పాక్‌కు షాక్.. జింబాబ్వే విజయం
టి20 ప్రపంచకప్‌లో భాగంగా సూపర్-12లో మరో సంచలనం నమోదైంది. గురువారం గ్రూఫ్-2లో పాకిస్తాన్‌కు షాకిచ్చిన జింబాబ్వే సంచలన విజయం నమోదు చేసింది. 131 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్తాన్ నిర్ణీత 20 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 129 పరుగులే చేయగలిగింది. దీంతో జింబాబ్వే ఒక్క పరుగు తేడాతో సంచలన విజయం సాధించింది. ఆఖరి వరకు పోరాడిన జింబాబ్వే అద్బుత ఆటతీరుతో మ్యాచ్‌ను సొంతం చేసుకుంది. పాకిస్తాన్ ఇన్నింగ్స్‌లో షాన్ మసూద్ 44 పరుగులతో టాప్ స్కోరర్ కాగా.. మహ్మద్ నవాజ్ 22 పరుగులు, మహ్మద్ వసీమ్ 12 పరుగులు నాటౌట్ చేశారు. జింబాబ్వే బౌలింగ్‌లో సికందర్ రజా 3, బ్రాడ్ ఎవన్స్ 2 వికెట్లు తీశారు.
పాక్‌ను దెబ్బతీసిన సికందర్ రజా.. ఒకే ఓవర్లో రెండు వికెట్లు
► జింబాబ్వేతో మ్యాచ్‌లో పాకిస్తాన్ మళ్లీ తడబడింది. ఆల్‌రౌండర్ సికందర్ రజా ఒకే ఓవర్లో రెండు వికెట్లు తీసి పాకిస్తాన్‌ను దెబ్బతీశాడు. మొదట 17 పరుగులు చేసిన షాదాబ్ ఖాన్‌ను పెవిలియన్ చేర్చిన రజా.. ఆ తర్వాత బంతికి హైదర్ అలీని గోల్డెన్ డకౌట్ చేశాడు. ప్రస్తుతం పాకిస్తాన్ 5 వికెట్ల నష్టానికి 88 పరుగులు చేసింది. పాక్ విజయానికి 36 బంతుల్లో 43 పరుగులు కావాల్సి ఉంది.
నిలకడగా ఆడుతున్న పాకిస్తాన్.. 13 ఓవర్లలో 88/3
► 36 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన పాకిస్తాన్ ఇన్నింగ్స్‌ను షాన్ మసూద్, షాదాబ్ ఖాన్‌లు నిలకడగా నడిపిస్తున్నారు. ప్రస్తుతం 13 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 88 పరుగులు చేసింది. షాన్ మసూద్ 39, షాదాబ్ ఖాన్ 17 పరుగులతో క్రీజులో ఉన్నారు.
మూడో వికెట్ కోల్పోయిన పాకిస్తాన్
► జింబాబ్వేతో మ్యాచ్‌లో పాకిస్తాన్ మూడో వికెట్ కోల్పోయింది. 5 పరుగులు చేసిన ఇప్తికర్ అహ్మద్ జాంగ్వే బౌలింగ్‌లో చక్‌బవాకు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ప్రస్తుతం పాకిస్తాన్ 36 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.
రిజ్వాన్(14) ఔట్.. రెండో వికెట్ డౌన్
► 14 పరుగుల వద్ద మహ్మద్ రిజ్వాన్ క్లీన్‌బౌల్డ్ అయ్యాడు. ముజరబానీ వేసిన ఇన్నింగ్స్ 5వ ఓవర్ నాలుగో బంతి ఇన్‌సైడ్ ఎడ్జ్ తీసుకొని వికెట్లను గిరాటేసింది. దీంతో పాక్ రెండో వికెట్ కోల్పోయింది. ప్రస్తుతం జింబాబ్వే 5 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 23 పరుగులు చేసింది.
బాబర్ ఆజం(4) ఔట్.. తొలి వికెట్ కోల్పోయిన పాకిస్తాన్
► 131 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్తాన్‌కు షాక్ తగిలింది. కెప్టెన్ బాబర్ ఆజం మరోసారి విఫలమయ్యాడు. ఫామ్ కోల్పోయి తంటాలు పడుతున్న బాబర్ ఆజం బ్రాడ్ ఎవన్స్ బౌలింగ్‌లో నాలుగు పరుగులు మాత్రమే చేసి రియాన్ బర్ల్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ప్రస్తుతం పాకిస్తాన్ వికెట్ నష్టానికి 13 పరుగులు చేసింది.
నామమాత్రపు స్కోరుకు పరిమితమైన జింబాబ్వే.. పాక్ టార్గెట్ 131
పాకిస్తాన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో జింబాబ్వే నామమాత్రపు స్కోరుకే పరిమితమైంది. పాక్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో పాటు వరుస విరామాల్లో వికెట్లు తీయడంతో జింబాబ్వే నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 130 పరుగులు చేసింది. సీన్ విలియమ్స్ 31 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. చివర్లో బ్రాడ్ ఎవన్స్ 19, రెయాన్ బర్ల్ 10 నాటౌట్ పరుగులు చేయడంతో జింబాబ్వే కనీసం పోరాడే స్కోరు చేయగలిగింది. 93/3తో కాస్త మెరుగైన స్థితిలో కనిపించిన జింబాబ్వే రెండు పరుగుల వ్యవధిలోనే నాలుగు వికెట్లు చేజార్చుకుంది. పాకిస్తాన్ బౌలర్లలో మహ్మద్ వసీమ్ 4, షాదాబ్ ఖాన్ 3, హారిస్ రౌఫ్ ఒక వికెట్ తీశాడు.
► జింబాబ్వే బ్యాటర్ జాక్ లుంగ్వే మహ్మద్ వసీమ్ బౌలింగ్‌లో గోల్డెన్ డక్ అయ్యాడు. ప్రస్తుతం జింబాబ్వే 16 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 102 పరుగులు చేసింది.
► మహ్మద్ వసీమ్ వేసిన ఇన్నింగ్స్ 15వ ఓవర్లో జింబాబ్వే ఆరో వికెట్ కోల్పోయింది. జింబాబ్వే కీలక బ్యాటర్ సికందర్ రజా 9 పరుగుల వద్ద వెనుదిరిగాడు.
బాబర్ ఆజం స్టన్నింగ్ క్యాచ్.. ఐదో వికెట్ కోల్పోయిన జింబాబ్వే
► పాకిస్తాన్ ఆల్‌రౌండర్ షాదాబ్‌ఖాన్ మెరిశాడు. తాను వేసిన ఇన్నింగ్స్ 14వ ఓవర్లో వరుస బంతుల్లో రెండు వికెట్లు తీశాడు. మొదట 31 పరుగులు చేసిన విలియమ్స్ క్లీన్‌బౌల్డ్ కాగా.. ఆ తర్వాత బంతికే బాబర్ ఆజం స్టన్నింగ్ క్యాచ్‌తో చక్‌బవా గోల్డెన్ డకౌట్‌గా వెనుదిరగాల్సి వచ్చింది.
8 ఓవర్లలో జింబాబ్వే స్కోరు ఎంతంటే?
► 8 ఓవర్లు ముగిసేసరికి జింబాబ్వే రెండు వికెట్ల నష్టానికి 53 పరుగులు చేసంది. సీన్ విలియమ్స్ 7, మిల్టన్ షుంబా మూడు పరుగులుతో ఆడుతున్నారు. అంతకముందు 17 పరుగులు చేసిన మాధవరే మహ్మద్ వసీమ్ బౌలింగ్‌లో ఎల్బీగా వెనుదిరిగాడు.
తొలి వికెట్ కోల్పోయిన జింబాబ్వే..
► పాకిస్తాన్‌తో మ్యాచ్‌లో జింబాబ్వే తొలి వికెట్ కోల్పోయింది. 19 పరుగులు చేసిన కెప్టెన్ క్రెయిగ్ ఇర్విన్ హారిస్ రౌఫ్ బౌలింగ్‌లో మహ్మద్ వసీమ్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ప్రస్తుతం జింబాబ్వే 5 ఓవర్లలో వికెట్ నష్టానికి 42 పరుగులు చేసింది. మాధవరే 17 పరుగులతో క్రీజులో ఉన్నాడు.
ఇన్నింగ్స్‌ను ధాటిగా ఆరంభించిన జింబాబ్వే..
► పాకిస్తాన్‌తో మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఆరంభించిన జింబాబ్వే ఇన్నింగ్స్‌ను ధాటిగా ఆరంభించింది. షాహిన్ ఆఫ్రిది వేసిన తొలి ఓవర్లో ఓపెనర్ వెస్లీ మాధవరే రెండు ఫోర్లు కొట్టి దూకుడు చూపించాడు. ప్రస్తుతం జింబాబ్వే 3 ఓవర్లు ముగిసేసరికి వికెట్ నష్టపోకుండా 31 పరుగులు చేసింది. ఇర్విన్ 13, మాధవరే 16 పరుగులుతో క్రీజులో ఉన్నారు.
టాస్ గెలిచి బ్యాటింగ్ ఏంచుకున్న జింబాబ్వే
► టి20 ప్రపంచకప్‌లో సూపర్-12లో భాగంగా గురువారం గ్రూఫ్-2లో పాకిస్తాన్, జింబాబ్వేల మధ్య మ్యాచ్ ప్రారంభమైంది. టాస్ గెలిచిన జింబాబ్వే బ్యాటింగ్ ఏంచుకుంది. తొలి మ్యాచ్‌లో టీమిండియా చేతిలో ఓడిన పాకిస్తాన్ జింబాబ్వేపై గెలిచి ఖాతా తెరవాలని భావిస్తుంది. మరోవైపు జింబాబ్వే మాత్రం దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి మ్యాచ్‌కు వరుణుడు అడ్డుపడడంతో ఒక్క బంతి కూడా పడకుండానే రద్దైంది. దీంతో ఇరుజట్లకు చెరో పాయింట్ కేటాయించారు.
పాకిస్తాన్ : మహ్మద్ రిజ్వాన్(వికెట్ కీపర్), బాబర్ ఆజం(కెప్టెన్), షాన్ మసూద్, ఇఫ్తీకర్ అహ్మద్, షాదాబ్ ఖాన్, హైదర్ అలీ, మహ్మద్ నవాజ్, షాహీన్ అఫ్రిది, హరీస్ రవూఫ్, మహ్మద్ వసీం జూనియర్, నసీమ్ షా
జింబాబ్వే: రెగిస్ చకబ్వా(వికెట్ కీపర్), క్రెయిగ్ ఎర్విన్(కెప్టెన్), సీన్ విలియమ్స్, సికందర్ రజా, వెస్లీ మాధేవెరే, మిల్టన్ శుంబా, బ్రాడ్ ఎవాన్స్, ర్యాన్ బర్ల్, ల్యూక్ జోంగ్వే, బ్లెస్సింగ్ ముజారబానీ, రిచర్డ్ నగరవ
ఇంకా ఖాతా తెరవని జింబాబ్వే కూడా పాకిస్తాన్‌పై నెగ్గి క్వాలిఫయింగ్‌లో చూపెట్టిన జోరును ఇక్కడా ప్రదర్శించాలనే పట్టుదలతో ఉంది.ముఖాముఖి పోరులో పాకిస్తాన్, జింబాబ్వేలు 17సార్లు తలపడగా.. పాకిస్తాన్ 16 సార్లు గెలవగా.. జింబాబ్వే ఒకసారి మాత్రమే నెగ్గింది. ఇక టి20 ప్రపంచకప్‌లో పాకిస్తాన్‌తో జింబాబ్వేకు ఇదే తొలి మ్యాచ్ కావడం గమనార్హం. జింబాబ్వే కదా తేలికగా తీసుకుంటే మాత్రం మొదటికే మోసం వచ్చే అవకాశం ఉంది.
టీమిండియాతో మ్యాచ్‌లో బాబర్ ఆజం గోల్డెన్ డకౌట్‌గా వెనుదిరగడం జట్టును ప్రభావితం చేసింది. ఇన్‌ఫాం బ్యాటర్ మహ్మద్ రిజ్వాన్ కూడా తక్కువ స్కోరుకే వెనుదిరిగాడు. అయితే షాన్ మసూద్, ఇప్తికర్ అహ్మద్, హైదర్ అలీలతో మిడిలార్డర్ పటిష్టంగా కనిపిస్తోంది. ఇక చివర్లో షాదాబ్ ఖాన్ హిట్టర్లు ఉండనే ఉన్నారు. ఇక బౌలింగ్ మాత్రం దుర్బేద్యంగా ఉంది. అటు జింబాబ్వే బ్యాటింగ్ మాత్రం ప్రధానంగా కెప్టెన్ క్రెయిగ్ ఇర్విన్, సికందర్ రజాలపై ఆధారపడి ఉంది. బౌలింగ్ విభాగం కూడా బాగానే కనిపిస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment