టీ20 వరల్డ్‌కప్-2022లో పసికూన జింబాబ్వే.. పాకిస్తాన్‌పై సంచలన విజయం సాధించిన అనంతరం పాక్ కెప్టెన్ బాబర్ ఆజమ్ గతంలో చేసిన ఓ ట్వీట్ వైరలవుతోంది. 2015లో జింబాబ్వే.. పాక్ పర్యటనకు వచ్చిన సందర్భంగా బాబర్ ఆజమ్ ఆ జట్టుకు స్వాగతం పలికాడు. వెల్‌కమ్ జింబాబ్వే అంటూ ట్వీట్ చేశాడు. అయితే బాబర్ చేసిన ఆ ట్వీట్‌లో జింబాబ్వే స్పెల్లింగ్‌లో అక్షర దోషాలు ఉండటంతో నెటిజన్లు అతన్ని ఓ ఆటాడుకున్నారు. బాబర్.. ZIMBABWEకి బదులు ZIMBAWAY అంటూ ట్వీట్ చేయడంతో సొంత అభిమానులు సైతం ట్రోల్ చేశారు. పాక్ వ్యతిరేక అభిమానులైతే బాబర్ ఇంగ్లీష్‌ను అవహేళన చేశారు.
Welcome zimbaway
— Babar Azam (@babarazam258) May 19, 2015
కాగా, ప్రస్తుతం జరుగుతున్న టీ20 వరల్డ్‌కప్‌లో జింబాబ్వే చేతిలో పాక్ ఓటమి అనంతరం బాబర్ చేసిన ఈ ట్వీట్ మరోసారి తెరపై వచ్చింది. ఈ ట్వీట్‌ను బేస్ చేసుకుని నెటిజన్లు పాక్ కెప్టెన్‌ను మరోసారి ఆటాడుకుంటున్నారు. నువ్వు గతంలో జింబాబ్వే స్పెల్లింగ్‌ను తప్పు ట్వీట్ చేసినందుకు ఇప్పుడా ఆ జట్టు ప్రతీకారం తీర్చుకుందని కామెంట్లు చేస్తున్నారు. మరికొందరేమో.. పాకిస్తాన్‌కు తిరుగు ప్రయాణం అయ్యేందుకు ఆస్ట్రేలియా ఎయిర్‌పోర్ట్‌లు స్వాగతం పలుకుతున్నాయంటూ ట్వీట్ల వర్షం కురిపిస్తున్నారు. అసలే ఓటమి బాధలో ఉన్న బాబర్‌కు ఈ ట్వీట్ల గోల మరింత ఇబ్బందిగా మారింది.
ye jo tumne zimbabwe ki galat spelling likhi hai uska badla liya hai un ne
— Tatya Vinchu (@TatyaVinc) October 28, 2022
ఇదిలా ఉంటే, సూపర్-12 గ్రూప్-2లో భాగంగా అక్టోబర్ 27న జరిగిన మ్యాచ్‌లో పాకిస్తాన్‌పై జింబాబ్వే ఒక్క పరుగు తేడాతో సంచలన విజయం సాధించింది. చివరి బంతి వరకు నరాలు తెగే ఉత్కంఠ నడుమ సాగిన ఈ మ్యాచ్‌లో జింబాబ్వే అత్యుత్తమ ప్రదర్శన కనబర్చి పాక్‌కు ఊహించని షాకిచ్చింది. 130 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో 129 పరుగులకు మాత్రమే పరిమితమై ఓటమిపాలైంది. సికందర్ రజా (3/25) అద్భుతమైన బౌలింగ్ ప్రదర్శనతో పాక్ ఓటమికి కారకుడయ్యాడు.
Welcome Pakistan From Australia airports..
— $ARAN virat^°🔥 (@Itz_Saranvj) October 27, 2022
Comments
Please login to add a commentAdd a comment