Craig Ervine
-
పాకిస్తాన్‌తో పరిమిత ఓవర్ల సిరీస్‌ల కోసం జింబాబ్వే జట్ల ప్రకటన
స్వదేశంలో పాకిస్తాన్‌తో జరిగే వన్డే, టీ20 సిరీస్‌ల కోసం రెండు వేర్వేరు జింబాబ్వే జట్లను ఇవాళ (నవంబర్ 18) ప్రకటించారు. వన్డే జట్టుకు కెప్టెన్‌గా క్రెయిస్ ఎర్విన్.. టీ20 జట్టు సారధిగా సికందర్ రజా ఎంపికయ్యారు. వన్డే జట్టులో కొత్తగా ముగ్గురు అన్క్యాప్డ్ ప్లేయర్లకు (ట్రెవర్ గ్వాండు, తషింగ ముసెకివా, టినొటెండా మపోసా) చోటు దక్కింది. వన్డే జట్టులో సికందర్ రజా, సీన్ విలియమ్స్, బ్లెస్సింగ్ ముజరబాని, రిచర్డ్ నగరవ లాంటి సీనియర్ ప్లేయర్లు.. క్లైవ్ మదండే, బ్రియాన్ బెన్నెట్, డియాన్ మైర్స్ లాంటి యువ ఆటగాళ్లు చోటు దక్కించుకున్నారు. టీ20 జట్టులో వన్డే జట్టు కెప్టెన్ క్రెయిగ్ ఎర్విన్, సీన్ విలియమ్స్, జాయ్‌లార్డ్ గుంబీకు చోటు దక్కలేదు. పాకిస్తాన్ జట్టు నవంబర్ 24 నుంచి డిసెంబర్ 5 వరకు జింబాబ్వేలో పర్యటిస్తుంది. ఈ పర్యటనలో పాక్ మూడు వన్డేలు, మూడు టీ20లు ఆడనుంది. ఈ సిరీస్‌ల కోసం పాక్ జట్లను ఇదివరకే ప్రకటించారు. ఈ సిరీస్‌ల కోసం పాక్ మేనేజ్మెంట్ బాబర్ ఆజమ్, షాహీన్ అఫ్రిది లాంటి సీనియర్లకు రెస్ట్ ఇచ్చింది.జింబాబ్వే పర్యటనలో పాక్ షెడ్యూల్..నవంబర్ 24- తొలి వన్డే నవంబర్ 26- రెండో వన్డేనవంబర్ 28- మూడో వన్డేడిసెంబర్ 1- తొలి టీ20డిసెంబర్ 3- రెండో టీ20డిసెంబర్ 5- మూడో టీ20మ్యాచ్‌లన్నీ బులవాయోలోని క్వీన్స్ స్పోర్ట్స్ క్లబ్ మైదానంలో జరుగనున్నాయి.జింబాబ్వే వన్డే జట్టు: క్రెయిగ్ ఎర్విన్ (కెప్టెన్), ఫరాజ్ అక్రమ్, బ్రియాన్ బెన్నెట్, జాయ్‌లార్డ్ గుంబీ, ట్రెవర్ గ్వాండు, క్లైవ్ మదాండే, టినోటెండా మపోసా, తడివానాషే మారుమణి, బ్రాండన్ మవుటా, తషింగా ముసెకివా, బ్లెస్సింగ్ ముజరాబనీ, డియాన్ మైర్స్, రిచర్డ్ నగరవ, సికందర్ రజా, సీన్ విలియమ్స్.జింబాబ్వే టీ20 జట్టు: సికందర్ రజా (కెప్టెన్), ఫరాజ్ అక్రమ్, బ్రియాన్ బెన్నెట్, ర్యాన్ బర్ల్, ట్రెవర్ గ్వాండు, క్లైవ్ మదాండే, వెస్లీ మాధవెరె, టినోటెండా మపోసా, తడివానాషే మారుమణి, వెల్లింగ్టన్ మసకద్జా, బ్రాండన్ మవుటా, తషింగ ముసెకివా, బ్లెస్సింగ్ ముజరాబనీ, డియాన్ మైర్స్, రిచర్డ్ నగరవ -
శ్రీలంకతో పరిమిత ఓవర్ల సిరీస్.. జింబాబ్వే జట్టు ప్రకటన
జనవరి 6 నుంచి శ్రీలంకతో జరిగే పరిమిత ఓవర్ల సిరీస్ కోసం జింబాబ్వే జట్టును ఇవాళ (జనవరి 1) ప్రకటించారు. వన్డే, టీ20లకు వేర్వేరు జట్లను ప్రకటించిన జింబాబ్వే క్రికెట్ బోర్డు.. వన్డే సారధిగా క్రెయిగ్ ఎర్విన్‌ను, టీ20 కెప్టెన్‌గా సికందర్ రజాను ఎంపిక చేసింది. గాయం కారణంగా కొంతకాలంగా జట్టుకు దూరంగా ఉన్న ఎర్విన్.. తిరిగి జట్టులో చేరడంతో పాటు వన్డే జట్టు పగ్గాలు చేపట్టాడు. మరోవైపు ఈ సిరీస్‌ల కోసం శ్రీలంక సైతం ప్రిలిమినరీ జట్లను ప్రకటించింది. లంక జట్టు సైతం రెండు ఫార్మాట్లలో కెప్టెన్లను మార్చింది. వన్డే జట్టుకు కుశాల్ మెండిస్ కెప్టెన్‌గా వ్యవహరించనుండగా.. టీ20 జట్టుకు హసరంగ సారధిగా ఎంపికయ్యాడు. ఈ సిరీస్‌లలో తొలుత వన్డేలు, ఆతర్వాత టీ20లు జరుగనున్నాయి. జనవరి 6, 8, 11 తేదీల్లో వన్డేలు.. 14, 16, 18 తేదీల్లో టీ20లు జరుగనున్నాయి. అన్ని మ్యాచ్‌లకు కొలొంబోలోని ప్రేమదాస స్టేడియం వేదిక కానుంది. జింబాబ్వే వన్డే జట్టు: క్రెయిగ్ ఎర్విన్ (కెప్టెన్), ఫరాజ్ అక్రన్, ర్యాన్ బర్ల్, జాయ్‌లార్డ్ గుంబీ, ల్యూక్ జోంగ్వే, తకుద్జ్వనషే కైతానో, టినాషే కమున్హుకమ్వే, క్లైవ్ మదండే, వెల్లింగ్టన్ మసకద్జ, టాపివా ముఫుద్జా, టోనీ మున్యోంగా, బ్లెస్సింగ్ ముజరబానీ, రిచర్డ్ నగరవ, సికందర్ రజా, మిల్టన్ షుంభ జింబాబ్వే టీ20 జట్టు: సికందర్ రాజా (కెప్టెన్), బ్రియాన్ బెన్నెట్, ర్యాన్ బర్ల్, క్రెయిగ్ ఎర్విన్, జాయిలార్డ్ గుంబీ, ల్యూక్ జాంగ్వే, టినాషే కమున్హుకమ్వే, క్లైవ్ మదండే, వెల్లింగ్టన్ మసకద్జ, కార్ల్ ముంబా, టోనీ మున్యోంగా, బ్లెస్సింగ్ ముజరబానీ, ఐన్స్లీ ఎండిలోవు. రిచర్డ్ నగరవ, మిల్టన్ షుంభ శ్రీలంక వన్డే ప్రిలిమినరీ స్క్వాడ్: కుశాల్ మెండిస్ (కెప్టెన్), చరిత్ అసలంక (వైస్ కెప్టెన్), పథుమ్ నిస్సంక, అవిష్క ఫెర్నాండో, సదీర సమరవిక్రమ, సాహన్ అరాచ్చిగే, నువనిదు ఫెర్నాండో, దసున్ షనక, కమిందు మెండిస్, చమిక కరుణరత్నే, జనిత్ లియనాగే, వనిందు హసరంగ, మషీశ్ తీక్షణ, దిల్షాన్ మదుషంక, దుష్మంత చమీరా, దునిత్ వెల్లలగే, ప్రమోద్ మదుషన్, అషిత ఫెర్నాండో, అకిల ధనంజయ, జెఫ్రీ వాండర్సే, చమికా గుణశేఖర శ్రీలంక టీ20 ప్రిలిమినరీ స్క్వాడ్: వనిందు హసరంగ (కెప్టెన్), చరిత్ అసలంక (వైస్ కెప్టెన్), పథుమ్ నిస్సంక, కుశాల్ మెండిస్, సధీర సమరవిక్రమ, దసున్ షనక, ఏంజెలో మాథ్యూస్, ధనంజయ డిసిల్వ, మహీశ తీక్షణ, కుశాల్ జనిత్ పెరీరా, భానుక రాజపక్ష, కమిందు మెండిస్, దునిత్ వెల్లలగే, అకిల ధనంజయ, జెఫ్రీ వాండర్సే, చమిక కరుణరత్నే, దుష్మంత చమీర, దిల్షన్ మధుషంక, బినుర ఫెర్నాండో, నుదాన్ తుషార, ప్రమోద్ మధుషన్, మతీష పతిరణ -
పసికూన చేతిలో పరాభవం.. కెప్టెన్ మార్పు.. నూతన సారధిగా స్టార్ ఆల్‌రౌండర్
జింబాబ్వే క్రికెట్ బోర్డు తమ టీ20 జట్టుకు నూతన కెప్టెన్‌ను నియమించింది. ఇటీవల స్వదేశంలో పసికూన నమీబియాతో చేతిలో ఘోర పరాభవం ఎదురైన నేపథ్యంలో ఆ దేశ క్రికెట్ బోర్డు ఆల్ ఫార్మాట్ కెప్టెన్ క్రెయిగ్ ఎర్విన్‌పై వేటు వేసింది. ఎర్విన్ స్థానంలో జింబాబ్వే టీ20 జట్టు సారధిగా స్టార్ ఆల్‌రౌండర్ సికందర్ రజా నియమించబడ్డాడు. ఎర్విన్ టెస్ట్, వన్డే జట్లకు కెప్టెన్‌గా పరిమితం చేయబడ్డాడు. వచ్చే నెలలో జరుగబోయే టీ20 వరల్డ్‌కప్ క్వాలిఫయర్స్‌ను దృష్టిలో ఉంచుకుని జింబాబ్వే క్రికెట్ బోర్డు ఈ కీలక మార్పు చేసింది. జింబాబ్వే క్రికెట్ బోర్డు టీ20 జట్టు కెప్టెన్‌ను మార్చడంతో పాటు మరిన్ని కీలక మార్పులు కూడా చేసింది. మాజీ హెడ్ కోచ్ డేవ్ హటన్‌కు మరోసారి అవే బాధ్యతలు అప్పజెప్పింది. అదనంగా హటన్‌కు సెలక్షన్ ప్యానెల్లో చోటు కల్పించింది. హటన్తో పాటు మాజీ కెప్టెన్ ఎల్టన్ చిగుంబరకు కూడా సెలక్షన్ ప్యానెల్లో చోటు దక్కింది. జింబాబ్వే క్రికెట్ కమిటీ నూతన చైర్మన్‌గా బ్లెస్సింగ్ గొండోను నియమించింది. ఈ కమిటీలో సభ్యులుగా హమిల్టన్ మసకద్జ, కెన్యోన్ జెహ్లా, రసెల్ టిఫిన్, జూలియా చిబాబ, డేవ్ హటన్, చిగుంబరలకు చోటు దక్కింది. కాగా, స్వదేశంలో ఇటీవల నమీబియాతో జరిగిన టీ20 సిరీస్‌లో జింబాబ్వే 2-3 తేడాతో ఓటమిపాలైంది. -
లేటు వయసులో శతక్కొట్టారు.. ఒకరిది ఫాస్టెస్ట్ హండ్రెడ్
వరల్డ్‌కప్ క్వాలిఫయర్స్ 2023లో భాగంగా నిన్న (జూన్ 18) జరిగిన రెండు మ్యాచ్‌ల్లో మూడు సెంచరీలు నమోదయ్యాయి. నేపాల్‌తో జరిగిన మ్యాచ్‌లో జింబాబ్వే బ్యాటర్లు సీన్ విలియమ్స్ (70 బంతుల్లో 102 నాటౌట్; 13 ఫోర్లు, సిక్స్), క్రెయిగ్ ఎర్విన్ (128 బంతుల్లో 121 నాటౌట్; 15 ఫోర్లు, సిక్స్) అజేయ శతకాలు సాధించగా.. వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో యూఎస్ఏ ఆటగాడు గజానంద్ సింగ్ (109 బంతుల్లో 101 నాటౌట్; 8 ఫోర్లు, 2 సిక్సర్లు) వీరోచిత శతకం బాదాడు. రెండు వేర్వేరు మ్యాచ్‌ల్లో ముగ్గురు సెంచరీలు చేయడం సాధారణ విషయమే అయినప్పటికీ.. సెంచరీలు చేసిన వారు 35 ఏళ్ల వయసు పైబడ్డ వారు కావడం విశేషం. అందులోనూ ముగ్గురు బ్యాటర్లు నాటౌట్‌గా నిలిచారు. వీరిలో జింబాబ్వే ఆటగాడు సీన్ విలియమ్స్‌ది ఆ దేశం తరఫున వన్డేల్లో ఫాస్టెస్ట్ హండ్రెడ్ (70) కావడం మరో విశేషం. శతక్కొట్టిన బ్యాటర్లలో యూఎస్ఏ ఆటగాడు గజానంద్ సింగ్‌కు 35 ఏళ్లు కాగా.. సీన్ విలియమ్స్‌కు 36, క్రెయిగ్ ఎర్విన్‌కు 37 ఏళ్లు. లేటు వయసులో ఈ ముగ్గురు బ్యాటర్లు తమ జట్లను గెలిపించేందుకు శక్తి వంచన లేకుండా ప్రత్నించడంతో నెటిజన్లు వీరిని ప్రశంసిస్తున్నారు. కాగా, నేపాల్‌తో జరిగిన మ్యాచ్‌లో సీన్ విలియమ్స్, క్రెయిగ్ ఎర్విన్ సెంచరీలు చేసి జింబాబ్వేను విజయతీరాలకు చేర్చగా.. విండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో గజానంద్ వీరోచిత సెంచరీ చేసి తన జట్టును (యూఎస్ఏ) గెలిపించేందుకు విఫలయత్నం చేశాడు. నేపాల్‌పై జింబాబ్వే 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించగా.. యూఎస్ఏపై వెస్టిండీస్ 39 పరుగుల తేడాతో గెలుపొందింది. -
వన్డేల్లో ఫాస్టెస్ట్ సెంచరీ సాధించిన సీన్ విలియమ్స్
వరల్డ్‌కప్ క్వాలిఫయర్స్ 2023లో భాగంగా నేపాల్‌తో ఇవాళ (జూన్ 18) జరిగిన మ్యాచ్‌లో జింబాబ్వే ఆటగాడు సీన్ విలియమ్స్ మెరుపు శతకం బాదాడు. కేవలం 70 బంతుల్లో 13 ఫోర్లు, సిక్సర్ సాయంతో 102 పరుగులు చేసి అజేయంగా నిలిచిన విలియమ్స్.. జింబాబ్వే తరఫున వన్డేల్లో ఫాస్టెస్ట్ సెంచరీ (70 బంతుల్లో) నమోదు చేశాడు. గతంలో ఈ రికార్డు రెగిస్ చకబ్వా పేరిట ఉండేది. చకబ్వా.. 2022లో బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో 73 బంతుల్లో సెంచరీ చేశాడు. జింబాబ్వే తరఫున వన్డేల్లో అత్యంత వేగంగా సెంచరీలు చేసిన ఆటగాళ్ల జాబితాలో విలియమ్స్, చకబ్వా తర్వాత బ్రెండన్ టేలర్ (2015లో ఐర్లాండ్‌పై 79 బంతుల్లో), సికందర్ రజా (2022లో బంగ్లాదేశ్‌పై 81 బంతుల్లో) ఉన్నారు. కాగా, నేపాల్‌తో ఇవాళ జరిగిన వరల్డ్‌కప్ క్వాలిఫయర్ మ్యాచ్‌లో విలియమ్స్‌తో పాటు క్రెయిగ్ ఎర్విన్ (128 బంతుల్లో 121 నాటౌట్; 15 ఫోర్లు, సిక్స్) అజేయ సెంచరీతో చెలరేగడంతో జింబాబ్వే 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన నేపాల్.. కుశాల్ భూర్టెల్ (99), ఆసిఫ్ షేక్ (66), కుశాల్ మల్లా (41), కెప్టెన్ రోహిత్ పౌడెల్ (31) రాణించడంతో నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 290 పరుగులు చేయగా.. అనంతరం బరిలోకి దిగిన జింబాబ్వే మరో 35 బంతులు మిగిలుండగానే కేవలం 2 వికెట్లు మాత్రమే కోల్పోయి విజయతీరాలకు చేరింది. ఇవాలే జరిగిన మరో మ్యాచ్‌లో యూఎస్ఏపై వెస్టిండీస్ 39 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన విండీస్.. జాన్సన్ ఛార్లెస్ (66), షాయ్ హోప్ (54), రోప్టన్ ఛేజ్ (55), జేసన్ హోల్డర్ (56), నికోలస్ పూరన్ (43) రాణించగా 49.3 ఓవర్లలో 297 పరుగులకు ఆలౌటైంది. అనంతరం బరిలోకి దిగిన యూఎస్ఏను గజానంద్ సింగ్ (101 నాటౌట్) వీరోచిత శతకం సాయంతో గెలిపించేందుకు విఫలయత్నం చేశాడు. గజానంద్తో పాటు ఆరోన్ జోన్స్ (23), షయాన్ జహంగీర్ (39), నోస్తుష్ కెంజిగే (34) పోరాడటంతో విండీస్‌కు విజయం అంత సులువుగా దక్కలేదు. యూఎస్ఏ నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 258 పరుగులు చేసి ఓటమిపాలైంది. -
శతక్కొట్టిన సీన్ విలియమ్స్, క్రెయిగ్ ఎర్విన్.. జింబాబ్వే ఘన విజయం
వరల్డ్ కప్ క్వాలిఫయర్స్ 2023 తొలి మ్యాచ్‌లో నేపాల్‌పై జింబాబ్వే ఘన విజయం సాధించింది. హరారే వేదికగా ఇవాళ (జూన్ 18) జరిగిన ఈ మ్యాచ్‌లో జింబాబ్వే 8 వికెట్ల తేడాతో గెలుపొందింది. జింబాబ్వే బ్యాటర్లు సీన్ విలియమ్స్ (70 బంతుల్లో 102 నాటౌట్; 13 ఫోర్లు, సిక్స్), క్రెయిగ్ ఎర్విన్ (128 బంతుల్లో 121 నాటౌట్; 15 ఫోర్లు, సిక్స్) అజేయ శతకాలతో జింబాబ్వేను విజయతీరాలకు చేర్చారు. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన నేపాల్.. కుశాల్ భూర్టెల్ (99), ఆసిఫ్ షేక్ (66), కుశాల్ మల్లా (41), కెప్టెన్ రోహిత్ పౌడెల్ (31) రాణించడంతో నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 290 పరుగులు చేయగా.. అనంతరం బరిలోకి దిగిన జింబాబ్వే మరో 35 బంతులు మిగిలుండగానే కేవలం 2 వికెట్లు మాత్రమే కోల్పోయి విజయం సాధించింది. జింబాబ్వే బౌలర్లలో నగరవా 4 వికెట్లు తీసి నేపాల్‌ను దారుణంగా దెబ్బకొట్టిగా.. మసకద్జ 2, చటారా, ముజరబాని తలో వికెట్ దక్కించుకున్నారు. జింబాబ్వే ఆటగాడు జాయ్‌లార్డ్ గుంబీ (25) వికెట్ సొంపాల్ కామీకి, వెస్లీ మధెవెరె (32) వికెట్ గుల్సన్ ఝాకు దక్కాయి. ఈ విజయంతో జింబాబ్వే.. గ్రూప్-ఏలో మెరుగైన రన్‌రేట్‌తో (0.789) అగ్రస్థానానికి చేరుకుంది. గ్రూస్-ఏలో జింబాబ్వే, నేపాల్‌తో పాటు వెస్టిండీస్, యూఎస్ఏ, నెదర్లాండ్స్ జట్లు ఉన్నాయి. గ్రూప్-ఏలో భాగంగానే ఇవాళ వెస్టిండీస్, యూఎస్ఏ జట్లు కూడా తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో విండీస్ విజయం దిశగా సాగుతుంది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన విండీస్.. 49.3 ఓవర్లలో 297 పరుగులకు ఆలౌటైంది. జాన్సన్ ఛార్లెస్ (66), షాయ్ హోప్ (54), రోప్టన్ ఛేజ్ (55), జేసన్ హోల్డర్ (56), నికోలస్ పూరన్ (43) రాణించగా.. బ్రాండన్ కింగ్ (0), కైల్ మేయర్స్ (2), రోవ్‌మన్ పావెల్ (0), కీమో పాల్ (4), అల్జరీ జోసఫ్ (3) విఫలమయ్యారు. యూఎస్ఏ బౌలర్లలో స్టీవెన్ టేలర్, సౌరభ్ నేత్రావాల్కర్, కైల్ ఫిలిప్ తలో 3 వికెట్లు, నోషటష్ ఓ వికెట్ దక్కించుకున్నాడు. ఛేదనలో యూఎస్ఏ తడబడుతుంది. 44 ఓవర్ల తర్వాత ఆ జట్టు 7 వికెట్ల నష్టానికి 206 పరుగులు చేసి, ఓటమి దిశగా పయనిస్తుంది. క్వాలిఫయర్స్ మ్యాచ్‌ల్లో భాగంగా రేపు (జూన్ 19) శ్రీలంక-యూఏఈ.. ఐర్లాండ్-ఒమన్ తలపడనున్నాయి. గ్రూప్-బిలో భాగంగా ఈ మ్యాచ్‌లు జరుగనున్నాయి. గ్రూప్-బిలో శ్రీలంక, యూఏఈ, ఐర్లాండ్, ఒమన్, స్కాట్లాండ్ జట్లు పోటీపడనున్నాయి. -
వన్డే ప్రపంచకప్‌కు జట్టును ప్రకటించిన జింబాబ్వే.. యువ వికెట్ కీపర్ ఎంట్రీ
వన్డే ప్రపంచకప్-2023 క్వాలిఫైయర్స్‌కు 15 మంది సభ్యులతో కూడిన తమ జట్టుకు జింబాబ్వే క్రికెట్ ప్రకటించింది. ఈ జట్టుకు క్రెయిగ్ ఎర్విన్ సారధ్యం వహించనున్నాడు. ఈ జట్టులో యువ వికెట్ కీపర్ బ్యాటర్ జాయ్‌లార్డ్ గుంబీకి చోటు దక్కింది. ఇది మినహా సెలక్టర్లు తమ జట్టులో పెద్దగా మార్పులు చేయలేదు. జట్టులో రజా, సీన్ విలియమ్స్, ముజాబ్రానీ వంటి స్టార్ ఆటగాళ్లు ఉన్నారు. కాగా ఈ క్వాలిఫియర్ రౌండ్ మ్యాచ్‌లకు జింబాబ్వేనే అతిధ్యం ఇవ్వనుంది. ఈ మ్యాచ్‌లు జూన్ 18 నుంచి జరగనున్నాయి. ఇందులో మొత్తం 10 జట్లు పాల్గొనున్నాయి. వీటిలో రెండు జట్లు భారత వేదికగా జరగనున్న ప్రపంచకప్‌కు అర్హత సాధిస్తాయి. ఇక జింబాబ్వే తమ మొదటి మ్యాచ్‌లో జూన్ 18న హారారే వేదికగా నెపాల్తో తలపడనుంది. కాగా ఈ క్వాలిఫియర్స్ రౌండ్లో శ్రీలంక, వెస్టిండీస్ వంటి మేటి జట్లు కూడా పాల్గొంటున్నాయి. జింబాబ్వే జట్టు: ర్యాన్ బర్ల్, టెండై చటారా, క్రెయిగ్ ఎర్విన్, బ్రాడ్లీ ఎవాన్స్, జాయ్‌లార్డ్ గుంబీ, ల్యూక్ జోంగ్వే, ఇన్నోసెంట్ కైయా, క్లైవ్ మదాండే, వెస్లీ మాధేవెరే, తాడివానాషే మారుమణి, వెల్లింగ్టన్ మసకద్జా, బ్లెస్సింగ్ ముజరబానీ, రిచర్డ్ నగరవ, సికందర్ రజా, సీన్ విలియమ్స్. చదవండి: WTC Final 2023: డబ్ల్యూటీసీ ఫైనల్ డ్రా అయితే.. విజేత ఎవరంటే? -
విండీస్ బౌలర్ ధాటికి విలవిలలాడిన జింబాబ్వే
Gudakesh Motie: వెస్టిండీస్ యువ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ గుడకేశ్ మోటీ ధాటికి జింబాబ్వే విలవిలలాడింది. 2 మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో భాగంగా విండీస్‌తో ఇవాళ (ఫిబ్రవరి 12) మొదలైన రెండో టెస్ట్‌లో మోటీ 7 వికెట్లతో విజృంభించడంతో జింబాబ్వే తొలి ఇన్నింగ్స్‌లో 115 పరుగులకే కుప్పకూలింది. మోటీతో పాటు జేసన్ హోల్డర్ (2/18), అల్జరీ జోసఫ్ (1/29) రాణించడంతో జింబాబ్వే స్వల్ప స్కోర్‌కే పరిమితమైంది. జింబాబ్వే ఇన్నింగ్స్‌లో ఇన్నోసెంట్ కాలా (38) టాప్ స్కోర్‌గా నిలిచాడు. జింబాబ్వే ఇన్నింగ్స్‌లో కాలాతో పాటు చిబాబ (10), కెప్టెన్ క్రెయిగ్ ఎర్విన్ (22), ట్రిపానో (23 నాటౌట్) మాత్రమే రెండంకెల స్కోర్ చేశారు. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన విండీస్.. తొలి రోజు ఆట ముగిసే సమయానికి 4 వికెట్ల నష్టానికి 133 పరుగులు చేసింది. రేమన్ రీఫర్ (53) అర్ధసెంచరీతో రాణించగా.. తేజ్‌నరైన్ చంద్రపాల్ (36), జెర్మైన్ బ్లాక్‌వుడ్ (22) ఓ మోస్తరుగా రాణించారు. కైల్ మేయర్స్ (8), రోస్టన్ చేజ్ (5) క్రీజ్‌లో ఉన్నారు. జింబాబ్వే బౌలర్లలో బ్రెండన్ మవుటా 2 వికెట్లు పడగొట్టగా.. మసకద్జకు ఓ వికెట్ దక్కంది. రీఫర్ రనౌటయ్యాడు. కాగా, తొలి టెస్ట్ సెంచరీ హీరో, జింబాబ్వే ఆటగాడు గ్యారీ బ్యాలెన్స్‌కు ఈ మ్యాచ్‌లో చోటు దక్కకపోవడం విశేషం. 2 మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో తొలి టెస్ట్ డ్రాగా ముగిసింది. ఆ మ్యాచ్‌లో బ్యాలెన్స్‌తో పాటు విండీస్ కెప్టెన్ బ్రాత్‌వైట్ సెంచరీలు చేయగా.. శివ్‌నరైన్ చంద్రపాల్ కొడుకు తేజ్‌నరైన్ డబుల్ సెంచరీతో చెలరేగాడు. -
చెలరేగిన జింబాబ్వే బౌలర్లు.. పటిష్ట జట్లపై ఆడిన బ్యాటర్లకు చుక్కలు! గెలుపుతో
Zimbabwe vs Ireland, 1st T20I: ఐర్లాండ్‌తో టీ20 సిరీస్‌లో జింబాబ్వే శుభారంభం చేసింది. హరారే వేదికగా జరిగిన తొలి మ్యాచ్‌లో 5 వికెట్ల తేడాతో గెలుపొందింది. తద్వారా సొంతగడ్డపై మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0తో ఆధిక్యంలో నిలిచింది. మూడు టీ20, మూడు వన్డేల సిరీస్ కోసం ఐర్లాండ్.. జింబాబ్వే పర్యటనకు వెళ్లింది. ఇందులో భాగంగా హరారే స్పోర్ట్స్ క్లబ్లో గురువారం మొదటి టీ20 జరిగింది. టాస్ గెలిచిన జింబాబ్వే తొలుత బౌలింగ్ ఎంచుకుంది. కెప్టెన్ క్రెయిగ్ ఎర్విన్ టాస్ ఛాయిస్‌కు సార్థకత చేకూరేలా ఆతిథ్య జట్టు బౌలర్లు.. ఐర్లాండ్ బ్యాటర్లకు చుక్కలు చూపించారు. ర్యాన్ బర్ల్ మూడు వికెట్లు కూల్చగా.. చటారా, నగరవ, మసకద్జ రెండేసి వికెట్లు తీశారు. బ్రాడ్ ఎవాన్స్‌కు ఒక వికెట్ దక్కింది. టీమిండియా వంటి పటిష్ట జట్లపై మెరుగ్గా ఆడగలిగిన ఐరిష్ కెప్టెన్ బల్బిర్నీ(5), హ్యారీ టెక్టార్(5) వంటి కీలక బ్యాటర్లు విఫలం కావడం తీవ్ర ప్రభావం చూపింది. ఐర్లాండ్ ఇన్నింగ్స్‌లో 24 పరుగులతో డెలని టాప్ స్కోరర్ అనిపించుకున్నాడు. ఇలా జింబాబ్వే బౌలర్ల ధాటికి బ్యాటర్లు చేతులెత్తేయడంతో 19.2 ఓవర్లలో 10 వికెట్ల నష్టానికి ఐర్లాండ్ 114 పరుగులు మాత్రమే చేయగలిగింది. అయితే, స్వల్ప లక్ష్యంతో ఛేదనకు దిగినప్పటికీ జింబాబ్వే విజయం కోసం చివరి వరకు పోరాడాల్సి వచ్చింది. ఓపెనింగ్ జోడీ ఎర్విన్, మరునణి చెరో నాలుగు పరుగులు చేసి పెవిలియన్ చేరారు. వన్‌డౌన్‌లో మధెవెరె 16 పరుగులకు అవుటయ్యాడు. టాపార్డర్ విఫలమైన వేళ నాలుగో స్థానంలో వచ్చిన గ్యారీ బ్యాలన్స్ 30 పరుగులు చేయగా , సీన్ విలియమ్స్(34) పరుగులతో ఆఖరి వరకు అజేయంగా నిలిచాడు. ఈ క్రమంలో 18 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 118 పరుగులు చేసిన జింబాబ్వే జయకేతనం ఎగురవేసింది. చదవండి: దంచికొట్టిన సాల్ట్! సన్‌రైజర్స్‌కు తొలి మ్యాచ్‌లోనే చేదు అనుభవం Rashid Khan: రషీద్ ఖాన్ సంచలన నిర్ణయం! -
జింబాబ్వేపై ఘన విజయం.. గ్రూప్-2 టాపర్‌గా సెమీస్‌కు టీమిండియా
టి20 ప్రపంచకప్‌లో టీమిండియా గ్రూప్-2 టాపర్‌గా సెమీస్‌లో అడుగుపెట్టింది. జింబాబ్వేతో జరిగిన సూపర్-12 మ్యాచ్‌లో టీమిండియా 71 పరుగుల తేడాతో భారీ విజయాన్ని అందుకుంది. 187 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన జింబాబ్వే టీమిండియా బౌలర్ల దాటికి ఏ దశలోనూ పోరాడలేకపోయింది. భారత బౌలర్లు కట్టుదిట్టమైన బంతులు విసరడంతో పాటు వరుస విరామాల్లో వికెట్లు తీయడంతో జింబాబ్వే ఒత్తిడిలో పడిపోయింది. రియాన్ బర్ల్ 35 పరుగులతో టాప్ స్కోరర్ కాగా.. సికందర్ రజా 34 పరుగులు చేశాడు. టీమిండియా బౌలర్లలో అశ్విన్ 3, మహ్మద్ షమీ, హార్దిక్ పాండ్యాలు రెండు వికెట్లు తీయగా.. భువనేశ్వర్, అర్ష్‌దీప్, అక్షర్ పటేల్ తలా ఒక వికెట్ తీశారు. ఈ విజయంతో టీమిండియా గ్రూప్-2 టాపర్‌గా సెమీస్‌లో అడుగుపెట్టింది. ఇక సెమీఫైనల్లో గ్రూప్-1లో రెండో స్థానంలో ఉన్న ఇంగ్లండ్‌తో అమితుమీ తేల్చుకోనున్నాయి. ఇక మరొక సెమీస్‌లో టోర్నీ ఫేవరెట్ న్యూజిలాండ్‌తో పాకిస్తాన్ ఆడనుంది. అన్ని కుదిరితే టీమిండియా, పాకిస్తాన్ ఫైనల్లో తలపడే అవకాశాలున్నాయి. అంతకముందు తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో రోహిత్ సేన 5 వికెట్ల నష్టానికి 186 పరుగులు చేసింది. ఆకాశమే హద్దుగా చెలరేగిన సూర్యకుమార్ యాదవ్ 61 నాటౌట్, కేఎల్ రాహుల్ 51 రాణించారు. -
WC 2022: అంచనాలు తలకిందులు చేసే ఛాన్స్ ఎలా వదులుకుంటాం: జింబాబ్వే కెప్టెన్
ICC Mens T20 World Cup 2022- India vs Zimbabwe: టీ20 ప్రపంచకప్-2022 సూపర్-12లో ఇప్పటి వరకు ఆడిన నాలుగు మ్యాచ్‌లలో మూడు విజయాలు.. అత్యుత్తమ బ్యాటర్ విరాట్ కోహ్లి పరుగుల మోత.. మిడిలార్డర్లో రాణిస్తూ జట్టును ఆదుకుంటున్న సూర్యకుమార్ యాదవ్.. టోర్నీ తాజా ఎడిషన్‌లో 220 రన్స్‌తో టాప్‌లో.. జయవర్ధనే రికార్డు బద్దలు కొట్టి ఓవరాల్‌గా టాప్ రన్ స్కోరర్‌గా కోహ్లి.. బంగ్లాదేశ్‌తో మ్యాచ్ సందర్భంగా టీ20 ర్యాంకింగ్స్‌లో నంబర్ 1గా అవతరించిన సూర్య.. ఇక బౌలర్లు సరేసరి.. అటు సీనియర్ భువనేశ్వర్ కుమార్.. ఇటు యువ పేసర్ అర్ష్‌దీప్ సింగ్.. ప్రత్యర్థి బ్యాటర్లకు చుక్కలు చూపిస్తున్నారు.. ఫీల్డింగ్‌లోనూ లోపాలు సరిదిద్దుకుని మరింత పటిష్టమైన జట్టుగా టీమిండియా.. సవాల్ విసిరిన జింబాబ్వే కెప్టెన్! ఇలా అన్ని విభాగాల్లో బలంగా ఉన్న రోహిత్ సేన సూపర్-12లో తమ ఆఖరి మ్యాచ్‌లో జింబాబ్వేతో తలపడనుంది. మేటి జట్టు.. వరల్డ్‌క్లాస్ బ్యాటర్లు.. మరి ప్రత్యర్థి భయపడటం సాధారణమే కదా! అయితే, గొప్ప జట్టుతో పోటీపడటం తమకే లాభిస్తుందంటున్నాడు జింబాబ్వే కెప్టెన్ క్రెయిగ్ ఎర్విన్. పాకిస్తాన్‌తో ఉత్కంఠ మ్యాచ్‌లో ఒక్క పరుగు తేడాతో గెలుపొంది సంచలనం సృష్టించిన జింబాబ్వే.. నెదర్లాండ్స్ చేతిలో 5 వికెట్ల తేడాతో ఓడిపోయి చతికిలపడింది. అయితే, టీమిండియాతో మ్యాచ్‌లో మాత్రం కచ్చితంగా బ్యాటర్లను కట్టడి చేసేందుకు తమ బౌలర్లు సంసిద్ధంగా ఉన్నారంటూ క్రెయిగ్ సవాల్ విసరడం విశేషం. గ్రూప్-2లో ఆఖరి మ్యాచ్‌లో భారత జట్టుతో ఆదివారం(నవంబరు 6) జింబాబ్వే తలపడనున్న నేపథ్యంలో జింబాబ్వే సారథి క్రెయిగ్ ఎర్విన్ శనివారం మీడియాతో ముచ్చటించాడు. ఈ సందర్భంగా అతడు మాట్లాడుతూ.. ‘‘టీమిండియా బ్యాటర్లను ఎదుర్కోవడానికి మా బౌలర్లు సిద్ధంగా ఉన్నారు. అంచనాలు తలకిందులు చేసే ఛాన్స్! ప్రపంచంలోనే గొప్ప బ్యాటర్లకు బౌలింగ్ చేయడం కంటే అదృష్టం, అవకాశం మరొకటి ఉండదు. కాబట్టి మా వాళ్లు తప్పకుండా వందకు వంద శాతం అత్యుత్తమ ప్రదర్శన కనబరిచేందుకు సన్నద్ధమయ్యారు. విరాట్ కోహ్లి వికెట్ తీసే అవకాశం ఎంత మందికి వస్తుంది? అలాంటి అరుదైన, అంచనాలు తలకిందులు చేసే ఛాన్స్‌ను ఎవరు మాత్రం వదులుకుంటారు! రేపటి మ్యాచ్‌లో మా ఫాస్ట్ బౌలర్లు కచ్చితంగా తమ సత్తా చాటుకుంటారు’’ అని తాము ఆత్మవిశ్వాసంతో ఉన్నట్లు వెల్లడించాడు. అలాంటివి వర్కౌట్ కావేమో! ఇక కోహ్లి అత్యుత్తమ ఆటగాడు అంటూ కొనియాడిన 37 ఏళ్ల ఎర్విన్.. అతడి కోసం ప్రత్యేకంగా ప్రణాళికలేమీ రచించలేదన్నాడు. పరిస్థితులకు తగ్గట్లుగా సమయస్ఫూర్తితో బ్యాటింగ్ చేసే మేటి బ్యాటర్ల విషయంలో స్పెషల్ ప్లాన్స్ పెద్దగా వర్కౌట్ కావు గానీ తమ బౌలర్లు మాత్రం పట్టుదలగా పోరాడటం ఖాయమని చెప్పుకొచ్చాడు. కాగా మెల్బోర్న్లో టీమిండియా- జింబాబ్వే మ్యాచ్ ముగిసిన తర్వాత గ్రూప్-2 నుంచి ఏ రెండు జట్లు సెమీస్‌కు చేరతాయన్న అంశం తేలనుంది. చదవండి: Virat Kohli- Anushka Sharma Love Story: అప్పుడప్పుడు నటించేవాడు కూడా.. ‘బ్యాడ్ జోక్’తో మాట కలిపి! ఇప్పుడేమో ఇలా T20 WC 2022: వర్షంతో మ్యాచ్ రద్దయినా టీమిండియాకే మేలు -
పాక్‌పై జింబాబ్వే ఉత్కంఠ విజయం
పాక్‌కు షాక్.. జింబాబ్వే విజయం టి20 ప్రపంచకప్‌లో భాగంగా సూపర్-12లో మరో సంచలనం నమోదైంది. గురువారం గ్రూఫ్-2లో పాకిస్తాన్‌కు షాకిచ్చిన జింబాబ్వే సంచలన విజయం నమోదు చేసింది. 131 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్తాన్ నిర్ణీత 20 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 129 పరుగులే చేయగలిగింది. దీంతో జింబాబ్వే ఒక్క పరుగు తేడాతో సంచలన విజయం సాధించింది. ఆఖరి వరకు పోరాడిన జింబాబ్వే అద్బుత ఆటతీరుతో మ్యాచ్‌ను సొంతం చేసుకుంది. పాకిస్తాన్ ఇన్నింగ్స్‌లో షాన్ మసూద్ 44 పరుగులతో టాప్ స్కోరర్ కాగా.. మహ్మద్ నవాజ్ 22 పరుగులు, మహ్మద్ వసీమ్ 12 పరుగులు నాటౌట్ చేశారు. జింబాబ్వే బౌలింగ్‌లో సికందర్ రజా 3, బ్రాడ్ ఎవన్స్ 2 వికెట్లు తీశారు. పాక్‌ను దెబ్బతీసిన సికందర్ రజా.. ఒకే ఓవర్లో రెండు వికెట్లు ► జింబాబ్వేతో మ్యాచ్‌లో పాకిస్తాన్ మళ్లీ తడబడింది. ఆల్‌రౌండర్ సికందర్ రజా ఒకే ఓవర్లో రెండు వికెట్లు తీసి పాకిస్తాన్‌ను దెబ్బతీశాడు. మొదట 17 పరుగులు చేసిన షాదాబ్ ఖాన్‌ను పెవిలియన్ చేర్చిన రజా.. ఆ తర్వాత బంతికి హైదర్ అలీని గోల్డెన్ డకౌట్ చేశాడు. ప్రస్తుతం పాకిస్తాన్ 5 వికెట్ల నష్టానికి 88 పరుగులు చేసింది. పాక్ విజయానికి 36 బంతుల్లో 43 పరుగులు కావాల్సి ఉంది. నిలకడగా ఆడుతున్న పాకిస్తాన్.. 13 ఓవర్లలో 88/3 ► 36 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన పాకిస్తాన్ ఇన్నింగ్స్‌ను షాన్ మసూద్, షాదాబ్ ఖాన్లు నిలకడగా నడిపిస్తున్నారు. ప్రస్తుతం 13 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 88 పరుగులు చేసింది. షాన్ మసూద్ 39, షాదాబ్ ఖాన్ 17 పరుగులతో క్రీజులో ఉన్నారు. మూడో వికెట్ కోల్పోయిన పాకిస్తాన్ ► జింబాబ్వేతో మ్యాచ్‌లో పాకిస్తాన్ మూడో వికెట్ కోల్పోయింది. 5 పరుగులు చేసిన ఇప్తికర్ అహ్మద్ జాంగ్వే బౌలింగ్‌లో చక్బవాకు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ప్రస్తుతం పాకిస్తాన్ 36 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. రిజ్వాన్(14) ఔట్.. రెండో వికెట్ డౌన్ ► 14 పరుగుల వద్ద మహ్మద్ రిజ్వాన్ క్లీన్‌బౌల్డ్ అయ్యాడు. ముజరబానీ వేసిన ఇన్నింగ్స్ 5వ ఓవర్ నాలుగో బంతి ఇన్సైడ్ ఎడ్జ్ తీసుకొని వికెట్లను గిరాటేసింది. దీంతో పాక్ రెండో వికెట్ కోల్పోయింది. ప్రస్తుతం జింబాబ్వే 5 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 23 పరుగులు చేసింది. బాబర్ ఆజం(4) ఔట్.. తొలి వికెట్ కోల్పోయిన పాకిస్తాన్ ► 131 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్తాన్‌కు షాక్ తగిలింది. కెప్టెన్ బాబర్ ఆజం మరోసారి విఫలమయ్యాడు. ఫామ్ కోల్పోయి తంటాలు పడుతున్న బాబర్ ఆజం బ్రాడ్ ఎవన్స్ బౌలింగ్‌లో నాలుగు పరుగులు మాత్రమే చేసి రియాన్ బర్ల్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ప్రస్తుతం పాకిస్తాన్ వికెట్ నష్టానికి 13 పరుగులు చేసింది. నామమాత్రపు స్కోరుకు పరిమితమైన జింబాబ్వే.. పాక్ టార్గెట్ 131 పాకిస్తాన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో జింబాబ్వే నామమాత్రపు స్కోరుకే పరిమితమైంది. పాక్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో పాటు వరుస విరామాల్లో వికెట్లు తీయడంతో జింబాబ్వే నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 130 పరుగులు చేసింది. సీన్ విలియమ్స్ 31 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. చివర్లో బ్రాడ్ ఎవన్స్ 19, రెయాన్ బర్ల్ 10 నాటౌట్ పరుగులు చేయడంతో జింబాబ్వే కనీసం పోరాడే స్కోరు చేయగలిగింది. 93/3తో కాస్త మెరుగైన స్థితిలో కనిపించిన జింబాబ్వే రెండు పరుగుల వ్యవధిలోనే నాలుగు వికెట్లు చేజార్చుకుంది. పాకిస్తాన్ బౌలర్లలో మహ్మద్ వసీమ్ 4, షాదాబ్ ఖాన్ 3, హారిస్ రౌఫ్ ఒక వికెట్ తీశాడు. ► జింబాబ్వే బ్యాటర్ జాక్ లుంగ్వే మహ్మద్ వసీమ్ బౌలింగ్‌లో గోల్డెన్ డక్ అయ్యాడు. ప్రస్తుతం జింబాబ్వే 16 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 102 పరుగులు చేసింది. ► మహ్మద్ వసీమ్ వేసిన ఇన్నింగ్స్ 15వ ఓవర్లో జింబాబ్వే ఆరో వికెట్ కోల్పోయింది. జింబాబ్వే కీలక బ్యాటర్ సికందర్ రజా 9 పరుగుల వద్ద వెనుదిరిగాడు. బాబర్ ఆజం స్టన్నింగ్ క్యాచ్.. ఐదో వికెట్ కోల్పోయిన జింబాబ్వే ► పాకిస్తాన్ ఆల్‌రౌండర్ షాదాబ్‌ఖాన్ మెరిశాడు. తాను వేసిన ఇన్నింగ్స్ 14వ ఓవర్లో వరుస బంతుల్లో రెండు వికెట్లు తీశాడు. మొదట 31 పరుగులు చేసిన విలియమ్స్ క్లీన్‌బౌల్డ్ కాగా.. ఆ తర్వాత బంతికే బాబర్ ఆజం స్టన్నింగ్ క్యాచ్‌తో చక్‌బవా గోల్డెన్ డకౌట్‌గా వెనుదిరగాల్సి వచ్చింది. 8 ఓవర్లలో జింబాబ్వే స్కోరు ఎంతంటే? ► 8 ఓవర్లు ముగిసేసరికి జింబాబ్వే రెండు వికెట్ల నష్టానికి 53 పరుగులు చేసంది. సీన్ విలియమ్స్ 7, మిల్టన్ షుంబా మూడు పరుగులుతో ఆడుతున్నారు. అంతకముందు 17 పరుగులు చేసిన మాధవరే మహ్మద్ వసీమ్ బౌలింగ్‌లో ఎల్బీగా వెనుదిరిగాడు. తొలి వికెట్ కోల్పోయిన జింబాబ్వే.. ► పాకిస్తాన్‌తో మ్యాచ్‌లో జింబాబ్వే తొలి వికెట్ కోల్పోయింది. 19 పరుగులు చేసిన కెప్టెన్ క్రెయిగ్ ఇర్విన్ హారిస్ రౌఫ్ బౌలింగ్‌లో మహ్మద్ వసీమ్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ప్రస్తుతం జింబాబ్వే 5 ఓవర్లలో వికెట్ నష్టానికి 42 పరుగులు చేసింది. మాధవరే 17 పరుగులతో క్రీజులో ఉన్నాడు. ఇన్నింగ్స్‌ను ధాటిగా ఆరంభించిన జింబాబ్వే.. ► పాకిస్తాన్‌తో మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఆరంభించిన జింబాబ్వే ఇన్నింగ్స్‌ను ధాటిగా ఆరంభించింది. షాహిన్ ఆఫ్రిది వేసిన తొలి ఓవర్లో ఓపెనర్ వెస్లీ మాధవరే రెండు ఫోర్లు కొట్టి దూకుడు చూపించాడు. ప్రస్తుతం జింబాబ్వే 3 ఓవర్లు ముగిసేసరికి వికెట్ నష్టపోకుండా 31 పరుగులు చేసింది. ఇర్విన్ 13, మాధవరే 16 పరుగులుతో క్రీజులో ఉన్నారు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఏంచుకున్న జింబాబ్వే ► టి20 ప్రపంచకప్‌లో సూపర్-12లో భాగంగా గురువారం గ్రూఫ్-2లో పాకిస్తాన్, జింబాబ్వేల మధ్య మ్యాచ్ ప్రారంభమైంది. టాస్ గెలిచిన జింబాబ్వే బ్యాటింగ్ ఏంచుకుంది. తొలి మ్యాచ్‌లో టీమిండియా చేతిలో ఓడిన పాకిస్తాన్ జింబాబ్వేపై గెలిచి ఖాతా తెరవాలని భావిస్తుంది. మరోవైపు జింబాబ్వే మాత్రం దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి మ్యాచ్‌కు వరుణుడు అడ్డుపడడంతో ఒక్క బంతి కూడా పడకుండానే రద్దైంది. దీంతో ఇరుజట్లకు చెరో పాయింట్ కేటాయించారు. పాకిస్తాన్ : మహ్మద్ రిజ్వాన్(వికెట్ కీపర్), బాబర్ ఆజం(కెప్టెన్), షాన్ మసూద్, ఇఫ్తీకర్ అహ్మద్, షాదాబ్ ఖాన్, హైదర్ అలీ, మహ్మద్ నవాజ్, షాహీన్ అఫ్రిది, హరీస్ రవూఫ్, మహ్మద్ వసీం జూనియర్, నసీమ్ షా జింబాబ్వే: రెగిస్ చకబ్వా(వికెట్ కీపర్), క్రెయిగ్ ఎర్విన్(కెప్టెన్), సీన్ విలియమ్స్, సికందర్ రజా, వెస్లీ మాధేవెరే, మిల్టన్ శుంబా, బ్రాడ్ ఎవాన్స్, ర్యాన్ బర్ల్, ల్యూక్ జోంగ్వే, బ్లెస్సింగ్ ముజారబానీ, రిచర్డ్ నగరవ ఇంకా ఖాతా తెరవని జింబాబ్వే కూడా పాకిస్తాన్‌పై నెగ్గి క్వాలిఫయింగ్‌లో చూపెట్టిన జోరును ఇక్కడా ప్రదర్శించాలనే పట్టుదలతో ఉంది.ముఖాముఖి పోరులో పాకిస్తాన్, జింబాబ్వేలు 17సార్లు తలపడగా.. పాకిస్తాన్ 16 సార్లు గెలవగా.. జింబాబ్వే ఒకసారి మాత్రమే నెగ్గింది. ఇక టి20 ప్రపంచకప్‌లో పాకిస్తాన్‌తో జింబాబ్వేకు ఇదే తొలి మ్యాచ్ కావడం గమనార్హం. జింబాబ్వే కదా తేలికగా తీసుకుంటే మాత్రం మొదటికే మోసం వచ్చే అవకాశం ఉంది. టీమిండియాతో మ్యాచ్‌లో బాబర్ ఆజం గోల్డెన్ డకౌట్‌గా వెనుదిరగడం జట్టును ప్రభావితం చేసింది. ఇన్ఫాం బ్యాటర్ మహ్మద్ రిజ్వాన్ కూడా తక్కువ స్కోరుకే వెనుదిరిగాడు. అయితే షాన్ మసూద్, ఇప్తికర్ అహ్మద్, హైదర్ అలీలతో మిడిలార్డర్ పటిష్టంగా కనిపిస్తోంది. ఇక చివర్లో షాదాబ్ ఖాన్ హిట్టర్లు ఉండనే ఉన్నారు. ఇక బౌలింగ్ మాత్రం దుర్బేద్యంగా ఉంది. అటు జింబాబ్వే బ్యాటింగ్ మాత్రం ప్రధానంగా కెప్టెన్ క్రెయిగ్ ఇర్విన్, సికందర్ రజాలపై ఆధారపడి ఉంది. బౌలింగ్ విభాగం కూడా బాగానే కనిపిస్తుంది. -
జింబాబ్వే కొత్త చరిత్ర.. 15 ఏళ్లలో తొలిసారి
టి20 ప్రపంచకప్‌లో జింబాబ్వే కొత్త చరిత్ర సృష్టించింది.ఈ మెగాటోర్నీ ఆరంభమైన 15 ఏళ్లలో జింబాబ్వే తొలిసారి సూపర్-12 స్టేజ్‌లో అడుగుపెట్టింది. సూపర్-12కు చేరడం మనకు పెద్ద విషయం కాకపోవచ్చు.. కానీ జింబాబ్వేకు మాత్రం ఇది పెద్ద ఘనత అని చెప్పొచ్చు. ఎందుకంటే జింబాబ్వే సరైన క్రికెట్ ఆడి దశాబ్దంన్నర గడిచిపోయింది. ఈ దశాబ్దంన్నరలో జింబాబ్వే జట్టు ఆర్ధిక సంక్షోభంతో కొట్టుమిట్టాడింది. ఎంతలా అంటే క్రికెటర్లకు కనీసం షూస్, జీతాలు చెల్లించలేని పరిస్థితి. అలాంటి స్థితి నుంచి ఇవాళ అందరూ మెచ్చుకునే స్థాయికి ఎదిగింది. ఈ మధ్య కాలంలో చూసుకుంటే జింబాబ్వే క్రికెట్లో పునర్వైభవం స్పష్టంగా కనిపిస్తోంది. బంగ్లాదేశ్‌ను ఓడించిన జింబాబ్వే.. ఆ తర్వాత టీమిండియాకు చెమటలు పట్టించింది. ముఖ్యంగా సికందర్ రజా, క్రెయిగ్ ఇర్విన్, సీన్ విలియమ్స్, రియాన్ బర్ల్ సహా కొంతమంది ఆటగాళ్లు జింబాబ్వేను పటిష్టంగా తయారు చేశారు. టి20 ప్రపంచకప్ ఆరంభమైన నాటి నుంచి జింబాబ్వే క్వాలిఫయింగ్ పోరులోనే వెనుదిరుగుతూ వస్తుంది. 2007, 2010, 2012, 201,2016 వరల్డ్‌కప్‌లు ఆడిన జింబాబ్వే గ్రూఫ్ దశకే పరిమితమైంది. ఇక 2009, 2021 ప్రపంచకప్‌లకు జింబాబ్వే కనీసం అర్హత కూడా సాధించలేదు. ఇదే జింబాబ్వే ఒకప్పుడు క్వాలిఫయింగ్ మ్యాచ్‌ల్లోనే వెనుదిరిగిన జింబాబ్వే ఏడాది తిరగకుండానే జరిగిన టి20 ప్రపంచకప్ క్వాలిఫయింగ్ పోరులో ఇవాళ ఒక్క ఓటమి కూడా లేకుండా గ్రూఫ్ టాపర్‌గా నిలిచింది. సగర్వంగా సూపర్-12లో అడుగుపెట్టింది. ఇండియా, పాకిస్తాన్, బంగ్లాదేశ్, నెదర్లాండ్స్ లాంటి జట్లున్న గ్రూఫ్-2లో ఉన్న జింబాబ్వేను తక్కువ అంచనా వేస్తే మొదటికే మోసం వచ్చే అవకాశం ఉంది. ఇక జింబాబ్వే తొలిసారి టి20 ప్రపంచకప్‌లో సూపర్-12కు అర్హత సాధించడంపై క్రికెట్ ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ''కప్ గెలుస్తుందో లేదో తెలియదు కానీ మనసులు మాత్రం గెలిచేసింది.'' అంటూ కామెంట్స్ చేశారు. ఐసీసీ కూడా జింబాబ్వే సూపర్-12కు అర్హత సాధించడంపై ఆనందం వ్యక్తం చేస్తూ వారి విన్నింగ్ మూమెంట్‌ను షేర్ చేసింది. ''తొలిసారి జింబాబ్వే సూపర్-12 స్టేజీకి అర్హత సాధించింది. ఇది వారికి చాలా గొప్ప విజయం''అంటూ క్యాప్షన్ జత చేసింది. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. శుక్రవారం స్కాట్లాండ్తో జరిగిన క్వాలిఫయింగ్ పోరులో జింబాబ్వే ఐదు వికెట్ల తేడాతో విజయాన్ని అందుకుంది. జట్టులో సీనియర్ ఆటగాళ్లైన కెప్టెన్ క్రెయిగ్ ఇర్విన్, సికందర్ రజాలు తమ విలువేంటో చూపిస్తూ జట్టును గెలిపించారు. వారిద్దరి మెరుపులతో 133 పరుగుల లక్ష్యాన్ని జింబాబ్వే మరో 9 బంతులు మిగిలి ఉండగానే విజయాన్ని అందుకుంది. View this post on Instagram A post shared by ICC (@icc) #T20WorldCup Group 1: 🏴 🇳🇿 🇦🇺 🇦🇫 🇱🇰 🇮🇪 Group 2: 🇮🇳 🇵🇰 🇿🇦 🇧🇩 🇿🇼 🇳🇱 The Super 12 is set! ✅ Who takes home the trophy? 🏆https://t.co/nwR4cn6DTE pic.twitter.com/bNvvRWGgGf — The Field (@thefield_in) October 21, 2022 All round brilliance 👌 For contributions with bat and ball in Zimbabwe's historic win in the #T20WorldCup, Sikandar Raza is the @aramco Player of the Match 🌟 pic.twitter.com/fd9DIPZ6dE — ICC (@ICC) October 21, 2022 చదవండి: భారత్-పాక్ మ్యాచ్.. వీళ్లు ఎదురుపడితే మజానే వేరు -
క్రెయిగ్ ఇర్విన్, సికందర్ రజా మెరుపులు.. సూపర్-12కు జింబాబ్వే
టి20 ప్రపంచకప్‌లో భాగంగా జింబాబ్వే సూపర్-12లో అడుగుపెట్టింది. గ్రూఫ్-బిలో భాగంగా స్కాట్లాండ్తో జరిగిన మ్యాచ్‌లో జింబాబ్వే ఐదు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. 133 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన జింబాబ్వే 18.3 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి టార్గెట్‌ను అందుకుంది. క్రెయిగ్ ఇర్విన్(58 పరుగులు) కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడగా.. సికందర్ రజా 23 బంతుల్లో 40 పరుగులు కీలక ఇన్నింగ్స్ ఆడాడు. ఆఖర్లో జింబాబ్వే వరుసగా వికెట్లు కోల్పోయినప్పటికి మిల్టన్ షుంబా 11, రియాన్ బర్ల్ 9 పరుగులు చేసి జట్టును గెలిపించారు. స్కాట్లాండ్ బౌలర్లలో జోష్ డేవీ 2, బ్రాడ్ వీల్, మార్క్ వాట్, మైకెల్ లీస్క్‌లు తలా ఒక వికెట్ తీశారు. అంతకముందు తొలుత బ్యాటింగ్ చేసిన స్కాట్లాండ్ నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 132 పరుగులు చేసింది. స్కాట్లాండ్ ఇన్నింగ్స్‌లో ఒక్క సిక్సర్ కూడా లేకపోవడం గమనార్హం. స్కాట్లాండ్ ఇన్నింగ్స్‌లో మున్సీ 54 పరుగులతో టాప్ స్కోరర్ కాగా.. మెక్ లియోడ్ 25 పరుగులు చేశాడు. జింబాబ్వే బౌలర్లలో చతరా, నగర్వాలు తలా రెండు వికెట్లు తీయగా.. ముజరబానీ, సికందర్ రాజాలు చెరొక వికెట్ తీశారు. ఈ విజయంతో జింబాబ్వే జట్టు గ్రూఫ్-బి టాపర్‌గా సూపర్-12లో ఇండియా, పాకిస్తాన్‌లు ఉన్న గ్రూఫ్-2లోకి రాగా.. వెస్టిండీస్‌పై విజయం సాధించిన ఐర్లాండ్ బి2గా ఇంగ్లండ్, ఆస్ట్రేలియాలు ఉన్న గ్రూఫ్-1లోకి అడుగుపెట్టింది. ఇక సూపర్-12లో గ్రూఫ్-1లో ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, న్యూజిలాండ్, శ్రీలంక, ఐర్లాండ్‌లు ఉండగా.. గ్రూఫ్-2లో ఇండియా, పాకిస్తాన్, బంగ్లాదేశ్, నెదర్లాండ్స్, జింబాబ్వేలు ఉన్నాయి. చదవండి: 'హెట్‌మైర్ శాపం తగిలింది.. అందుకే విండీస్‌కు ఈ దుస్థితి' నొప్పితో బాధపడుతుంటే చప్పట్లు కొట్టడం ఏంటి? var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4911494512.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
T20 WC 2022: జట్టును ప్రకటించిన జింబాబ్వే.. కెప్టెన్ వచ్చేశాడు! వాళ్లు కూడా!
T20 World Cup 2022- Zimbabwe Squad: ఆస్ట్రేలియా వేదికగా ఆరంభం కానున్న టీ20 ప్రపంచకప్-2022 టోర్నీకి జింబాబ్వే జట్టును ప్రకటించింది. తొడ కండరాల గాయంతో జట్టుకు దూరమైన కెప్టెన్ క్రెయిగ్ ఎర్విన్ ఈ ఐసీసీ మెగా ఈవెంట్‌తో పునరాగమనం చేయనున్నాడు. అదే విధంగా.. ఆస్ట్రేలియా పర్యటనకు దూరంగా ఉన్న పేసర్ బ్లెస్సింగ్ ముజరబాని సైతం సెలక్టర్ల నుంచి పిలుపు అందుకున్నాడు. 15 మంది సభ్యులతో మెగా ఈవెంట్‌కు వీరితో పాటు.. గాయాల నుంచి కోలుకున్న టెండాయి చటారా, వెల్లింగ్టన్ మసకద్జ, మిల్టన్ శుంబాలకు తిరిగి జట్టులో స్థానం దక్కించుకున్నారు. కాగా క్రెయిగ్ సారథ్యంలో 15 మందితో కూడిన జట్టును ఐసీసీ టోర్నీకి ఎంపిక చేసినట్లు జింబాబ్వే క్రికెట్ బోర్డు తెలిపింది. కాగా ఆస్ట్రేలియా వేదికగా అక్టోబరు 16 నుంచి నవంబరు 13 వరకు ప్రపంచకప్ టోర్నీ జరుగనున్న విషయం తెలిసిందే. ఈ ఐసీసీ మెగా ఈవెంట్లో క్వాలిఫైయింగ్ దశలో అక్టోబరు 17న జింబాబ్వే ఐర్లాండ్‌తో తమ మొదటి మ్యాచ్‌లో తలపడనుంది. అంతకంటే ముందు శ్రీలంక, నమీబియాలతో అక్టోబరు 10, 13 తేదీల్లో వార్మప్ మ్యాచ్‌లు ఆడనుంది. టీ20 ప్రపంచకప్-2022కు జింబాబ్వే జట్టు: క్రెయిగ్ ఎర్విన్(కెప్టెన్), రియాన్ బర్ల్, రెగిస్ చకబ్వా, టెండాయి చటారా, బ్రాడ్లే ఎవాన్స్, ల్యూక్ జోంగ్వే, క్లైవ్ మడాండే, వెస్లీ మెధెవెరె, వెల్లింగ్టన్ మసకద్జ, టోనీ మున్యోంగా, బ్లెస్సింగ్ ముజరబాని, రిచర్డ్ నగరవ, సికిందర్ రజా, మిల్టన్ శుంబా, సీన్ విలియమ్స్. రిజర్వు ప్లేయర్లు: టనక చివాంగా, ఇన్నోసెంట్ కైయా, కెవిన్ కసుజ, తడివానివాషె మరుమాని, విక్టర్ న్యౌచి. చదవండి: కోహ్లి, రోహిత్‌లను అవుట్ చేస్తే.. సగం జట్టు పెవిలియన్ చేరినట్లే! అలా అనుకుని.. T20 WC: ఇదే లాస్ట్ ఛాన్స్! అదే జరిగితే బాబర్ ఆజం కెప్టెన్సీ కోల్పోవడం ఖాయం!