వరల్డ్‌కప్ క్వాలిఫయర్స్ 2023లో భాగంగా నిన్న (జూన్ 18) జరిగిన రెండు మ్యాచ్‌ల్లో మూడు సెంచరీలు నమోదయ్యాయి. నేపాల్‌తో జరిగిన మ్యాచ్‌లో జింబాబ్వే బ్యాటర్లు సీన్ విలియమ్స్ (70 బంతుల్లో 102 నాటౌట్; 13 ఫోర్లు, సిక్స్), క్రెయిగ్ ఎర్విన్ (128 బంతుల్లో 121 నాటౌట్; 15 ఫోర్లు, సిక్స్) అజేయ శతకాలు సాధించగా.. వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో యూఎస్‌ఏ ఆటగాడు గజానంద్ సింగ్ (109 బంతుల్లో 101 నాటౌట్; 8 ఫోర్లు, 2 సిక్సర్లు) వీరోచిత శతకం బాదాడు.
రెండు వేర్వేరు మ్యాచ్‌ల్లో ముగ్గురు సెంచరీలు చేయడం సాధారణ విషయమే అయినప్పటికీ.. సెంచరీలు చేసిన వారు 35 ఏళ్ల వయసు పైబడ్డ వారు కావడం విశేషం. అందులోనూ ముగ్గురు బ్యాటర్లు నాటౌట్‌గా నిలిచారు. వీరిలో జింబాబ్వే ఆటగాడు సీన్ విలియమ్స్‌ది ఆ దేశం తరఫున వన్డేల్లో ఫాస్టెస్ట్ హండ్రెడ్ (70) కావడం మరో విశేషం. శతక్కొట్టిన బ్యాటర్లలో యూఎస్‌ఏ ఆటగాడు గజానంద్ సింగ్‌కు 35 ఏళ్లు కాగా.. సీన్ విలియమ్స్‌కు 36, క్రెయిగ్ ఎర్విన్‌కు 37 ఏళ్లు. లేటు వయసులో ఈ ముగ్గురు బ్యాటర్లు తమ జట్లను గెలిపించేందుకు శక్తి వంచన లేకుండా ప్రత్నించడంతో నెటిజన్లు వీరిని ప్రశంసిస్తున్నారు.
కాగా, నేపాల్‌తో జరిగిన మ్యాచ్‌లో సీన్ విలియమ్స్, క్రెయిగ్ ఎర్విన్ సెంచరీలు చేసి జింబాబ్వేను విజయతీరాలకు చేర్చగా.. విండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో గజానంద్ వీరోచిత సెంచరీ చేసి తన జట్టును (యూఎస్‌ఏ) గెలిపించేందుకు విఫలయత్నం చేశాడు. నేపాల్‌పై జింబాబ్వే 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించగా.. యూఎస్‌ఏపై వెస్టిండీస్ 39 పరుగుల తేడాతో గెలుపొందింది.
Comments
Please login to add a commentAdd a comment