Sean Williams
-
అజేయ లంక.. క్వాలిఫయర్స్ ఫైనల్లో జయకేతనం
వరల్డ్‌కప్ క్వాలిఫయర్స్-2023లో శ్రీలంక అజేయ జట్టుగా నిలిచింది. ఈ టోర్నీలో ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోని శ్రీలంక.. వన్డేల్లో తమ విజయ పరంపరను కొనసాగించింది. ఈ ఫార్మాట్లో వరుసగా 10 మ్యాచ్‌ల్లో విజయాలు సాధించిన శ్రీలంక.. ఇవాళ (జులై 9) జరిగిన ఫైనల్లో నెదర్లాండ్స్‌పై 128 పరుగుల భారీ తేడాతో గెలుపొంది, క్వాలిఫయర్స్ విజేతగా నిలిచింది. 🇦🇪 ✅ 🇴🇲 ✅ 🍀 ✅ 🏴 ✅ 🇳🇱 ✅ 🇿🇼 ✅ 🌴 ✅ 🏆 ✅ 🙏 Namaste India ✅#LionsRoar #CWC23 pic.twitter.com/nO7U14F9ky — Sri Lanka Cricket 🇱🇰 (@OfficialSLC) July 9, 2023 ఓ మోస్తరు లక్ష్యాన్ని కాపాడుకునే క్రమంలో లంక బౌలర్లు చెలరేగిపోయారు. మహేష్ తీక్షణ (6.3-1-31-4), దిల్షన్ మధుశంక (7-1-18-3), హసరంగ (7-1-35-2) నెదర్లాండ్స్ పతనాన్ని శాసించారు. 🔥 Another fiery spell of fast bowling by Dilshan Madushanka! 💪🏏#LionsRoar #CWC23 pic.twitter.com/tCwDdA6ojw — Sri Lanka Cricket 🇱🇰 (@OfficialSLC) July 9, 2023 ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక.. 47.5 ఓవర్లలో 233 పరుగులకు ఆలౌటైంది. కొత్త ఆటగాడు సహన్ అర్చిగే (57) అర్ధసెంచరీతో రాణించగా.. కుశాల్ మెండిస్ (43), అసలంక (36) పర్వాలేదనిపించారు. ఆఖర్లో హసరంగ (29), తీక్షణ (13) కాసేపు ప్రతిఘటించడంతో శ్రీలంక 200 పరుగుల మైలురాయిని దాటగలిగింది. నెదర్లాండ్స్ బౌలర్లలో వాన్ బీక్, ర్యాన్ క్లెయిన్, విక్రమ్‌జీత్ సింగ్, సాకిబ్ జుల్ఫికర్ తలో 2 వికెట్లు పడగొట్టగా.. ఆర్యన్ దత్ ఓ వికెట్ దక్కించుకున్నాడు. He is unstoppable! 💪 Another match-winning spell by Maheesh Theekshana! 🏏🎉🔥#LionsRoar pic.twitter.com/FY0YwfMAwg — Sri Lanka Cricket 🇱🇰 (@OfficialSLC) July 9, 2023 అనంతరం ఓ మోస్తరు లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన నెదర్లాండ్స్.. తీక్షణ, మధుశంక, హసరంగ ధాటికి 23.3 ఓవర్లలో 105 పరుగులు మాత్రమే చేసి ఆలౌటైంది. నెదర్లాండ్స్ ఇన్నింగ్స్‌లో మ్యాక్స్ ఓడౌడ్ (33), వాన్ బీక్ (20 నాటౌట్), విక్రమ్‌జీత్ (13) మాత్రమే రెండంకెల స్కోర్ చేశారు. మధుశంకకు ప్లేయర్ ఆఫ్ మ్యాచ్ అవార్డు దక్కగా.. టోర్నీ ఆసాంతం రాణించిన జింబాబ్వే ప్లేయర్ సీన్ విలియమ్స్‌కు ప్లేయర్ ఆఫ్ ద టోర్నీ అవార్డు లభించింది. కాగా, ఈ మ్యాచ్ ఫలితంతో సంబంధం లేకుండా శ్రీలంక, నెదర్లాండ్స్ జట్లు వన్డే వరల్డ్‌కప్‌కు అర్హత సాధించిన విషయం తెలిసిందే. -
కొనసాగుతున్న సీన్ విలియమ్స్ భీకర ఫామ్.. వదిలితే రన్‌మెషీన్‌ను మించిపోయేలా ఉన్నాడు..!
వరల్డ్‌కప్ క్వాలిఫయర్స్ 2023లో జింబాబ్వే వెటరన్ బ్యాటర్ సీన్ విలియమ్స్ భీకర ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. ఇప్పటివరకు జరిగిన 5 మ్యాచ్‌ల్లో 3 సెంచరీలు (102*, 174, 142), ఓ భారీ హాఫ్ సెంచరీ (91) సాయంతో 532 పరుగులు చేసిన విలియమ్స్.. ఇవాళ (జులై 2) శ్రీలంకతో జరుగుతున్న మ్యాచ్‌లో మరో అర్ధసెంచరీ (56) సాధించి, పరుగుల యంత్రం విరాట్ కోహ్లిని మరిపించాడు. విరాట్ 5 వరుస వన్డే ఇన్నింగ్స్‌ల్లో 4 శతకాల సాయంతో 596 పరుగులు చేస్తే.. విలియమ్స్ ఇంచుమించు విరాట్ రికార్డును సమం చేసినంత పని చేశాడు. సీన్ విలియమ్స్ ఫామ్ వన్డేల వరకే పరిమితమైందనుకుంటే పొరపాటే. ఈ వెటరన్ ఆల్‌రౌండర్ టెస్ట్‌ల్లోనూ భీకర ఫామ్‌లో ఉన్నాడు. విలియమ్స్ చివరిగా ఆడిన 5 టెస్ట్ ఇన్నింగ్స్‌ల్లో 3 సెంచరీలు, ఓ హాఫ్ సెంచరీ సాధించాడు. కాగా, విలియమ్స్ పరుగుల ప్రవాహం కొనసాగుతుండటంతో వరల్డ్‌కప్ క్వాలిఫయర్స్‌లో జింబాబ్వే విజయ యాత్ర కొనసాగుతుంది. ఆ జట్టు సూపర్ సిక్స్‌లో శ్రీలంకతో సమానంగా 6 పాయింట్లు సాధించి , వన్డే వరల్డ్‌కప్-2023 బెర్త్‌ను దాదాపుగా ఖరారు చేసుకుంది. అయితే, శ్రీలంకతో ఇవాళ జరుగుతున్న కీలక మ్యాచ్‌లో మాత్రం జింబాబ్వే చేతులెత్తేసింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఆ జట్టు 32.2 ఓవర్లలో 165 పరుగులు మాత్రమే చేసి చాపచుట్టేసింది. సీన్ విలియమ్స్ (56) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. సికందర్ రజా (31) కాస్త పర్వాలేదనిపించాడు. శ్రీలంక బౌలర్లలో తీక్షణ (4/25), మధుశంక (3/15), పతిరణ (2/18), షనక (1/30) చెలరేగిపోయారు. -
ఒమన్‌పై విజయం.. వరల్డ్‌కప్ అర్హత దిశగా జింబాబ్వే
సొంతగడ్డపై జరుగుతున్న క్రికెట్ వరల్డ్‌కప్ క్వాలిఫయర్స్ పోటీలో జింబాబ్వే ఎదురులేకుండా సాగుతోంది. గురువారం మొదలైన సూపర్ సిక్స్ పోటీల్లో జింబాబ్వే, ఒమన్‌లు తలపడ్డాయి. ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌లో జింబాబ్వే 14 పరుగుల తేడాతో విజయాన్ని అందుకుంది. ఈ నేపథ్యంలో వన్డే వరల్డ్‌కప్‌కు అర్హత సాధించే విషయంలో మరింత దగ్గరైంది. తొలుత బ్యాటింగ్ చేసిన జింబాబ్వే నిర్ణీత 50 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 332 పరుగులు చేసింది. సీనియర్ బ్యాటర్ సీన్ విలియమ్సన్(103 బంతుల్లో 142 పరుగులు, 14 ఫోర్లు, 3 సిక్సర్లు) టోర్నీలో మూడో శతకంతో చెలరేగాడు. సికందర్ రజా 49 బంతుల్లో 42 పరుగులు చేయగా.. ఆఖర్లో జాంగ్వే 28 బంతుల్లో 43 పరుగులతో మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. ఒమన్ బౌలర్లలో ఫయాజ్ బట్ నాలుగు వికెట్లు పడగొట్టాడు. అనంతరం 333 పరుగుల టార్గెట్‌తో బరిలోకి దిగిన ఒమన్ శక్తికి మించి పోరాటం చేసింది. ఓపెనర్ కశ్యప్ ప్రజాపతి 97 బంతుల్లోనే 103 పరుగులు చేసి ఆకట్టుకున్నాడు. మిడిలార్డర్లో అకీబ్ ఇల్యాస్ 45, జీషన్ మక్సూద్ 37, ఆయానా ఖాన్ 47 పరుగులు చేశాడు. ఒక దశలో 42 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 248 పరుగులతో గెలిపించేలా అనిపించింది. ఆ తర్వాత వరుస విరామాల్లో మూడు వికెట్లు కోల్పోయింది. అయితే చివర్లో మొహమ్మద్ నదీమ్ 18 బంతుల్లోనే 30 పరుగులు నాటౌట్ ఆశలు రేపినా మిగతావారు సహకరించడంలో విఫలమయ్యారు. దీంతో ఒమన్ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానిక 318 పరుగులకు పరిమితమైంది. జింబాబ్వే బౌలర్లలో బ్లెస్సింగ్ ముజరబానీ, తెందయి చతారాలు చెరో మూడు వికెట్లు తీయగా.. రిచర్డ్ నగర్వా రెండు,సికందర్ రజా ఒక వికెట్ పడగొట్టాడు. లీగ్ దశలో అన్ని మ్యాచ్‌ల్లో విజయాలు సాధించిన జింబాబ్వే 4 పాయింట్లతో సూపర్ సిక్స్‌లో రెండో టాపర్‌గా అడుగుపెట్టింది. తాజాగా ఒమన్‌పై విజయంతో పాయింట్ల సంఖ్యను ఆరుకి పెంచుకుంది. మరొక విజయం సాధిస్తే జింబాబ్వే అక్టోబర్-నవంబర్ నెలల్లో భారత్ వేదికగా జరగనున్ను వన్డే వరల్డ్‌కప్‌కు అర్హత సాధిస్తుంది. A hard-fought win! 🇿🇼 beat Oman by 1⃣4⃣ runs in the first match of the Super Six 🙌 📝: https://t.co/wBKKKFmDjo #ZIMvOMA | #CWC23 pic.twitter.com/aTn5aruPjo — Zimbabwe Cricket (@ZimCricketv) June 29, 2023 చదవండి: 58 గంటల ప్రయాణం.. తీరా వస్తే టికెట్ దొరకలేదు; కట్‌చేస్తే Ashes 2023: రోహిత్ శర్మ రికార్డు బద్దలు కొట్టిన స్టీవ్ స్మిత్ -
హ్యాట్రిక్ సెంచరీ.. జట్టును వరల్డ్‌కప్‌కు చేర్చడమే ధ్యేయంగా!
జింబాబ్వే సీనియర్ బ్యాటర్ సీన్ విలియమ్స్ తన జట్టును వరల్డ్‌కప్‌కు క్వాలిఫై చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లుగా అనిపిస్తోంది. తన కెరీర్లోనే పీక్ ఫామ్ కనబరుస్తున్న సీన్ విలియమ్స్ మరో సెంచరీతో మెరిశాడు. క్రికెట్ వరల్డ్‌కప్ క్వాలిఫయర్స్‌లో భాగంగా గురువారం సూపర్ సిక్స్‌లో ఒమన్‌తో మ్యాచ్‌లో ఈ ఫీట్ నమోదు చేశాడు. ఈ టోర్నీలో సీన్ విలియమ్స్‌కు ఇది హ్యాట్రిక్ సెంచరీ కావడం విశేషం. గ్రూప్ దశలో అమెరికాతో జరిగిన చివరి లీగ్ మ్యాచ్‌లో 175 పరుగుల ఇన్నింగ్స్‌తో కెరీర్ బెస్ట్ ఇన్నింగ్స్ ఆడిన విలియమ్సన్ తన జోరును సూపర్ సిక్స్‌లోనూ చూపిస్తున్నాడు. 81 బంతుల్లో సెంచరీ మార్క్ అందుకున్న విలియమ్సన్ ఖాతాలో 13 ఫోర్లు, ఒక సిక్సర్ ఉన్నాయి. విలిమయమ్సన్ ధాటికి జింబాబ్వే మరోసారి భారీ స్కోరు దిశగా పయనిస్తోంది. ప్రస్తుతం జింబాబ్వే 41 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 234 పరుగులు చేసింది. విలియమ్సన్ 119 పరుగులతో అజేయంగా ఆడుతుండగా.. రియాన్ బర్ల్ 2 పరుగులతో సహకరిస్తున్నాడు. కాగా వలర్డ్‌కప్ క్వాలిఫయర్ టోర్నీలో ప్రస్తుతం విలియమ్సన్ టాప్ స్కోరర్‌గా కొనసాగుతున్నాడు. ఇప్పటివరకు టోర్నీలో ఐదు మ్యాచ్‌లు ఆడిన విలియమ్సన్ రెండు అర్థసెంచరీలు, మూడు సెంచరీల సాయంతో 506 పరుగులు సాధించాడు. రెండో స్థానంలో నికోలస్ పూరన్ 296 పరుగులతో ఉన్నాడు. టాప్-2 స్కోరర్స్‌కు చాలా తేడా ఉంది. దీంతో అతని దూకుడు ఎలా కొనసాగుతుందో అర్థం చేసుకోవచ్చు. The third hundred in the tournament 💯 A batting average of over 100 in ODIs in 2023 ✅ Sean Williams is UNSTOPPABLE! 💥#ZIMvOMA | #CWC23 pic.twitter.com/R89inyV9KT — ICC (@ICC) June 29, 2023 చదవండి: సీన్ రివర్స్ అయినట్టుందే!.. ఇంగ్లండ్‌కు దిమ్మతిరిగే షాక్ రూట్ అరుదైన ఘనత.. యాషెస్ చరిత్రలో మూడో ఆటగాడిగా -
జింబాబ్వే సంచలనం.. వన్డేల్లో అత్యధిక స్కోర్ నమోదు!
ఐసీసీ వన్డే వరల్డ్‌కప్ క్వాలిఫయర్స్-2023లో జింబాబ్వే సంచలనం సృష్టించింది. ఈ టోర్నీలో భాగంగా యూఎస్ఏతో జరిగిన మ్యాచ్‌లో 405 పరుగుల భారీ స్కోర్ సాధించింది. వన్డే చరిత్రలో జింబాబ్వేకు ఇదే అత్యధిక స్కోర్ కావడం గమనార్హం. ఇంతకుముందు 2006లో కెన్యాతో జరిగిన ఓ వన్డే మ్యాచ్‌లో 351 పరుగుల భారీ స్కోర్ సాధించింది. ఇప్పటివరకు ఇదే అత్యధిక స్కోర్ కాగా.. తాజా మ్యాచ్‌తో ఈ స్కోర్‌ను జింబాబ్వే అధిగమించింది. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. టాస్ గెలిచిన అమెరికా తొలుత జింబాబ్వేకు బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. తొలుత బ్యాటింగ్ చేసిన జింబాబ్వే నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి ఏకంగా 408 పరుగులు చేసింది. జింబాబ్వే బ్యాటర్లలో కెప్టెన్ సీన్ విలియమ్స్ సంచలన ఇన్నింగ్స్ ఆడాడు. కేవలం 101 బంతుల్లోనే 174 పరుగులు చేసిన విలియమ్స్.. తృటిలో డబుల్ సెంచరీ చేసే అవకాశాన్ని కోల్పోయాడు. అతడి ఇన్నింగ్స్‌లో 21 ఫోర్లు, 5 సిక్సర్లు ఉన్నాయి. ఈ క్రమంలో వన్డేల్లో అత్యధిక వ్యక్తిగత స్కోర్ సాధించిన జింబాబ్వే కెప్టెన్‌గా విలియమ్స్ నిలిచాడు. ఇక ఈ మ్యాచ్‌లో విలియమ్స్‌తో పాటు గుంబే(78), బర్ల్(16 బంతుల్లో 47) పరుగులతో రాణించారు. యూఎస్ఏ బౌలర్లలో అభిషేక్ మూడు వికెట్లు, జష్దీప్ సింగ్ రెండు వికెట్లు సాధించారు. చదవండి: Yashasvi Jaiswal: ఆ చేదు జ్ఞాపకాలు చెరిపేయలేను.. ఆ విషయం గురించి చెప్పడానికి సిగ్గుపడను! -
జింబాబ్వే తరపున ఫాస్టెస్ట్ సెంచరీ.. రెండు రోజుల్లోనే చెరిపేసి
జింబాబ్వే ఆల్‌రౌండర్ సికందర్ రజా చరిత్ర సృష్టించాడు. వన్డే క్రికెట్లో జింబాబ్వే తరపున అత్యంత వేగంగా సెంచరీ చేసిన క్రికెటర్‌గా రికార్డులకెక్కాడు. ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్ క్వాలిఫయింగ్ టోర్నీలో భాగంగా మంగళవారం నెదర్లాండ్స్‌తో జరిగిన లీగ్ మ్యాచ్‌లో సికందర్ రజా 54 బంతుల్లో ఆరు ఫోర్లు, 8 సిక్సర్లతో 102 పరుగులు నాటౌట్ సుడిగాలి శతకంతో మెరిశాడు. కేవలం 54 బంతుల్లోనే భారీ శతకం బాదిన సికందర్ రాజా జింబాబ్వే తరపున వన్డే క్రికెట్లో అత్యంత వేగవంతమైన సెంచరీ రికార్డును కూడా సొంతం చేసుకున్నాడు. ఇంతకు ముందు ఈ రికార్డు సీన్ విలియమ్స్ పేరిట ఉండేది. జూన్ 18న నేపాల్‌పై విలియమ్స్ కేవలం 70 బంతుల్లోనే సెంచరీ సాధించాడు. ఇప్పుడు ఈ రికార్డును సికందర్ రాజా కేవలం రెండు రోజుల్లోనే చెరిపేసి కొత్త చరిత్ర సృష్టించాడు. కాగా 37 ఏళ్ల వయసులో శతకం బాదిన సికందర్ రజా.. వన్డేల్లో ఫాస్టెస్ట్ సెంచరీ బాదిన పెద్ద వయస్కుడిగా క్రెయిగ్ ఎర్విన్‌తో కలిసి సంయుక్తంగా నిలిచాడు. ఇక వన్డే క్రికెట్ చరిత్రలో అత్యంత వేగవంతమైన శతకం దక్షిణాఫ్రికా దిగ్గజం ఏబీ డివిలియర్స్ పేరిట ఉంది. డివిలియర్స్ కేవలం 31 బంతుల్లోనే శతకం మార్క్ అందుకోగా.. ఆ తర్వాతి స్థానంలో న్యూజిలాండ్ బ్యాటర్ కోరె అండర్సన్ (36 బంతుల్లోనే శతకం), షాహిద్ అఫ్రిది 37 బంతుల్లో, జాస్ బట్లర్ 46 బంతుల్లో, సనత్ జయసూర్య 48 బంతుల్లో అందుకున్నారు. ఇక టీమిండియా తరపున విరాట్ కోహ్లి 52 బంతుల్లో సెంచరీ సాధించాడు. చదవండి: చావుదెబ్బ కొట్టిన ఆసీస్.. రికార్డులు బద్దలైన వేళ సికందర్ రజా ఆల్‌రౌండ్ ప్రదర్శన.. ఎదురులేని జింబాబ్వే -
లేటు వయసులో శతక్కొట్టారు.. ఒకరిది ఫాస్టెస్ట్ హండ్రెడ్
వరల్డ్‌కప్ క్వాలిఫయర్స్ 2023లో భాగంగా నిన్న (జూన్ 18) జరిగిన రెండు మ్యాచ్‌ల్లో మూడు సెంచరీలు నమోదయ్యాయి. నేపాల్‌తో జరిగిన మ్యాచ్‌లో జింబాబ్వే బ్యాటర్లు సీన్ విలియమ్స్ (70 బంతుల్లో 102 నాటౌట్; 13 ఫోర్లు, సిక్స్), క్రెయిగ్ ఎర్విన్ (128 బంతుల్లో 121 నాటౌట్; 15 ఫోర్లు, సిక్స్) అజేయ శతకాలు సాధించగా.. వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో యూఎస్ఏ ఆటగాడు గజానంద్ సింగ్ (109 బంతుల్లో 101 నాటౌట్; 8 ఫోర్లు, 2 సిక్సర్లు) వీరోచిత శతకం బాదాడు. రెండు వేర్వేరు మ్యాచ్‌ల్లో ముగ్గురు సెంచరీలు చేయడం సాధారణ విషయమే అయినప్పటికీ.. సెంచరీలు చేసిన వారు 35 ఏళ్ల వయసు పైబడ్డ వారు కావడం విశేషం. అందులోనూ ముగ్గురు బ్యాటర్లు నాటౌట్‌గా నిలిచారు. వీరిలో జింబాబ్వే ఆటగాడు సీన్ విలియమ్స్‌ది ఆ దేశం తరఫున వన్డేల్లో ఫాస్టెస్ట్ హండ్రెడ్ (70) కావడం మరో విశేషం. శతక్కొట్టిన బ్యాటర్లలో యూఎస్ఏ ఆటగాడు గజానంద్ సింగ్‌కు 35 ఏళ్లు కాగా.. సీన్ విలియమ్స్‌కు 36, క్రెయిగ్ ఎర్విన్‌కు 37 ఏళ్లు. లేటు వయసులో ఈ ముగ్గురు బ్యాటర్లు తమ జట్లను గెలిపించేందుకు శక్తి వంచన లేకుండా ప్రత్నించడంతో నెటిజన్లు వీరిని ప్రశంసిస్తున్నారు. కాగా, నేపాల్‌తో జరిగిన మ్యాచ్‌లో సీన్ విలియమ్స్, క్రెయిగ్ ఎర్విన్ సెంచరీలు చేసి జింబాబ్వేను విజయతీరాలకు చేర్చగా.. విండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో గజానంద్ వీరోచిత సెంచరీ చేసి తన జట్టును (యూఎస్ఏ) గెలిపించేందుకు విఫలయత్నం చేశాడు. నేపాల్‌పై జింబాబ్వే 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించగా.. యూఎస్ఏపై వెస్టిండీస్ 39 పరుగుల తేడాతో గెలుపొందింది. -
వన్డేల్లో ఫాస్టెస్ట్ సెంచరీ సాధించిన సీన్ విలియమ్స్
వరల్డ్‌కప్ క్వాలిఫయర్స్ 2023లో భాగంగా నేపాల్‌తో ఇవాళ (జూన్ 18) జరిగిన మ్యాచ్‌లో జింబాబ్వే ఆటగాడు సీన్ విలియమ్స్ మెరుపు శతకం బాదాడు. కేవలం 70 బంతుల్లో 13 ఫోర్లు, సిక్సర్ సాయంతో 102 పరుగులు చేసి అజేయంగా నిలిచిన విలియమ్స్.. జింబాబ్వే తరఫున వన్డేల్లో ఫాస్టెస్ట్ సెంచరీ (70 బంతుల్లో) నమోదు చేశాడు. గతంలో ఈ రికార్డు రెగిస్ చకబ్వా పేరిట ఉండేది. చకబ్వా.. 2022లో బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో 73 బంతుల్లో సెంచరీ చేశాడు. జింబాబ్వే తరఫున వన్డేల్లో అత్యంత వేగంగా సెంచరీలు చేసిన ఆటగాళ్ల జాబితాలో విలియమ్స్, చకబ్వా తర్వాత బ్రెండన్ టేలర్ (2015లో ఐర్లాండ్‌పై 79 బంతుల్లో), సికందర్ రజా (2022లో బంగ్లాదేశ్‌పై 81 బంతుల్లో) ఉన్నారు. కాగా, నేపాల్‌తో ఇవాళ జరిగిన వరల్డ్‌కప్ క్వాలిఫయర్ మ్యాచ్‌లో విలియమ్స్‌తో పాటు క్రెయిగ్ ఎర్విన్ (128 బంతుల్లో 121 నాటౌట్; 15 ఫోర్లు, సిక్స్) అజేయ సెంచరీతో చెలరేగడంతో జింబాబ్వే 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన నేపాల్.. కుశాల్ భూర్టెల్ (99), ఆసిఫ్ షేక్ (66), కుశాల్ మల్లా (41), కెప్టెన్ రోహిత్ పౌడెల్ (31) రాణించడంతో నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 290 పరుగులు చేయగా.. అనంతరం బరిలోకి దిగిన జింబాబ్వే మరో 35 బంతులు మిగిలుండగానే కేవలం 2 వికెట్లు మాత్రమే కోల్పోయి విజయతీరాలకు చేరింది. ఇవాలే జరిగిన మరో మ్యాచ్‌లో యూఎస్ఏపై వెస్టిండీస్ 39 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన విండీస్.. జాన్సన్ ఛార్లెస్ (66), షాయ్ హోప్ (54), రోప్టన్ ఛేజ్ (55), జేసన్ హోల్డర్ (56), నికోలస్ పూరన్ (43) రాణించగా 49.3 ఓవర్లలో 297 పరుగులకు ఆలౌటైంది. అనంతరం బరిలోకి దిగిన యూఎస్ఏను గజానంద్ సింగ్ (101 నాటౌట్) వీరోచిత శతకం సాయంతో గెలిపించేందుకు విఫలయత్నం చేశాడు. గజానంద్తో పాటు ఆరోన్ జోన్స్ (23), షయాన్ జహంగీర్ (39), నోస్తుష్ కెంజిగే (34) పోరాడటంతో విండీస్‌కు విజయం అంత సులువుగా దక్కలేదు. యూఎస్ఏ నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 258 పరుగులు చేసి ఓటమిపాలైంది. -
శతక్కొట్టిన సీన్ విలియమ్స్, క్రెయిగ్ ఎర్విన్.. జింబాబ్వే ఘన విజయం
వరల్డ్ కప్ క్వాలిఫయర్స్ 2023 తొలి మ్యాచ్‌లో నేపాల్‌పై జింబాబ్వే ఘన విజయం సాధించింది. హరారే వేదికగా ఇవాళ (జూన్ 18) జరిగిన ఈ మ్యాచ్‌లో జింబాబ్వే 8 వికెట్ల తేడాతో గెలుపొందింది. జింబాబ్వే బ్యాటర్లు సీన్ విలియమ్స్ (70 బంతుల్లో 102 నాటౌట్; 13 ఫోర్లు, సిక్స్), క్రెయిగ్ ఎర్విన్ (128 బంతుల్లో 121 నాటౌట్; 15 ఫోర్లు, సిక్స్) అజేయ శతకాలతో జింబాబ్వేను విజయతీరాలకు చేర్చారు. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన నేపాల్.. కుశాల్ భూర్టెల్ (99), ఆసిఫ్ షేక్ (66), కుశాల్ మల్లా (41), కెప్టెన్ రోహిత్ పౌడెల్ (31) రాణించడంతో నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 290 పరుగులు చేయగా.. అనంతరం బరిలోకి దిగిన జింబాబ్వే మరో 35 బంతులు మిగిలుండగానే కేవలం 2 వికెట్లు మాత్రమే కోల్పోయి విజయం సాధించింది. జింబాబ్వే బౌలర్లలో నగరవా 4 వికెట్లు తీసి నేపాల్‌ను దారుణంగా దెబ్బకొట్టిగా.. మసకద్జ 2, చటారా, ముజరబాని తలో వికెట్ దక్కించుకున్నారు. జింబాబ్వే ఆటగాడు జాయ్‌లార్డ్ గుంబీ (25) వికెట్ సొంపాల్ కామీకి, వెస్లీ మధెవెరె (32) వికెట్ గుల్సన్ ఝాకు దక్కాయి. ఈ విజయంతో జింబాబ్వే.. గ్రూప్-ఏలో మెరుగైన రన్‌రేట్‌తో (0.789) అగ్రస్థానానికి చేరుకుంది. గ్రూస్-ఏలో జింబాబ్వే, నేపాల్‌తో పాటు వెస్టిండీస్, యూఎస్ఏ, నెదర్లాండ్స్ జట్లు ఉన్నాయి. గ్రూప్-ఏలో భాగంగానే ఇవాళ వెస్టిండీస్, యూఎస్ఏ జట్లు కూడా తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో విండీస్ విజయం దిశగా సాగుతుంది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన విండీస్.. 49.3 ఓవర్లలో 297 పరుగులకు ఆలౌటైంది. జాన్సన్ ఛార్లెస్ (66), షాయ్ హోప్ (54), రోప్టన్ ఛేజ్ (55), జేసన్ హోల్డర్ (56), నికోలస్ పూరన్ (43) రాణించగా.. బ్రాండన్ కింగ్ (0), కైల్ మేయర్స్ (2), రోవ్‌మన్ పావెల్ (0), కీమో పాల్ (4), అల్జరీ జోసఫ్ (3) విఫలమయ్యారు. యూఎస్ఏ బౌలర్లలో స్టీవెన్ టేలర్, సౌరభ్ నేత్రావాల్కర్, కైల్ ఫిలిప్ తలో 3 వికెట్లు, నోషటష్ ఓ వికెట్ దక్కించుకున్నాడు. ఛేదనలో యూఎస్ఏ తడబడుతుంది. 44 ఓవర్ల తర్వాత ఆ జట్టు 7 వికెట్ల నష్టానికి 206 పరుగులు చేసి, ఓటమి దిశగా పయనిస్తుంది. క్వాలిఫయర్స్ మ్యాచ్‌ల్లో భాగంగా రేపు (జూన్ 19) శ్రీలంక-యూఏఈ.. ఐర్లాండ్-ఒమన్ తలపడనున్నాయి. గ్రూప్-బిలో భాగంగా ఈ మ్యాచ్‌లు జరుగనున్నాయి. గ్రూప్-బిలో శ్రీలంక, యూఏఈ, ఐర్లాండ్, ఒమన్, స్కాట్లాండ్ జట్లు పోటీపడనున్నాయి. -
నెదర్లాండ్స్ కలను నాశనం చేసిన జింబాబ్వే
నెదర్లాండ్స్‌తో జరిగిన మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ను జింబాబ్వే 2-1 తేడాతో కైవసం చేసుకుంది. శనివారం జరిగిన చివరి వన్డేలో జింబాబ్వే 7 వికెట్లతో విజయాన్ని అందుకుంది. కాగా జింబాబ్వేపై సిరీస్ నెగ్గి వరల్డ్‌కప్ క్వాలిఫయర్స్‌లో చోటు సంపాదించాలన్న కల డచ్‌కు తీరలేదు. ఇక సౌతాఫ్రికాతో జరగనున్న వన్డే సిరీస్‌లో గెలిస్తేనే నెదర్లాండ్స్ వరల్డ్‌కప్ క్వాలిఫయర్స్‌కు అర్హత సాధించే అవకాశం ఉంటుంది. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన నెదర్లాండ్స్ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్లకు 231 పరుగులు చేసింది. మ్యాక్స్ ఒ డౌడ్ (38), స్కాట్ ఎడ్వర్డ్స్ (34) రాణించారు. జింబాబ్వే బౌలర్లలో సీన్ విలియమ్స్ మూడు వికెట్లు తీయగా.. సికందర్ రజా రెండు, ముజరబాని, మదవెరె, నగరవా, చతరాలు తలా ఒక వికెట్ తీశారు. అనంతరం జింబాబ్వే 41.4 ఓవర్లలో 3 వికెట్లకు 235 పరుగులు చేసింది. గ్యారీ బ్యాలెన్స్ (64 నాటౌట్), మదెవెర్ (50), క్రెయిగ్ ఇర్విన్ (44), సీన్ విలియమ్స్ (43) జట్టును గెలిపించారు. సీన్ విలియమ్స్‌కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌తో పాటు ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డును గెలుచుకున్నాడు. 🇿🇼seal 2⃣-1⃣ series victory with a comfortable 7-wicket win over @KNCBcricket at Harare Sports Club.#ZIMvNED | #ICCSuperLeague | #VisitZimbabwe | #FillUpHarareSportsClub pic.twitter.com/5DdjTHyHYO — Zimbabwe Cricket (@ZimCricketv) March 25, 2023 -
మ్యాచ్‌ను మలుపు తిప్పిన రనౌట్.. పాపం జింబాబ్వే
టి20 ప్రపంచకప్‌లో భాగంగా సూపర్-12లో ఆదివారం జింబాబ్వేతో జరిగిన పోరులో బంగ్లాదేశ్ ఉత్కంఠ విజయం సాధించింది. గెలుపు కోసం చివరి దాకా పోరాడినప్పటికి ఒత్తిడిలో జింబాబ్వే కేవలం 3 పరుగుల తేడాతో ఓడిపోయింది. అయితే జింబాబ్వే పోరాడి ఓడినప్పటికి వారి ఆటతీరు మాత్రం సగటు అభిమానిని ఆకట్టుకుంది. ఒక దశలో జింబాబ్వే విజయానికి చేరువగా వచ్చింది. అయితే బంగ్లా కెప్టెన్ షకీబ్ అల్ హసన్ చేసిన రనౌట్ మ్యాచ్‌ను మలుపు తిప్పింది. జింబాబ్వే ఇన్నింగ్స్‌లో సీన్ విలియమ్స్ 64 పరుగులతో టాప్ స్కోరర్. 69 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయిన దశలో రియాన్ బర్ల్తో కలిసి ఇన్నింగ్స్ నడిపించిన సీన్ విలియమ్స్ 63 పరుగులు జోడించాడు. 9 బంతుల్లో 19 పరుగులు చేయాల్సిన దశలో షకీబ్ వేసిన 18వ ఓవర్ నాలుగో బంతిని విలియమ్స్ ఆఫ్‌సైడ్ దిశగా ఆడాడు. అయితే బంతి ఎక్కువ దూరం పోనప్పటికి అనవసరంగా సింగిల్‌కు ప్రయత్నించాడు. అప్పటికే బంతి వేసి అక్కడే ఉన్న షకీబ్ మెరుపువేగంతో పరిగెత్తి నాన్స్టై్రక్ ఎండ్‌వైపు బంతిని విసిరాడు. నేరుగా వికెట్లను గిరాటేయడంతో సీన్ విలియమ్సన్ రనౌట్‌గా వెనుదిరిగాడు. ఆ తర్వాత వచ్చిన బ్యాటర్లు పరుగులు చేయడంలో విఫలం కావడంతో జింబాబ్వే ఓటమి పాలయ్యింది. View this post on Instagram A post shared by ICC (@icc) చదవండి: క్రికెట్ చరిత్రలో ఇలా తొలిసారి.. నాటకీయంగా నో బాల్ ప్రకటన -
న్యూజిలాండ్ ఇన్నింగ్స్ విజయం
బులవాయో: సీన్ విలియమ్స్ (148 బంతుల్లో 119; 21 ఫోర్లు) సెంచరీ సాధించినప్పటికీ... న్యూజిలాండ్‌తో జరిగిన తొలి టెస్టులో జింబాబ్వే ఓటమిని తప్పించుకోలేకపోయింది. రెండో ఇన్నింగ్స్‌లోనూ బౌలర్లు రాణించడంతో ఈ మ్యాచ్‌లో న్యూజిలాండ్ ఇన్నింగ్స్ 117 పరుగుల ఆధిక్యంతో విజయాన్ని దక్కించుకుంది. ఆదివారం 121/5 ఓవర్‌నైట్ స్కోరుతో నాలుగో రోజు రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన జింబాబ్వే జట్టు 295 పరుగులకు ఆలౌటైంది. విలియమ్స్, క్రెమెర్ (130 బంతుల్లో 33; 6 ఫోర్లు) ఏడో వికెట్‌కు 118 పరుగులు జోడించి కివీస్ విజయాన్ని కాస్త ఆలస్యం చేశారు. విలియమ్స్ 106 బంతుల్లో సెంచరీ సాధించి జింబాబ్వే తరఫున టెస్టుల్లో వేగవంతమైన శతకం కొట్టిన బ్యాట్స్‌మన్‌గా గుర్తింపు పొందాడు. కివీస్ బౌలర్లలో ట్రెంట్ బౌల్ట్ నాలుగు, సౌతీ, వాగ్నెర్ రెండేసి వికెట్లు పడగొట్టారు. ఈ రెండు జట్ల మధ్య రెండో టెస్టు ఈనెల 6 నుంచి జరుగుతుంది.