Sean Williams Hat Trick Ton CWC Qualifiers Vs Oman Super Six Match - Sakshi
Sakshi News home page

#SeanWilliams: హ్యాట్రిక్‌ సెంచరీ.. జట్టును వరల్డ్‌కప్‌కు చేర్చడమే ధ్యేయంగా!

Published Thu, Jun 29 2023 3:50 PM | Last Updated on Thu, Jun 29 2023 4:35 PM

Sean Williams Hat-trick-Ton-CWC Qualifiers Vs-Oman Super Six Match - Sakshi

జింబాబ్వే సీనియర్‌ బ్యాటర్‌ సీన్‌ విలియమ్స్‌ తన జట్టును వరల్డ్‌కప్‌కు క్వాలిఫై చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లుగా అనిపిస్తోంది.  తన కెరీర్‌లోనే పీక్‌ ఫామ్‌ కనబరుస్తున్న సీన్‌ విలియమ్స్‌ మరో సెంచరీతో మెరిశాడు. క్రికెట్‌ వరల్డ్‌కప్‌ క్వాలిఫయర్స్‌లో భాగంగా గురువారం సూపర్‌ సిక్స్‌లో ఒమన్‌తో మ్యాచ్‌లో ఈ ఫీట్‌ నమోదు చేశాడు. ఈ టోర్నీలో సీన్‌ విలియమ్స్‌కు ఇది హ్యాట్రిక్‌ సెంచరీ కావడం విశేషం.

గ్రూప్‌ దశలో అమెరికాతో జరిగిన చివరి లీగ్‌ మ్యాచ్‌లో 175 పరుగుల ఇన్నింగ్స్‌తో కెరీర్‌ బెస్ట్‌ ఇన్నింగ్స్‌ ఆడిన విలియమ్సన్‌ తన జోరును సూపర్‌ సిక్స్‌లోనూ చూపిస్తున్నాడు. 81 బంతుల్లో సెంచరీ మార్క్‌ అందుకున్న విలియమ్సన్‌ ఖాతాలో 13 ఫోర్లు, ఒక సిక్సర్‌ ఉన్నాయి. విలిమయమ్సన్‌ ధాటికి జింబాబ్వే మరోసారి భారీ స్కోరు దిశగా పయనిస్తోంది. ప్రస్తుతం జింబాబ్వే 41 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 234 పరుగులు చేసింది. విలియమ్సన్‌ 119 పరుగులతో అజేయంగా ఆడుతుండగా.. రియాన్‌ బర్ల్‌ 2 పరుగులతో సహకరిస్తున్నాడు.

కాగా వలర్డ్‌కప్‌ క్వాలిఫయర్‌ టోర్నీలో ప్రస్తుతం విలియమ్సన్‌ టాప్‌ స్కోరర్‌గా కొనసాగుతున్నాడు. ఇప్పటివరకు టోర్నీలో ఐదు మ్యాచ్‌లు ఆడిన విలియమ్సన్‌ రెండు అర్థసెంచరీలు, మూడు సెంచరీల సాయంతో 506 పరుగులు సాధించాడు. రెండో స్థానంలో నికోలస్‌ పూరన్‌ 296 పరుగులతో ఉన్నాడు. టాప్‌-2 స్కోరర్స్‌కు చాలా తేడా ఉంది. దీంతో అతని దూకుడు ఎలా కొనసాగుతుందో అర్థం చేసుకోవచ్చు.

చదవండి: సీన్‌ రివర్స్‌ అయినట్టుందే!.. ఇంగ్లండ్‌కు దిమ్మతిరిగే షాక్‌

రూట్‌ అరుదైన ఘనత.. యాషెస్‌ చరిత్రలో మూడో ఆటగాడిగా

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement