వరల్డ్‌కప్ క్వాలిఫయర్స్ 2023లో భాగంగా నేపాల్‌తో ఇవాళ (జూన్ 18) జరిగిన మ్యాచ్‌లో జింబాబ్వే ఆటగాడు సీన్ విలియమ్స్ మెరుపు శతకం బాదాడు. కేవలం 70 బంతుల్లో 13 ఫోర్లు, సిక్సర్ సాయంతో 102 పరుగులు చేసి అజేయంగా నిలిచిన విలియమ్స్.. జింబాబ్వే తరఫున వన్డేల్లో ఫాస్టెస్ట్ సెంచరీ (70 బంతుల్లో) నమోదు చేశాడు. గతంలో ఈ రికార్డు రెగిస్ చకబ్వా పేరిట ఉండేది. చకబ్వా.. 2022లో బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో 73 బంతుల్లో సెంచరీ చేశాడు. జింబాబ్వే తరఫున వన్డేల్లో అత్యంత వేగంగా సెంచరీలు చేసిన ఆటగాళ్ల జాబితాలో విలియమ్స్, చకబ్వా తర్వాత బ్రెండన్ టేలర్ (2015లో ఐర్లాండ్‌పై 79 బంతుల్లో), సికందర్ రజా (2022లో బంగ్లాదేశ్‌పై 81 బంతుల్లో) ఉన్నారు.
కాగా, నేపాల్‌తో ఇవాళ జరిగిన వరల్డ్‌కప్ క్వాలిఫయర్ మ్యాచ్‌లో విలియమ్స్‌తో పాటు క్రెయిగ్ ఎర్విన్ (128 బంతుల్లో 121 నాటౌట్; 15 ఫోర్లు, సిక్స్) అజేయ సెంచరీతో చెలరేగడంతో జింబాబ్వే 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన నేపాల్.. కుశాల్ భూర్టెల్ (99), ఆసిఫ్ షేక్ (66), కుశాల్ మల్లా (41), కెప్టెన్ రోహిత్ పౌడెల్ (31) రాణించడంతో నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 290 పరుగులు చేయగా.. అనంతరం బరిలోకి దిగిన జింబాబ్వే మరో 35 బంతులు మిగిలుండగానే కేవలం 2 వికెట్లు మాత్రమే కోల్పోయి విజయతీరాలకు చేరింది.
ఇవాలే జరిగిన మరో మ్యాచ్‌లో యూఎస్‌ఏపై వెస్టిండీస్ 39 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన విండీస్.. జాన్సన్ ఛార్లెస్ (66), షాయ్ హోప్ (54), రోప్టన్ ఛేజ్ (55), జేసన్ హోల్డర్ (56), నికోలస్ పూరన్ (43) రాణించగా 49.3 ఓవర్లలో 297 పరుగులకు ఆలౌటైంది. అనంతరం బరిలోకి దిగిన యూఎస్‌ఏను గజానంద్ సింగ్ (101 నాటౌట్) వీరోచిత శతకం సాయంతో గెలిపించేందుకు విఫలయత్నం చేశాడు. గజానంద్‌తో పాటు ఆరోన్ జోన్స్ (23), షయాన్ జహంగీర్ (39), నోస్‌తుష్ కెంజిగే (34) పోరాడటంతో విండీస్‌కు విజయం అంత సులువుగా దక్కలేదు. యూఎస్‌ఏ నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 258 పరుగులు చేసి ఓటమిపాలైంది.
Comments
Please login to add a commentAdd a comment