వరల్డ్‌కప్ క్వాలిఫయర్స్ 2023లో జింబాబ్వే వెటరన్ బ్యాటర్ సీన్ విలియమ్స్ భీకర ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. ఇప్పటివరకు జరిగిన 5 మ్యాచ్‌ల్లో 3 సెంచరీలు (102*, 174, 142), ఓ భారీ హాఫ్ సెంచరీ (91) సాయంతో 532 పరుగులు చేసిన విలియమ్స్.. ఇవాళ (జులై 2) శ్రీలంకతో జరుగుతున్న మ్యాచ్‌లో మరో అర్ధసెంచరీ (56) సాధించి, పరుగుల యంత్రం విరాట్ కోహ్లిని మరిపించాడు.
విరాట్ 5 వరుస వన్డే ఇన్నింగ్స్‌ల్లో 4 శతకాల సాయంతో 596 పరుగులు చేస్తే.. విలియమ్స్ ఇంచుమించు విరాట్ రికార్డును సమం చేసినంత పని చేశాడు. సీన్ విలియమ్స్ ఫామ్ వన్డేల వరకే పరిమితమైందనుకుంటే పొరపాటే. ఈ వెటరన్ ఆల్‌రౌండర్ టెస్ట్‌ల్లోనూ భీకర ఫామ్‌లో ఉన్నాడు. విలియమ్స్ చివరిగా ఆడిన 5 టెస్ట్ ఇన్నింగ్స్‌ల్లో 3 సెంచరీలు, ఓ హాఫ్ సెంచరీ సాధించాడు.
కాగా, విలియమ్స్ పరుగుల ప్రవాహం కొనసాగుతుండటంతో వరల్డ్‌కప్ క్వాలిఫయర్స్‌లో జింబాబ్వే విజయ యాత్ర కొనసాగుతుంది. ఆ జట్టు సూపర్ సిక్స్‌లో శ్రీలంకతో సమానంగా 6 పాయింట్లు సాధించి , వన్డే వరల్డ్‌కప్-2023 బెర్త్‌ను దాదాపుగా ఖరారు చేసుకుంది.
అయితే, శ్రీలంకతో ఇవాళ జరుగుతున్న కీలక మ్యాచ్‌లో మాత్రం జింబాబ్వే చేతులెత్తేసింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఆ జట్టు 32.2 ఓవర్లలో 165 పరుగులు మాత్రమే చేసి చాపచుట్టేసింది. సీన్ విలియమ్స్ (56) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. సికందర్ రజా (31) కాస్త పర్వాలేదనిపించాడు. శ్రీలంక బౌలర్లలో తీక్షణ (4/25), మధుశంక (3/15), పతిరణ (2/18), షనక (1/30) చెలరేగిపోయారు.
Comments
Please login to add a commentAdd a comment