సొంతగడ్డపై జరుగుతున్న క్రికెట్ వరల్డ్‌కప్ క్వాలిఫయర్స్ పోటీలో జింబాబ్వే ఎదురులేకుండా సాగుతోంది. గురువారం మొదలైన సూపర్ సిక్స్ పోటీల్లో జింబాబ్వే, ఒమన్‌లు తలపడ్డాయి. ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌లో జింబాబ్వే 14 పరుగుల తేడాతో విజయాన్ని అందుకుంది. ఈ నేపథ్యంలో వన్డే వరల్డ్‌కప్‌కు అర్హత సాధించే విషయంలో మరింత దగ్గరైంది.
తొలుత బ్యాటింగ్ చేసిన జింబాబ్వే నిర్ణీత 50 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 332 పరుగులు చేసింది. సీనియర్ బ్యాటర్ సీన్ విలియమ్సన్(103 బంతుల్లో 142 పరుగులు, 14 ఫోర్లు, 3 సిక్సర్లు) టోర్నీలో మూడో శతకంతో చెలరేగాడు. సికందర్ రజా 49 బంతుల్లో 42 పరుగులు చేయగా.. ఆఖర్లో జాంగ్వే 28 బంతుల్లో 43 పరుగులతో మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. ఒమన్ బౌలర్లలో ఫయాజ్ బట్ నాలుగు వికెట్లు పడగొట్టాడు.
అనంతరం 333 పరుగుల టార్గెట్‌తో బరిలోకి దిగిన ఒమన్ శక్తికి మించి పోరాటం చేసింది. ఓపెనర్ కశ్యప్ ప్రజాపతి 97 బంతుల్లోనే 103 పరుగులు చేసి ఆకట్టుకున్నాడు. మిడిలార్డర్‌లో అకీబ్ ఇల్యాస్ 45, జీషన్ మక్సూద్ 37, ఆయానా ఖాన్ 47 పరుగులు చేశాడు. ఒక దశలో 42 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 248 పరుగులతో గెలిపించేలా అనిపించింది. ఆ తర్వాత వరుస విరామాల్లో మూడు వికెట్లు కోల్పోయింది.
అయితే చివర్లో మొహమ్మద్ నదీమ్ 18 బంతుల్లోనే 30 పరుగులు నాటౌట్ ఆశలు రేపినా మిగతావారు సహకరించడంలో విఫలమయ్యారు. దీంతో ఒమన్ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానిక 318 పరుగులకు పరిమితమైంది. జింబాబ్వే బౌలర్లలో బ్లెస్సింగ్ ముజరబానీ, తెందయి చతారాలు చెరో మూడు వికెట్లు తీయగా.. రిచర్డ్ నగర్వా రెండు,సికందర్ రజా ఒక వికెట్ పడగొట్టాడు.
లీగ్ దశలో అన్ని మ్యాచ్‌ల్లో విజయాలు సాధించిన జింబాబ్వే 4 పాయింట్లతో సూపర్ సిక్స్‌లో రెండో టాపర్‌గా అడుగుపెట్టింది. తాజాగా ఒమన్‌పై విజయంతో పాయింట్ల సంఖ్యను ఆరుకి పెంచుకుంది. మరొక విజయం సాధిస్తే జింబాబ్వే అక్టోబర్-నవంబర్ నెలల్లో భారత్ వేదికగా జరగనున్ను వన్డే వరల్డ్‌కప్‌కు అర్హత సాధిస్తుంది.
A hard-fought win! 🇿🇼 beat Oman by 1⃣4⃣ runs in the first match of the Super Six 🙌
— Zimbabwe Cricket (@ZimCricketv) June 29, 2023
📝: https://t.co/wBKKKFmDjo #ZIMvOMA | #CWC23 pic.twitter.com/aTn5aruPjo
చదవండి: 58 గంటల ప్రయాణం.. తీరా వస్తే టికెట్ దొరకలేదు; కట్‌చేస్తే
Ashes 2023: రోహిత్ శర్మ రికార్డు బద్దలు కొట్టిన స్టీవ్ స్మిత్
Comments
Please login to add a commentAdd a comment