ఐదేసిన మెహిది హసన్‌.. అయినా తొలి ఇన్నింగ్స్‌ లీడ్‌ సాధించిన జింబాబ్వే | Zimbabwe All Out For 273, Gets 82 Runs Lead In First Test Match Against Bangladesh | Sakshi
Sakshi News home page

ఐదేసిన మెహిది హసన్‌.. అయినా తొలి ఇన్నింగ్స్‌ లీడ్‌ సాధించిన జింబాబ్వే

Published Mon, Apr 21 2025 4:09 PM | Last Updated on Mon, Apr 21 2025 4:50 PM

Zimbabwe All Out For 273, Gets 82 Runs Lead In First Test Match Against Bangladesh

రెండు మ్యాచ్‌ల టెస్ట్‌ సిరీస్‌లో భాగంగా బంగ్లాదేశ్‌తో జరుగుతున్న తొలి టెస్ట్‌ మ్యాచ్‌లో పర్యాటక జింబాబ్వే కీలకమైన 82 పరుగుల తొలి ఇన్నింగ్స్‌ లీడ్‌ సాధించింది. ఓవర్‌నైట్‌ స్కోర్‌ 67/1 వద్ద రెండో రోజు ఆటను ప్రారంభించిన జింబాబ్వే మరో 206 పరుగులు జోడించి 273 పరుగులకు ఆలౌటైంది. 

జింబాబ్వే బ్యాటర్లలో ఓపెనర్‌ బ్రియాన్‌ బెన్నెట్‌ (57), సీన్‌ విలియమ్స్‌ (59) అర్ద సెంచరీలతో రాణించగా.. వికెట్‌కీపర్‌ న్యాషా మయవో (35), వెస్లీ మెదెవెరె (24), రిచర్డ్‌ నగరవ (28 నాటౌట్‌) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. 

మిగతా బ్యాటర్లలో బెన్‌ కర్రన్‌ 18, నిక్‌ వెల్చ్‌ 2, కెప్టెన్‌ క్రెయిగ్‌ ఎర్విన్‌ 8, వెల్లింగ్టన్‌ మసకద్జ 6, ముజరబానీ 17, న్యాయుచి 7 పరుగులకు ఔటయ్యారు. బంగ్లాదేశ్‌ బౌలర్లలో మెహిది హసన్‌ మిరాజ్‌ ఐదు వికెట్లతో చెలరేగగా.. నహిద్‌ రాణా 3, హసన్‌ మహమూద్‌, ఖలీద్‌ అహ్మద్‌ తలో వికెట్‌ పడగొట్టారు.

అంతకుముందు జింబాబ్వే బౌలర్లు రెచ్చిపోవండతో బంగ్లాదేశ్‌ తొలి ఇన్నింగ్స్‌లో 191 పరుగులకే కుప్పకూలింది. ముజరబానీ, వెల్లింగ్టన్‌ మసకద్జ తలో 3.. న్యాయుచి, మదెవెరె చెరో 2 వికెట్లు తీసి బంగ్లాదేశ్‌ సొంతగడ్డపై భారీ దెబ్బకొట్టారు. బంగ్లాదేశ్‌కు సొంతగడ్డపై ఇది నాలుగో అత్యల్ప స్కోర్‌. 

బంగ్లా ఇన్నింగ్స్‌లో మొమినుల్‌ హక్‌ (56) అర్ద సెంచరీతో రాణించగా.. కెప్టెన్‌ నజ్ముల్‌ హసన్‌ షాంటో (40), జాకిర్‌ అలీ (28), మహ్మదుల్‌ హసన్‌ రాయ్‌ (14), షద్మాన్‌ ఇస్లాం (12), హసన్‌ మహమూద్‌ (19) రెండంకెల స్కోర్లు చేశారు. స్టార్‌ ప్లేయర్‌ ముష్ఫికర్‌ రహీం 4, మెహిది హసన్‌ మిరాజ్‌ 1, తైజుల్‌ ఇస్లాం 3, నహిద్‌ రాణా డకౌటయ్యారు. ఖలీద్‌ అహ్మద్‌ 4 పరుగులతో అజేయంగా నిలిచాడు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement