mehdi hasan
-
Asia Cup 2023: గెలిచి నిలిచిన బంగ్లాదేశ్.. ‘సూపర్–4’ రేసులో
లాహోర్: ఆసియా కప్ క్రికెట్ టోర్నీలో బంగ్లాదేశ్ జట్టు ‘సూపర్–4’ రేసులో నిలిచింది. లంకతో జరిగిన గ్రూప్ ‘బి’ తొలి మ్యాచ్‌లో 160 పైచిలుకు పరుగులు చేసేందుకు ఇబ్బంది పడిన బంగ్లాదేశ్ అఫ్గానిస్తాన్‌పై మాత్రం చెలరేగి 89 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. ఓపెనర్ మెహదీ హసన్ మిరాజ్ (119 బంతుల్లో 112 రిటైర్డ్‌హర్ట్; 7 ఫోర్లు, 3 సిక్స్‌లు), మిడిలార్డర్లో నజ్ముల్ హోసేన్ షాంతో (105 బంతుల్లో 104; 9 ఫోర్లు, 2 సిక్స్‌లు) సెంచరీలతో కదంతొక్కారు. దాంతో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న బంగ్లాదేశ్ 50 ఓవర్లలో 5 వికెట్లకు 334 పరుగులు చేసింది. వన్డేల్లో బంగ్లాదేశ్‌కిది మూడో అత్యధిక స్కోరు. ఓపెనర్ నయీమ్ (28), వన్‌డౌన్ బ్యాటర్ తౌహిద్ (0) నిరాశపరిచినప్పటికీ ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ మిరాజ్, నజు్మల్ మూడో వికెట్‌కు 194 పరుగులు జోడించారు. అఫ్గాన్ బౌలర్లలో ముజీబ్, గుల్బదిన్ చెరో వికెట్ తీశారు. అనంతరం కష్టమైన లక్ష్యఛేదనకు దిగిన అఫ్గానిస్తాన్ 44.3 ఓవర్లలో 245 పరుగుల వద్ద ఆలౌటైంది. ఇబ్రహీం జద్రాన్ (74 బంతుల్లో 75; 10 ఫోర్లు, 1 సిక్స్), కెపె్టన్ హష్మతుల్లా (60 బంతుల్లో 51; 6 ఫోర్లు) రాణించారు. బంగ్లాదేశ్ బౌలర్లలో టస్కిన్ అహ్మద్ 4, షోరిఫుల్ ఇస్లామ్ 3 వికెట్లు తీశారు. మంగళవారం లాహోర్‌లో శ్రీలంకతో జరిగే మ్యాచ్‌లో అఫ్గానిస్తాన్ గెలిస్తే మాత్రం బంగ్లాదేశ్‌తో కలిసి ఈ మూడు జట్లు రెండు పాయింట్లతో సమఉజ్జీగా నిలుస్తాయి. మెరుగైన రన్‌రేట్ ఉన్న రెండు జట్లు ‘సూపర్–4’ దశకు అర్హత సాధిస్తాయి. స్కోరు వివరాలు బంగ్లాదేశ్ ఇన్నింగ్స్: నయీమ్ (బి) ముజీబ్ 28; మెహదీ హసన్ మిరాజ్ (రిటైర్డ్‌హర్ట్) 112; తౌహిద్ (సి)జద్రాన్ (బి) గుల్బదిన్ 0; నజ్ముల్ (రనౌట్) 104; ముషి్ఫకర్ (రనౌట్) 25; షకీబ్ (నాటౌట్) 32; షమీమ్ (రనౌట్) 11; ఆఫిఫ్ (నాటౌట్) 4; ఎక్స్‌ట్రాలు 18; మొత్తం (50 ఓవర్లలో 5 వికెట్లకు) 334. వికెట్ల పతనం: 1–60, 2–63, 2–257 (మిరాజ్ రిటైర్డ్), 3–278, 4–294, 5–324. బౌలింగ్: ఫరూఖి 6–1–53–0, ముజీబ్ 10–0–62–1, గుల్బదిన్ 8–0–58–1, కరీమ్ 6–0–39–0, నబీ 10–0–50–0, రషీద్ ఖాన్ 10–1–66–0. అఫ్గానిస్తాన్ ఇన్నింగ్స్: గుర్బాజ్ (ఎల్బీడబ్ల్యూ) (బి) షోరిఫుల్ 1; జద్రాన్ (సి) ముష్ఫికర్ (బి) హసన్ 75; రహ్మత్ (బి) టస్కిన్ అహ్మద్ 33; హష్మతుల్లా (సి) హసన్ (బి) షోరిఫుల్ 51; నజీబుల్లా (బి) మిరాజ్ 17; నబీ (సి) ఆఫిఫ్ (బి) టస్కిన్ అహ్మద్ 3; గుల్బదిన్ (బి) షోరిఫుల్ 15; కరీమ్ (రనౌట్) 1; రషీద్ ఖాన్ (సి) షకీబ్ (బి) టస్కిన్ అహ్మద్ 24; ముజీబ్ (హిట్‌వికెట్) (బి) టస్కిన్ అహ్మద్ 4; ఫరూఖి (నాటౌట్) 1; ఎక్స్‌ట్రాలు 20; మొత్తం (44.3 ఓవర్లలో ఆలౌట్) 245. వికెట్ల పతనం: 1–1, 2–79, 3–131, 4–193, 5–196, 6–212, 7–214, 8–221, 9–244, 10–245. బౌలింగ్: టస్కిన్ 8.3–0–44–4, షోరిఫుల్ 9–1–36–3, హసన్ 9–1–61–1, షకీబ్ 8–0–44–0, అఫిఫ్ 1–0–6–0, మిరాజ్ 8–0–41–1, షమీమ్ 1–0–10–0. -
Asia Cup 2023: శతకాల మోత మోగించిన బంగ్లాదేశ్ బ్యాటర్లు.. భారీ స్కోర్
ఆసియా కప్-2023లో భాగంగా లాహోర్ వేదికగా ఆఫ్ఘనిస్తాన్‌తో ఇవాళ (సెప్టెంబర్ 3) జరుగుతున్న మ్యాచ్‌లో బంగ్లాదేశ్ బ్యాటర్లు ఆకాశమే హద్దుగా చెలరేగిపోయారు. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న బంగ్లాదేశ్.. మెహిది హసన్ మీరజ్ (119 బంతుల్లో 112; 7 ఫోర్లు, 3 సిక్సర్లు), నజ్ముల్ హసన్ షాంటో (105 బంతుల్లో 104; 9 ఫోర్లు, సిక్సర్లు) సెంచరీలతో కదంతొక్కడంతో నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 334 పరుగుల భారీ స్కోర్ చేసింది. మీరజ్, షాంటోలు తమతమ వన్డే కెరీర్లలో రెండో సెంచరీలు నమోదు చేసి, తమ జట్టు భారీ స్కోర్ చేసేందుకు దోహదపడ్డారు. 112 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద మీరజ్ రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరగగా.. 104 పరుగులు చేసి షాంటో రనౌటయ్యాడు. బంగ్లా ఇన్నింగ్స్‌లో మొహమ్మద్ నైమ్ (28), ముష్ఫికర్ రహీం (25), షకీబ్ అల్ హసన్ (32 నాటౌట్) ఓ మోస్తరు స్కోర్లు చేయగా.. తౌహిద్ హ్రిదోయ్ డకౌటై నిరాశపరిచాడు. ఆఫ్ఘన్ బౌలర్లలో గుల్బదిన్ నైబ్, ముజీబ్ ఉర్ రెహ్మాన్ తలో వికెట్ పడగొట్టగా.. షాంటో, ముష్ఫికర్, షమీమ్ (11) రనౌట్లయ్యారు. కాగా, ఈ టోర్నీలో నిలబడాలంటే బంగ్లాదేశ్ ఈ మ్యాచ్‌లో తప్పనిసరిగా గెలవాల్సి ఉంది. ఆ జట్టు తమ తొలి గ్రూప్ మ్యాచ్‌లో శ్రీలంక చేతిలో ఓటమిపాలైంది. మరోవైపు ఆఫ్ఘనిస్తాన్‌కు సైతం ఈ మ్యాచ్ చాలా కీలకమనే చెప్పాలి. ఈ మ్యాచ్‌లో ఆ జట్టు గెలిస్తే.. తదుపరి శ్రీలంకతో జరిగే మ్యాచ్‌తో సంబంధం లేకుండా సూపర్-4కు చేరుకుంటుంది. తొలి మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌పై గెలిచిన శ్రీలంక సూపర్-4 బెర్త్ దాదాపుగా ఖరారు చేసుకుంది. గ్రూప్-ఏ నుంచి పాకిస్తాన్ ఇదివరకే సూపర్-4కు అర్హత సాధించింది. తొలి మ్యాచ్‌లో నేపాల్‌పై నెగ్గిన ఆ జట్టు.. నిన్న (సెప్టెంబర్ 2) టీమిండియాతో జరిగిన మ్యాచ్ వర్షం కారణంగా రద్దు కావడంతో ఓ పాయింట్ (మొత్తంగా 3 పాయింట్లు) ఖాతాలో వేసుకుని తదుపరి రౌండ్‌కు అర్హత సాధించింది. పాక్‌తో మ్యాచ్ రద్దు కావడంతో భారత్‌కు సైతం ఓ పాయింట్ దక్కింది. రేపు జరుగబోయే మ్యాచ్‌లో భారత్.. నేపాల్‌పై గెలిస్తే సూపర్-4కు చేరుకుంటుంది. -
జగజ్జేత ఇంగ్లండ్‌కు ఘోర పరాభవం.. పసికూనల చేతిలో దారుణ ఓటమి
టీ20 వరల్డ్ ఛాంపియన్, 2022 పొట్టి ప్రపంచకప్ విన్నర్ ఇంగ్లండ్‌కు పసికూన బంగ్లాదేశ్ ఊహించని షాకిచ్చింది. స్వదేశంలో జరుగుతున్న మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో తొలి రెండు మ్యాచ్‌లు గెలవడం ద్వారా 2-0 తేడాతో సిరీస్‌ను కైవసం చేసుకుంది. ఢాకా వేదికగా ఇవాళ (మార్చి 12) జరిగిన రెండో టీ20లో 4 వికెట్ల తేడాతో జగజ్జేతను మట్టికరిపించిన బంగ్లాదేశ్.. వన్డే సిరీస్‌లో ఎదురైన పరాభవానికి (1-2) ప్రతీకారం తీర్చుకుంది. ఈ సిరీస్‌లో తొలి రెండు వన్డేల్లో ఓటమిపాలైన బంగ్లా పులులు.. ఆతర్వాత అనూహ్యంగా పుంజుకుని ఆఖరి వన్డేలో, తొలి రెండు టీ20ల్లో వరుస విజయాలు సాధించారు. సొంతగడ్డపై ప్రత్యర్ధి ఎంతటి వారైనా తిరుగులేని ఆధిప్యతం ప్రదర్శించే బంగ్లా టైగర్స్..అండర్ డాగ్స్‌గా తమపై ఉన్న ముద్రను కొనసాగించారు. మ్యాచ్ విషయానికొస్తే.. రెండో టీ20లో టాస్ గెలిచి తొలుత బౌలింగ్ చేసిన బంగ్లాదేశ్.. ఇంగ్లండ్‌ను 117 పరుగులకే ఆలౌట్ చేసింది. మొత్తం 20 ఓవర్ల పాటు బ్యాటింగ్ చేసిన బట్లర్ సేన.. ఒక్కో పరుగు రాబట్టేందుకు నానా తంటాలు పడింది. బంగ్లా సంచలన స్పిన్నర్ మెహిది హసన్ మీరజ్ (4-0-12-4) ఇంగ్లండ్ పతనాన్ని శాశించగా.. తస్కిన్ అహ్మద్ (1/27), ముస్తాఫిజుర్ (1/19), షకీబ్ అల్ హసన్ (1/13), హసన్ మహమూద్ (1/10) తలో చేయి వేశారు. ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌లో సాల్ట్ (25), మొయిన్ అలీ (15), బెన్ డక్కెట్ (28), సామ్ కర్రన్ (12), రెహాన్ అహ్మద్ (11) మాత్రమే రెండంకెల స్కోర్ చేశారు. అనంతరం స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన బంగ్లాదేశ్.. నజ్ముల్ షాంటో (46 నాటౌట్), తౌహిద్ హ్రిదోయ్ (17), మెహిది హసన్ (20) రాణించడంతో సునాయాసంగా విజయతీరాలకు (18.5 ఓవర్లలో 120/6) చేరింది. స్వల్ప లక్ష్యంగా కావడంతో బంగ్లా టైగర్స్ ఏమాత్రం బెరుకు లేకుండా ఆడారు. ఫలితంగా మ్యాచ్ గెలవడంతో పాటు సిరీస్‌ను కూడా కైవసం చేసుకున్నారు. ఇంగ్లండ్ బౌలర్లలో జోఫ్రా ఆర్చర్ 3 వికెట్లు పడగొట్టగా.. సామ్ కర్రన్, మొయిన్ అలీ, రెహాన్ అహ్మద్ తలో వికెట్ దక్కించుకున్నారు. బంతితో పాటు బ్యాట్‌తోనూ రాణించిన మెహిది హసన్‌కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. -
జట్టు సీఈవోతో గొడవ.. ఏకంగా కెప్టెన్సీ నుంచే తీసేసారు!
బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్-2022 మధ్యలో ఛటోగ్రామ్ ఛాలెంజర్స్ కెప్టెన్‌గా మెహిదీ హసన్ మిరాజ్‌ను తొలిగించిన సంగతి తెలిసిందే. దీంతో అతడు పూర్తిగా ఛటోగ్రామ్ ఛాలెంజర్స్ జట్టు నుంచి తప్పుకున్నాడు. తాజాగా ఈ వివాదంపై మెహిదీ హసన్ స్పందించాడు. అనారోగ్యంతో ఉన్న తన తల్లితో కలిసి ఉండటానికి టోర్నమెంట్ నుంచి నిష్క్రమించాలనుకుంటున్నట్లు మెహిదీ హసన్ వెల్లడించాడు. తనను కెప్టెన్‌గా తొలిగించడానికి ఛటోగ్రామ్ ఛాలెంజర్స్ సీఈవో యాసిర్ ఆలం కారణమని మెహిదీ హసన్ తెలిపాడు. కాగా ప్రధాన కోచ్ పాల్ నిక్సన్ సలహా మేరకే తాము ఈ నిర్ణయం తీసుకున్నామని యాసిర్ ఆలం చెప్పిన సంగతి తెలిసిందే. అయితే యాసిర్ చేసిన ప్రకటను మెహిదీ వ్యతిరేకించాడు. "నేను ఇకపై జట్టుకు ఆడాలి అని అనుకోవడంలేదు. చివరి రోజు ఏమి జరిగిందో ఇప్పటికీ నాకు తెలియడం లేదు. మా మ్యాచ్‌కు మూడు గంటల ముందు, నేను ఇకపై కెప్టెన్‌ని కాదని వారు నాకు చెప్పారు. వారు నాకు ముందే ఆ విషయం చెప్పుంటే బాగుండేది. ఇది ఒక ఆటగాడికి చాలా అవమానకరం. నన్ను కెప్టెన్‌గా తొలగిస్తున్నట్లు కోచ్‌పై యాసిర్ చేసిన ప్రకటన పూర్తిగా అబద్ధం. నేను కోచ్‌తో అరగంట మాట్లాడాను. యాసిర్ ప్రకటన పూర్తిగా అబద్ధం. యాసిర్ అతిపెద్ద అపరాధి. కాగా మా జట్టు ఓనర్ చాలా మంచివాడు. జట్టు విషయాల్లో అతడు జోక్యం చేసుకోడు.బ్యాటింగ్ ఆర్డర్‌ను మార్చాలని అనుకోవడం వల్లే గొడవంతా మొదలైంది. అతడు జట్టులో ఉంటే నేను ఆడను. యాసిర్ భాయ్ ఫ్రాంచైజీలో లేకుంటే నేను ఆడతాను. లేకపోతే, నేను ఆడను" అని మెహిదీ హసన్ మిరాజ్ పేర్కొన్నాడు. చదవండి: IPL 2022: ఆ రెండు రాష్ట్రాల్లోనే ఐపీఎల్ నిర్వహణ..!