బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్-2022 మధ్యలో ఛటోగ్రామ్ ఛాలెంజర్స్ కెప్టెన్‌గా మెహిదీ హసన్ మిరాజ్‌ను తొలిగించిన సంగతి తెలిసిందే. దీంతో అతడు పూర్తిగా ఛటోగ్రామ్ ఛాలెంజర్స్ జట్టు నుంచి తప్పుకున్నాడు. తాజాగా ఈ వివాదంపై మెహిదీ హసన్ స్పందించాడు. అనారోగ్యంతో ఉన్న తన తల్లితో కలిసి ఉండటానికి టోర్నమెంట్ నుంచి నిష్క్రమించాలనుకుంటున్నట్లు మెహిదీ హసన్ వెల్లడించాడు. తనను కెప్టెన్‌గా తొలిగించడానికి ఛటోగ్రామ్ ఛాలెంజర్స్ సీఈవో యాసిర్ ఆలం కారణమని మెహిదీ హసన్ తెలిపాడు. కాగా ప్రధాన కోచ్ పాల్ నిక్సన్ సలహా మేరకే తాము ఈ నిర్ణయం తీసుకున్నామని యాసిర్ ఆలం చెప్పిన సంగతి తెలిసిందే. అయితే యాసిర్ చేసిన ప్రకటను మెహిదీ వ్యతిరేకించాడు.
"నేను ఇకపై జట్టుకు ఆడాలి అని అనుకోవడంలేదు. చివరి రోజు ఏమి జరిగిందో ఇప్పటికీ నాకు తెలియడం లేదు. మా మ్యాచ్‌కు మూడు గంటల ముందు, నేను ఇకపై కెప్టెన్‌ని కాదని వారు నాకు చెప్పారు. వారు నాకు ముందే ఆ విషయం చెప్పుంటే బాగుండేది. ఇది ఒక ఆటగాడికి చాలా అవమానకరం. నన్ను కెప్టెన్‌గా తొలగిస్తున్నట్లు కోచ్‌పై యాసిర్ చేసిన ప్రకటన పూర్తిగా అబద్ధం. నేను కోచ్‌తో అరగంట మాట్లాడాను. యాసిర్ ప్రకటన పూర్తిగా అబద్ధం. యాసిర్ అతిపెద్ద అపరాధి. కాగా మా జట్టు ఓనర్ చాలా మంచివాడు. జట్టు విషయాల్లో అతడు జోక్యం చేసుకోడు.బ్యాటింగ్ ఆర్డర్‌ను మార్చాలని అనుకోవడం వల్లే గొడవంతా మొదలైంది. అతడు జట్టులో ఉంటే నేను ఆడను. యాసిర్ భాయ్ ఫ్రాంచైజీలో లేకుంటే నేను ఆడతాను. లేకపోతే, నేను ఆడను" అని మెహిదీ హసన్ మిరాజ్ పేర్కొన్నాడు.
చదవండి: IPL 2022: ఆ రెండు రాష్ట్రాల్లోనే ఐపీఎల్ నిర్వహణ..!
Comments
Please login to add a commentAdd a comment