caption
-
క్యాప్షన్ కాంపిటీషన్లో విన్నర్: ఆనంద్ మహీంద్రా గిఫ్ట్ ఏంటో తెలుసా?
ప్రముఖ పారిశ్రామిక దిగ్గజం ఆనంద్ మహీంద్రా ఎప్పటికప్పుడు ఆసక్తికరమైన విషయాలను తన ఎక్స్ (ట్విటర్) ఖాతాలో షేర్ చేస్తూ ఉంటారు. ఇందులో భాగంగానే తాజాగా మరో ఫోటోను షేర్ చేస్తూ.. ఓ ఫన్నీ కాంపిటీషన్ నిరవహించారు. గెలిచినవారికి గిఫ్ట్ కూడా ఉంటుందని పేర్కొన్నారు.ఆనంద్ మహీంద్రా షేర్ చేసిన ఫోటోను గమనిస్తే.. ఇనుప రెయిలింగ్ వెనుక కూర్చున్న ఓ కుక్క తన మొహాన్ని కరెక్ట్‌గా ఓ ఆకృతి దగ్గర పెట్టింది. దీనికి ఓ సరదా కామెంట్ చేయాలనీ, దాని కోసం జులై 3 వరకు గడువు ఇచ్చారు. గెలిచినవారికి ఓ బొమ్మ మహీంద్రా ఫ్యూరియో ప్రకటించారు.ఆనంద్ మహీంద్రా షేర్ చేసిన ఫోటో మీద నెటిజన్లు తమదైన రీతిలో కామెంట్స్ చేశారు. ఇందులో ఒకరు ఫోటో మీద కామెంట్ చేస్తూ.. అది ఇన్‌కాగ్నిటో మోడ్ మాదిరిగా ఉందని పేర్కొన్నారు. ఈ సమాధానం ఆనంద్ మహీంద్రాకు తెగ నచ్చేసింది. దీంతో వారి అడ్రస్ మెయిల్ చేస్తే గిఫ్ట్ పంపిస్తా అంటూ పేర్కొన్నారు.And the winner is... @raptorsworld : “Indognito mode” (incognito) Bravo! Would you please DM your mailing address details to @mahindracares to receive your Diecast, scale model Mahindra Furio Truck? https://t.co/fYGJybTOWS— anand mahindra (@anandmahindra) June 6, 2024 -
జట్టు సీఈవోతో గొడవ.. ఏకంగా కెప్టెన్సీ నుంచే తీసేసారు!
బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్-2022 మధ్యలో ఛటోగ్రామ్ ఛాలెంజర్స్ కెప్టెన్‌గా మెహిదీ హసన్ మిరాజ్‌ను తొలిగించిన సంగతి తెలిసిందే. దీంతో అతడు పూర్తిగా ఛటోగ్రామ్ ఛాలెంజర్స్ జట్టు నుంచి తప్పుకున్నాడు. తాజాగా ఈ వివాదంపై మెహిదీ హసన్ స్పందించాడు. అనారోగ్యంతో ఉన్న తన తల్లితో కలిసి ఉండటానికి టోర్నమెంట్ నుంచి నిష్క్రమించాలనుకుంటున్నట్లు మెహిదీ హసన్ వెల్లడించాడు. తనను కెప్టెన్‌గా తొలిగించడానికి ఛటోగ్రామ్ ఛాలెంజర్స్ సీఈవో యాసిర్ ఆలం కారణమని మెహిదీ హసన్ తెలిపాడు. కాగా ప్రధాన కోచ్ పాల్ నిక్సన్ సలహా మేరకే తాము ఈ నిర్ణయం తీసుకున్నామని యాసిర్ ఆలం చెప్పిన సంగతి తెలిసిందే. అయితే యాసిర్ చేసిన ప్రకటను మెహిదీ వ్యతిరేకించాడు. "నేను ఇకపై జట్టుకు ఆడాలి అని అనుకోవడంలేదు. చివరి రోజు ఏమి జరిగిందో ఇప్పటికీ నాకు తెలియడం లేదు. మా మ్యాచ్‌కు మూడు గంటల ముందు, నేను ఇకపై కెప్టెన్‌ని కాదని వారు నాకు చెప్పారు. వారు నాకు ముందే ఆ విషయం చెప్పుంటే బాగుండేది. ఇది ఒక ఆటగాడికి చాలా అవమానకరం. నన్ను కెప్టెన్‌గా తొలగిస్తున్నట్లు కోచ్‌పై యాసిర్ చేసిన ప్రకటన పూర్తిగా అబద్ధం. నేను కోచ్‌తో అరగంట మాట్లాడాను. యాసిర్ ప్రకటన పూర్తిగా అబద్ధం. యాసిర్ అతిపెద్ద అపరాధి. కాగా మా జట్టు ఓనర్ చాలా మంచివాడు. జట్టు విషయాల్లో అతడు జోక్యం చేసుకోడు.బ్యాటింగ్ ఆర్డర్‌ను మార్చాలని అనుకోవడం వల్లే గొడవంతా మొదలైంది. అతడు జట్టులో ఉంటే నేను ఆడను. యాసిర్ భాయ్ ఫ్రాంచైజీలో లేకుంటే నేను ఆడతాను. లేకపోతే, నేను ఆడను" అని మెహిదీ హసన్ మిరాజ్ పేర్కొన్నాడు. చదవండి: IPL 2022: ఆ రెండు రాష్ట్రాల్లోనే ఐపీఎల్ నిర్వహణ..! -
కంగ్రాట్స్..రాకేశ్, భూపేశ్ : ఆనంద్ మహీంద్ర
తాను నిర్వహించిన ఫొటో క్యాప్షన్ పోటీలో ఇద్దరు వ్యక్తులు గెలుపొందినట్లు పారిశ్రామిక వేత్త ఆనంద్ మహీంద్ర ప్రకటించారు. ఈ మేరకు వారిద్దరికి డై కాస్ట్ మహీంద్రా మోడల్ వాహనాన్ని బహుమతిగా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నానని పేర్కొంటూ.. వారి చిరునామా తెలపాల్సిందిగా కోరారు. మహీంద్ర గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా సోషల్ మీడియాలో చురుగ్గా ఉంటారన్న విషయం తెలిసిందే. పలు సామాజిక అంశాలపై స్పందించే మహీంద్ర తనదైన శైలిలో ట్వీట్లు చేస్తూ లక్షలాది మంది అభిమానులను సొంతం చేసుకున్నారు. ఈ నేపథ్యంలో మంగళవారం ఓ బస్సు ఫొటోను షేర్ చేసిన ఆనంద్ మహీంద్ర.. దానికి సరిగా సరిపోయే క్యాప్షన్ జతచేసిన వారికి డై కాస్ట్ మోడల్ మహీంద్రా (బొమ్మ కారు)ను ఇస్తానని ప్రకటించారు. హిందీ, ఇంగ్లీష్ లేదా హింగ్లీష్ భాషలో క్యాప్షన్ ఉండాలని షరతు పెట్టారు. ఈ పోటీకి సై అన్న ఔత్సాహిక నెటిజన్లు తమ సృజనాత్మతకు పదును పెట్టి క్యాప్షన్లతో ఆనంద్ మహీంద్రాకు బదులిచ్చారు.(చదవండి : మాట నిలబెట్టుకున్న ఆనంద్ మహీంద్రా!) ఈ క్రమంలో బస్సు క్యాప్షన్ పోటీలో రాకేశ్, భూపేశ్ అనే ఇద్దరు వ్యక్తులను ఆనంద్ మహీంద్ర గురువారం విజేతలుగా ప్రకటించారు. ఈ మేరకు...‘ కాప్షన్ పోటీలో ఇద్దరు గెలుపొందారు. ఒకటి హిందీ/హింగ్లీష్, ఇంకోటి ఇంగ్లీష్ టైటిల్. రెండూ తెలివైన సమాధానాలు. కంగ్రాట్స్ రాకేశ్. మీరు ఇచ్చిన క్యాప్షన్ బాగుంది. మహీంద్రాకేర్స్ డీఎంకు మీ చిరునామా పంపండి అని ఆనంద్ మహీంద్ర ట్వీట్ చేశారు. అదే విధంగా మరో విజేత భూపేశ్‌ను కూడా తన చిరునామా షేర్ చేయాల్సిందిగా కోరారు. ఇంతకీ వారిద్దరూ ఏ క్యాప్షన్లు చెప్పి మహీంద్రా వాహనాలు సొంతం చేసుకున్నారా అని ఆలోచిస్తున్నారా..అక్కడికే వస్తున్నాం.. కాస్త ఆగండి.. బస్సుపై తిరగేసిన బస్సు ఉన్నట్లుగా ఆ ఫొటోకు రాకేశ్ సబ్ కీ బస్(SUB की BUS), భూపేశ్ హ్యాంగోవర్ బస్(Hangover Bus) అనే క్యాప్షన్లు ఇచ్చారు. కాగా ఆనంద్ మహీంద్రా చొరవతో తమిళనాడుకు చెందిన ఇడ్లీ అవ్వ కమలాతాళ్‌కు భారత్ గ్యాస్ ఇటీవలే గ్యాస్ స్టవ్ అందించిన విషయం తెలిసిందే. Recognising 2 winners of the caption competition. 1 Hindi/Hinglish &1 English. Both compact but clever. Both make you pause before realising their perfect application to the photo. Congratulations Rakesh. The double play on SUB is delightful. Please DM @MahindraCares your address https://t.co/MVLZi9VTnA — anand mahindra (@anandmahindra) September 19, 2019 And here’s winner number 2. Congratulations Bhupesh. Enjoyed the double play on Hangover...Yes, anyone on the top would definitely be ‘hungover!’ Please DM @MahindraCares your address so they can send you the die-cast scale model Mahindra. https://t.co/TLBBIkzmwG — anand mahindra (@anandmahindra) September 19, 2019 -
నాకు మాత్రం దోనీ మంచి కెప్టెన్