నెదర్లాండ్స్‌తో జరిగిన మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ను జింబాబ్వే 2-1 తేడాతో కైవసం చేసుకుంది. శనివారం జరిగిన చివరి వన్డేలో జింబాబ్వే 7 వికెట్లతో విజయాన్ని అందుకుంది. కాగా జింబాబ్వేపై సిరీస్ నెగ్గి వరల్డ్‌కప్ క్వాలిఫయర్స్‌లో చోటు సంపాదించాలన్న కల డచ్‌కు తీరలేదు. ఇక సౌతాఫ్రికాతో జరగనున్న వన్డే సిరీస్‌లో గెలిస్తేనే నెదర్లాండ్స్ వరల్డ్‌కప్ క్వాలిఫయర్స్‌కు అర్హత సాధించే అవకాశం ఉంటుంది.
ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన నెదర్లాండ్స్ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్లకు 231 పరుగులు చేసింది. మ్యాక్స్ ఒ డౌడ్ (38), స్కాట్ ఎడ్వర్డ్స్ (34) రాణించారు. జింబాబ్వే బౌలర్లలో సీన్ విలియమ్స్ మూడు వికెట్లు తీయగా.. సికందర్ రజా రెండు, ముజరబాని, మదవెరె, నగరవా, చతరాలు తలా ఒక వికెట్ తీశారు.
అనంతరం జింబాబ్వే 41.4 ఓవర్లలో 3 వికెట్లకు 235 పరుగులు చేసింది. గ్యారీ బ్యాలెన్స్ (64 నాటౌట్), మదెవెర్ (50), క్రెయిగ్ ఇర్విన్ (44), సీన్ విలియమ్స్ (43) జట్టును గెలిపించారు. సీన్ విలియమ్స్‌కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌తో పాటు ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డును గెలుచుకున్నాడు.
🇿🇼seal 2⃣-1⃣ series victory with a comfortable 7-wicket win over @KNCBcricket at Harare Sports Club.#ZIMvNED | #ICCSuperLeague | #VisitZimbabwe | #FillUpHarareSportsClub pic.twitter.com/5DdjTHyHYO
— Zimbabwe Cricket (@ZimCricketv) March 25, 2023
Comments
Please login to add a commentAdd a comment