టి20 ప్రపంచకప్‌లో భాగంగా సూపర్-12లో ఆదివారం జింబాబ్వేతో జరిగిన పోరులో బంగ్లాదేశ్ ఉత్కంఠ విజయం సాధించింది. గెలుపు కోసం చివరి దాకా పోరాడినప్పటికి ఒత్తిడిలో జింబాబ్వే కేవలం 3 పరుగుల తేడాతో ఓడిపోయింది. అయితే జింబాబ్వే పోరాడి ఓడినప్పటికి వారి ఆటతీరు మాత్రం సగటు అభిమానిని ఆకట్టుకుంది. ఒక దశలో జింబాబ్వే విజయానికి చేరువగా వచ్చింది.
అయితే బంగ్లా కెప్టెన్ షకీబ్ అల్ హసన్ చేసిన రనౌట్ మ్యాచ్‌ను మలుపు తిప్పింది. జింబాబ్వే ఇన్నింగ్స్‌లో సీన్ విలియమ్స్ 64 పరుగులతో టాప్ స్కోరర్. 69 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయిన దశలో రియాన్ బర్ల్‌తో కలిసి ఇన్నింగ్స్ నడిపించిన సీన్ విలియమ్స్ 63 పరుగులు జోడించాడు. 9 బంతుల్లో 19 పరుగులు చేయాల్సిన దశలో షకీబ్ వేసిన 18వ ఓవర్ నాలుగో బంతిని విలియమ్స్ ఆఫ్‌సైడ్ దిశగా ఆడాడు.
అయితే బంతి ఎక్కువ దూరం పోనప్పటికి అనవసరంగా సింగిల్‌కు ప్రయత్నించాడు. అప్పటికే బంతి వేసి అక్కడే ఉన్న షకీబ్ మెరుపువేగంతో పరిగెత్తి నాన్‌స్టై‍్రక్ ఎండ్‌వైపు బంతిని విసిరాడు. నేరుగా వికెట్లను గిరాటేయడంతో సీన్ విలియమ్సన్ రనౌట్‌గా వెనుదిరిగాడు. ఆ తర్వాత వచ్చిన బ్యాటర్లు పరుగులు చేయడంలో విఫలం కావడంతో జింబాబ్వే ఓటమి పాలయ్యింది.
చదవండి: క్రికెట్ చరిత్రలో ఇలా తొలిసారి.. నాటకీయంగా నో బాల్ ప్రకటన
Comments
Please login to add a commentAdd a comment