బంగ్లాదేశ్ ఆల్‌రౌండర్ షకీబ్ అల్ హసన్ టీమిండియా మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్‌ను ఉద్దేశించి ఘాటు వ్యాఖ్యలు చేశాడు. అసలు సెహ్వాగ్ ఎవరో తనకు తెలియదంటూ గట్టిగా కౌంటర్ ఇచ్చాడు.
కాగా టీ20 ప్రపంచకప్-2024 ఆడే బంగ్లాదేశ్ జట్టుకు ఎంపికైన షకీబ్ అల్ హసన్.. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మతో కలిసి అరుదైన రికార్డు నెలకొల్పిన విషయం తెలిసిందే. పొట్టి ఫార్మాట్ వరల్డ్‌కప్ కప్ ఆరంభ ఎడిషన్ నుంచి ఇప్పటిదాకా కొనసాగిన ఆటగాడిగా రోహిత్‌తో పాటు అతడు నిలిచాడు.
అయితే, గ్రూప్ దశలోని తొలి రెండు మ్యాచ్‌లలో ఈ వెటరన్ స్పిన్ బౌలింగ్ ఆల్‌రౌండర్ పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు. శ్రీలంక, సౌతాఫ్రికా మ్యాచ్‌లలో వరుసగా ఎనిమిది, మూడు పరుగులు చేసిన షకీబ్.. ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు.
ముఖ్యంగా సౌతాఫ్రికాతో మ్యాచ్‌లో అతడు అవుటైన తీరు విమర్శలకు దారితీసింది. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్.. అనవసర షాట్లకు అవుట్ కావడం ఏమిటని, ఎప్పుడో రిటైర్ అవ్వాల్సిన క్రికెటర్ ఇంకా ఆడితే ఇలాగే ఉంటుందని విమర్శించాడు.
అంతేకాకుండా నువ్వేమీ మాథ్యూ హెడ్‌న్, ఆడం గిల్‌క్రిస్ట్ కాదని.. జస్ట్ బంగ్లాదేశ్ ప్లేయర్‌వి అని వీరూ భాయ్ షకీబ్‌పై ఆగ్రహం వ్యక్తం చేశాడు. అయితే, తాజాగా నెదర్లాండ్స్‌తో మ్యాచ్‌లో బంగ్లాదేశ్ గెలుపొంది సూపర్-8కు చేరువైంది.
ఈ విజయంలో షకీబ్ అల్ హసన్ కీలక పాత్ర పోషించాడు. 46 బంతుల్లో 64 పరుగులతో రాణించి ఆఖరి వరకు అజేయంగా నిలిచాడు. కీలక సమయంలో రాణించి.. జట్టును గెలిపించి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు.
ఈ క్రమంలో మీడియాతో మాట్లాడుతున్న సందర్భంగా సెహ్వాగ్ విమర్శల గురించి ఓ జర్నలిస్టు ప్రశ్నించగా.. ‘‘సెహ్వాగ్? అతడెవరు?’’ అంటూ షకీబ్ అల్ హసన్ ఎదురు ప్రశ్నించాడు. ‘‘విమర్శకులు చేసిన వ్యాఖ్యలపై స్పందించాల్సిన అవసరం ఆటగాళ్లకు లేదు.
జట్టుకు ఏ విధంగా ఉపయోగపడగలం అని మాత్రమే మనం ఆలోచించాలి. అలా ఆలోచించని వాళ్లే అనవసరపు విషయాల గురించి పట్టించుకుంటారు.
బ్యాటర్ బ్యాటింగ్ గురించి.. బౌలర్ బౌలింగ్ గురించి.. ఫీల్డింగ్ చేసే సమయంలో క్యాచ్‌లు లేదంటే పరుగులు సేవ్ చేయడం గురించి మాత్రమే ఆలోచిస్తారు.
అంతేగానీ ఇలాంటి వాటికి జవాబు ఇవ్వాల్సిన అవసరం ఆటగాళ్లకు ఏమాత్రం ఉండదు’’ అని షకీబ్ అల్ హసన్ సెహ్వాగ్‌ను ఉద్దేశించి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియలో వైరల్ అవుతోంది.
చదవండి: అందరికీ పది నిమిషాలు.. అతడికి ఇరవై: పాక్ మాజీ కెప్టెన్ సంచలన వ్యాఖ్యలు
Shakib Al Hasan, the most arrogant cricketer in the his history.
Journalist: There has been lot of discussions about your performance especially criticize by Virendra Sehwag"
Shakib: Who is Sehwag?
pic.twitter.com/wtqlGrdeX3— Farrago Abdullah Parody (@abdullah_0mar) June 14, 2024
Comments
Please login to add a commentAdd a comment