ఐసీసీ వన్డే వరల్డ్‌కప్ క్వాలిఫయర్స్-2023లో జింబాబ్వే సంచలనం సృష్టించింది. ఈ టోర్నీలో భాగంగా యూఎస్ఏతో జరిగిన మ్యాచ్‌లో 405 పరుగుల భారీ స్కోర్ సాధించింది. వన్డే చరిత్రలో జింబాబ్వేకు ఇదే అత్యధిక స్కోర్ కావడం గమనార్హం. ఇంతకుముందు 2006లో కెన్యాతో జరిగిన ఓ వన్డే మ్యాచ్‌లో 351 పరుగుల భారీ స్కోర్ సాధించింది. ఇప్పటివరకు ఇదే అత్యధిక స్కోర్ కాగా.. తాజా మ్యాచ్‌తో ఈ స్కోర్‌ను జింబాబ్వే అధిగమించింది.
ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. టాస్ గెలిచిన అమెరికా తొలుత జింబాబ్వేకు బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. తొలుత బ్యాటింగ్ చేసిన జింబాబ్వే నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి ఏకంగా 408 పరుగులు చేసింది. జింబాబ్వే బ్యాటర్లలో కెప్టెన్ సీన్ విలియమ్స్ సంచలన ఇన్నింగ్స్ ఆడాడు.
కేవలం 101 బంతుల్లోనే 174 పరుగులు చేసిన విలియమ్స్.. తృటిలో డబుల్ సెంచరీ చేసే అవకాశాన్ని కోల్పోయాడు. అతడి ఇన్నింగ్స్‌లో 21 ఫోర్లు, 5 సిక్సర్లు ఉన్నాయి. ఈ క్రమంలో వన్డేల్లో అత్యధిక వ్యక్తిగత స్కోర్ సాధించిన జింబాబ్వే కెప్టెన్‌గా విలియమ్స్ నిలిచాడు. ఇక ఈ మ్యాచ్‌లో విలియమ్స్‌తో పాటు గుంబే(78), బర్ల్(16 బంతుల్లో 47) పరుగులతో రాణించారు. యూఎస్‌ఏ బౌలర్లలో అభిషేక్ మూడు వికెట్లు, జష్‌దీప్ సింగ్ రెండు వికెట్లు సాధించారు.
చదవండి: Yashasvi Jaiswal: ఆ చేదు జ్ఞాపకాలు చెరిపేయలేను.. ఆ విషయం గురించి చెప్పడానికి సిగ్గుపడను!
Comments
Please login to add a commentAdd a comment