స్వదేశంలో పాకిస్తాన్‌తో జరిగే వన్డే, టీ20 సిరీస్‌ల కోసం రెండు వేర్వేరు జింబాబ్వే జట్లను ఇవాళ (నవంబర్ 18) ప్రకటించారు. వన్డే జట్టుకు కెప్టెన్‌గా క్రెయిస్ ఎర్విన్.. టీ20 జట్టు సారధిగా సికందర్ రజా ఎంపికయ్యారు. వన్డే జట్టులో కొత్తగా ముగ్గురు అన్‌క్యాప్డ్ ప్లేయర్లకు (ట్రెవర్ గ్వాండు, తషింగ ముసెకివా, టినొటెండా మపోసా) చోటు దక్కింది. వన్డే జట్టులో సికందర్ రజా, సీన్ విలియమ్స్, బ్లెస్సింగ్ ముజరబాని, రిచర్డ్ నగరవ లాంటి సీనియర్ ప్లేయర్లు.. క్లైవ్ మదండే, బ్రియాన్ బెన్నెట్, డియాన్ మైర్స్ లాంటి యువ ఆటగాళ్లు చోటు దక్కించుకున్నారు.
టీ20 జట్టులో వన్డే జట్టు కెప్టెన్ క్రెయిగ్ ఎర్విన్, సీన్ విలియమ్స్, జాయ్‌లార్డ్ గుంబీకు చోటు దక్కలేదు. పాకిస్తాన్ జట్టు నవంబర్ 24 నుంచి డిసెంబర్ 5 వరకు జింబాబ్వేలో పర్యటిస్తుంది. ఈ పర్యటనలో పాక్ మూడు వన్డేలు, మూడు టీ20లు ఆడనుంది. ఈ సిరీస్‌ల కోసం పాక్ జట్లను ఇదివరకే ప్రకటించారు. ఈ సిరీస్‌ల కోసం పాక్ మేనేజ్‌మెంట్ బాబర్ ఆజమ్, షాహీన్ అఫ్రిది లాంటి సీనియర్లకు రెస్ట్ ఇచ్చింది.
జింబాబ్వే పర్యటనలో పాక్ షెడ్యూల్..
నవంబర్ 24- తొలి వన్డే
నవంబర్ 26- రెండో వన్డే
నవంబర్ 28- మూడో వన్డే
డిసెంబర్ 1- తొలి టీ20
డిసెంబర్ 3- రెండో టీ20
డిసెంబర్ 5- మూడో టీ20
మ్యాచ్‌లన్నీ బులవాయోలోని క్వీన్స్ స్పోర్ట్స్ క్లబ్ మైదానంలో జరుగనున్నాయి.
జింబాబ్వే వన్డే జట్టు: క్రెయిగ్ ఎర్విన్ (కెప్టెన్), ఫరాజ్ అక్రమ్, బ్రియాన్ బెన్నెట్, జాయ్‌లార్డ్ గుంబీ, ట్రెవర్ గ్వాండు, క్లైవ్ మదాండే, టినోటెండా మపోసా, తడివానాషే మారుమణి, బ్రాండన్ మవుటా, తషింగా ముసెకివా, బ్లెస్సింగ్ ముజరాబనీ, డియాన్ మైర్స్, రిచర్డ్ నగరవ, సికందర్ రజా, సీన్ విలియమ్స్.
జింబాబ్వే టీ20 జట్టు: సికందర్ రజా (కెప్టెన్), ఫరాజ్ అక్రమ్, బ్రియాన్ బెన్నెట్, ర్యాన్ బర్ల్, ట్రెవర్ గ్వాండు, క్లైవ్ మదాండే, వెస్లీ మాధవెరె, టినోటెండా మపోసా, తడివానాషే మారుమణి, వెల్లింగ్టన్ మసకద్జా, బ్రాండన్ మవుటా, తషింగ ముసెకివా, బ్లెస్సింగ్ ముజరాబనీ, డియాన్ మైర్స్, రిచర్డ్ నగరవ
Comments
Please login to add a commentAdd a comment