
ఐర్లాండ్‌తో మూడో వన్డేలో జింబాబ్వే(ZImbabwe Vs Ireland) అదరగొట్టింది. ఏకంగా తొమ్మిది వికెట్ల తేడాతో ప్రత్యర్థి జట్టును మట్టికరిపించి ఘన విజయం సాధించింది. తద్వారా మూడు మ్యాచ్‌ల సిరీస్(ODI Series)ను 2-1తో కైవసం చేసుకుంది. కాగా ఒక టెస్టు, మూడు వన్డేలు, మూడు టీ20లు ఆడేందుకు ఐర్లాండ్ క్రికెట్ జట్టు జింబాబ్వే పర్యటనకు వచ్చింది.
ఈ క్రమంలో ఏకైక టెస్టులో ఐర్లాండ్ అనూహ్య రీతిలో విజయం సాధించగా.. ఆతిథ్య జింబాబ్వే తొలి వన్డేలో గెలుపుతో సిరీస్‌ను ఆరంభించింది. అనంతరం రెండో వన్డేలో ఐరిష్ జట్టు చేతిలో ఓడిన జింబాబ్వే తాజాగా నిర్ణయాత్మక ఆఖరి మ్యాచ్‌లో మాత్రం దుమ్ములేపింది. హరారే వేదికగా మంగళవారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో టాస్ గెలిచిన జింబాబ్వే తొలుత బౌలింగ్ చేసింది.
ఆండ్రూ బల్బిర్నీ, టెక్టర్, టకర్ అర్ధ శతకాలు
ఐర్లాండ్ ఓపెనర్లలో ఆండ్రూ బల్బిర్నీ అర్ధ శతకం(99 బంతుల్లో 64)తో రాణించగా.. మరో ఓపెనర్, కెప్టెన్ పాల్ స్టిర్లింగ్ 9 పరుగులకే నిష్క్రమించాడు. ఇక వన్‌డౌన్ బ్యాటర్ కర్టిస్ కాంఫర్(11) కూడా త్వరగానే పెవిలియన్ చేరాడు. ఇలా జట్టు కష్టాల్లో కూరుకుపోయిన వేళ హ్యారీ టెక్టర్(51), వికెట్ కీపర్ బ్యాటర్ లోర్కాన్ టకర్(61) హాఫ్ సెంచరీలతో ఆదుకున్నారు.
మిగతా వాళ్లలో డాక్‌రెల్(2) విఫలంకాగా.. మార్క్ అడెర్ 26, ఆండీ మెక్‌బ్రిన్ 7 పరుగులతో అజేయంగా నిలిచారు. ఈ క్రమంలో నిర్ణీత యాభై ఓవర్లలో ఐర్లాండ్ జట్టు ఆరు వికెట్లు నష్టపోయి 240 పరుగులు సాధించింది. జింబాబ్వే బౌలర్లలో ఎంగర్వ, ట్రెవర్ గ్వాండు రెండేసి వికెట్లు కూల్చగా.. ముజర్బాని, వెల్లింగ్‌టన్ మసకద్జ ఒక్కో వికెట్ దక్కించుకున్నారు.
శతక్కొట్టిన ఓపెనర్..
ఇక ఓ మోస్తరు లక్ష్యంతో బరిలోకి దిగిన ఎర్విన్ బృందం 39.3 ఓవర్లలోనే కథ ముగించింది. ఓపెనర్ బ్రియాన్ బెనెట్ 48 బంతుల్లో 48 పరుగులు చేసి గ్రాహమ్ హ్యూబ్ బౌలింగ్‌లో బౌల్డ్ అయ్యాడు. ఇక మరో ఓపెనర్ బెన్ కరన్(Ben Curran) మాత్రం శతక్కొట్టాడు. 130 బంతులు ఎదుర్కొని 14 ఫోర్ల సాయంతో 118 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు.
కరన్‌కు తోడుగా వన్‌డౌన్ బ్యాటర్ క్రెయిగ్ ఎర్విన్ కెప్టెన్ ఇన్నింగ్స్‌తో మెరిశాడు. 59 బంతుల్లో ఐదు ఫోర్లు, మూడు సిక్సర్లు బాదిన ఎర్విన్ 69 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఫలితంగా కేవలం ఒకే ఒక వికెట్ నష్టపోయిన జింబాబ్వే 246 పరుగులు చేసి.. ఘన విజయం సాధించింది. అంతేకాదు.. సిరీస్‌నూ 2-1తో కైవసం చేసుకుంది. బెన్ కరన్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’, బ్రియాన్ బెనెట్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ది సిరీస్’ అవార్డులు దక్కాయి.
జింబాబ్వే వర్సెస్ ఐర్లాండ్ సంక్షిప్త స్కోర్లు
👉వేదిక: హరారే స్పోర్ట్స్ క్లబ్, హరారే
👉టాస్: జింబాబ్వే.. తొలుత బౌలింగ్
👉ఐర్లాండ్ స్కోరు: 240/6 (50 ఓవర్లలో)
👉జింబాబ్వే స్కోరు: 246/1 (39.3 ఓవర్లలో)
👉ఫలితం: తొమ్మిది వికెట్ల తేడాతో ఐర్లాండ్‌పై జింబాబ్వే విజయం.. మూడు వన్డేల సిరీస్ 2-1తో సొంతం.
చదవండి: CT 2025: షెడ్యూల్, జట్లు, మ్యాచ్ ఆరంభ సమయం.. లైవ్ స్ట్రీమింగ్.. పూర్తి వివరాలు
Comments
Please login to add a commentAdd a comment