Zimbabwe vs Ireland
-
శెభాష్ అన్నా!.. జింబాబ్వే ఓపెనర్‌పై ఇంగ్లండ్ ఆల్‌రౌండర్ పోస్ట్
ఇంగ్లండ్ ఆల్‌రౌండర్ సామ్ కరన్(Sam Curran) ఉద్వేగానికి లోనయ్యాడు. తన సోదరుడు, జింబాబ్వే ఓపెనర్ బెన్ కరన్(Ben Curran) వన్డేల్లో తొలి శతకం బాదడం పట్ల హర్షం వ్యక్తం చేశాడు. ‘‘ అద్భుత ఇన్నింగ్స్ ఆడావు’’ అంటూ అన్నను ప్రశంసల్లో ముంచెత్తాడు. కాగా ఐర్లాండ్‌తో జరిగిన చివరిదైన మూడో వన్డేలో జింబాబ్వే ఓపెనర్ బెన్ కరన్ అజేయ సెంచరీతో కదంతొక్కిన విషయం తెలిసిందే. 130 బంతుల్లో 14 ఫోర్ల సాయంతో 118 పరుగులు సాధించాడు.తద్వారా తొమ్మిది వికెట్ల తేడాతో జయభేరి మోగించిన జింబాబ్వే మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను 2–1తో కైవసం చేసుకుంది. హరారే వేదికగా మంగళవారం రాత్రి జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ నెగ్గిన జింబాబ్వే ఫీల్డింగ్ ఎంచుకోగా... మొదట బ్యాటింగ్‌కు దిగిన ఐర్లాండ్ నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 240 పరుగులు చేసింది. 120 బంతుల్లో శతకంఓపెనర్ అండీ బాల్బిర్నీ (99 బంతుల్లో 64; 4 ఫోర్లు, 1 సిక్స్), మిడిలార్డర్లో లొర్కన్ టక్కర్ (54 బంతుల్లో 61; 7 ఫోర్లు), హ్యారి టెక్టర్ (84 బంతుల్లో 51; 3 ఫోర్లు, 1 సిక్స్) అర్ధసెంచరీలు సాధించారు.ప్రత్యర్థి జట్టు బౌలర్లలో రిచర్డ్ ఎన్‌గరవ, ట్రెవర్ వాండు చెరో 2 వికెట్లు తీశారు. అనంతరం లక్ష్యఛేదనకు దిగిన జింబాబ్వే 39.3 ఓవర్లలోనే వికెట్ మాత్రమే కోల్పోయి 246 పరుగులు చేసి గెలిచింది. బ్రియాన్ బెన్నెట్ (48 బంతుల్లో 48; 6 ఫోర్లు) ఇన్నింగ్స్ ప్రారంభించిన బెన్ కరన్ తొలి వికెట్‌కు 124 పరుగులు జోడించి చక్కటి శుభారంభం ఇచ్చాడు. తర్వాత కెప్టెన్ క్రెయిగ్ ఇర్విన్ (59 బంతుల్లో 69 నాటౌట్; 5 ఫోర్లు, 3 సిక్స్‌లు)తో కలిసి అబేధ్యమైన రెండో వికెట్‌కు 122 పరుగులు జోడించాడు.రోమాలు నిక్కబొడుచుకున్నాయిఈ క్రమంలో 120 బంతుల్లో కరన్ సెంచరీ పూర్తిచేసుకున్నాడు. జట్టు విజయంలో కీలక పాత్ర పోషించి ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కించుకున్నాడు. ఈ నేపథ్యంలో సామ్ కరన్ ఎక్స్ వేదికగా తన అన్నను అభినందించాడు. ‘‘రోమాలు నిక్కబొడుచుకున్నాయి. వాట్ ఏ బాయ్!.. అద్బుత ఇన్నింగ్స్’’ అని ఉద్వేగపూరిత ట్వీట్ చేశాడు. కాగా జింబాబ్వే మాజీ క్రికెటర్ కెవిన్ కరన్‌కు ముగ్గురు కుమారులు. వారిలో 29 ఏళ్ల టామ్ కరన్ పెద్దవాడు కాగా.. బెన్ కరన్ రెండోవాడు. ఇక సామ్ అందరికంటే చిన్నవాడు. అయితే, బెన్ తండ్రి మాదిరి జింబాబ్వే జట్టుకు ఆడుతుండగా.. టామ్, సామ్ మాత్రం ఇంగ్లండ్ తరఫున అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటుతున్నారు. అయితే, కరన్ సోదరుల్లో తొలి ఇంటర్నేషనల్ సెంచరీ చేసిన ఘనత మాత్రం బెన్కే దక్కింది. 28 ఏళ్ల బెన్ స్పెషలిస్టు బ్యాటర్ కాగా.. 26 ఏళ్ల సామ్ కరన్ బౌలింగ్ ఆల్‌రౌండర్. లెఫ్టార్మ్పేస్ మీడియం బౌలర్ అయిన అతడు లెఫ్టాండర్ బ్యాటర్. ఇక వీరిద్దరి పెద్దన్న టామ్ కరన్ కూడా బౌలింగ్ ఆల్‌రౌండరే. అయితే అతడిది కుడిచేతి వాటం కావడం గమనార్హం. ఇదిలా ఉంటే... జింబాబ్వే- ఐర్లాండ్ మధ్య ఫిబ్రవరి 22, 23, 25 తేదీల్లో ఇరుజట్ల మధ్య హరారే వేదికగా మూడు టీ20 మ్యాచ్‌ల సిరీస్ జరుగనుంది.చదవండి: సచిన్ కాదు!.. నంబర్ వన్ వన్డే బ్యాటర్ అతడే: సెహ్వాగ్ -
ZIM Vs IRE: శతక్కొట్టిన ఓపెనర్.. ఐర్లాండ్‌ను చిత్తు చేసిన జింబాబ్వే.. సిరీస్ సొంతం
ఐర్లాండ్‌తో మూడో వన్డేలో జింబాబ్వే(ZImbabwe Vs Ireland) అదరగొట్టింది. ఏకంగా తొమ్మిది వికెట్ల తేడాతో ప్రత్యర్థి జట్టును మట్టికరిపించి ఘన విజయం సాధించింది. తద్వారా మూడు మ్యాచ్‌ల సిరీస్(ODI Series)ను 2-1తో కైవసం చేసుకుంది. కాగా ఒక టెస్టు, మూడు వన్డేలు, మూడు టీ20లు ఆడేందుకు ఐర్లాండ్ క్రికెట్ జట్టు జింబాబ్వే పర్యటనకు వచ్చింది.ఈ క్రమంలో ఏకైక టెస్టులో ఐర్లాండ్ అనూహ్య రీతిలో విజయం సాధించగా.. ఆతిథ్య జింబాబ్వే తొలి వన్డేలో గెలుపుతో సిరీస్‌ను ఆరంభించింది. అనంతరం రెండో వన్డేలో ఐరిష్ జట్టు చేతిలో ఓడిన జింబాబ్వే తాజాగా నిర్ణయాత్మక ఆఖరి మ్యాచ్‌లో మాత్రం దుమ్ములేపింది. హరారే వేదికగా మంగళవారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో టాస్ గెలిచిన జింబాబ్వే తొలుత బౌలింగ్ చేసింది.ఆండ్రూ బల్బిర్నీ, టెక్టర్, టకర్ అర్ధ శతకాలుఐర్లాండ్ ఓపెనర్లలో ఆండ్రూ బల్బిర్నీ అర్ధ శతకం(99 బంతుల్లో 64)తో రాణించగా.. మరో ఓపెనర్, కెప్టెన్ పాల్ స్టిర్లింగ్ 9 పరుగులకే నిష్క్రమించాడు. ఇక వన్‌డౌన్ బ్యాటర్ కర్టిస్ కాంఫర్(11) కూడా త్వరగానే పెవిలియన్ చేరాడు. ఇలా జట్టు కష్టాల్లో కూరుకుపోయిన వేళ హ్యారీ టెక్టర్(51), వికెట్ కీపర్ బ్యాటర్ లోర్కాన్ టకర్(61) హాఫ్ సెంచరీలతో ఆదుకున్నారు.మిగతా వాళ్లలో డాక్రెల్(2) విఫలంకాగా.. మార్క్ అడెర్ 26, ఆండీ మెక్‌బ్రిన్ 7 పరుగులతో అజేయంగా నిలిచారు. ఈ క్రమంలో నిర్ణీత యాభై ఓవర్లలో ఐర్లాండ్ జట్టు ఆరు వికెట్లు నష్టపోయి 240 పరుగులు సాధించింది. జింబాబ్వే బౌలర్లలో ఎంగర్వ, ట్రెవర్ గ్వాండు రెండేసి వికెట్లు కూల్చగా.. ముజర్బాని, వెల్లింగ్టన్ మసకద్జ ఒక్కో వికెట్ దక్కించుకున్నారు.శతక్కొట్టిన ఓపెనర్.. ఇక ఓ మోస్తరు లక్ష్యంతో బరిలోకి దిగిన ఎర్విన్ బృందం 39.3 ఓవర్లలోనే కథ ముగించింది. ఓపెనర్ బ్రియాన్ బెనెట్ 48 బంతుల్లో 48 పరుగులు చేసి గ్రాహమ్ హ్యూబ్ బౌలింగ్‌లో బౌల్డ్ అయ్యాడు. ఇక మరో ఓపెనర్ బెన్ కరన్(Ben Curran) మాత్రం శతక్కొట్టాడు. 130 బంతులు ఎదుర్కొని 14 ఫోర్ల సాయంతో 118 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు.కరన్‌కు తోడుగా వన్‌డౌన్ బ్యాటర్ క్రెయిగ్ ఎర్విన్ కెప్టెన్ ఇన్నింగ్స్‌తో మెరిశాడు. 59 బంతుల్లో ఐదు ఫోర్లు, మూడు సిక్సర్లు బాదిన ఎర్విన్ 69 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఫలితంగా కేవలం ఒకే ఒక వికెట్ నష్టపోయిన జింబాబ్వే 246 పరుగులు చేసి.. ఘన విజయం సాధించింది. అంతేకాదు.. సిరీస్‌నూ 2-1తో కైవసం చేసుకుంది. బెన్ కరన్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’, బ్రియాన్ బెనెట్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ది సిరీస్’ అవార్డులు దక్కాయి.జింబాబ్వే వర్సెస్ ఐర్లాండ్ సంక్షిప్త స్కోర్లు👉వేదిక: హరారే స్పోర్ట్స్ క్లబ్, హరారే👉టాస్: జింబాబ్వే.. తొలుత బౌలింగ్👉ఐర్లాండ్ స్కోరు: 240/6 (50 ఓవర్లలో)👉జింబాబ్వే స్కోరు: 246/1 (39.3 ఓవర్లలో)👉ఫలితం: తొమ్మిది వికెట్ల తేడాతో ఐర్లాండ్‌పై జింబాబ్వే విజయం.. మూడు వన్డేల సిరీస్ 2-1తో సొంతం.చదవండి: CT 2025: షెడ్యూల్, జట్లు, మ్యాచ్ ఆరంభ సమయం.. లైవ్ స్ట్రీమింగ్.. పూర్తి వివరాలు -
ఐర్లాండ్ వరల్డ్ రికార్డు.. ప్రపంచంలోనే తొలి టెస్టు జట్టుగా ఘనత
ఐర్లాండ్ క్రికెట్ జట్టు(Ireland Cricket Team) సరికొత్త చరిత్ర లిఖించింది. టెస్టు(Test Format)ల్లో ఇంత వరకు ఏ జట్టుకూ సాధ్యం కాని అరుదైన ఘనత సాధించింది. ‘హ్యాట్రిక్’ విజయాలతో 119 ఏళ్ల రికార్డును బద్దలు కొట్టింది. జింబాబ్వే(Zimbabwe)తో జరిగిన ఏకైక టెస్టు సందర్భంగా ఈ ఫీట్ నమోదు చేసింది.రాణించిన ఆండీ మెక్‌బ్రిన్ కాగా ఒక టెస్టు, మూడు వన్డేలు, మూడు టీ20లు ఆడే నిమిత్తం ఐర్లాండ్ జట్టు.. జింబాబ్వే పర్యటనకు వచ్చింది. ఈ క్రమంలో బులవాయో వేదికగా ఇరుజట్ల మధ్య టెస్టు మ్యాచ్ జరిగింది. క్వీన్స్ స్పోర్ట్స్ క్లబ్ మైదానంలో జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఐరిష్ టీమ్ తొలుత బ్యాటింగ్ చేసింది.అయితే, జింబాబ్వే బౌలర్ల ధాటికి ఐర్లాండ్ టాప్ ఆర్డర్ కుప్పకూలింది. ఈ క్రమంలో బౌలింగ్ ఆల్‌రౌండర్ ఆండీ మెక్‌బ్రిన్ 90 పరుగులు(నాటౌట్), టెయిలెండర్ మార్క్ అడెర్ 78 పరుగులతో రాణించారు. ఫలితంగా తమ తొలి ఇన్నింగ్స్‌లో ఐర్లాండ్ 260 పరుగుల మేర గౌరవప్రదమైన స్కోరు చేయగలిగింది.జింబాబ్వే బౌలర్లలో ముజర్బాని ఏకంగా ఏడు వికెట్లతో చెలరేగగా.. ఎంగరవ రెండు, ట్రెవర్ గ్వాండు ఒక వికెట్ దక్కించుకున్నారు. ఇక జింబాబ్వే తమ మొదటి ఇన్నింగ్స్‌లో 267 పరుగులకు ఆలౌట్ అయి.. ఏడు పరుగుల స్వల్ప ఆధిక్యాన్ని సాధించింది. నిక్ వెల్చ్ 90, ముజర్బాని 47 పరుగులతో రాణించారు.292 పరుగుల లక్ష్యం.. జింబాబ్వే బ్యాటర్ల వైఫ ల్యంఅనంతరం రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టిన ఐర్లాండ్ 298 పరుగులకు ఆలౌట్ అయింది. తద్వారా జింబాబ్వే ముందు 292 పరుగుల విజయలక్ష్యాన్ని ఉంచింది. అయితే, ఐరిష్ స్పిన్నర్ మాథ్యూ హంప్రెస్ ఆరు వికెట్లతో చెలరేగి జింబాబ్వే బ్యాటింగ్ ఆర్డర్ పతనాన్ని శాసించాడు. మరోవైపు బ్యారీ మెకార్తీ రెండు, మార్క్ అడెర్, ఆండీ మెక్‌బ్రిన్ ఒక్కో వికెట్ తీశారు.జింబాబ్వే బ్యాటర్లలో వెస్లీ మధెవెరె (195 బంతుల్లో 84; 8 ఫోర్లు) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. బ్రియాన్ బెనెట్ (72 బంతుల్లో 45; 3 ఫోర్లు), జొనాథన్ క్యాంప్‌బెల్ (62 బంతుల్లో 33; 3 ఫోర్లు) రాణించినా ఫలితం లేకపోయింది. 228 పరుగులకే జింబాబ్వే కుప్పకూలగా.. ఐర్లాండ్ 63 పరుగుల తేడాతో జయభేరి మోగించింది. వరుసగా మూడో టెస్టు విజయంతద్వారా టెస్టుల్లో వరుసగా మూడో విజయాన్ని(‘హ్యాట్రిక్’) నమోదు చేసింది. ఆల్‌రౌండ్ ప్రదర్శన చేసిన ఐర్లాండ్ ప్లేయర్ ఆండీ మెక్‌బ్రిన్ (90 పరుగులు; 4 వికెట్లు)కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది.కాగా ఎనిమిదేళ్ల క్రితం అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) నుంచి టెస్టు హోదా పొందిన ఐర్లాండ్ జట్టు ఆడిన తొలి ఏడు టెస్టుల్లోనూ ఓడిపోయింది. అయితే, గత ఏడాది మార్చిలో అఫ్గానిస్తాన్‌తో జరిగిన ఎనిమిదో టెస్టులో గెలిచి ఈ ఫార్మాట్లో తొలి విజయం నమోదు చేసుకుంది. అనంతరం జింబాబ్వేతో గత ఏడాది జూలైలో జరిగిన తొమ్మిదో టెస్టులో నెగ్గి వరుసగా రెండో గెలుపు రుచి చూసింది.తాజాగా జింబాబ్వేతోనే జరిగిన టెస్టులో ఐర్లాండ్ 63 పరుగుల తేడాతో నెగ్గి ఈ ఫార్మాట్లో ఈ మేర ‘హ్యాట్రిక్’ సాధించింది. ఇప్పటి వరకు కేవలం పది టెస్టులే ఆడిన ఐర్లాండ్.. వరుసగా మూడు మ్యాచ్‌లలో గెలుపొందడం ద్వారా.. అత్యంత తక్కువ టెస్టుల్లో ‘హ్యాట్రిక్’ విజయాలు అందుకున్న తొలి జట్టుగా చరిత్ర లిఖించింది. అంతకు ముందు సౌతాఫ్రికా 1906లో పద్నాలుగు మ్యాచ్‌ల తర్వాత హ్యాట్రిక్ కొట్టింది.తక్కువ మ్యాచ్‌ల వ్యవధిలోనే టెస్టుల్లో హ్యాట్రిక్ విజయాలు నమోదు చేసిన జట్లు👉ఐర్లాండ్- 10 మ్యాచ్‌లలో హ్యాట్రిక్- 2025👉సౌతాఫ్రికా- 14 మ్యాచ్‌లలో హ్యాట్రిక్- 1906👉ఇంగ్లండ్- 23 మ్యాచ్‌లలో హ్యాట్రిక్- 1886👉పాకిస్తాన్- 25 మ్యాచ్‌లలో హ్యాట్రిక్- 1959👉వెస్టిండీస్- 35 మ్యాచ్‌లలో హ్యాట్రిక్- 1950👉ఆస్ట్రేలియా- 50 మ్యాచ్‌లలో హ్యాట్రిక్- 1898👉శ్రీలంక- 87 మ్యాచ్‌లలో హ్యాట్రిక్- 1998👉బంగ్లాదేశ్- 88 మ్యాచ్‌లలో హ్యాట్రిక్- 2014👉ఇండియా- 109 మ్యాచ్‌లలో హ్యాట్రిక్- 1969👉న్యూజిలాండ్- 260 మ్యాచ్‌లలో హ్యాట్రిక్- 1998.చదవండి: తప్పు చేస్తున్నావ్ గంభీర్.. అతడిని బలి చేయడం అన్యాయం: మాజీ క్రికెటర్ ఫైర్ -
Zim Vs Ire: జింబాబ్వేకు షాకిచ్చిన ఐర్లాండ్
Zimbabwe vs Ireland, 3rd T20: జింబాబ్వే పర్యటనలో భాగంగా ఆతిథ్య జట్టుకు గట్టి షాకిచ్చింది ఐర్లాండ్ క్రికెట్ జట్టు. హరారే వేదికగా జరిగిన మూడో టీ20లో ఆరు వికెట్ల తేడాతో జింబాబ్వేను చిత్తు చేసింది. తద్వారా సిరీస్‌ను కైవసం చేసుకుంది. మూడు టీ20, మూడు వన్డే మ్యాచ్‌లు ఆడేందుకు ఐర్లాండ్ జింబాబ్వే టూర్‌కు వెళ్లింది. ఇందులో భాగంగా తొలి టీ20లో ఆఖరి బంతి వరకు ఆతిథ్య, పర్యాటక జట్ల మధ్య ఉత్కంఠ పోరు నడించింది. అయితే, గురువారం నాటి ఈ మ్యాచ్‌లో జింబాబ్వే ఐరిష్ టీమ్‌పై ఒక వికెట్ తేడాతో నెగ్గి గట్టెక్కింది. ఈ క్రమంలో రెండో టీ20లో ఐర్లాండ్ గత మ్యాచ్ తాలుకు పొరపాట్లను పునరావృతం కానివ్వలేదు. అద్భుత ఆట తీరుతో నాలుగు వికెట్ల తేడాతో గెలిచి సిరీస్‌ను సమం చేసింది. ఇక చావోరేవో తేల్చుకోవాల్సిన మూడో టీ20లో టాస్ గెలిచిన ఐర్లాండ్ తొలుత బౌలింగ్ చేసింది. హ్యారీ టెక్టర్, డాక్రెల్ అద్భుత అజేయ ఇన్నింగ్స్ జింబాబ్వే బ్యాటర్లలో కెప్టెన్ రియాన్ బర్ల్ 36 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 140 పరుగులు సాధించింది. ఈ క్రమంలో నామమాత్రపు లక్ష్యంతో బరిలోకి దిగిన ఐరిష్ జట్టుకు ఆదిలోనే షాకులు తగిలినా.. నాలుగో నంబర్లో వచ్చిన హ్యారీ టెక్టర్ అద్భుత ఇన్నింగ్స్‌తో ఆదుకున్నాడు. అతడికి తోడుగా జార్జ్ డాక్రెల్ ధనాధన్ ఇన్నింగ్స్‌తో అదరగొట్టాడు. హ్యారీ టెక్టర్ 45 బంతుల్లో 54, డాక్రెల్ 32 బంతుల్లో 49 పరుగులతో ఆఖరి వరకు అజేయంగా నిలిచి ఐర్లాండ్‌ను గెలుపుతీరాలకు చేర్చారు. వీరిద్దరు రాణించడంతో 18.4 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టపోయి ఐర్లాండ్ లక్ష్యాన్ని ఛేదించింది. ఈ మ్యాచ్‌లో అద్భుతంగా రాణించిన లెఫ్టార్మ్ స్పిన్ ఆల్‌రౌండర్ జార్జ్ డాక్రెల్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. సిరీస్ ఆసాంతం అద్భుతంగా ఆడిన హ్యారీ టెక్టర్ ప్లేయర్ ఆఫ్ ది సిరీస్‌గా నిలిచాడు. ఇక టీ20 సిరీస్‌ను 2-1తో కైవసం చేసుకున్న ఐర్లాండ్ తదుపరి.. జింబాబ్వేతో బుధవారం నుంచి వన్డే సిరీస్‌కు సిద్ధమవుతోంది. చదవండి: Ind vs Pak: భారత క్రికెట్ జట్టుకు నిరాశ.. సెమీస్ చేరాలంటే.. Player of the Series: @harry_tector pic.twitter.com/BgOH82vK8o — Cricket Ireland (@cricketireland) December 10, 2023