Harare Sports Club
-
హరారే స్పోర్ట్స్‌క్లబ్‌లో అగ్నిప్రమాదం.. ఐసీసీ కీలక ప్రకటన
జింబాబ్వే వేదికగా ప్రస్తుతం ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్ క్వాలిఫయర్ 2023 మ్యాచ్‌లు జరుగుతున్న సంగతి తెలిసిందే. కాగా ఈ మ్యాచ్‌లను రెండు వేదికల్లో నిర్వహిస్తున్నారు. ఒకటి హరారే స్పోర్ట్స్‌క్లబ్ కాగా.. రెండోది బులవాయోలోని క్వీన్స్ స్పోర్ట్స్క్లబ్లు ఉన్నాయి. కాగా మంగళవారం హరారే స్పోర్ట్స్‌క్లబ్‌లో అగ్నిప్రమాదం కలకలం రేపింది. జింబాబ్వే, నెదర్లాండ్స్ మ్యాచ్ ముగిసిన ఆరు గంటల తర్వాత మైదానంలోని సౌత్‌వెస్ట్ గ్రాండ్స్టాండ్లో అగ్రిప్రమాదం సంభవించింది. మంటలు చెలరేగిన సమయంలో కాజిల్ కార్నర్లో కప్పబడిన పైకప్పును కలిగి ఉంది. దీంతో పైకప్పు భాగంలో ఉన్న చెట్లకు మంటలు వ్యాపించాయి. అయితే వెంటనే అలర్ట్ అయిన ఫైర్ సెక్యూరిటీ మంటలను ఆర్పివేసి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. కాగా హారారే స్పోర్ట్స్‌క్లబ్‌లో వరల్డ్‌కప్ క్వాలిఫయర్ మ్యాచ్‌లు జరుగుతున్నాయి. దీంతో ఐసీసీ సెక్యూరిటీ టీమ్, జింబాబ్వే క్రికెట్ బోర్డు మైదానంలో ప్రత్యేక ఇన్స్పెక్షన్ నిర్వహించాయి. కేవలం ఒకవైపున్న స్టాండ్స్‌కు మాత్రమే మంటలు అంటుకోవడంతో పెద్ద నష్టం వాటిల్లలేదని.. దీంతో ముందుగా అనుకున్న ప్లాన్ ప్రకారమే మ్యాచ్‌లు జరుగుతాయని తెలిపారు. ఇక హరారే స్పోర్ట్స్‌క్లబ్‌లో ఇంకా నాలుగు సూపర్ సిక్స్ గేమ్‌లతో పాటు మూడు గ్రూప్ మ్యాచ్‌లు మిగిలిఉన్నాయి. జూలై 9న క్వాలిఫయర్ ఫైనల్ మ్యాచ్ జరగనుంది. ఫైనల్లో తలపడే రెండు జట్లు అక్టోబర్-నవంబర్ నెల్లలో జరగనున్న వన్డే వరల్డ్‌కప్‌కు అర్హత సాధించనున్నాయి. చదవండి: స్కాట్లాండ్ ప్లేయర్ విధ్వంసం; ఒక్క వికెట్ తేడాతో సంచలన విజయం -
Ind Vs Zim: జింబాబ్వే గడ్డపై 23 మ్యాచ్‌లు ఆడిన భారత్.. 4 ఓడింది! ఈసారి..
India tour of Zimbabwe, 2022- 1st ODI: టీమిండియా మరో సిరీస్ వేటకు సిద్ధమైంది. మూడు వన్డేలు ఆడేందుకు జింబాబ్వేలో పర్యటిస్తోంది. కాగా ఇటీవల ఇంగ్లండ్ పర్యటనలో వన్డే, టీ20 సిరీస్‌లను 2-1తో గెలిచిన భారత జట్టు.. వెస్టిండీస్ గడ్డ మీద శిఖర్ ధావన్ సారథ్యంలో వన్డే సిరీస్‌ను క్లీన్‌స్వీప్(3-0) చేసిన విషయం తెలిసిందే. అదే విధంగా విండీస్‌తో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను 4-1తో కైవసం చేసుకుంది. ఈ టూర్లలో రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ, వెటరన్ ఓపెనర్ శిఖర్ ధావన్(విండీస్‌తో వన్డే సిరీస్), వెస్టిండీస్‌తో ఆఖరి టీ20కి హార్దిక్ పాండ్యా సారథులుగా వ్యవహరించారు. ఇక జింబాబ్వే పర్యటనకు తొలుత శిఖర్ ధావన్ కెప్టెన్‌గా ఎంపికైనప్పటికీ.. పరిమిత ఓవర్ల వైస్ కెప్టెన్ కేఎల్ రాహుల్ అందుబాటులోకి రావడంతో గబ్బర్ను తప్పించి.. రాహుల్‌కు పగ్గాలు అప్పగించారు. గతంలో దక్షిణాఫ్రికా సిరీస్‌లో వైట్‌బాల్ క్రికెట్ సిరీస్‌కు సారథ్యం వహించిన రాహుల్.. ప్రొటిస్ గడ్డపై ఘోర పరాభవం చవిచూశాడు. అయితే, ఇప్పుడు జింబాబ్వే టూర్ రూపంలో అతడికి కెప్టెన్‌గా సిరీస్ గెలిచే సువర్ణావకాశం వచ్చింది. అయితే.. ఆతిథ్య జట్టు సైతం సొంతగడ్డపై బంగ్లాదేశ్‌ను వన్డే, టీ20 సిరీస్‌లలో 2-1తో మట్టికరిపించి ఆత్మవిశ్వాసంతో ఉంది. టీమిండియాకు పోటీనిస్తామని ధీమాగా చెబుతోంది. ఈ రెండు జట్ల మధ్య హరారే వేదికగా గురువారం(ఆగష్టు 18) నుంచి వన్డే సిరీస్ ఆరంభం కానుంది. మధ్యాహ్నం గం. 12:45 నుంచి సోనీ సిక్స్‌లో ప్రత్యక్ష ప్రసారం జరుగబోతోంది. ఈ నేపథ్యంలో మొదటి వన్డేకు తుది జట్ల అంచనా, పిచ్, వాతావరణం, ముఖాముఖి రికార్డులు తదితర అంశాలు పరిశీలిద్దాం. జింబాబ్వే వర్సెస్ భారత్ మొదటి వన్డే తుది జట్లు (అంచనా) టీమిండియా: కేఎల్ రాహుల్ (కెప్టెన్), శిఖర్ ధావన్, శుబ్‌మన్ గిల్, సంజూ సామ్సన్, దీపక్ హుడా, శార్దుల్ ఠాకూర్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, దీపక్ చహర్, ప్రసిధ్ కృష్ణ/అవేశ్ ఖాన్, మహ్మద్ సిరాజ్. జింబాబ్వే: రెగిస్ చకాబ్వా (కెప్టెన్), మరుమని, కైటానో, కయా, వెస్లీ మదెవెర్/సీన్ విలియమ్స్, సికందర్ రజా, టోని మన్యొంగా, ల్యూక్ జాంగ్వే, బ్రాడ్ ఇవాన్స్, విక్టర్ న్యాయుచి, చివాంగ. పిచ్, వాతావరణం జింబాబ్వే రాజధాని హరారేలోని హరారే స్పోర్ట్స్ క్లబ్ వేదికగా ఈ వన్డే సిరీస్ జరుగనుంది. ఇక బంగ్లాదేశ్‌తో జింబాబ్వే ఇటీవలే ఈ పిచ్ మీద ఆడింది. పర్యాటక బంగ్లా నమోదు చేసిన 303, 290 భారీ స్కోర్లను సైతం జింబాబ్వే అవలీలగా ఛేదించింది. దీనిని బట్టి చూస్తే బ్యాటర్లు చెలరేగిపోవడం ఖాయంగా కనిపిస్తోంది. కాబట్టి పరుగుల వరద పారుతుందడనంలో సందేహం. అభిమానులకు పండగే. ఇక వాతావరణం విషయానికొస్తే.. మ్యాచ్‌కు వర్షం ముప్పులేదు. టీమిండియా- జింబాబ్వే ముఖాముఖి రికార్డులు: టీమిండియా- జింబాబ్వే జట్ల మధ్య ఇప్పటివరకు మొత్తం 63 వన్డే మ్యాచ్‌లు జరిగాయి. ఇందులో భారత్ 51, జింబాబ్వే 10 గెలిచాయి. మరో రెండు మ్యాచ్‌లు ‘టై’గా ముగిశాయి. ఇక జింబాబ్వే గడ్డపై ఆ జట్టుతో 23 మ్యాచ్‌లు ఆడిన టీమిండియా 19 మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. నాలుగు మ్యాచ్‌ల్లో ఓడిపోయింది. సొంతగడ్డపై జింబాబ్వే చివరిసారి 2010లో భారత్‌పై వన్డేలో గెలిచింది. చదవండి: జింబాబ్వేకు బీసీసీఐ ఇస్తున్న ‘ఆర్థిక బహుమతి’... మరో సిరీస్ వేటలో భారత్! కళ్లన్నీ వాళ్ల మీదే! Vinod Kambli: ఏదైనా పని ఉంటే ఇప్పించండి.. చాలీచాలని జీతంతో బ్రతుకీడుస్తున్నా..! IRE VS AFG 5th T20: ఆఫ్ఘనిస్తాన్‌కు షాకిచ్చిన ఐర్లాండ్.. సిరీస్ కైవసం Deepak Hooda: ప్రపంచ రికార్డుకు చేరువలో దీపక్ హుడా.. భారత్ తరపున తొలి ఆటగాడిగా #TeamIndia ready for the first ODI against Zimbabwe 🙌#ZIMvIND pic.twitter.com/Hg0yUSGYAA — BCCI (@BCCI) August 18, 2022 -
ట్రై సిరీస్: ఆసీస్ పై జింబాబ్వే ఘన విజయం
హరారే: ఆస్ట్రేలియాతో ఇక్కడ జరిగిన ముక్కోణపు పోటీలో జింబాబ్వే చారిత్రాత్మక విజయాన్ని కైవసం చేసుకుంది. 210 పరుగుల విజయలక్ష్యంతో బ్యాటింగ్ ఆరంభించిన జింబాబ్వే 48 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది. దీంతో 31 ఏళ్ల తరువాత ఆసీస్ పై జింబాబ్వేకు రెండో విజయం దక్కింది. జింబాబ్వే ఆటగాళ్లలో చిగుంబరా(52), టేలర్(32), ఉత్సేయా(30),సికందర్ రాజా(22)పరుగులు చేసి జట్టు గెలుపుకు సహకరించారు. అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్ చేపట్టిన ఆస్ట్రేలియా 209 పరుగులు మాత్రమే చేసింది.ఆసీస్ కెప్టెన్ క్లార్క్(68),హడిన్(49), కట్టింగ్(26)పరుగులు చేశారు. జింబాబ్వే బౌలర్లలో విలియమ్స్, తిరిపానో, ఉత్సేయాలకు తలో రెండు వికెట్లు తీసి ఆసీస్ ను తక్కువ పరుగులకు కట్టడి చేశారు. -
ఉత్సెయ హ్యాట్రిక్ వృథా
దక్షిణాఫ్రికా చేతిలో జింబాబ్వే ఓటమి హరారే: జింబాబ్వే స్పిన్నర్ ఉత్సెయ (5/36) ఆ దేశ క్రికెట్ చరిత్రలో హ్యాట్రిక్ సాధించిన రెండో బౌలర్‌గా రికార్డు సాధించినా... దక్షిణాఫ్రికా చేతిలో జట్టు పరాజయాన్ని మాత్రం ఆపలేకపోయాడు. హరారే స్పోర్ట్స్ క్లబ్లో శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో ప్రొటీస్ జట్టు 61 పరుగులతో గెలిచింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన దక్షిణాఫ్రికా 49.5 ఓవర్లలో 231 పరుగులకు ఆలౌటైంది. ఆమ్లా (66), డి కాక్ (76) రాణించారు. నయుంబు 3, చతారా 2 వికెట్లు పడగొట్టారు. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన జింబాబ్వే 38.3 ఓవర్లలో 170 పరుగులకే పరిమితమైంది. సీన్ విలియమ్స్ (46) టాప్ స్కోరర్. స్టెయిన్ మూడు, మెక్లారెన్ రెండు వికెట్లు తీశారు -
ఆసీస్ చేతిలో జింబాబ్వే చిత్తు
చెలరేగిన మ్యాక్స్‌వెల్, మార్ష్ హరారే: ముక్కోణపు వన్డే సిరీస్‌లో ఆస్ట్రేలియా జట్టు శుభారంభం చేసింది. ఇక్కడి హరారే స్పోర్ట్స్ క్లబ్లో సోమవారం ఏకపక్షంగా జరిగిన టోర్నీ తొలి మ్యాచ్‌లో ఆసీస్ 198 పరుగుల తేడాతో జింబాబ్వేను చిత్తు చేసింది. గ్లెన్ మ్యాక్స్‌వెల్ (46 బంతుల్లో 93; 9 ఫోర్లు, 5 సిక్సర్లు), మిషెల్ మార్ష్ (83 బంతుల్లో 89; 7 ఫోర్లు, 4 సిక్సర్లు)ల విధ్వంసకర బ్యాటింగ్‌తో ముందుగా ఆస్ట్రేలియా 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 350 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఆరోన్ ఫించ్ (79 బంతుల్లో 67; 5 ఫోర్లు, 3 సిక్సర్లు) అర్ధ సెంచరీ చేయగా, బ్రాడ్ హాడిన్ (58 బంతుల్లో 46; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) రాణించాడు. మ్యాక్స్‌వెల్, మార్ష్ నాలుగో వికెట్‌కు 9 ఓవర్లలోనే 109 పరుగులు జోడించడం విశేషం. అనంతరం జింబాబ్వే 39.3 ఓవర్లలో 152 పరుగులకే కుప్పకూలింది. హామిల్టన్ మసకద్జా (91 బంతుల్లో 70; 6 ఫోర్లు, 1 సిక్స్) మినహా అంతా విఫలమయ్యారు. ఆసీస్ బౌలర్లలో స్మిత్ 3 వికెట్లు పడగొట్టగా... స్టార్క్, లియోన్ చెరో 2 వికెట్లు తీశారు. మెరుపు ఇన్నింగ్స్‌తో పాటు ఒక వికెట్ కూడా తీసిన మార్ష్‌కు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు దక్కింది. టోర్నీ తదుపరి మ్యాచ్‌లో బుధవారం ఇదే మైదానంలో ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా తలపడతాయి. -
జింబాబ్వే జిగేల్
హరారే: సిరీస్‌కు ముందు జీతాల కోసం మ్యాచ్‌లను బాయ్‌కాట్ చేస్తామన్న జింబాబ్వే ఆటగాళ్లు... మైదానంలో మాత్రం విజృంభించారు. సమష్టిగా రాణించి 15 ఏళ్ల తర్వాత పాకిస్థాన్‌పై ఓ సంచలన విజయాన్ని నమోదు చేశారు. టెండీ చతారా (5/61) సూపర్ బౌలింగ్‌కు తోడు ఫీల్డర్లు చురుకుగా కదలడంతో హరారే స్పోర్ట్స్ క్లబ్ మైదానంలో శనివారం ముగిసిన రెండో టెస్టులో ఆతిథ్య జట్టు 24 పరుగుల తేడాతో పాక్‌ను ఓడించింది. దీంతో రెండు మ్యాచ్‌ల సిరీస్ 1-1తో సమమైంది. 264 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన పాకిస్థాన్ రెండో ఇన్నింగ్స్‌లో 81 ఓవర్లలో 239 పరుగులకు ఆలౌటైంది. కెప్టెన్ మిస్బా (79 నాటౌట్) ఒంటరి పోరాటం వృథా అయ్యింది. అద్నాన్ అక్మల్ (20), అబ్దుర్ రెహమాన్ (16) ఓ మోస్తరుగా ఆడారు. ఇప్పటివరకు 93 టెస్టులు ఆడిన జింబాబ్వే కేవలం 11 టెస్టుల్లో మాత్రమే గెలిచింది. 56 టెస్టుల్లో ఓడిపోయి, మిగతా 26 మ్యాచ్‌లను ‘డ్రా’ చేసుకుంది. జింబాబ్వే సాధించిన 11 టెస్టు విజయాల్లో బంగ్లాదేశ్‌పై ఆరు, పాకిస్థాన్‌పై మూడు, భారత్‌పై రెండు విజయాలు ఉన్నాయి. 1998లో పెషావర్‌లో పాకిస్థాన్‌పై నెగ్గిన తర్వాత జింబాబ్వేకు ఆ జట్టుపై ఇదే తొలి విజయం. చతారా మెరుపులు ఆఖరి రోజు పాకిస్థాన్ విజయానికి 106 పరుగులు కావాలి. చేతిలో ఐదు వికెట్లు ఉన్నాయి. అయితే 158/5 ఓవర్‌నైట్ స్కోరుతో ఆట కొనసాగించిన పాక్‌కు ఆరంభంలోనే చతారా షాకిచ్చాడు. ఐదు పరుగులు జతకూడిన తర్వాత కొత్త బంతితో అద్నాన్ అక్మల్‌ను ఎల్బీగా అవుట్ చేశాడు. తర్వాత వచ్చిన అబ్దుర్ రెహమాన్ ఆచితూచి ఆడుతూ మిస్బాతో కలిసి ఏడో వికెట్‌కు 34 పరుగులు జోడించాడు. ఈ దశలో పన్యాన్‌గర బంతిని ఆడబోయి కీపర్‌కు క్యాచ్ ఇచ్చాడు. ఆ తర్వాత మళ్లీ బౌలింగ్‌కు దిగిన చతారా.... సయీద్ అజ్మల్ (2)ను ఎల్బీగా వెనక్కి పంపాడు. వేగంగా వచ్చిన బంతిని కట్ చేయబోయిన అజ్మల్ వికెట్ల ముందు దొరికిపోయాడు. అయితే ఓ ఎండ్‌లో సహచరులు వరుసగా అవుటవుతున్నా.. రెండో ఎండ్‌లో మిస్బా మాత్రం నిలకడగా ఆడాడు. దీంతో జింబాబ్వే 217/8 స్కోరుతో లంచ్‌కు వెళ్లింది. కానీ లంచ్ తర్వాత మ్యాచ్‌లో నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. స్ట్రయిక్‌ను కాపాడుకోవడం కోసం చతారా, విటోరి వేసిన తొలి రెండు ఓవర్లలో మిస్బా కేవలం రెండు పరుగులే చేశాడు. అయితే చతారా తర్వాతి ఓవర్లో రెండు బౌండరీలతో 11 పరుగులు సాధించిన అతను విటోరి ఓవర్లోనూ మరో రెండు ఫోర్లు కొట్టాడు. కానీ రెండో బౌండరీతో జునైద్ (1)కు స్ట్రయిక్ ఇవ్వాల్సి వచ్చింది. ఈ దశలో విజయానికి మరో 26 పరుగులు కావాలి. రెండో కొత్త బంతితో చతారా (80.4 ఓవర్) ... జునైద్‌ను అవుట్ చేసి పాక్‌కు షాకిచ్చాడు. తర్వాతి బంతికి చివరి బ్యాట్స్‌మన్ రాహత్ అలీ (1) సింగిల్ తీసి మిస్బాకు స్ట్రయిక్ ఇచ్చాడు. అయితే ఆఖరి బంతికి (80.6 ఓవర్) స్ట్రయిక్‌ను కాపాడుకునే ప్రయత్నంలో రాహత్ అలీని రనౌట్ చేయడంతో ఇన్నింగ్స్‌ను తెరపడింది. ఉత్సెయాకు 2 వికెట్లు దక్కాయి. చతారాకు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’; యూనిస్ ఖాన్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద సిరీస్’ అవార్డులు లభించాయి. సంక్షిప్త స్కోర్లు జింబాబ్వే తొలి ఇన్నింగ్స్: 294; పాకిస్థాన్ తొలి ఇన్నింగ్స్: 230; జింబాబ్వే రెండో ఇన్నింగ్స్: 199; పాకిస్థాన్ రెండో ఇన్నింగ్స్: 239 (మిస్బా 79 నాటౌట్; అద్నాన్ అక్మల్ 20, చతారా 5/61). -
పాక్‌దే వన్డే సిరీస్
హరారే: జింబాబ్వేతో జరిగిన మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ను పాకిస్థాన్ 2-1తో గెలుచుకుంది. ఆల్‌రౌండ్ నైపుణ్యంతో ఆకట్టుకున్న మిస్బాసేన శనివారం జరిగిన ఆఖరి మ్యాచ్‌లో 108 పరుగుల తేడాతో ఆతిథ్య జట్టుపై విజయం సాధించింది. హరారే స్పోర్ట్స్ క్లబ్లో జరిగిన ఈ మ్యాచ్‌లో... మొదట బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ 50 ఓవర్లలో 6 వికెట్లకు 260 పరుగులు చేసింది. మిస్బా (67), అహ్మద్ షెహజాద్ (54) అర్ధసెంచరీలతో చెలరేగారు. నాజిర్ జంషేద్ (38), ఉమర్ అమిన్ (33) ఫర్వాలేదనిపించారు. చివర్లో సర్ఫార్రాజ్ అహ్మద్ (22) వేగంగా ఆడాడు. టెండి చతారాకు మూడు వికెట్లు దక్కాయి. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన జింబాబ్వే 40 ఓవర్లలో 152 పరుగులకు ఆలౌటై ఓడింది. వాలర్ (48) టాప్ స్కోరర్. హమిల్టన్ మసకద్జా (25), టేలర్ (26), ఉత్సెయా (23)లు ఓ మోస్తరుగా ఆడారు. మహ్మద్ హఫీజ్, అబ్దుర్ రెహమాన్, అజ్మల్ తలా రెండేసి వికెట్లు తీశారు. మిస్బాకు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’, హఫీజ్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద సిరీస్’ అవార్డులు లభించాయి. సోమవారం చెల్లిస్తాం: జింబాబ్వే బోర్డు తమకు ఇవ్వాల్సిన బకాయిలు వెంటనే చెల్లించాలని లేదంటే మ్యాచ్ ఆడబోమని హెచ్చరించిన జింబాబ్వే ఆటగాళ్లు ఎట్టకేలకు శాంతించారు. బకాయిలను సోమవారం చెల్లిస్తామని బోర్డు హామీ ఇవ్వడంతో పాక్‌తో ఆఖరి వన్డేలో బరిలోకి దిగారు. అయితే ఇప్పటికే పలుసార్లు బోర్డు మాట తప్పడంతో అటు ఆటగాళ్లు కూడా అల్టిమేటం జారీ చేశారు. సోమవారం డబ్బులు చెల్లించకుంటే పాక్‌తో జరగబోయే టెస్టు మ్యాచ్‌లు ఆడబోమని హెచ్చరించారు.