జింబాబ్వే వేదికగా ప్రస్తుతం ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్ క్వాలిఫయర్ 2023 మ్యాచ్‌లు జరుగుతున్న సంగతి తెలిసిందే. కాగా ఈ మ్యాచ్‌లను రెండు వేదికల్లో నిర్వహిస్తున్నారు. ఒకటి హరారే స్పోర్ట్స్‌క్లబ్ కాగా.. రెండోది బులవాయోలోని క్వీన్స్ స్పోర్ట్స్‌క్లబ్‌లు ఉన్నాయి. కాగా మంగళవారం హరారే స్పోర్ట్స్‌క్లబ్‌లో అగ్నిప్రమాదం కలకలం రేపింది.
జింబాబ్వే, నెదర్లాండ్స్ మ్యాచ్ ముగిసిన ఆరు గంటల తర్వాత మైదానంలోని సౌత్‌వెస్ట్ గ్రాండ్‌స్టాండ్‌లో అగ్రిప్రమాదం సంభవించింది. మంటలు చెలరేగిన సమయంలో కాజిల్ కార్నర్‌లో కప్పబడిన పైకప్పును కలిగి ఉంది. దీంతో పైకప్పు భాగంలో ఉన్న చెట్లకు మంటలు వ్యాపించాయి. అయితే వెంటనే అలర్ట్ అయిన ఫైర్ సెక్యూరిటీ మంటలను ఆర్పివేసి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.
కాగా హారారే స్పోర్ట్స్‌క్లబ్‌లో వరల్డ్‌కప్ క్వాలిఫయర్ మ్యాచ్‌లు జరుగుతున్నాయి. దీంతో ఐసీసీ సెక్యూరిటీ టీమ్, జింబాబ్వే క్రికెట్ బోర్డు మైదానంలో ప్రత్యేక ఇన్స్‌పెక్షన్ నిర్వహించాయి. కేవలం ఒకవైపున్న స్టాండ్స్‌కు మాత్రమే మంటలు అంటుకోవడంతో పెద్ద నష్టం వాటిల్లలేదని.. దీంతో ముందుగా అనుకున్న ప్లాన్ ప్రకారమే మ్యాచ్‌లు జరుగుతాయని తెలిపారు.
ఇక హరారే స్పోర్ట్స్‌క్లబ్‌లో ఇంకా నాలుగు సూపర్ సిక్స్ గేమ్‌లతో పాటు మూడు గ్రూప్ మ్యాచ్‌లు మిగిలిఉన్నాయి. జూలై 9న క్వాలిఫయర్ ఫైనల్ మ్యాచ్ జరగనుంది. ఫైనల్లో తలపడే రెండు జట్లు అక్టోబర్-నవంబర్ నెల్లలో జరగనున్న వన్డే వరల్డ్‌కప్‌కు అర్హత సాధించనున్నాయి.
చదవండి: స్కాట్లాండ్ ప్లేయర్ విధ్వంసం; ఒక్క వికెట్ తేడాతో సంచలన విజయం
Comments
Please login to add a commentAdd a comment