CWC Qualifiers 2023: USA Pacer Kyle Phillip Suspended From Bowling Due To Illegal Action - Sakshi
Sakshi News home page

#CWCQualifiers2023: సస్పెన్షన్‌ వేటు.. బౌలర్‌కు షాకిచ్చిన ఐసీసీ; ముంబై ఇండియన్స్‌కు ఎదురుదెబ్బ

Published Fri, Jun 23 2023 7:56 AM | Last Updated on Fri, Jun 23 2023 9:44 AM

CWC 2023: USA Bowler Kyle Phillip Suspended From Bowling Illegal Action - Sakshi

క్రికెట్‌ వరల్డ్‌కప్‌ క్వాలిఫయర్స్‌ 2023లో ఆడుతూ బిజీగా ఉన్న అమెరికా జట్టుకు ఊహించని షాక్‌ తగిలింది.ఆ జట్టు ఫాస్ట్‌ బౌలర్‌ కైల్‌ పిలిప్‌పై సస్పెన్షన్‌ వేటు పడింది. కైల్‌  పిలిప్‌ బౌలింగ్‌ యాక్షన్‌ నిబంధనలకు విరుద్ధంగా ఉండడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఐసీసీ ప్యానెల్‌ పేర్కొంది. కైల్‌ పిలిప్‌పై విధించిన నిషేధం వెంటనే అమల్లోకి వస్తుందని తెలిపింది.

''ఆర్టికల్‌ 6.7 రెగ్యులేషన్స్‌ ప్రకారం.. కైల్‌ పిలిప్‌ బౌలింగ్‌ యాక్షన్‌పై అనుమానముంది. అతని బౌలింగ్‌ యాక్షన్‌ నిబంధనలకు విరుద్ధంగా ఉన్నట్లు గుర్తించాం. తన బౌలింగ్‌కు సంబంధించిన రీఅసెస్‌మెంట్‌ జరిగేవరకు కైల్‌ పిలిప్‌పై సస్పెన్షన్‌ కొనసాగుతుంది'' అని ఐసీసీ ప్యానెల్‌ తెలిపింది. 2021 నుంచి అమెరికా తరపున ఐదు వన్డేలు ఆడిన కైల్‌ పిలిప్‌ ఆరు వికెట్లు పడగొట్టాడు.

ఇక క్రికెట్‌ వరల్డ్‌కప్‌ క్వాలిఫయర్స్‌ 2023 టోర్నీలో భాగంగా వెస్టిండీస్‌తో అమెరికా తొలి మ్యాచ్‌ ఆడింది. మ్యాచ్‌లో యూఎస్‌ఏ ఓడినప్పటికి కైల్‌ పిలిప్‌ మూడు వికెట్లు తీశాడు. కాగా టోర్నీలో హ్యాట్రిక్‌ ఓటములు నమోదు చేసిన అమెరికా దాదాపు నిష్క్రమించింది. ఇక తనపై నిషేధం పడడంతో కైల్‌ పిలిప్‌ వచ్చే నెలలో ప్రారంభం కానున్న మేజర్‌ లీగ్‌ క్రికెట్‌(MLC) టోర్నీలో ఆడేది అనుమానంగానే కనిపిస్తోంది. ముంబై ఇండియన్స్‌ న్యూయార్క్‌ జట్టు కైల్‌ పిలిప్‌ను 10వేల యూస్‌ డాలర్లకు సొంతం చేసుకుంది.

చదవండి: 50 ఫోర్లతో ట్రిపుల్‌ సెంచరీ బాదిన హైదరాబాదీ కుర్రాడు 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement