
క్రికెట్ వరల్డ్‌కప్ క్వాలిఫయర్స్ 2023లో భాగంగా వెస్టిండీస్ జట్టు సూపర్ సిక్స్‌లో తొలి విజయాన్ని నమోదు చేసింది. ఇప్పటికే వరల్డ్‌కప్ అర్హత అవకాశాన్ని కోల్పోయిన వెస్టిండీస్‌కు ఈ విజయం ఊరట మాత్రమే. బుధవారం సూపర్ సిక్స్‌లో భాగంగా వెస్టిండీస్, ఒమన్‌ల మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో వెస్టిండీస్ ఏడు వికెట్ల తేడాతో ఘన విజయాన్ని అందుకుంది.
తొలుత బ్యాటింగ్ చేసిన ఒమన్ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 221 పరుగులు చేసింది. సూరజ్ కుమార్ 53 పరుగులు నాటౌట్, షోయబ్ ఖాన్ 50 పరుగులతో రాణించగా.. అయాన్ ఖాన్ 30, కశ్యప్ 31 పరుగులు చేశారు. విండీస్ బౌలర్లలో రొమారియో షెపర్డ్ మూడు వికెట్లు తీయగా.. కైల్ మేయర్స్ రెండు, కెవిన్ సింక్లెయిర్ ఒక వికెట్ తీశాడు.
అనంతరం 222 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన వెస్టిండీస్ 39.4 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి టార్గెట్‌ను అందుకుంది. బ్రాండన్ కింగ్ (104 బంతుల్లో 100 పరుగులు) శతకంతో మెరవగా.. కెప్టెన్ షెయ్ హోప్ 63 నాటౌట్, పూరన్ 19 పరుగులు నాటౌట్ జట్టును విజయతీరాలకు చేర్చారు.