Oman team
-
విండీస్ విజయం; చేతులు కాలాకా ఆకులు పట్టుకుంటే ఏం లాభం
క్రికెట్ వరల్డ్‌కప్ క్వాలిఫయర్స్ 2023లో భాగంగా వెస్టిండీస్ జట్టు సూపర్ సిక్స్‌లో తొలి విజయాన్ని నమోదు చేసింది. ఇప్పటికే వరల్డ్‌కప్ అర్హత అవకాశాన్ని కోల్పోయిన వెస్టిండీస్‌కు ఈ విజయం ఊరట మాత్రమే. బుధవారం సూపర్ సిక్స్‌లో భాగంగా వెస్టిండీస్, ఒమన్‌ల మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో వెస్టిండీస్ ఏడు వికెట్ల తేడాతో ఘన విజయాన్ని అందుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన ఒమన్ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 221 పరుగులు చేసింది. సూరజ్ కుమార్ 53 పరుగులు నాటౌట్, షోయబ్ ఖాన్ 50 పరుగులతో రాణించగా.. అయాన్ ఖాన్ 30, కశ్యప్ 31 పరుగులు చేశారు. విండీస్ బౌలర్లలో రొమారియో షెపర్డ్ మూడు వికెట్లు తీయగా.. కైల్ మేయర్స్ రెండు, కెవిన్ సింక్లెయిర్ ఒక వికెట్ తీశాడు. అనంతరం 222 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన వెస్టిండీస్ 39.4 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి టార్గెట్‌ను అందుకుంది. బ్రాండన్ కింగ్ (104 బంతుల్లో 100 పరుగులు) శతకంతో మెరవగా.. కెప్టెన్ షెయ్ హోప్ 63 నాటౌట్, పూరన్ 19 పరుగులు నాటౌట్ జట్టును విజయతీరాలకు చేర్చారు. -
ఆశలు గల్లంతు!
మస్కట్: భారత ఫుట్‌బాల్ జట్టు ప్రపంచ కప్ ఆశలకు దాదాపుగా తెరపడింది. 2022 ప్రపంచకప్ ఆసియా జోన్ క్వాలిఫయింగ్‌లో మూడో రౌండ్‌కు చేరాలంటే తప్పనిసరిగా గెలవాల్సిన మ్యాచ్‌లో భారత్ ఓడిపోయింది. మంగళవారం ఇక్కడ జరిగిన గ్రూప్ ‘ఇ’ మ్యాచ్‌లో భారత్ 0–1తో ఒమన్ చేతిలో కంగుతింది. దీంతో రెండో రౌండ్ క్వాలిఫయింగ్ పోటీల్లో మరో మూడు మ్యాచ్‌లు మిగిలి ఉండగానే భారత్ తన ప్రపంచకప్ పోరాటాన్ని దాదాపు ముగించేసింది. సొంత ప్రేక్షకుల మధ్య ఆడిన ఒమన్ ఆరంభం నుంచే దూకుడుగా ఆడింది. పదే పదే భారత ‘డి’ బాక్స్‌లోకి చొచ్చుకువచ్చి ఒత్తిడి పెంచింది. ఆట 33వ నిమిషంలో ఒమన్ ఆటగాడు మోసిన్ అల్ ఖాల్ది అద్భుతమైన పాస్‌ను గోల్‌గా మలిచిన ముసెన్ అల్ ఘసాని తన జట్టుకు బ్రేక్ ఇచ్చాడు. మ్యాచ్‌లో గోల్ కోసం భారత్ చేసిన ప్రయత్నాలు సఫలం కాకపోవడంతో భారత ఓటమి ఖాయమైంది. ఒకవేళ భారత్ అర్హత పోటీల్లో ముందంజ వేయాలంటే మాత్రం మిగిలిన మూడు మ్యాచ్‌ల్లో భారీ గోల్స్‌తో గెలవాలి. ఆ తర్వాత ఇతర గ్రూప్‌ల సమీకరణాలపై ఆధారపడాలి. ఆసియా జోన్ రెండో రౌండ్లో ఎనిమిది గ్రూప్‌ల్లో (ఒక్కో గ్రూప్‌లో ఐదు జట్లు ఉన్నాయి) అగ్రస్థానంలో నిలిచిన ఎనిమిది జట్లు నేరుగా మూడో రౌండ్‌కు అర్హత పొందుతాయి. రెండో రౌండ్లో రెండో స్థానంలో నిలిచిన మిగతా నాలుగు అత్యుత్తమ జట్లకు కూడా మూడో రౌండ్‌కు చేరుకునే అవకాశం ఉంది. ఐదు జట్లున్న గ్రూప్ ‘ఇ’లో ప్రస్తుతం ఖతర్ (13 పాయింట్లు), ఒమన్ (12 పాయింట్లు), అఫ్గానిస్తాన్ (4 పాయింట్లు), భారత్ (3 పాయింట్లు) వరుసగా తొలి నాలుగు స్థానాల్లో ఉన్నాయి. భారత్ మిగిలిన తమ మూడు మ్యాచ్‌లను వచ్చే ఏడాది మార్చి 26న ఖతర్‌తో; జూన్ 4న బంగ్లాదేశ్‌తో; జూన్ 9న అఫ్గానిస్తాన్‌తో ఆడుతుంది. -
నిలవాలంటే...గెలవాలి
మస్కట్: ఒమన్‌తో తాడోపేడో తేల్చుకోవడానికి భారత ఫుట్‌బాల్ జట్టు సిద్ధమైంది. 2022 ఫుట్‌బాల్ ప్రపంచ కప్‌కు అర్హత రేసులో నిలవాలంటే భారత్‌కు ఈ విజయం తప్పనిసరి. ఒకవేళ ఓడిందంటే మాత్రం ప్రపంచ కప్ దారులు మూసుకుపోయినట్లే. 2022 ప్రపంచ కప్ క్వాలిఫయర్స్‌లో భాగంగా నేడు గ్రూప్ ‘ఇ’లో ఈ రెండు జట్ల మధ్య మ్యాచ్ జరుగుతుంది. ఇప్పటికే భారత్ నాలుగు మ్యాచ్‌లు ఆడింది. ఒక దాంట్లో ఓడి... మూడింటిని ‘డ్రా’ చేసుకున్న భారత్... 3 పాయింట్లతో గ్రూప్‌లో నాలుగో స్థానంలో ఉంది. మరోవైపు ఒమన్ మాత్రం నాలుగింటిలో మూడు గెలిచి 9 పాయింట్లతో గ్రూప్‌లో రెండో స్థానంలో ఉంది. క్వాలిఫయర్స్ తొలి అంచె పోటీల్లో ఇరు జట్లు గువాహటి వేదికగా తలపడగా భారత్ 1–2తో ఓటమి చవిచూసింది. ఆ మ్యాచ్‌లో 80 నిమిషాల పాటు ఆధిక్యం కనబరిచిన భారత్... చివరి 10 నిమిషాల్లో చేతులెత్తేసి ఏకంగా రెండు గోల్స్ ప్రత్యర్థికి సమర్పించుకొని పరాభవాన్ని మూటగట్టుకుంది. అనంతరం ఆసియా చాంపియన్ ఖతర్‌తో జరిగిన మ్యాచ్‌లో అంచనాలకు మించి రాణించిన భారత్ ఆ మ్యాచ్‌ను ‘డ్రా’ చేసుకుంది. అయితే విజయాలు ఖాయం అనుకున్న బంగ్లాదేశ్, అఫ్గానిస్తాన్ మ్యాచ్‌లను ‘డ్రా’తో సరిపెట్టుకున్న భారత్ ప్రస్తుతం చావో రేవో పరిస్థితి తెచ్చుకుంది. ముఖ్యంగా గత రెండు మ్యాచ్‌ల్లోనూ సారథి సునీల్ చెత్రి ఎటువంటి ప్రభావం చూపలేకపోయాడు. నేడు జరిగే మ్యాచ్‌లో ఒమన్‌ను ఓడించడం అంత సులభం కాదు. ఇప్పటివరకు ఇరు జట్లు 11 సార్లు తలపడగా... భారత్ ఎనిమిదింట ఓడి, మూడింటిని ‘డ్రా’ చేసుకుంది. ఒమన్‌కు పోటీ ఇవ్వాలంటే భారత్ అన్ని విభాగాల్లోనూ రాణించాల్సి ఉంటుంది. ముఖ్యంగా డిఫెన్స్ విషయంలో మెరుగవ్వాలి. అయితే కీలక ఆటగాళ్లు గాయాలతో మ్యాచ్‌కు దూరమవ్వడం భారత్‌కు ప్రతికూలాంశం. -
టి20 ప్రపంచకప్‌కు స్కాట్లాండ్, ఒమన్ అర్హత
దుబాయ్: వచ్చే ఏడాది ఆ్రస్టేలియాలో జరిగే టి20 ప్రపంచకప్‌కు స్కాట్లాండ్, ఒమన్ జట్లు అర్హత సాధించాయి. బుధవారం జరిగిన క్వాలిఫయింగ్ టోర్నీ ప్లే ఆఫ్ మ్యాచ్‌ల్లో స్కాట్లాండ్ 90 పరుగుల తేడాతో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)పై... ఒమన్ 12 పరుగుల తేడాతో హాంకాంగ్‌పై గెలిచాయి. ముందుగా బ్యాటింగ్ చేసిన స్కాట్లాండ్ 20 ఓవర్లలో 6 వికెట్లకు 198 పరుగులు చేసింది. మున్సే (43 బంతుల్లో 65; 2 ఫోర్లు, 5 సిక్సర్లు), బెరింగ్టన్ (18 బంతుల్లో 48; 4 ఫోర్లు, 3 సిక్సర్లు) చెలరేగారు. అనంతరం యూఏఈ 18.3 ఓవర్లలో 108 పరుగులకే కుప్పకూలింది. రమీజ్ షహజాద్ (28 బంతుల్లో 34; 2 ఫోర్లు, 2 సిక్సర్లు)దే అత్యధిక స్కోరు. వాట్, షరీఫ్ చెరో 3 వికెట్లు తీశారు. స్కాట్లాండ్ గతంలో 2007, 2009, 2016 టి20 ప్రపంచకప్‌లలో ఆడింది. హాంకాంగ్‌తో మ్యాచ్‌లో తొలుత ఒమన్ జట్టు 7 వికెట్లకు 134 పరుగులు చేసింది. అనంతరం హాంకాంగ్ జట్టు 20 ఓవర్లలో 9 వికెట్లకు 122 పరుగులు చేసి ఓడిపోయింది. -
అమెరికా, ఒమన్లకు వన్డే హోదా
దుబాయ్: అగ్రరాజ్యం అమెరికాతో పాటు మధ్య ఆసియా దేశం ఒమన్లకు అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) వన్డే జట్ల హోదా దక్కింది. బుధవారం జరిగిన ఐసీసీ వరల్డ్ క్రికెట్ లీగ్ డివిజన్–2లో ఒమన్ నాలుగు వికెట్లతో నమీబియాపై, అమెరికా 84 పరుగుల తేడాతో హాంకాంగ్‌పై విజయం సాధించడంతో వన్డే హోదాకు అర్హత సాధించాయి. డివిజన్–2లో ప్రస్తుతం స్కాట్లాండ్, నేపాల్ ఉన్నాయి. 2023లో జరిగే ప్రపంచ కప్‌కు అర్హత సాధించే క్రమంలో ఈ నాలుగు జట్ల మధ్య రాబోయే రెండున్నరేళ్లలో 36 వన్డే మ్యాచ్‌లు జరుగుతాయి. ఒమన్‌ను ఒడ్డెక్కించిన హైదరాబాదీ సందీప్ గౌడ్ ఒమన్ జట్టు ఐసీసీ వన్డే హోదా సాధించడంలో హైదరాబాదీ ఆల్‌రౌండర్ సందీప్ గౌడ్ (53 బంతుల్లో 57 నాటౌట్; 2 ఫోర్లు, 3 సిక్స్‌లు) అజేయ అర్ధసెంచరీతో కీలక పాత్ర పోషించాడు. బుధవారం నాటి మ్యాచ్‌లో ఆతిథ్య నమీబియా తొలుత 9 వికెట్ల నష్టానికి 213 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనలో ఒమన్ 157 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ దశలో సందీప్ ఒత్తిడిని తట్టుకుని నిలిచాడు. దీంతో ఒమన్ మరో ఐదు బంతులు ఉండగానే, 6 వికెట్ల నష్టానికి 214 పరుగులు చేసి గెలుపొందింది. అంతకుముందు పంజాబ్‌కు చెందిన వికెట్ కీపర్ సూరజ్ కుమార్ (51) ఒమన్ ఛేదనను ముందుకు నడిపించాడు. -
బంగ్లాతో మ్యాచ్: ఒమన్ విజయలక్ష్యం: 181
ధర్మశాల: టి-20 ప్రపంచ కప్ క్వాలిఫయింగ్ పోటీల్లో భాగంగా గ్రూపు-ఏలో బంగ్లాదేశ్, ఒమన్ జట్ల మధ్య ఆదివారమిక్కడ జరుగుతున్న మ్యాచ్‌లో ఒమన్ జట్టు తొలుత టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. బ్యాటింగ్‌కు దిగిన బంగ్లాదేశ్ నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 180 పరుగులు చేసింది. దాంతో ఒమన్ జట్లుకు బంగ్లాదేశ్181 పరుగుల విజయలక్ష్యాన్ని నిర్దేశించింది. తొలుత ఓపెనర్లుగా బరిలోకి దిగిన బంగ్లాదేశ్ ఆటగాళ్లు సౌమ్య సర్కార్ 22 బంతుల్లో (రెండు ఫోర్లు)తో 12 పరుగులకే చేతులెత్తేశాడు. షబ్బీర్ రహమాన్ 26 బంతుల్లో 44 పరుగులు చేసి పెవిలీయన్ బాట పట్టాడు. తమీమ్ ఇక్బాల్ సెంచరీ పూర్తి చేసి103 పరుగులతో అద్భుతంగా రాణించి నాటౌట్‌గా నిలిచాడు. షకీబ్ అల్ హసన్ 17 పరుగులతో నాటౌట్‌గా ఉన్నాడు. ఒమన్ బౌలర్లు లాల్చేతా, ఖావర్ అలీ తలో వికెట్ తీసుకున్నారు.