జింబాబ్వే వేదికగా జరుగుతున్న ఐసీసీ వన్డే ప్రపంచకప్ క్వాలిఫయర్స్-2023లో వెస్టిండీస్ దారుణ ప్రదర్శన కనబరుస్తున్న సంగతి తెలిసింది. వరుసగా రెండు మ్యాచ్‌లు ఆడి వరల్డ్‌కప్‌కు క్వాలిఫై అయ్యే అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది. విండీస్ సూపర్ సిక్స్‌కు క్వాలిఫై అయినప్పటికి.. ప్రపంచకప్ ఆడేందుకు భారత గడ్డపై అడుగుపెట్టాలంటే అద్భుతాలు జరగాల్సిందే.
ఇక సూపర్ సిక్స్ రౌండ్ ప్రారంభానికి ముందు వెస్టిండీస్ క్రికెట్ కీలక నిర్ణయం తీసుకుంది. గాయం కారణంగా వన్డే ప్రపంచకప్ క్వాలిఫయర్స్ మధ్యలో తప్పుకున్న స్పిన్నర్ యాన్నిక్ కారియా స్థానంలో మరో స్పిన్నర్ కెవిన్ సింక్లైర్ విండీస్ క్రికెట్ భర్తీ చేసింది. ఈ ఈవెంట్ ప్రారంభానికి ముందు ప్రాక్టీస్ సెషన్‌లో యాన్నిక్ కారియాకు గాయమైంది.
బంతి అతడి ముక్కుకు బలంగా తాకడంతో టోర్నీ మొత్తానికి దూరమయ్యాడు. సూపర్ సిక్స్‌లో భాగంగా వెస్టిండీస్ తమ తొలి మ్యాచ్‌లో జులై 1న స్కాట్లాండ్‌తో తలపడనుంది. ఈ మ్యాచ్‌కు ముందు కెవిన్ సింక్లైర్ విండీస్ జట్టుతో కలవనున్నాడు. ఇక కెవిన్ సింక్లైర్ రీప్లేస్‌మెంట్‌ను ఈవెంట్ టెక్నికల్ కమిటీ కూడా ఆమోదించింది.
చదవండి: #ICCWorldCup2023: విండీస్‌కు చివరి చాన్స్; అసాధ్యమని తెలుసు.. అలా జరిగితే మాత్రం!
Comments
Please login to add a commentAdd a comment