ఐసీసీ ప్రతిష్టాత్మకంగా నిర్వహించే వన్డే ప్రపంచకప్‌కు నెదర్లాండ్స్ జట్టు ఐదోసారి అర్హత సాధించిన సంగతి తెలిసిందే. ఇప్పటివరకు 1996, 2003, 2007, 2011లో నాలుగుసార్లు డచ్ జట్టు వన్డే వరల్డ్‌కప్ ఆడింది. ఈ నాలుగు సందర్భాల్లో మూడుసార్లు తన జట్టును వన్డే వరల్డ్‌కప్‌కు అర్హత సాధించడంలో కీలకపాత్ర పోషించాడు. అతనే టిమ్ డీ లీడే.. ఈ పేరు మీకు ఎక్కువగా పరిచయం లేకపోవచ్చు.
కానీ క్రికెట్ వరల్డ్‌కప్ క్వాలిఫయర్స్‌లో భాగంగా శుక్రవారం సూపర్ సిక్స్‌లో స్కాట్లాండ్, నెదర్లాండ్స్ తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో ఒకడి పేరు బాగా మార్మోగిపోయింది. అతనే బాస్ డీ లీడే. బౌలింగ్‌లో ఐదు వికెట్లు.. బ్యాటింగ్‌లో 123 పరుగులు వీరోచిత సెంచరీ.. వెరసి ఆల్‌రౌండ్ ప్రదర్శనతో తన జట్టును వన్డే వరల్డ్‌కప్ ఆడే అర్హతను సాధించిపెట్టాడు. 278 పరుగులు లక్ష్యాన్ని కేవలం 42.5 ఓవర్లలోనే చేధించిన డచ్ జట్టు క్వాలిఫయర్-2గా.. పదో జట్టుగా వన్డే వరల్డ్‌కప్‌లోకి అడుగుపెట్టింది.
మరి ఒంటిచేత్తో నెదర్లాండ్స్‌ను వన్డే వరల్డ్‌కప్‌లో పాల్గొనేలా చేసిన బాస్ డీ లీడే.. ఎవరో కాదు.. పైన మనం చెప్పుకున్న టిమ్ డీ లీడే కుమారుడే. బాస్ డీ లీడే తన వీరోచిత పోరాటంతో 12 ఏళ్ల తర్వాత మళ్లీ నెదర్లాండ్స్ వన్డే వరల్డ్‌కప్ ఆడేందుకు అర్హత సాధించిపెట్టి తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకున్నాడు.
ఇక టిమ్ డీ లీడే 1996లో అంతర్జాతీయ క్రికెట్‌లో అరంగేట్రం చేశాడు. తన 11 ఏళ్ల కెరీర్‌లో కేవలం వన్డే వరల్డ్‌కప్ మ్యాచ్‌లు మాత్రమే ఆడిన టిమ్ డీ లీడే 29 మ్యాచ్‌ల్లో 400 పరుగులు చేయడంతో పాటు బౌలింగ్‌లో 29 వికెట్లు పడగొట్టి బౌలింగ్ ఆల్‌రౌండర్‌గా గుర్తింపు పొందాడు.
2018లో నేపాల్‌తో మ్యాచ్‌లో నెదర్లాండ్స్ తరపున అంతర్జాతీయ క్రికెట్‌లో అరంగేట్రం చేసిన బాస్ డీ లీడే అనతికాలంలోనే మంచి పేరు సంపాదించాడు. మిడిలార్డర్‌లో ఎక్కువగా బ్యాటింగ్‌కు వచ్చే బాస్ డీ లీడే మంచి బ్యాటింగ్ ఆల్‌రౌండర్‌గా గుర్తింపు పొందాడు. ఇప్పటివరకు 30 వన్డేల్లో 765 పరుగులతో పాటు 24 వికెట్లు, 31 టి20ల్లో 610 పరుగులు చేయడంతో పాటు బౌలింగ్‌లో 27 వికెట్లు పడగొట్టాడు.
కాగా స్కాట్లాండ్‌తో మ్యాచ్‌లో విజయం అనంతరం ఐసీసీ నెదర్లాండ్స్‌కు అభినందనలు తెలుపుతూ ఒక ఫోటోను షేర్ చేసిది. ఆ ఫోటోలో బాస్ డీ లీడే.. తన తండ్రి టిమ్ డీ లీడేను గుర్తుచేస్తూ సేమ్ ఎక్స్‌ప్రెషన్ ఇవ్వడం హైలెట్‌గా నిలిచింది. ఇదే విషయాన్ని ఐసీసీ వివరిస్తూ తండ్రికి తగ్గ తనయుడు.. బాస్ డీ లీడే సన్నాఫ్ టిమ్ డీ లీడే అంటూ క్యాప్షన్ జత చేసింది.
Tim de Leede, Bas de Leede 🏏
— ICC (@ICC) July 7, 2023
Like father, like son 🇳🇱 #CWC23
More: https://t.co/qguNPPA8ai pic.twitter.com/KGECQ1yt5s
చదవండి: #NED Vs SCO: ఐదు వికెట్లు, వీరోచిత శతకం.. వన్డే వరల్డ్‌కప్‌కు నెదర్లాండ్స్ అర్హత
Bas De Leede: సెంచరీ హీరో ప్రపంచ రికార్డు.. వాళ్లెవరికీ సాధ్యం కాలేదు! దిగ్గజం సరసన..
Comments
Please login to add a commentAdd a comment