జింబాబ్వే ఆతిథ్యమిస్తున్న ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్ క్వాలిఫయర్ మ్యాచ్‌లు ఆసక్తికరంగా సాగుతున్నాయి. ప్రధానంగా వెస్టిండీస్, జింబాబ్వే,శ్రీలంకలు ఫెవరెట్‌గా కనిపిస్తున్నాయి. తాజాగా బుధవారం స్కాట్లాండ్, ఐర్లాండ్ మధ్య జరిగిన లీగ్ మ్యాచ్‌లో చిత్రమైన సన్నివేశం చోటుచేసుకుంది. నాన్‌స్ట్రైక్ ఎండ్‌లో ఉన్న బ్యాటర్‌ను రనౌట్(మన్కడింగ్) చేసే ప్రయత్నం చేయడం ఆసక్తి కలిగించింది.
చేజింగ్‌లో భాగంగా స్కాట్లాండ్‌కు ఆఖరి ఓవర్‌లో 8 పరుగులు కావాల్సి ఉంది. ఆఖరి ఓవర్ మార్క్ అడైర్ వేశాడు. అడైర్ వేసిన తొలి రెండు బంతులకు ఫోర్ సహా సింగిల్ తీశాడు. మూడో బంతిని వేసే సమయంలో నాన్‌స్ట్రైక్ ఎండ్‌లో ఉన్న లీస్క్ క్రీజు బయటికి వచ్చాడు. ఇది గమనించిన మార్క్ అడైర్ బంతి వేయడం ఆపివేసి మన్కడింగ్ చేసే ప్రయత్నం చేశాడు.
కానీ ఇంతలో అలర్ట్ అయిన లీస్క్ వెంటనే బ్యాట్‌ను క్రీజులో ఉంచాడు. అలా బతికిపోయిన లీస్క్ ఆఖరి బంతికి ఫోర్ కొట్టి స్కాట్లాండ్‌కు ఒక్క వికెట్ తేడాతో మరిచిపోలేని విజయాన్ని అందించాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వీడియో చూసిన అభిమానులు.. మ్యాచ్‌లో ఐర్లాండ్ గెలవాల్సింది.. తమ ఫీల్డింగ్ తప్పిదాలతో పాటు ఆ జట్టు బౌలర్ పెట్టిన బిక్షతో లీస్క్ తన జట్టును గెలిపించుకున్నాడు అంటూ కామెంట్ చేశారు.
చదవండి: #CWCQualifiers2023: స్కాట్లాండ్ ప్లేయర్ విధ్వంసం; ఒక్క వికెట్ తేడాతో సంచలన విజయం
Comments
Please login to add a commentAdd a comment