CWC Qualifiers 2023: Michael Leask guides Scotland to thrilling victory Vs Ireland - Sakshi
Sakshi News home page

#CWCQualifiers2023: స్కాట్లాండ్‌ ప్లేయర్‌ విధ్వంసం; ఒక్క వికెట్‌ తేడాతో సంచలన విజయం

Published Thu, Jun 22 2023 7:26 AM | Last Updated on Thu, Jun 22 2023 8:46 AM

Michael Leask-91-Not-out-SCO-Won-By-1-Wicket Vs IRE CWC Qualifiers 2023 - Sakshi

ఐసీసీ క్రికెట్‌ వరల్డ్‌కప్‌ క్వాలిఫయర్స్‌ల 2023లో భాగంగా బుధవారం స్కాట్లాండ్‌, ఐర్లాండ్‌ మధ్య మ్యాచ్‌ హై థ్రిల్లర్‌ను తలపించింది. చివరి బంతి వరకు ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌లో స్కాట్లాండ్‌ కేవలం ఒక్క వికెట్‌ తేడాతో విజయం సాధించడం విశేషం. తొలుత బ్యాటింగ్‌ చేసిన ఐర్లాండ్‌ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 286 పరుగుల స్కోరు చేసింది.

70 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయిన దశలో కర్టీస్‌ కాంఫర్‌ (108 బంతుల్లో 120 పరుగులు, 9 ఫోర్లు, 4 సిక్సర్లు) వీరోచిత సెంచరీకి తోడుగా డోక్రెల్‌ 69 పరుగులు చేశాడు. ఈ ఇద్దరు ఆరో వికెట్‌కు 136 పరుగులు జోడించారు. ఐర్లాండ్‌ బౌలర్లలో బ్రాండన్‌ మెక్‌ముల్లెన్‌ ఐదు వికెట్లతో రాణించాడు.అనంతరం 287 పరుగుల టార్గెట్‌తో బరిలోకి దిగిన స్కాట్లాండ్‌ 9 వికెట్లు కోల్పోయి 289 పరుగులు చేసి ఒక్క వికెట్‌ తేడాతో విజయాన్ని అందుకుంది.

ఓపెనర్‌ క్రిస్టోఫర్‌ మెక్‌బ్రైడ్‌ 56 పరుగులు చేయగా..ఏడో స్థానంలో వచ్చి బ్యాటింగ్‌ చేసిన మైకెల్‌ లీస్క్‌ (61 బంతుల్లో 91 పరుగులు నాటౌట్‌, 9 ఫోర్లు, 4 సిక్సర్లు) విధ్వంసకర ఇన్నింగ్స్‌ ఆడి స్కాట్లాండ్‌ విజయంలో కీలకపాత్ర పోషించాడు. మార్క్‌ వాల్ట్‌ 43 బంతుల్లో 47 పరుగులతో లీస్క్‌కు సహకరించాడు. ఐర్లాండ్‌ బౌలర్లలో మార్క్‌ అడైర్‌ మూడు వికెట్లు తీయగా.. జోషువా లిటిల్‌, జార్జ్‌ డోక్రెల్‌లు చెరో రెండు వికెట్లు పడగొట్టారు.

ఇక చేజింగ్‌లోనూ స్కాట్లాండ్‌ జట్టు సరికొత్త రికార్డు సృష్టించింది. చేజింగ్‌లో వరుసగా 14 మ్యాచ్‌ల్లో తొలి మ్యాచ్‌ మాత్రమే ఓడిన స్కాట్లాండ్‌ అప్పటినుంచి 13 మ్యాచ్‌ల్లో ఓటమనేది లేకుండా ముందుకు సాగుతుంది.

చదవండి: హ్యాట్రిక్‌ గోల్స్‌తో రికార్డు.. టాప్‌-4లో సునీల్‌ ఛెత్రి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement