
టి20 ప్రపంచకప్‌లో క్వాలిఫయర్ పోరులో భాగంగా గ్రూఫ్-బిలో బుధవారం ఐర్లాండ్, స్కాట్లాండ్ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన స్కాట్లండ్ నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్లె నష్టానికి 176 పరుగులు చేసింది. స్కాట్లాండ్ ఓపెనర్ మైకెల్ జోన్స్ (55 బంతుల్లో 86 పరుగులు, 6 ఫోర్లు, 4 సిక్సర్లు) టాప్ స్కోరర్‌గా నిలవగా.. కెప్టెన్ రిచీ బెరింగ్‌టన్ 37 పరుగులతో రాణించాడు. అంతకముందు వికెట్ కీపర్ మాథ్యూ క్రాస్ 28 పరుగులు చేశాడు. ఐర్లాండ్ బౌలర్లలో కర్టీస్ కాంపర్ రెండు వికెట్లు తీయగా.. మార్ అడెయిర్, జోషువా లిటిల్‌లు తలా ఒక వికెట్ తీశారు.
ఇక స్కాట్లాండ్ తమ తొలి మ్యాచ్‌లో వెస్టిండీస్‌ను ఓడించిం పాయింట్ల పట్టికలో టాప్‌లో కొనసాగుతుంది. మరోవైపు ఐర్లాండ్ మాత్రం జింబాబ్వే చేతిలో ఓటమి పాలైంది. ఐర్లాండ్‌పై గెలిచి సూపర్-12 దశకు చేరుకోవాలని స్కాట్లాండ్ లక్ష్యంగా పెట్టుకుంది.
Comments
Please login to add a commentAdd a comment