
PC: BCCI/IPL.com
ఐపీఎల్-2025లో లక్నో సూపర్ జెయింట్స్ తిరిగి గెలుపు బాట పట్టింది. ఏక్నా స్టేడియం వేదికగా ముంబై ఇండియన్స్‌తో ఆఖరి వరకు ఉత్కంఠ భరితంగా సాగిన మ్యాచ్‌లో 12 పరుగుల తేడాతో లక్నో విజయం సాధించింది. 204 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 191 పరుగులకే పరిమితమైంది.
ఆఖరి ఓవర్‌లో అవేష్ ఖాన్ అద్బుతంగా బౌలింగ్ చేశాడు. ముంబై విజయానికి చివరి ఓవర్‌లో 22 పరుగులు అవసరమయ్యాయి. ఆ ఓవర్‌లో తొలి బంతినే హార్దిక్ పాండ్యా సిక్సర్‌గా మలిచాడు. ఆ తర్వాత అవేష్ ఖాన్ సూపర్ కమ్‌బ్యాక్ ఇచ్చాడు. ఆఖరి 5 బంతుల్లో కేవలం మూడు పరుగులు మాత్రమే అవేష్ ఇచ్చాడు.
ముంబై ఇండియన్స్ బ్యాటర్లలో సూర్యకుమార్ యాదవ్(67) టాప్ స్కోరర్‌గా నిలవగా.. నమాన్ ధీర్(46) పరుగులతో పర్వాలేదన్పించాడు. కెప్టెన్ హార్దిక్ పాండ్యా(28) ఆఖరిలో పోరాడినప్పటికి తన జట్టును గెలిపించలేకపోయాడు. లక్నో బౌలర్లలో ఆకాష్ దీప్, దిగ్వేష్, శార్ధూల్ ఠాకూర్, అవేష్ ఖాన్ తలా వికెట్ సాధించారు. అంతకుముందు బ్యాటింగ్ చేసిన లక్నో సూపర్ జెయింట్స్ 8 వికెట్ల నష్టానికి 203 పరుగులు చేసింది.
లక్నో బ్యాటర్లలో మిచెల్ మార్ష్(31 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్స్‌లతో 60), మార్‌క్రమ్(53) హాఫ్ సెంచరీలతో మెరవగా.. డేవిడ్ మిల్లర్(27), బదోని(27) రాణించారు. ముంబై బౌలర్లలో హార్ధిక్ పాండ్యా 5 వికెట్లతో చెలరేగగా.. విఘ్నేష్ పుత్తార్, బౌల్ట్, అశ్వినీ కుమార్ తలా వికెట్ సాధించారు.