Mankading
-
ఔటైనా వెనుక్కి పిలిచారు.. బంగ్లాదేశ్ క్రీడా స్పూర్తి! వీడియో వైరల్
ఢాకా వేదికగా బంగ్లాదేశ్-న్యూజిలాండ్ మధ్య జరిగిన రోండో వన్డేలో ఓ ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. రనౌట్ అయ్యి పెవిలియన్‌కు వెళ్తున్న కివీస్ బ్యాటర్‌ను వెనక్కి పిలిచి.. బంగ్లాదేశ్ క్రికెట్ జట్టు క్రీడా స్పూర్తిని చాటుకుంది. ఏం జరిగిందంటే? ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన న్యూజిలాండ్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. 167 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి కివీస్ కష్టాల్లో పడింది. ఇటువంటి సమయంలో కివీస్ స్పిన్ ఆల్‌రౌండర్ ఇష్ సోధి జట్టును అదుకునే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో కివీస్ ఇన్నింగ్స్ 46 ఓవర్ వేసేందుకు బంగ్లా పేసర్ హసన్ మహమూద్ సిద్దమయ్యాడు. అయితే తొలి బతి వేసేందుకు సిద్దమైన మహమూద్.. నాన్ స్ట్రైక్ ఎండ్‌లో ఉన్న న్యూజిలాండ్ బ్యాటర్ ఇష్ సోదీని రౌనౌట్(మన్కడింగ్) చేశాడు. సోధి క్రీజు దాటడం గమనించిన మహమూద్ బంతిని డెలివరీ చేయకుండా స్టంప్స్‌ను పడగొట్టాడు. వెంటనే రనౌట్‌కు అప్పీల్ చేయగా.. ఫీల్డ్ అంపైర్లు థర్డ్ అంపైర్‌కు రిఫర్ చేశాడు. థర్డ్ అంపైర్ నితిన్ మీనన్ కొత్త నిబంధనల ప్రకారం ఔట్‌గా ప్రకటించాడు. దీంతో నిరాశతో పెవిలియన్ వైపుగా సోధి నడిచాడు. బంగ్లాదేశ్ క్రీడా స్పూర్తి.. సరిగ్గా ఇదే సమయంలో బంగ్లాదేశ్ తమ క్రీడా స్పూర్తిని చాటుకుంది. బంగ్లాదేశ్ కెప్టెన్ లిటన్ దాస్, సహచర ఆటగాళ్లు అంపైర్లతో చర్చలు జరిపి సోదీని వెనక్కి పిలవాలని నిర్ణయించుకున్నారు. వెంటనే హసన్ మహమూద్ పరిగెత్తుకుంటూ వెళ్లి సోధిని వెనుక్కి పిలిచాడు. మళ్లీ తిరిగి వచ్చిన సోదీ నవ్వుతూ హసన్ మహమూద్‌ను కౌగిలించుకున్నాడు. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఇది చూసిన అభిమానులు బంగ్లాదేశ్ మంచి మనసుకు పిధా అయిపోయారు. కాగా ఈ మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌పై 86 పరుగుల తేడాతో కివీస్ విజయం సాధించింది. చదవండి: Asian Games 2023: సెమీస్‌లో బంగ్లాదేశ్ చిత్తు.. ఫైనల్‌కు చేరిన భారత్ #BabarAzam𓃵 Asif Hassan Mahmud mankad Ish Sodhi then made him come back. Umpire gave it out (Rabitholebd Sports) pic.twitter.com/tyDbSr5WPJ — Muhammad Farhan Ali (@imrealfarhanali) September 23, 2023 -
బౌలర్ పెట్టిన బిక్షతో మ్యాచ్‌ను గెలిపించాడు
జింబాబ్వే ఆతిథ్యమిస్తున్న ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్ క్వాలిఫయర్ మ్యాచ్‌లు ఆసక్తికరంగా సాగుతున్నాయి. ప్రధానంగా వెస్టిండీస్, జింబాబ్వే,శ్రీలంకలు ఫెవరెట్‌గా కనిపిస్తున్నాయి. తాజాగా బుధవారం స్కాట్లాండ్, ఐర్లాండ్ మధ్య జరిగిన లీగ్ మ్యాచ్‌లో చిత్రమైన సన్నివేశం చోటుచేసుకుంది. నాన్‌స్ట్రైక్ ఎండ్‌లో ఉన్న బ్యాటర్‌ను రనౌట్(మన్కడింగ్) చేసే ప్రయత్నం చేయడం ఆసక్తి కలిగించింది. చేజింగ్‌లో భాగంగా స్కాట్లాండ్కు ఆఖరి ఓవర్లో 8 పరుగులు కావాల్సి ఉంది. ఆఖరి ఓవర్ మార్క్ అడైర్ వేశాడు. అడైర్ వేసిన తొలి రెండు బంతులకు ఫోర్ సహా సింగిల్ తీశాడు. మూడో బంతిని వేసే సమయంలో నాన్‌స్ట్రైక్ ఎండ్‌లో ఉన్న లీస్క్ క్రీజు బయటికి వచ్చాడు. ఇది గమనించిన మార్క్ అడైర్ బంతి వేయడం ఆపివేసి మన్కడింగ్ చేసే ప్రయత్నం చేశాడు. కానీ ఇంతలో అలర్ట్ అయిన లీస్క్ వెంటనే బ్యాట్‌ను క్రీజులో ఉంచాడు. అలా బతికిపోయిన లీస్క్ ఆఖరి బంతికి ఫోర్ కొట్టి స్కాట్లాండ్కు ఒక్క వికెట్ తేడాతో మరిచిపోలేని విజయాన్ని అందించాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వీడియో చూసిన అభిమానులు.. మ్యాచ్‌లో ఐర్లాండ్ గెలవాల్సింది.. తమ ఫీల్డింగ్ తప్పిదాలతో పాటు ఆ జట్టు బౌలర్ పెట్టిన బిక్షతో లీస్క్ తన జట్టును గెలిపించుకున్నాడు అంటూ కామెంట్ చేశారు. View this post on Instagram A post shared by ICC (@icc) చదవండి: #CWCQualifiers2023: స్కాట్లాండ్ ప్లేయర్ విధ్వంసం; ఒక్క వికెట్ తేడాతో సంచలన విజయం వీడిన మిస్టరీ.. వార్న్ ఆకస్మిక మరణానికి కారణం అదేనా! -
నాన్ స్ట్రయికర్ ముందుగా క్రీజ్ వదిలితే 6 పరుగులు పెనాల్టి..!
ఐపీఎల్-2023లో భాగంగా లక్నో సూపర్ జెయింట్స్-రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య నిన్న (ఏప్రిల్ 11) జరిగిన హైఓల్టేజీ మ్యాచ్ తర్వాత సీఎస్కే ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్ ఓ ఆసక్తికర ప్రతిపాదనను తెరపైకి వచ్చింది. నాన్ స్ట్రయికింగ్ ఎండ్‌లో ఉన్న బ్యాటర్.. బౌలర్ బంతి వేయకముందే క్రీజ్ దాటితే 6 పరుగులు పెనాల్టి విధించాలని ఆయన కోరాడు. Bishnoi was leaving his crease early. Any silly people out there still saying you shouldn't run the non-striker out? — Harsha Bhogle (@bhogleharsha) April 10, 2023 ఎల్ఎస్జే-ఆర్సీబీ మ్యాచ్‌లో హర్షల్-బిష్ణోయ్ మన్కడింగ్ ఉదంతం తర్వాత ప్రముఖ వ్యాఖ్యాత హర్షా భోగ్లే చేసిన ట్వీట్‌కు స్పందిస్తూ స్టోక్స్ ఈరకంగా స్పందించాడు. బిష్ణోయ్.. బౌలర్ బంతి వేయకముందే క్రీజ్ వదిలి వెళ్లాడు. ఇంకా ఎవరైనా ఇలాంటి సందర్భంలో కూడా మన్కడింగ్ (నాన్ స్ట్రయికర్ రనౌట్) చేయొద్దని అంటారా అంటూ హర్షా ట్వీట్ చేయగా.. ఈ ట్వీట్‌కు బదులిస్తూ స్టోక్స్ పైవిధంగా స్పందించాడు. Thought’s Harsha? Umpires discretion.. 6 penalty runs if obviously trying to gain unfair advantage by leaving crease early? Would stop batters doing it without all the controversy https://t.co/xjK7Bnw0PS — Ben Stokes (@benstokes38) April 10, 2023 కాగా, నిన్నటి మ్యాచ్‌లో లక్నో గెలవాలంటే చివరి బంతికి ఒక్క పరుగు కావాల్సి తరుణంలో నాన్ స్ట్రయికర్ ఎండ్‌లో ఉన్న రవి బిష్ణోయ్.. బౌలర్ హర్షల్ పటేల్ బంతి వేయకముందే క్రీజ్ దాటి చాలా ముందుకు వెళ్లాడు. ఇది గమనించిన హర్షల్ మన్కడింగ్ చేసి భిష్ణోయ్ను రనౌట్ చేశాడు. అయితే దీన్ని అంపైర్ పరిగణించలేదు. హర్షల్‌కు బౌల్ వేసే ఉద్ధేశం లేకపోవడంతో పాటు క్రీజ్ దాటినందుకు గానూ మన్కడింగ్‌ను అంపైర్ ఒప్పుకోలేదు. Virat Kohli mocking his own RCB teammate Harshal Patel for Mankad / Mankading. R Ashwin gonna get good sleep today. pic.twitter.com/Qnvnv1WaGZ — Chintan (@ChinTTan221b) April 10, 2023 నిబంధనల ప్రకారం బౌలర్ బౌలింగ్ చేసే ఉద్దేశం లేకపోయినా, క్రీజ్ దాటి బయటకు వెళ్లినా మన్కడింగ్ చేయడానికి వీలు లేదు. మన్కడింగ్ రూల్ ప్రకారం బౌలర్ బంతి సంధించే ఉద్దేశం కలిగి, క్రీజ్ దాటకుండా ఉంటేనే రనౌట్ చేసేందుకు అవకాశం ఉంటుంది. మొత్తానికి హర్షల్ చివరి బంతికి మన్కడింగ్ చేయలేకపోవడంతో బిష్ణోయ్ బ్రతికిపోయాడు. ఆతర్వాత ఆఖరి బంతికి బై రూపంలో పరుగు రావడంతో లక్నో వికెట్ తేడాతో విజయం సాధించింది. -
ధావన్‌కు అశ్విన్ వార్నింగ్.. వీడియో వైరల్
ఐపీఎల్ 16వ సీజన్లో భాగంగా పంజాబ్ కింగ్స్, రాజస్తాన్ మ్యాచ్‌లో ఒక ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. పంజాబ్ కెప్టెన్ శిఖర్ ధావన్‌ను రాజస్తాన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ హెచ్చరించాడు. ఇన్నింగ్స్ ఏడో ఓవర్లో నాలుగో బంతిని విడవడానికి ముందే ధావన్ క్రీజు దాటాడు. ఇది గమనించిన అశ్విన్ బంతిని వేయడం ఆపేసి మన్కడింగ్ చేయడానికి ప్రయత్నించాడు. Photo: Jio Cinema Twitter కానీ బంతిని బెయిల్స్‌కు తగిలించకుండా ధావన్‌కు వార్నింగ్‌తోనే సరిపెట్టాడు. ఆ సమయంలో ధావన్ పూర్తిగా క్రీజు బయట ఉన్నాడు. కానీ అశ్విన్ క్రీడాస్పూర్తిని ప్రదర్శించాడు. అయితే వెంటనే వెనక్కి వచ్చిన ధావన్ అశ్విన్‌ను చూస్తూ చేసేయాల్సింది అన్న తరహాలో చిన్న స్మైల్ ఇచ్చాడు. ఇదే సమయంలో కెమెరా జాస్ బట్లర్‌వైపు తిరగడం ఆసక్తి కలిగించింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కెమెరా బట్లర్‌వైపు ఎందుకు తిరిగిందో కూడా మీకు అందరికి తెలిసే ఉంటుంది. ఇదే ఐపీఎల్లో అశ్విన్ పంజాబ్‌కు ఆడుతున్న సమయంలో బట్లర్‌ను మన్కడింగ్ చేసి పెవిలియన్ చేర్చాడు. ఒకరకంగా అశ్విన్ మన్కడింగ్‌ను మరోసారి తెరపైకి తెచ్చిన క్రికెటర్‌గా నిలిచాడు. అయితే అశ్విన్ చర్యను కొందరు తప్పుబడితే మరికొందరు సమర్థించారు. కొన్నాళ్ల పాటు మన్కడింగ్‌పై చర్చ జరిగింది. అయితే ఇటీవలే మన్కడింగ్‌ను రనౌట్‌గా మారుస్తూ ఐసీసీ చట్టబద్దం చేసింది. Ash warning Gabbar and Jos going "I've seen this movie before" in his head - it's all happening at Barsapara 😅 Stream #RRvPBKS LIVE & FREE NOW with #IPLonJioCinema - across all telecom operators 📲#TATAIPL #IPL2023 | @ashwinravi99 @josbuttler pic.twitter.com/M5dChwgARd — JioCinema (@JioCinema) April 5, 2023 చదవండి: ధావన్ దెబ్బకు రాజపక్స రిటైర్డ్‌హర్ట్.. ఐపీఎల్‌కు దూరమయ్యే చాన్స్! -
పాతది గుర్తొచ్చిందేమో.. చేయాలనుకొని చేయలేకపోయాడు
మన్కడింగ్ పేరు చెప్పగానే మొదటగా గుర్తుకువచ్చే పేరు రవిచంద్రన్ అశ్విన్. ఐపీఎల్లో జాస్ బట్లర్‌ను మన్కడింగ్ చేయడం ద్వారా అశ్విన్ పేరు మారుమోగిపోయింది. ఇప్పుడంటే మన్కడింగ్‌ను రనౌట్‌గా చట్టబద్దం చేశారు కానీ.. అప్పట్లో అశ్విన్ చర్యపై రెండుగా చీలిపోయారు. క్రీడాస్పూర్తిని దెబ్బతీశాడంటూ కొందరు పేర్కొంటే.. అశ్విన్ చేసింది న్యాయమేనని మరికొందరు తెలిపారు. ఆ తర్వాత కూడా దీనిపై పెద్ద చర్చే నడిచింది. కాగా గతేడాది మన్కడింగ్(నాన్‌స్ట్రైక్ ఎండ్‌లో బంతి విడువక ముందే బ్యాటర్ క్రీజు వదిలితే రనౌట్ చేయడం)ను ఐసీసీ రనౌట్‌గా మారుస్తూ నిబంధనను సవరించింది. ఏది ఏమైనా ఒక రకంగా అశ్విన్ మన్కడింగ్‌కు మూల కారకుడు అని అభిమానులు పేర్కొంటునే ఉన్నారు. తాజాగా ఐపీఎల్ 16వ సీజన్లో అశ్విన్ మరోసారి మన్కడింగ్ చేయబోయాడు. ఎస్ఆర్హెచ్ ఇన్నింగ్స్ 12వ ఓవర్లు ఇది చోటుచేసుకుంది. ఓవర్లో తొలి బంతి వేయడానికి ముందే నాన్‌స్ట్రైక్ ఎండ్‌లో ఉన్న ఆదిల్ రషీద్ క్రీజు దాటాడు. ఇది గమనించిన అశ్విన్ బంతిని విడవకుండా బెయిల్స్ వైపు బంతిని ఉంచాడు. అయితే తన తొలి మన్కడింగ్ గుర్తొచ్చిందేమో అవకాశాన్ని విరమించుకున్నాడు. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. Just a normal day for Ashwin 😂#IPL23 #IPL2023 #ravichandranashwin @ashwinravi99 pic.twitter.com/4B7rwjhPD3— Tharaka Jayathilaka (@TharakaOfficial) April 2, 2023 చదవండి: -
చేసిందే తప్పు.. వేలు చూపిస్తూ అసభ్య ప్రవర్తన
క్రికెట్లో మన్కడింగ్‌ను రనౌట్‌గా మారుస్తూ గతేడాది అక్టోబర్‌లోనే ఐసీసీ చట్టం తెచ్చింది. అప్పటినుంచి మన్కడింగ్‌ను రనౌట్‌గా పరిగణిస్తున్నారు. ఇక మన్కడింగ్ అంటే బౌలర్ బంతిని విడవకముందే నాన్‌స్ట్రైక్ ఎండ్‌లో ఉన్న బ్యాటర్ క్రీజు దాటితే ఔట్ చేసే అవకాశం ఉంటుంది. ఒకప్పుడు ఇది క్రీడాస్పూర్తికి విరుద్ధంగా పరిగణించినా ఇప్పుడు మాత్రం రనౌట్‌గా చూస్తున్నారు. అయితే ఒక తస్మానియా క్రికెటర్ మాత్రం తాను ఔట్ అని తెలిసినా కొంచెం కూడా సహనం లేకుండా క్రీడాస్పూర్తికి విరుద్ధంగా ప్రవర్తించి అపఖ్యాతిని మూటగట్టుకున్నాడు. విషయంలోకి వెళితే.. ఎస్సీఏ(SCA Cricket)లీగ్‌లో క్లార్మౌంట్, న్యూ నొర్ఫోక్ల మధ్య ఫైనల్ మ్యాచ్ జరిగింది. మ్యాచ్ సమయంలో బౌలర్ బంతిని విడవకముందే నాన్‌స్ట్రైక్ ఎండ్‌లో ఉన్న బ్యాటర్ క్రీజు దాటి ముందుకు వచ్చాడు. ఇది గమనించిన బౌలర్ బెయిల్స్‌ను ఎగురగొట్టి మన్కడింగ్ చేశాడు. రనౌట్ కింద పరిగణించిన అంపైర్ ఔట్ ఇచ్చాడు. దీంతో కోపంతో పెవిలియన్ బాట పట్టిన బ్యాటర్ చేతిలోని బ్యాట్‌ను, హెల్మెట్‌ను గాల్లోకి ఎగిరేసి.. చేతికున్న గ్లోవ్స్‌ను కాలితో తన్నాడు. ఆ తర్వాత వేలిని చూపిస్తూ అసభ్యకరమైన వ్యాఖ్యలు చేశాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అంతర్జాతీయ క్రికెట్లో ఒక క్రికెటర్ ఆఫ్ ది ఫీల్డ్ ఏం చేసినా పట్టించుకోరు.. కానీ ఆన్‌ఫీల్డ్‌లో ఇలా చేయడం నిబంధనలకు విరుద్ధం. ఈ చర్య అంపైర్ సహా ఆటగాళ్లను షాక్‌కు గురిచేసింది. మ్యాచ్ ముగిసిన తర్వాత సదరు క్రికెటర్‌పై మ్యాచ్ రిఫరీ చర్య తీసుకున్నారు. ఆన్‌ఫీల్డ్ అబ్రస్టకింగ్ చేసినందుకు జరిమానాతో పాటు ఒక మ్యాచ్ నిషేధం విధించినట్లు తెలిసింది. A Tasmanian cricketer was NOT happy after getting out via a Mankad and launched his bat, helmet and gloves into the air! 🤬🤯 pic.twitter.com/y64z4kwpE3 — Fox Cricket (@FoxCricket) March 28, 2023 చదవండి: బీసీసీఐ దెబ్బకు మాట మార్చిన ఐసీసీ -
నేను అస్సలు ‘మన్కడింగ్’ చేయను.. ఎందుకంటే: అర్జున్ టెండుల్కర్
Arjun Tendulkar- Mankading: టీమిండియా దిగ్గజం సచిన్ టెండుల్కర్ తనయుడు, గోవా ఆల్‌రౌండర్ అర్జున్ టెండుల్కర్ ‘మన్కడింగ్’ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. మన్కడింగ్ తప్పు కాదని, అయితే తను మాత్రం ఈ విధంగా రనౌట్‌లో భాగమై సమయం వృథా చేసుకోనన్నాడు. రంజీ టోర్నీలో గోవాకు ప్రాతినిథ్యం వహిస్తున్న అర్జున్.. సర్వీసెస్‌తో మ్యాచ్‌లో మొదటి రోజు ఆటలో రెండు వికెట్లు తీశాడు. ఈ క్రమంలో మంగళవారం క్రిక్‌నెక్ట్స్ తో మాట్లాడిన అర్జున్ టెండుల్కర్ మన్కడింగ్ విషయంలో తన అభిప్రాయం పంచుకున్నాడు. ‘‘మన్కడింగ్‌ను నేను పూర్తిగా సమర్థిస్తా. నిబంధనల ప్రకారం అది సరైందే. ఇలా రనౌట్ చేయడం క్రీడాస్ఫూర్తికి విర్ధుమంటే నేను ఒప్పుకోను. టైమ్, ఎనర్జీ వేస్ట్ చేసుకోను అయితే, నేను మాత్రం నాన్ స్ట్రైకర్‌ను మన్కడింగ్ చేసి సమయం వృథా చేసుకోను. బెయిల్స్‌ను పడగొట్టడానికి నేను నా వేగాన్ని తగ్గించుకోలేను. మన్కడింగ్ చేయాలంటే చాలా వరకు ఎనర్జీ, ఎఫర్ట్ పెట్టాల్సి ఉంటుంది. నేను అలా నా శక్తి, టైమ్ వేస్ట్ చేయను. అయితే, ఎవరైనా మన్కడింగ్ చేస్తే దానిని మాత్రం సమర్థిస్తా’’ అని చెప్పుకొచ్చాడు. కాగా, బౌలర్ బంతి విసరకముందే నాన్- స్ట్రైకర్ క్రీజును వీడితే రనౌట్ చేయడం నిబంధనల ప్రకారం సరైందేనన్న సంగతి తెలిసిందే. సచిన్ సైతం ఇక మన్కడింగ్ రవిచంద్రన్ అశ్విన్ వంటి బౌలర్ల విషయంలో విమర్శలు వచ్చిన తరుణంలో సచిన్ వారికి అండగా నిలబడ్డాడు. కాగా 23 ఏళ్ల అర్జున్ బౌలింగ్ ఆల్‌రౌండర్. ఎడమచేతి వాటం గల ఈ బ్యాటర్.. లెఫ్టార్మ్ ఫాస్ట్ మీడియం పేసర్. తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకునే క్రమంలో.. మేటి క్రికెటర్‌గా ఎదగాలనే ఆశయం అడుగులు వేస్తున్నాడు. ఇదిలా ఉంటే.. ఇటీవల శ్రీలంకతో తొలి వన్డే సందర్భంగా మహ్మద్ షమీ దసున్ షనకు మన్కడింగ్ చేయగా.. కెప్టెన్ రోహిత్ శర్మ ఆ రనౌట్ అప్పీలు వెనక్కి తీసుకున్నాడు. ఈ నేపథ్యంలో అర్జున్ టెండుల్కర్ ఈ మేరకు వ్యాఖ్యలు చేయడం గమనార్హం. చదవండి: ఆటో డ్రైవర్ కొడుకు నుంచి టీమిండియా కీలక పేసర్‌గా! ఆ ఒక్క లోటు తప్ప! కెప్టెన్ మాటలు వింటే.. Virat Kohli: ఓర్వలేనితనం అంటే ఇదే.. -
కొంచెం చూడరా బాబు.. బంతి వేయకముందే పిచ్ మధ్యలోకి! వీడియో వైరల్
ప్రస్తుతం ప్రపంచ క్రికెట్లో తరుచూ ఏదో ఒక మ్యాచ్‌లో మన్కడింగ్( నాన్-స్ట్రైకర్స్ రనౌట్)ను మనం చూస్తునే ఉన్నాం. కొన్ని వివాదాస్పదంగా మారిన సందర్భాలు ఉన్నాయి. తాజాగా ఇటువంటి సంఘటనే ఒకటి యూరోపియన్ క్రికెట్ లీగ్‌లో చోటు చేసుకుంది. బౌలర్ బంతి వేయకముందే నాన్ స్ట్రైకర్ దాదాపు మిడిల్ పిచ్ వరకు వెళ్లిపోయాడు. రౌనౌట్ చేసే అవకాశం ఉన్నప్పటికీ.. బౌలర్ మాత్రం కేవలం వార్నింగ్‌తోనే సరిపెట్టాడు. అయితే పిచ్ మధ్య వరకు వెళ్లిన బ్యాటర్ మళ్లీ వెనుక్కి వచ్చే ప్రయత్నం చేయకపోవడం గమానార్హం. ఈ సంఘటన సైప్రస్ మౌఫ్లన్స్- పంజాబ్ లయన్స్ మ్యాచ్ సందర్భంగా జరిగింది. అయితే ఈ వీడియో మాత్రం సోషల్ మీడియాలో నవ్వులు పూయిస్తోంది. నెటిజన్లు ఈ వీడియోపై ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు. "కొంచెం బంతిని చూసి వెళ్ల వచ్చుకదా" అంటూ ఓ యూజర్ కామెంట్ చేశాడు. ఇక తాజాగా బిగ్‌బాష్ లీగ్‌లో కూడా ఆడమ్ జంపా చేసిన మన్కడింగ్ తీవ్ర చర్చనీయాంశం అయింది. Incredible backing up🤯 #EuropeanCricket #EuropeanCricketLeague #ThrowbackECL22 pic.twitter.com/lZZroI2X3V — European Cricket (@EuropeanCricket) January 6, 2023 చదవండి: Rishabh Pant: రిషభ్ పంత్ మోకాలి సర్జరీ సక్సెస్.. కానీ! -
జంపా మన్కడింగ్.. క్రీజు దాటినా నాటౌట్ ఇచ్చిన అంపైర్! ఎందుకో తెలుసా?
బిగ్‌బాష్ లీగ్-2022లో మంగళవారం మెల్బోర్న్ స్టార్స్- మెల్బోర్న్ రెనిగేడ్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో ఓ ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. రెనిగేడ్స్ ఇన్నింగ్స్ ఆఖరి ఓవర్ వేయడానికి వచ్చిన మెల్బోర్న్ స్టార్స్ కెప్టెన్ ఆడమ్ జంపా నాన్-స్ట్రైకర్ టామ్ రోజర్స్‌ను రనౌట్(మన్కడింగ్) చేయడానికి ప్రయత్నించాడు. జంపా బంతి వేయకముందే రోజర్స్ క్రీజును వదిలి బయటకు వెళ్లగా.. అది గమనించిన అతడు వెంటనే వికెట్లను గిరాటేశాడు. దీంతో రనౌట్‌కు అప్పీల్ చేయగా, ఫీల్డ్ అంపైర్ థర్డ్ అంపైర్‌కు రిఫర్ చేశాడు. కాగా పలు మార్లు రిప్లేలో చూసిన థర్డ్ అంపైర్ నాటౌట్‌గా ప్రకటించాడు. కాగా కొత్త రూల్స్ ప్రకారం మన్కడింగ్‌ను సాధారణ రనౌట్‌గానే పరిగిణిస్తారు. ఈ క్రమంలో థర్డ్ అంపైర్ మాత్రం ఎందుకు నాటౌట్‌గా ప్రకటించాడన్నది ప్రేక్షకులకు ఆర్ధం కాలేదు. థర్డ్ అంపైర్ ఎందుకు నాటౌట్ ఇచ్చాడంటే? మెరిల్‌బోన్ క్రికెట్ నిబంధనల ప్రకారం.. బౌలర్ నాన్ స్ట్రైకర్ బ్యాటర్ ను రనౌట్ చేయాలనుకుంటే యాక్షన్‌ను పూర్తి చేయకముందే ఔట్ చేయాలి. అంటే చేతిని పూర్తిగా తిప్పకముందే వికెట్లను గిరాటు వేయాలి. కానీ జంపా మాత్రం తన బౌలింగ్ యాక్షన్‌ను పూర్తి చేసి స్టంప్స్‌ను పడగొట్టాడు. దీంతో థర్డ్ అంపైర్ నాటౌట్‌గా ప్రకటించాడు. ఇక ఈ మ్యాచ్‌లో మెల్బోర్న్ స్టార్స్‌పై రెనెగేడ్స్ 33 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. Spicy, spicy scenes at the MCG. Not out is the call...debate away, friends! #BBL12 pic.twitter.com/N6FAjNwDO7 — KFC Big Bash League (@BBL) January 3, 2023 చదవండి: IND vs SL: దీపక్ హుడా, అక్షర్ సూపర్ ఇన్నింగ్స్.. శ్రీలంక టార్గెట్ 163 పరుగులు -
తొందరెందుకు? క్రీజులో ఉండు డ్యూడ్..! అబ్బో చెప్పావులే!
Australia vs South Africa, 2nd Test: ఆస్ట్రేలియా- దక్షిణాఫ్రికా జట్ల మధ్య రెండో టెస్టు సందర్భంగా ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. తాను బాల్ వేసేకంటే ముందే క్రీజు దాటేందుకు ప్రయత్నించిన ప్రొటిస్ బ్యాటర్‌కు గట్టిగా వార్నింగ్ ఇచ్చాడు ఆసీస్ బౌలర్ మిచెల్ స్టార్క్. రనౌట్(మన్కడింగ్) ప్రమాదాన్ని గుర్తు చేస్తూ క్రీజులో ఉండాలి కదా అంటూ హితవు పలికాడు. సౌతాఫ్రికా రెండో ఇన్నింగ్స్‌లో 19వ ఓవర్లో స్టార్క్ బౌలింగ్ చేస్తున్న సమయంలో తెంబా బవుమా క్రీజులో ఉన్నాడు. మూడో బంతి సంధించిన తర్వాత మరో డెలివరీకి సిద్ధమవుతున్న స్టార్క్.. నాన్‌స్ట్రైక్ ఎండ్‌లో ఉన్న వన్‌డౌన్ బ్యాటర్ థీనిస్ డి బ్రూయిన్ క్రీజు వీడటాన్ని గమనించాడు. క్రీజులో ఉండు వెంటనే వెనక్కి వచ్చి అతడిని హెచ్చరించాడు. ‘‘క్రీజులో ఉండు. రూల్స్ ఉన్నది ఎందుకు? క్రీజులోనే ఉండు డ్యూడ్’’ అని అన్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కాగా ఓవర్లో బవుమా ఒక్క పరుగు కూడా తీయలేకపోయాడు. దీంతో పరుగు తీద్దామన్న ఆసక్తితో ఉన్న బ్రూయిన్ నాన్‌స్ట్రైక్ ఎండ్‌లోనే ఉండిపోవాల్సి వచ్చింది. ఇక వీడియోపై స్పందించిన నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు. కాగా ఈ ఏడాది అక్టోబరులో టీమిండియా బౌలర్ దీప్తి శర్మను ఉద్దేశించి స్టార్క్ విమర్శలు సంధించిన విషయం తెలిసిందే. ఇంగ్లండ్ మహిళా బ్యాటర్ చార్లీ డీన్ రనౌట్(మన్కడింగ్) చేయడంపై ఎంత చర్చ జరిగిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మన్కడింగ్ చేయడాన్ని రనౌట్‌గా పరిగణిస్తూ నిబంధనలు వచ్చినా.. దీప్తిని చాలా మంది తప్పుబట్టారు. అపుడు దీప్తి శర్మను ఉద్దేశించి.. ఈ నేపథ్యంలో స్టార్క్ అత్యుత్సాహం ప్రదర్శించాడు. ఇంగ్లండ్‌తో మ్యాచ్ సందర్భంగా నాన్ స్ట్రైకర్ జోస్ బట్లర్‌ను రనౌట్ చేసే అవకాశం ఉన్నా వదిలేశాడు. అంతేగాక నేనేమీ దీప్తిని కాదంటూ వ్యాఖ్యానించి టీమిండియా అభిమానుల ఆగ్రహానికి గురయ్యాడు. ఇక తాజాగా మరోసారి బ్యాటర్‌ను అవుట్ చేసే అవకాశం ఉన్నా వదిలేశాడు. దీంతో కొంతమంది అతడి చర్యను సమర్థిస్తున్నారు. మరికొందరు మాత్రం రూల్స్ పాటించడంలో తప్పు లేదని, స్టార్క్.. నిబంధనలను తనకు అనుకూలంగా మార్చుకోనంత మాత్రాన ఇతరులను విమర్శించే హక్కు మాత్రం లేదంటూ వ్యాఖ్యానిస్తున్నారు. దీప్తి శర్మ విషయంలో అతడి వ్యాఖ్యలు ప్రస్తావిస్తూ ట్రోల్ చేస్తున్నారు. ఇక మ్యాచ్ విషయానికొస్తే.. ఇన్నింగ్స్ మీద 182 పరుగుల భారీ తేడాతో ఆతిథ్య ఆస్ట్రేలియా చేతిలో సౌతాఫ్రికా ఓటమి పాలైంది. బాక్సింగ్ డే టెస్టు నాలుగు రోజుల్లోనే ముగిసిపోయింది. చదవండి: Suryakumar Yadav: మొన్న 90.. నిన్న 95.. చెలరేగుతున్న సూర్య! టెస్టుల్లో ఎంట్రీ ఖాయం! IPL: జట్టును నాశనం చేయకండి.. చేతనైతే: సన్‌రైజర్స్‌పై మాజీ ప్లేయర్ ఘాటు వ్యాఖ్యలు Aus Vs SA 2nd Test: ఎదురులేని ఆసీస్.. దక్షిణాఫ్రికా చిత్తు! డబ్ల్యూటీసీ ఫైనల్ రేసులో ఇక.. Wow! Starc reminding de Bruyn to stay grounded! 🍿#AUSvSA pic.twitter.com/2y4U9t7glv — cricket.com.au (@cricketcomau) December 28, 2022 -
అశ్విన్.. మిల్లర్‌ను వదిలేసి తప్పుచేశావ్
మన్కడింగ్(నాన్‌స్ట్రైకింగ్ ఎండ్ రనౌట్) అనగానే మొదటగా గుర్తుకువచ్చేది రవిచంద్రన్ అశ్విన్. ఐపీఎల్లో జాస్ బట్లర్‌ను మన్కడింగ్ చేయడం ద్వారా అశ్విన్ పెద్ద వివాదానికే తెర లేపాడు. ఆ తర్వాత మన్కడింగ్‌ను చట్టబద్ధం చేస్తూ రూల్ తీసుకురావడంతో అశ్విన్ చర్యను సమర్థించారు. తాజాగా టి20 ప్రపంచకప్‌లో భాగంగా ఆదివారం సౌతాఫ్రికాతో మ్యాచ్‌లో టీమిండియా స్పిన్నర్ అశ్విన్‌కు మరోసారి మన్కడింగ్ చేసే అవకాశం వచ్చింది. అది కూడా ప్రొటిస్ విజయంలో కీలకపాత్ర పోషించిన డేవిడ్ మిల్లర్‌ది. అయితే ఈసారి రనౌట్ చేయకుండా కేవలం హెచ్చరికతోనే వదిలిపెట్టాడు. ఇన్నింగ్స్ 18వ ఓవర్లో ఇది చోటుచేసుకుంది. ఆ ఓవర్లో అశ్విన్ చివరి బంతిని వేయడానికి ముందే నాన్‌స్ట్రైక్ ఎండ్‌లో ఉన్న మిల్లర్ క్రీజు బయట ఉన్నాడు. ఇది గమినించిన అశ్విన్ బంతి వేయడం ఆపేసి మిల్లర్‌కు..''యూ ఆర్ ఔట్ ఆఫ్ క్రీజ్'' అంటూ వార్నింగ్ ఇచ్చాడు. అయితే రూల్స్ ప్రకారం మిల్లర్‌ను రనౌట్ చేసే అవకాశం వచ్చినా అశ్విన్ వదిలేశాడు. ఇది క్రీడాస్పూర్తిగా పరిగణించినప్పటికి అశ్విన్ చర్యపై మాత్రం టీమిండియా క్రికెట్ ఫ్యాన్స్ సంతోషంగా లేరు. ఎందుకంటే అప్పటికే మిల్లర్ తన జట్టును విజయంవైపు నడిపిస్తున్నాడు. కిల్లర్ మిల్లర్‌గా గుర్తింపు పొందిన అతను ఉంటే మ్యాచ్ కచ్చితంగా గెలిపిస్తాడు. ఈ నేపథ్యంలోనే మిల్లర్‌ను రనౌట్ చేయాల్సింది అని అభిమానులు పేర్కొన్నారు. ఇది కూడా వాస్తవమే. ఎందుకంటే ఆ తర్వాత మిల్లర్ మూడు ఫోర్లు కొట్టి సౌతాఫ్రికాను విజయతీరాలకు చేర్చాడు. ఒకవేళ అశ్విన్ మిల్లర్‌ను మన్కడింగ్ చేసి ఉంటే ఫలితం కచ్చితంగా వేరుగా ఉండేది. అందుకే ఫ్యాన్స్..'' ఛ.. అశ్విన్ మిల్లర్‌ను వదిలేసి పెద్ద తప్పు చేశావ్'' అంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున కామెంట్స్ చేశారు. View this post on Instagram A post shared by ICC (@icc) చదవండి: రోహిత్ మరీ ఇంత బద్దకమా.. -
'నేనేమి దీప్తిని కాదు.. అలా చేయడానికి'
టీమిండియా బౌలర్ దీప్తి శర్మ ఇంగ్లండ్ మహిళా బ్యాటర్ చార్లీ డీన్‌ను మన్కడింగ్(రనౌట్) చేయడంపై ఎంత రచ్చ జరిగిందో అందరికి తెలిసిందే. బంతి విడవకముందే చార్లీ క్రీజు దాటడంతో దీప్తి నాన్‌స్ట్రైక్ ఎండ్‌లో బెయిల్స్‌ను ఎగురగొట్టింది. మన్కడింగ్ చట్టబద్ధం కావడంతో అంపైర్ చార్లీ డీన్‌ను ఔట్‌గా ప్రకటించారు. కాగా దీప్తి చర్యపై క్రికెట్ ప్రేమికులు రెండుగా చీలిపోయారు. దీప్తి శర్మ చేసిందని క్రీడాస్పూర్తికి విరుద్ధమని కొందరు పేర్కొంటే.. నిబంధనల ప్రకారమే దీప్తి నడుచుకుందంటూ మరికొంత మంది పేర్కొన్నారు. ఏది ఏమైనా దీప్తి చర్యపై ఇంగ్లండ్ క్రికెటర్లు మాత్రం సమయం దొరికినప్పుడల్లా తప్పుబడుతూనే ఉన్నారు. తాజాగా ఇంగ్లండ్ ఆటగాళ్లకు మద్దతుగా నిలుస్తూ ఆస్ట్రేలియా పేసర్ మిచెల్ స్టార్క్ దీప్తి శర్మ చర్యను పరోక్షంగా తప్పుబట్టాడు. విషయంలోకి వెళితే.. ఇంగ్లండ్, ఆస్ట్రేలియా మధ్య శుక్రవారం మూడో టి20 మ్యాచ్ జరిగింది. ఇంగ్లండ్ ఇన్నింగ్స్ సమయంలో ఐదో ఓవర్లో స్టార్క్ బంతి వేయడానికి ముందే నాన్‌స్ట్రైక్ ఎండ్‌లో ఉన్న బట్లర్ క్రీజు దాటాడు. కానీ మిచెల్ స్టార్క్ మాత్రం రనౌట్ చేయకుండా బట్లర్‌ను హెచ్చరికతో వదిలిపెట్టాడు. ఆ తర్వాత రనప్‌కు వెళ్తూ.. ''నేనేమి దీప్తిని కాదు.. మన్కడింగ్ చేయడానికి.. కానీ ఇది రిపీట్ చేయకు బట్లర్'' అంటూ పేర్కొన్నాడు. అంపైర్‌తో పాటు బట్లర్ కూడా నవ్వుల్లో మునిగిపోయారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక క్రికెట్ చరిత్రలో అశ్విన్ బట్లర్‌ను మన్కడింగ్ చేయడం అంత తొందరగా ఎవరు మరిచిపోలేరు. అంతేకాదు రెండుసార్లు మన్కడింగ్ అయిన ఆటగాడిగా బట్లర్ నిలవడం గమనార్హం. టి20 ప్రపంచకప్‌కు ముందు ఆస్ట్రేలియాను సొంతగడ్డపై క్లీన్‌స్వీప్ చేయాలని భావించిన ఇంగ్లండ్ ఆశలపై వరుణుడు నీళ్లు చల్లాడు. మూడో టి20కి వర్షం అంతరాయం కలిగించడంతో మ్యాచ్ రద్దైంది. వర్షం అంతరాయంతో మ్యాచ్‌ను 12 ఓవర్లకు కుదించగా.. తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ 12 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి 112 పరుగులు చేసింది. కెప్టెన్ జాస్ బట్లర్ 41 బంతుల్లో 65 పరుగులు నాటౌట్ రాణించాడు. 113 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆసీస్ ఆట నిలిచిపోయే సమయానికి 3 వికెట్ల నష్టానికి 30 పరుగులు చేసింది. ఆ తర్వాత వర్షం ఎంతకీ తెరిపినివ్వకపోవడంతో మ్యాచ్‌ను రద్దు చేస్తున్నట్లు అంపైర్లు ప్రకటించారు. SOUND 🔛 What do you think about this event between Mitchell Starc and @josbuttler? 🤔#JosButtler #MitchellStarc #AUSvENG #SonySportsNetwork pic.twitter.com/rA3D5yxwFP — Sony Sports Network (@SonySportsNetwk) October 14, 2022 చదవండి: భారత్, పాక్ మ్యాచ్‌కు వర్షం ముప్పు.. వారం ముందే ఎలా చెప్తారు! -
'తప్పును భూతద్ధంలో పెట్టి చూస్తున్నారు'.. దిమ్మతిరిగే కౌంటర్
టీమిండియా మహిళా క్రికెటర్ దీప్తి శర్మ ఇటీవల లార్డ్స్ వేదికగా ముగిసిన మూడో వన్డేలో ప్రత్యర్థి జట్టు బ్యాటర్ చార్లీ డీన్ ను రనౌట్ (మన్కడింగ్)చేసిన విషయం తెలిసిందే. మన్కడింగ్ చట్టబద్ధం చేసినప్పటికి.. ఇంగ్లీష్ మీడియా సహా అక్కడి క్రికెటర్లు మాత్రం దీప్తి శర్మ ఏదో పెద్ద నేరం చేసినట్లుగా చెప్పుకుంటున్నారు. క్రికెట్ చట్టాల్లో ఈ నిబంధన ఉన్నా ఇలా ఔట్ చేయడం క్రీడా స్ఫూర్తికి విరుద్ధమంటూ తమ వెర్రితనాన్ని ప్రదర్శిస్తున్నారు. ఈ నేపథ్యంలో భారత మాజీ క్రికెటర్ వసీం జాఫర్ ఒక్క ట్వీట్‌తో ఇంగ్లీష్ మీడియా, క్రికెటర్లు,విశ్లేషకులు,విమర్శకుల నోళ్లు మూయించాడు. తాజాగా షేర్ చేసిన వీడియోలో ఇటాలియన్ సైక్లిస్టు మైఖేల్ గరియాకు సంబంధించిన ఓ వీడియో ఉంటుంది. ఆ వీడియోలో ఇటాలియన్ సైక్లిస్టు మైఖేల్ గరియా..తన ముందున్న వారిని దాటేయడానికి గాను సైకిల్‌ను వేగంగా తొక్కి తర్వాత తన బాడీని సీట్ మీద ఫ్లాంక్ పొజిషన్ లో ఉంచుతాడు.దీంతో సైకిల్.. తన ముందున్న సైకిళ్లను దాటేసుకుంటూ ముందుకు వెళ్తుంది. ఈ వీడియోను జాఫర్ రీట్వీట్ చేస్తూ.. ''ఇది (గరియా చేసిన పని) వాస్తవానికి చట్టబద్దమైనదే కావచ్చు. నిబంధనల్లో ఉండొచ్చు. కానీ ఇది సైక్లింగ్ స్ఫూర్తికి విరుద్ధం.. అని ఇ ఓ ఇంగ్లీష్ సైక్లిస్టు చెప్పాడు.తప్పును భూతద్ధంలో పెట్టి చూస్తున్నారు'' అని రాసుకొచ్చాడు. పేరు చెప్పకపోయినా జాఫర్ ట్వీట్ ద్వారా ఇంగ్లీష్ మీడియా,క్రికెటర్ల వ్యాఖ్యలకు కౌంటరిచ్చినట్టేనని స్పష్టమవుతున్నది. Italian cyclist Michael Guerra uses his knowledge of physics and aerodynamics to adopt a “plank” position and overtake his competitors. pic.twitter.com/EsRt16l2PT — Ian Fraser (@Ian_Fraser) September 27, 2022 Deepti Sharma nailed id today on field 😄 what she did it was heart breaking feeling for England . Superb #DeeptiSharma . Gore ko unki line se bahar jaane ki saja 😄🤣#ENGvsIND #womenscricket #JhulanGoswami #ODI pic.twitter.com/NKnoHhfRQD — Vishoka M🇮🇳 (@Vishokha) September 24, 2022 చదవండి: ధోని కొత్త అవతారం.. వీడియో వైరల్ -
ఇన్నింగ్స్ చివర్లో హైడ్రామా.. 'మరో అశ్విన్'లా కనబడింది
ఇంగ్లండ్‌తో జరిగిన మూడో వన్డే మ్యాచ్‌ను టీమిండియా 16 పరుగుల తేడాతో గెలిచిన సంగతి తెలిసిందే. లార్డ్స్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో టీమిండియా గెలిచి మూడు వన్డేల సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేయడమే గాక చివరి మ్యాచ్ ఆడిన ఝులన్ గోస్వామికి విజయాన్ని కానుకగా అందించింది. అయితే ఇంగ్లండ్ ఇన్నింగ్స్ చివర్లో హైడ్రామా నెలకొంది. ఇంగ్లండ్ చివరి వికెట్ వివాదాస్పదమైంది. దీప్తి శర్మ బంతి వేయకముందే నాన్ స్ట్రయికర్ ఎండ్‌లో ఇంగ్లండ్ బ్యాటర్ చార్లీ డీన్ (47; 5 ఫోర్లు) క్రీజు దాటి ముందుకు వెళ్లింది. యాక్షన్ పూర్తి చేసిన దీప్తి వెంటనే వికెట్లను గిరాటేసింది. దాంతో చార్లీ డీన్‌ను అంపైర్ రనౌట్‌గా ప్రకటించడంతో భారత విజయం ఖాయమైంది. ఇలా ఔట్ చేయడాన్ని మన్కడింగ్ అంటారని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మన్కడింగ్‌పై క్రికెట్ వర్గాల్లో పెద్ద చర్చే నడిచింది. కానీ ఇటీవలే క్రికెట్లో చట్టాలు చేసే మెరిల్బోర్న్ క్రికెట్ క్లబ్(ఎంసీసీ) మన్కడింగ్‌ను చట్టబద్ధం చేసింది. దీంతో మన్కడింగ్ ఇకపై రనౌట్‌గా పిలవనున్నారు. ఐసీసీ కూడా దీనికి ఆమోదముద్ర వేసింది. కాగా అక్టోబర్ 1 నుంచి క్రికెట్లో మన్కడింగ్(రనౌట్) సహా పలు కొత్త రూల్స్ అమలు కానున్నాయి. ఇక ఐపీఎల్లో రవిచంద్రన్ అశ్విన్.. రాజస్తాన్ రాయల్స్ ఆటగాడు జాస్ బట్లర్‌ను మన్కడింగ్ చేయడం అప్పట్లో వివాదాస్పదమైంది. తాజాగా టీమిండియా నుంచి అశ్విన్ తర్వాత మన్కడింగ్ చేసిన బౌలర్‌గా దీప్తి శర్మ నిలిచింది. దీంతో క్రికెట్ అభిమానులు.. ''ఇవాళ దీప్తి శర్మ మరో అశ్విన్‌లా కనబడింది.. తగ్గేదే లే'' అంటూ కామెంట్ చేశారు. What’s your take on this? A: What Deepti did was spot on! B: Hey mate, where is the spirit of the game? C: Stay within the laws (crease) or get OUT! Comment below!#ENGvIND | #DeeptiSharma | #ThankYouJhulan pic.twitter.com/CjWxr0xkiz — Women’s CricZone (@WomensCricZone) September 24, 2022 చదవండి: జులన్‌కు క్లీన్‌స్వీప్ కానుక -
అక్టోబర్ ఒకటి నుంచి కొత్త రూల్స్.. టి20 ప్రపంచకప్‌లో తొలిసారిగా
క్రికెట్లో అక్టోబర్ ఒకటి నుంచి కొత్త రూల్స్ అమల్లోకి రానున్నాయి. ఆస్ట్రేలియా వేదికగా జరగనున్న టి20 ప్రపంచకప్ లాంటి మేజర్ టోర్నీలో ఈ రూల్స్ తొలిసారి అమలు కానున్నాయి. క్రికెట్లో చట్టాలు చేసే మెరిల్బోర్న్ క్రికెట్ క్లబ్(ఎంసీసీ) గత మార్చిలోనే మన్కడింగ్ సహా పలు అంశాలపై నూతన చట్ట సవరణలు తీసుకొచ్చింది. వీటికి ఐసీసీ కూడా గతంలోనే ఆమోద ముద్ర వేసింది. అయితే అక్టోబర్ 1 నుంచి ఇవి అమల్లోకి వస్తామని ఐసీసీ పేర్కొంది. కాగా మన్కడింగ్ అనే పదం ఇక క్రికెట్లో చట్టబద్ధం అని ఎంసీసీ పేర్కొన్న సంగతి తెలిసిందే. బౌలింగ్ వేసే సమయంలో బంతి బౌలర్ చేతి నుంచి విడుదల కాకముందే నాన్‌స్ట్రయిక్ బ్యాటర్ పరుగు పెడితే బౌలర్ వికెట్లను గిరాటేయడమే మన్కడింగ్. ఐపీఎల్లో బట్లర్‌ను అశ్విన్ ఇలా అవుట్ చేస్తే పాశ్చత్య క్రికెటర్లు అతనిపై ధ్వజమెత్తారు. క్రీడాస్ఫూర్తికి విరుద్ధమని నానాయాగీ చేశారు. క్రికెట్ చట్టాలు చేసే మెరిల్‌బోన్ క్రికెట్ క్లబ్ (ఎంసీసీ) మన్కడింగ్‌ను చట్టబద్ధం చేసింది. ఇది క్రికెట్లో రనౌట్! అంతేతప్ప క్రీడాస్ఫూర్తికి విరుద్ధమయ్యే మన్కడింగ్ కాదని పేర్కొంది. అక్టోబర్ ఒకటి నుంచి అమలు కానున్న రూల్స్ ఇవే.. ఉమ్మిపై నిషేధం ►బంతిని మెరిసేలా చేసేందుకు బౌలర్లు ఉమ్మి రాయడం తెలిసిందే. అయితే ఇటీవల కోవిడ్ వల్ల బంతికి ఉమ్మిరాయ రాదు అని ఓ నిషేధాన్ని విధించారు. తాత్కాలికంగా రెండేళ్ల పాటు ఆ నిషేధం కొనసాగింది. అయితే ఇప్పుడు ఆ నిషేధాన్ని పర్మినెంట్ చేసేశారు. ఉమ్మి బదులుగా ఇటీవల ప్లేయర్లు.. చెమటతో బంతిని మెరిసేలా చేస్తున్నారు. ఆ ఫార్ములా వర్కౌట్ అయినట్లు తెలుస్తోంది. ►క్యాచ్ అవుట్ అయిన బ్యాటర్ సగం పిచ్ దాటినా కూడా కొత్త బ్యాటరే స్ట్రయిక్ చేయాలి. ఓవర్ చివరిబంతికి ఔటైతే తప్ప... సగం పిచ్ దాటిన నెపంతో నాన్ స్ట్రయికర్ బ్యాటింగ్ చేయడానికి వీలులేదు. ►ఫీల్డింగ్ సమయంలో ఎవరైన ఆటగాడు అనైతికంగా ఫీల్డ్‌లో కదిలితే ఇన్నాళ్లు అది డెడ్‌బాల్‌గానే పరిగణించేవారు. బ్యాటర్ భారీషాట్ ఆడినపుడు బ్యాటింగ్ జట్టుకు ఇది ప్రతికూలమయ్యేది. కానీ ఇప్పుడు బ్యాటింగ్ జట్టుకు అనుకూలంగా మార్చారు. ఫీల్డర్ అనుచిత మార్పు చేస్తే ప్రత్యర్థి (బ్యాటింగ్) జట్టు స్కోరుకు ఐదు పెనాల్టీ పరుగులు జతచేస్తారు. A host of important changes to the Playing Conditions that come into effect at the start of next month 👀https://t.co/4KPW2mQE2U — ICC (@ICC) September 20, 2022 చదవండి: T20 World Cup 2022: టి20 ప్రపంచకప్‌కు జట్టును ప్రకటించిన కివీస్ అర్ష్‌దీప్‌పై రోహిత్ ప్రశంసలు.. అందుకే వాళ్లంతా ఇంట్లో కూర్చుని ఉన్నా! -
ఏంటి చాహర్ ఇది..? అశ్విన్‌ను చూసి నేర్చుకున్నావా! వీడియో వైరల్
హరారే వేదికగా జింబాబ్వేతో జరిగిన మూడో వన్డేలో భారత్ 13 పరుగుల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే. అయితే ఈ మ్యాచ్ రెండో ఇన్నింగ్స్ ప్రారంభంకు ముందు ఓ ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా.. అతిథ్య జట్టుకు 290 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. అనంతరం 290 పరుగుల లక్ష్యాన్ని చేధించేందుకు జింబాబ్వే ఓపెనర్లు ఇన్నోసెంట్ కైయా, కైటినో బరిలోకి దిగారు. అయితే భారత పేసర్ దీపక్ చాహర్ తొలి ఓవర్ వేసే క్రమంలో నాన్ స్ట్రైక్‌లో ఉన్న కైయాను మన్కడింగ్(రనౌట్) చేసే ప్రయత్నం చేశాడు. కాగా చాహర్ బెయిల్స్ పడగొట్టే సమయానికి.. కైయా క్రీజు నుంచి దూరంగా ఉన్నాడు. అయితే చాహర్ బెయిల్స్ పడగొట్టినప్పటికీ రనౌట్‌కు మాత్రం అప్పీల్ చేయలేదు. ఒక వేళ చాహర్ అప్పీల్ చేసి వుంటే మాత్రం కచ్చితంగా రనౌట్‌గానే అంపైర్ ప్రకటించే వాడు. కాగా ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ క్రమంలో నెటిజన్లు ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు. చహర్‌ను టీమిండియా వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్‌తో పోలుస్తున్నారు. ఇక ఇదే విషయంపై ఓ నెటిజన్ స్పందిస్తూ.. "ఏంటి చాహర్ ఇది.. అశ్విన్‌ను చూసి నేర్చుకున్నావా..?" అంటూ కామెంట్ చేశాడు. కాగా 2012లో శ్రీలంకపై, 2019 ఐపీఎల్ సీజన్లో జోస్ బట్లర్‌ను ఈ విధంగానే అశ్విన్ ఔట్ చేశాడు. అయితే బట్లర్‌ను మన్కడింగ్ చేసిన అశ్విన్ అప్పట్లో తీవ్ర విమర్శల పాలయ్యాడు. కాగా భారత క్రికెట్ దిగ్గజం వినూ మన్కడ్ పేరు మీద ఉన్న ‘మన్కడింగ్’ ఔట్ ను సాధారణ రనౌట్ గా చేస్తూ ఈ ఏడాది మార్చిలో మెరిల్బోర్న్ క్రికెట్ క్లబ్ (ఎంసీసీ) నిర్ణయం తీసుకుంది. Deepak Chahar didn't Appeal on Mankad 😂 pic.twitter.com/4ihfnljbMl — Keshav Bhardwaj 👀 (@keshxv1999) August 22, 2022 Shades of Ashwin in Deepak Chahar. Kaia was almost Mankad had he appealed. — Gagan Thakur (@gagan_gt) August 22, 2022 చదవండి: Ind Vs Pak- Virat Kohli: పాక్‌తో మ్యాచ్‌లో ఫిఫ్టీ కొడితే ఆ నోళ్లన్నీ మూతపడతాయి! -
అశ్విన్ ఒక సంచలనం; అప్పుడు 'మన్కడింగ్'.. ఇప్పుడు 'రిటైర్డ్ ఔట్'
టీమిండియా స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఏం చేసినా సంచలనమే అవుతుందని మరోసారి నిరూపితమైంది. తాజాగా ఐపీఎల్ 2022లో రాజస్తాన్ రాయల్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న అశ్విన్ లక్నో సూపర్ జెయింట్స్‌తో మ్యాచ్‌లో అనూహ్యంగా రిటైర్డ్ ఔట్ అయ్యాడు. దీంతో ఐపీఎల్ చరిత్రలో రిటైర్డ్ ఔట్ అయిన తొలి బ్యాటర్‌గా అశ్విన్ చరిత్ర సృష్టించాడు. రియాన్ పరాగ్‌కు అవకాశం ఇవ్వడం కోసం అశ్విన్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. రిటైర్డ్ ఔట్.. అంటే అంపైర్ అనుమతి లేకుండానే పెవిలియన్‌కు వెళ్లిపోవచ్చు.. అయితే తిరిగి బ్యాటింగ్ చేసే అవకాశం మాత్రం ఉండదు. ఏదేమైనా అశ్విన్ తాజా నిర్ణయంతో మరోసారి వార్తల్లో నిలిచాడు. Courtesy: IPL Twitter ఇంతకముందు ఐపీఎల్లో మన్కడింగ్ చేసిన తొలి క్రికెటర్‌గానూ అశ్వినే ఉండడం గమనార్హం. ఇక్కడ విచిత్రమేంటంటే.. మన్కడింగ్ చేసిన సమయంలో రాజస్తాన్ రాయల్స్ తన ప్రత్యర్థి జట్టు.. తాజాగా రిటైర్డ్ ఔట్ అయిన సందర్భంలో అదే అశ్విన్.. రాజస్తాన్ రాయల్స్ జట్టు సభ్యుడిగా ఉన్నాడు. ఈ రెండు సందర్బాల్లో యాదృశ్చికంగా కామన్‌గా వినిపించిన పేరు రాజస్తాన్ రాయల్స్. దీంతో అశ్విన్‌కు రాజస్తాన్ రాయల్స్‌తో విడదీయని బంధంగా మారుతుందని అభిమానులు కామెంట్స్ చేశారు. అప్పుడు మన్కడింగ్.. Courtesy: IPL Twitter ఐపీఎల్ 2019 సీజన్లో రవిచంద్రన్ అశ్విన్ పంజాబ్ కింగ్స్‌కు ప్రాతినిధ్యం వహించాడు. రాజస్తాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 43 బంతుల్లో 69 పరుగులతో జోరు చూపిస్తున్న బట్లర్‌ను అశ్విన్ మన్కడింగ్ చేశాడు. అయితే అశ్విన్ మన్కడింగ్ తీరుపై అన్నివైపుల నుంచి తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి. బౌలర్ బంతి వేయకముందే బ్యాట్స్‌మన్ క్రీజు దాటితే సదరు బౌలర్ రనౌట్ చేయడమే మన్కడింగ్ అని పిలుస్తారు. ఎప్పుడు ఎక్కడ ఎవరు మన్కడింగ్ చేసినా అశ్విన్ పేరు మొదట గుర్తుకు వస్తుంది.. అంతలా ఇంపాక్ట్ చూపించాడు మన అశ్విన్. అయితే ఇదే మన్కడింగ్‌ను ఇటీవలే క్రికెట్లో చట్టాలు చేసే మెరిల్బోర్న్ క్రికెట్ క్లబ్(ఎంసీసీ) చట్టబద్ధం చేసింది. ఇకపై మన్కడింగ్ రనౌట్‌గా పిలుస్తారు. చదవండి: Ravichandran Ashwin: అశ్విన్ 'రిటైర్డ్ ఔట్'.. ఐపీఎల్ చరిత్రలో తొలిసారి -
'మన్కడింగ్'పై పోరాటం చేసిన మాజీ క్రికెటర్ రాహుల్ మన్కడ్ కన్నుమూత
Rahul Mankad Passed Away: భారత మాజీ క్రికెటర్, దిగ్గజ ఆటగాడు వినూ మన్కడ్ చిన్న కుమారుడు ముంబై మాజీ ఆల్‌రౌండర్ రాహుల్ మన్కడ్ (66) అలియాస్ జిగ్గా భాయ్ కన్నుమూశారు. గత కొద్దిరోజులుగా గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్న రాహుల్.. బుధవారం (మార్చి 30) లండన్‌లోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. తండ్రి వారసత్వాన్ని పుణికి పుచ్చుకుని క్రికెటర్‌గా ఎదిగిన రాహుల్.. 1972-85 మధ్యకాలంలో ముంబై రంజీ జట్టుకు ప్రాతినిధ్యం వహించారు. జిగ్గా భాయ్.. ముంబై తరఫున 47 మ్యాచ్‌లు ఆడి 5 శతకాలు, 12 అర్ధ శతకాల సాయంతో 2111 పరుగులు, 162 వికెట్లు పడగొట్టాడు. రాహుల్ మన్కడ్ కు భార్య ఇద్దరు పిల్లలున్నారు. రాహుల్ సోదరులు అశోక్ మన్కడ్, అతుల్ మన్కడ్ కూడా క్రికెటర్లుగా రాణించారు. వీరిలో అశోక్ టీమిండియాకు ప్రాతనిధ్యం వహించాడు. రాహుల్ మృతిపై పలవురు మాజీ క్రికెటర్లు, ప్రముఖ జర్నలిస్టు రాజ్‌దీప్ సర్దేశాయ్ ట్విటర్ వేదికగా సంతాపం తెలిపారు. కాగా, రాహుల్.. తన తండ్రి వినూ మన్కడ్ పేరు మీద ఉన్న ‘మన్కడింగ్' (నాన్ స్ట్రైకింగ్ ఎండ్ లో ఉన్న బ్యాటర్ ను బౌలర్ ఔట్ చేయడం) ను నిషేధించాలని జీవితాంతం పోరాడారు. అయితే ఇటీవలే మెరిల్బోర్న్ క్రికెట్ క్లబ్ (ఎంసీసీ) మన్కడింగ్ అనే పదాన్ని నిషేధించి, అలా ఔట్ అయిన విధానాన్ని సాధారణ రనౌట్ గానే పరిగణించాలని నిర్ణయించింది. అయితే ఈ నిబంధన కార్యరూపం దాల్చకుండానే రాహుల్ కన్నుమూయడం బాధాకరం. మన్కడింగ్‌కు సంబంధించి ఎంసీసీ కొత్త రూల్స్ ఈ ఏడాది అక్టోబర్ నుంచి అమల్లోకి రానున్నాయి. చదవండి: షేన్ వార్న్‌కు కడసారి వీడ్కోలు పలికిన దిగ్గజ క్రికెటర్లు -
మన్కడింగ్‌పై నిషేదం.. విండీస్ దిగ్గజ బ్యాటర్ సంచలన వ్యాఖ్యలు
మన్కడింగ్‌ను నిషేధించడంతో పాటు క్యాచ్ అవుట్ అయినప్పుడు కొత్త బ్యాటర్ స్ట్రైకింగ్‌కు రావడం, బంతికి లాలాజలాన్ని పూయడం వంటి పలు క్రికెట్ చట్టాలను మెరిల్బోర్న్ క్రికెట్ క్లబ్ (ఎంసీసీ) ఇటీవలే సవరించిన సంగతి తెలిసిందే. అయితే ఈ చట్టాలపై దిగ్గజ క్రికెటర్ల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సునీల్ గవాస్కర్, సచిన్ టెండూల్కర్, వీరేంద్ర సెహ్వాగ్ వంటి భారత క్రికెట్ దిగ్గజాలు ఎంసీసీ నిబంధనలను స్వాగతించగా, వెస్టిండీస్ బ్యాటింగ్ దిగ్గజం బ్రియాన్ లారా మాత్రం ఎంసీసీ కొత్త నిబంధనలపై విమర్శలు గుప్పించాడు. మన్కడింగ్‌ను నిషేదించడంపై లారా స్పందిస్తూ.. బౌలర్ బంతి విసిరే క్రమంలో నాన్ స్ట్రైకింగ్‌లో ఉన్న బ్యాటర్ పరుగు కోసం క్రీజ్‌ను వదలడం సహజమేనని, అలాంటి తరుణంలో బౌలర్ బెయిల్స్‌ను పడగొట్టి ఔట్‌కు అప్పీల్ చేయడం (ఈ తరహా రనౌట్ అప్పీల్‌ను మన్కడింగ్ అంటారు) క్రీడా స్ఫూర్తికి విరుద్ధమని అభిప్రాయపడ్డాడు. ఎంసీసీ తాజాగా ఇలాంటి అప్పీల్స్‌కు చట్టబద్దత కల్పిస్తూ రనౌట్‌గా పరిగణించడం ఎంత మాత్రం సబబు కాదని మండిపడ్డాడు. లారాకు ముందు న్యూజిలాండ్ ఆల్‌రౌండర్ జిమ్మీ నీషమ్ కూడా ఎంసీసీ నూతన నిబంధనలపై ధ్వజమెత్తాడు. క్యాచ్ అవుట్ అయినప్పుడు కొత్త బ్యాటర్ స్ట్రైకింగ్‌కు రావడం అనే రూల్‌పై నీషమ్ స్పందిస్తూ.. ఎంసీసీ ఈ అనవసర నిబంధన ఎందుకు అమల్లోకి తేవాలనుకుంటుందో అర్థం కావడం లేదని ట్వీట్ చేశాడు. ఇదిలా ఉంటే, మన్కడింగ్‌ను నిషేదిస్తూ ఎంసీసీ తీసుకున్న నిర్ణయంపై భారత క్రికెటర్లు మాత్రం హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే భారత మాజీ క్రికెటర్ వినూ మన్కడ్ పేరుతో ఈ తరహా రనౌట్ పాపులర్ అయిన సంగతి తెలిసిందే. తాజాగా ఎంసీసీ మన్కడ్ పేరుతో చలామణి అవుతున్న మన్కడింగ్ పదాన్ని నిషేధించి, ఆ తరహా ఔట్‌ను సాధారణ రనౌట్‌గా పరిగణించాలని నిర్ణయించింది. చదవండి: కుటుంబ సభ్యులు, సన్నిహితుల నడుమ స్పిన్ మాంత్రికుడికి కడసారి వీడ్కోలు -
‘రెండో ఆలోచన వద్దు.. రనౌట్ చేసేయండి’
‘మన్కడింగ్’ విషయంలో ఎంసీసీ తీసుకొచ్చిన కొత్త నిబంధనపై భారత స్పిన్నర్ అశ్విన్ హర్షం వ్యక్తం చేశాడు. ఇకపై దీనిని రనౌట్ అని ప్రకటిస్తూ, నాన్ స్ట్రైకర్ క్రీజ్ బయట ఉంటే తప్పు అతడిదే తప్ప బౌలర్‌ది కాదని కొత్త నిబంధనల్లో స్పష్టం చేశారు. ‘నా బౌలర్ మిత్రులారా... నాన్‌స్ట్రైకర్ ఒక అడుగు బయట ఉంచి అదనపు ప్రయోజనం తీసుకుంటే అది మీ కెరీర్లనే నాశనం చేయవచ్చు. కాబట్టి రెండో ఆలోచన లేకుండా అతడిని రనౌట్ చేసేయండి’ అని అశ్విన్ సూచించాడు. ఇక 'మన్కడింగ్' అని వినగానే మనకు గుర్తొచ్చే పేరు రవిచంద్రన్ అశ్విన్. ఇంతకు ముందు మన్కడింగ్ అంటే ఏంటో ఎవ్వరికీ తెలియదు. క్రికెట్ లవర్స్‌కు దీన్ని పరిచయం చేసిన ఘనత అశ్విన్‌కే దక్కుతుంది. 2019 ఐపీఎల్ సీజన్లో పంజాబ్ తరుపున ఆడిన అశ్విన్... రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో జాస్ బట్లర్‌ను మన్కడింగ్ చేశాడు. అప్పట్లో ఈ అంశం వివాదంగా మారింది. ఐతే మన్కడింగ్ అనేది క్రికెట్ రూల్స్‌లో భాగమైనప్పటికీ ఇది క్రికెట్ స్ఫూర్తికి విరుద్ధమని క్రికెట్ ఫాన్స్‌తో పాటు పలువురు ఆటగాలు అశ్విన్ తీరుపై మండిపడ్డారు. రూల్ ఉన్నప్పుడు మన్కడింగ్ చేస్తే తప్పేంటని అశ్విన్ సమర్థించుకున్నాడు. ఇటీవలే క్రికెట్లో చట్టాలు చేసే మెరిల్బోర్న్ క్రికెట్ అసోసియేషన్(ఎంసీసీ) మన్కడింగ్ తప్పు కాదని పేర్కొంది. ఇకపై మన్కడింగ్‌ను రనౌట్‌గా మారుస్తూ కొత్త రూల్ తీసుకొచ్చింది. ఇందులో భాగంగా క్రికెట్ నిబంధనల్లో లా-41 (క్రీడాస్పూర్తికి విరుద్ధం) నుంచి లా-38(రనౌట్)కు మార్చారు. రానున్న అక్టోబర్ నుంచి ఈ నిబంధనలు అమల్లోకి రానున్నాయి. చదవండి: David Warner: వార్నర్ మ్యాచ్ ఫిక్సింగ్ ఏమైనా చేశావా?! Sanju Samson: కండలు కరిగించాడు.. ఇక సిక్సర్ల వర్షమేనా! New Rules Of Cricket 2022: మన్కడింగ్ తప్పుకాదు: ఐసీసీ -
మన్కడింగ్‌ను రనౌట్‌గా మార్చడం సంతోషం.. కానీ
క్రికెట్లో ఎంసీసీ(మెరిల్బోర్న్ క్రికెట్ అసోసియేషన్) సవరించిన కొత్త రూల్స్ సంతోషం కలిగించాయని టీమిండియా దిగ్గజం సచిన్ టెండూల్కర్ పేర్కొన్నాడు. ''ఎంసీసీ కమిటీ తీసుకొచ్చిన కొత్త రూల్స్ బాగున్నాయి.. అందులో కొన్నింటికి నేను మద్దతు ఇస్తున్నా. ముఖ్యంగా మన్కడింగ్ విషయంలో మార్పు తీసుకురావడం అభినందనీయం. క్రీజులో ఉన్న బ్యాటర్‌కు మన్కడింగ్ అనే పదం ఇబ్బందిగా అనిపించేది. తాజాగా మన్కడింగ్ పదాన్ని రనౌట్‌గా మార్చారు. నా దృష్టిలో మన్కడింగ్ అనేది రనౌట్‌గానే పరిగణిస్తారు. ఒక రకంగా ఇది మంచిదే అయినప్పటికి.. అందరికి సౌకర్యవంతంగా అనిపించకపోవచ్చు. ఇక రెండో రూల్ ఒక బ్యాట్స్‌మన్ క్యాచ ఔట్‌గా వెనుదిరిగినప్పుడు.. క్రీజులోకి కొత్త బ్యాటర్ రావాలనే నిర్ణయం కూడా బాగా నచ్చింది. ఎందుకంటే.. ఒక బౌలర్ వికెట్ తీసి సక్సెస్ ట్రాక్‌లో ఉండడం సక్సెస్‌గా కనిపించినప్పుడు.. అతను కొత్త బ్యాట్స్‌మన్‌కు బౌలింగ్ చేయడం కూడా ఫెయిర్‌గానే కనిపిస్తుంది. ఈ కొత్త రూల్ బాగుంది.. వెల్డన్'' అంటూ చెప్పుకొచ్చాడు. ఇక క్రికెట్ చట్టాలు చేసే మెరిల్‌బోన్ క్రికెట్ క్లబ్ (ఎంసీసీ) మన్కడింగ్‌ను చట్టబద్ధం చేసింది. ఇది క్రికెట్లో రనౌట్! అంతేతప్ప క్రీడాస్ఫూర్తికి విరుద్ధమయ్యే మన్కడింగ్ కానే కాదిపుడు. ఎంసీసీ చేసిన పలు సవరణలను అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) అమోదించింది. అయితే ఇవన్నీ ఈ ఏడాది అక్టోబర్ తర్వాతే అమలవుతాయి. ఎంసీసీ సవరణలివి... ►సలైవా (ఉమ్ము), చెమటతో బంతిని రుద్దడం పూర్తిగా నిషిద్ధం. కరోనా వల్ల ఇప్పుడైతే చెమట, ఉమ్ముతో బంతిని షైన్ చేయడాన్ని తాత్కాలికంగా నిలిపివేశారు. ఇకపైనా కుదరదు. ►క్యాచ్ అవుట్ అయిన బ్యాటర్ సగం పిచ్ దాటినా కూడా కొత్త బ్యాటరే స్ట్రయిక్ చేయాలి. ఓవర్ చివరిబంతికి ఔటైతే తప్ప... సగం పిచ్ దాటిన నెపంతో నాన్ స్ట్రయికర్ బ్యాటింగ్ చేయడానికి వీలులేదు. ►ఫీల్డింగ్ సమయంలో ఎవరైన ఆటగాడు అనైతికంగా ఫీల్డ్‌లో కదిలితే ఇన్నాళ్లు అది డెడ్‌బాల్‌గానే పరిగణించేవారు. బ్యాటర్ భారీషాట్ ఆడినపుడు బ్యాటింగ్ జట్టుకు ఇది ప్రతికూలమయ్యేది. కానీ ఇప్పుడు బ్యాటింగ్ జట్టుకు అనుకూలంగా మార్చారు. ఫీల్డర్ అనుచిత మార్పు చేస్తే ప్రత్యర్థి (బ్యాటింగ్) జట్టు స్కోరుకు ఐదు పెనాల్టీ పరుగులు జతచేస్తారు. -
మన్కడింగ్ తప్పుకాదు: ఐసీసీ
లండన్: మన్కడింగ్ గుర్తుందిగా..! బౌలింగ్ వేసే సమయంలో బంతి బౌలర్ చేతి నుంచి విడుదల కాకముందే నాన్‌స్ట్రయిక్ బ్యాటర్ పరుగు పెడితే బౌలర్ వికెట్లను గిరాటే వేయడమే మన్కడింగ్. ఐపీఎల్లో బట్లర్‌ను అశ్విన్ ఇలా అవుట్ చేస్తే పాశ్చత్య క్రికెటర్లు అతనిపై ధ్వజమెత్తారు. క్రీడాస్ఫూర్తికి విరుద్ధమని నానాయాగీ చేశారు. ఇప్పుడు క్రికెట్ చట్టాలు చేసే మెరిల్‌బోన్ క్రికెట్ క్లబ్ (ఎంసీసీ) మన్కడింగ్‌ను చట్టబద్ధం చేసింది. ఇది క్రికెట్లో రనౌట్! అంతేతప్ప క్రీడాస్ఫూర్తికి విరుద్ధమయ్యే మన్కడింగ్ కానే కాదిపుడు. ఎంసీసీ చేసిన పలు సవరణలను అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) అమోదించింది. అయితే ఇవన్నీ ఈ ఏడాది అక్టోబర్ తర్వాతే అమలవుతాయి. ఎంసీసీ సవరణలివి... ►సలైవా (ఉమ్ము), చెమటతో బంతిని రుద్దడం పూర్తిగా నిషిద్ధం. కరోనా వల్ల ఇప్పుడైతే చెమట, ఉమ్ముతో బంతిని షైన్ చేయడాన్ని తాత్కాలికంగా నిలిపివేశారు. ఇకపైనా కుదరదు. ►క్యాచ్ అవుట్ అయిన బ్యాటర్ సగం పిచ్ దాటినా కూడా కొత్త బ్యాటరే స్ట్రయిక్ చేయాలి. ఓవర్ చివరిబంతికి ఔటైతే తప్ప... సగం పిచ్ దాటిన నెపంతో నాన్ స్ట్రయికర్ బ్యాటింగ్ చేయడానికి వీలులేదు. ►ఫీల్డింగ్ సమయంలో ఎవరైన ఆటగాడు అనైతికంగా ఫీల్డ్‌లో కదిలితే ఇన్నాళ్లు అది డెడ్‌బాల్‌గానే పరిగణించేవారు. బ్యాటర్ భారీషాట్ ఆడినపుడు బ్యాటింగ్ జట్టుకు ఇది ప్రతికూలమయ్యేది. కానీ ఇప్పుడు బ్యాటింగ్ జట్టుకు అనుకూలంగా మార్చారు. ఫీల్డర్ అనుచిత మార్పు చేస్తే ప్రత్యర్థి (బ్యాటింగ్) జట్టు స్కోరుకు ఐదు పెనాల్టీ పరుగులు జతచేస్తారు. చదవండి: IPL 2022: అఫ్గన్ ఆటగాడికి బంపరాఫర్.. ఇక సాహాకు కష్టమే Aus Vs Pak: టెస్టుల్లో చెత్త రికార్డు.. ప్రపంచంలోనే తొలి బౌలర్‌గా! -
'మన్కడింగ్' అనడం ఆపేయండి.. గంగూలీకి మాజీ క్రికెటర్ కుమారుడి లేఖ
Vinoo Mankad Son Rahul Writes Email To Sourav Ganguly Stop Using Mankading.. క్రికెట్లో మన్కడింగ్ అనే పదం వినగానే.. మొదటగా గుర్తుకువచ్చేది టీమిండియా స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్. మన్కడింగ్ అంటే.. బౌలర్ బంతి వేయకముందే నాన్‌స్ట్రైక్ ఎండ్‌లో ఉన్న బ్యాట్స్‌మన్ క్రీజు దాటి బయటకు వెళితే.. బౌలర్‌కు రనౌట్ చేసే అవకాశం ఉంటుంది. దీనిని అశ్విన్ 2019 ఐపీఎల్ సందర్భంగా రాజస్తాన్ రాయల్స్ ఆటగాడు జాస్ బట్లర్‌పై ఉపయోగించడం అప్పట్లో వివాదానికి దారి తీసింది. ఈ విషయంలో కొందరు అశ్విన్‌ను తప్పు బడితే.. మరికొందరు అతన్ని సమర్థించారు. చదవండి: Rahul Dravid: కోచ్ అనే పదానికి అర్థం మారుస్తున్న ద్రవిడ్.. వీడియో వైరల్ అయితే అంతకముందే టీమిండియా నుంచి వినూ మన్కడ్ రెండుసార్లు ఒకే ఆటగాడిని మన్కడింగ్ చేశారు. 1947-48లో టీమిండియా ఆస్ట్రేలియాలో పర్యటించింది. సిడ్నీ వేదికగా జరిగిన తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో ఆసీస్ బ్యాట్స్‌మన్ బిల్ బ్రౌన్ పదేపదే క్రీజు దాటుతుండడంతో వినూ మాన్కడ్ అతన్ని హెచ్చరించాడు. మరోసారి బిల్ బ్రౌన్ బంతి వేయకుండానే క్రీజు దాటడంతో మాన్కడ్ బ్రౌన్‌ను మన్కడింగ్ చేశాడు. ఆ తర్వాత రెండో టెస్టులోనూ బ్రౌన్ ఇదే తరహాలో చేయడంతో వినూ మాన్కడ్ ఈసారి అతనికి వార్నింగ్ ఇవ్వకుండానే మన్కడింగ్(రనౌట్ చేశాడు). ఈ చర్య అప్పట్లో పెద్ద వివాదంగా మారింది. కాగా ఈ వివాదం తర్వాతే వినూకు.. వినూ మన్కడ్ అని పేరు రావడం విశేషం. చదవండి: ఎందుకు ఆగిపోయావు అశ్విన్..? అయితే బీసీసీఐ మాత్రం ఇప్పటికి మన్కడింగ్ అనే పదాన్ని వాడుతుండడంపై వినూ మన్కడ్ కుమారుడు రాహుల్ మన్కడ్ అభ్యంతరం వ్యక్తం చేశాడు. తాజగా రాహుల్ మన్కడ్ బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీకి మన్కడింగ్ అంశంపై ఈమెయిల్ ద్వారా లేఖ రాశారు. ఐసీసీ మన్కడింగ్ పదాన్ని తొలగించిందని.. దానిని రనౌట్ అనే పిలుస్తుందని.. ఇప్పటికైనా బీసీసీఐ మన్కడింగ్ అని పిలవడం మానేయాలంటూ లేఖ ద్వారా గంగూలీని కోరాడు. ''నా తండ్రి వినూ మన్కడ్ దేశం తరపున ప్రాతినిధ్యం వహించిన తొలితరం క్రికెటర్లలో ఒకరు. ఆటగాడిగా ఎంతో గౌరవం సంపాదించిన ఆయనపై మన్కడింగ్ అనే పదం ఉపయోగించడం నాకు బాధ కలిగించింది. ఐసీసీ ఆ పదాన్ని తొలగించింది. క్రికెట్ లా బుక్స్ ప్రకారం మన్కడింగ్‌ను రనౌట్ అనే పేరుతో పిలుస్తున్నారు. మన్కడింగ్ అనే పదం వినగానే నా తండ్రి పేరు ఎక్కువగా వినిపిస్తుంది. ఇది నాకు నచ్చలేదు. అందుకే బీసీసీఐని విజ్ఞప్తి చేస్తున్నా. మన్కడింగ్ అని పిలవడం ఆపేయండి.. ఐసీసీ ప్రకారం దానిని రనౌట్‌గా పరిగణించడం ఉత్తమం'' అంటూ పేర్కొన్నారు. చదవండి: అరంగేట్ర మ్యాచ్‌లోనే నలుగురిని మన్కడింగ్ చేసిన బౌలర్ ఇక వినూ మాన్కడ్ టీమిండియా తరపున 44 టెస్టులు ఆడి 2109 పరుగులు చేశాడు. మంచి ఆల్‌రౌండర్‌గా గుర్తింపు పొందిన మాన్కడ్ బౌలింగ్‌లోనూ 132 వికెట్లు తీశాడు. 1996లో క్రికెట్లో అతని సేవలకు గాను భారత ప్రభుత్వం అతని పేరుమీద పోస్టల్ స్టాంప్ విడుదల చేసింది. ఇక ఈ ఏడాది మొదట్లో వినూ మన్కడ్ ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్‌లో చోటు సంపాదించారు. -
అరంగేట్ర మ్యాచ్‌లోనే నలుగురిని మన్కడింగ్ చేసిన బౌలర్
కంపాలా: అంతర్జాతీయ అరంగేట్ర మ్యాచ్‌లో ఆటగాళ్లు సెంచరీలు, హ్యాట్రిక్‌లు సాధించడం వంటి రికార్డులను క్రికెట్లో సాధారణంగా మనం చూస్తూనే ఉంటాం. కామెరూన్‌కు చెందిన మేవా డౌమా తన అంతర్జాతీయ అరంగేట్ర మ్యాచ్‌లో ఓ రికార్డు సాధించింది. ఏకంగా ఐదుగురుని ఔట్ చేసింది. అయినప్పటికీ తమ బ్యాట్స్‌మెన్ ప్రత్యర్థి విసిరిన 191 పరుగుల టార్గెట్‌ను ఛేదించలేక చేతులెత్తేశారు. కేవలం 36 పరుగులకే ఆలౌట్ అయి ఘోర ఓటమిని మూటగట్టుకున్నారు. ఇక ఏకపక్షంగా సాగిన ఈ మ్యాచ్‌లో మేవా డౌమా సాధించిన రికార్డు ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే ఆమె తీసిన ఐదు వికెట్లలో నాలుగు వివాదాస్పద మన్కడింగ్ ద్వారానే రావడం గమనార్హం. కామెరూన్, ఉగాండా జట్ల మధ్య ఆదివారం జరిగిన మహిళల టీ20 వరల్డ్ కప్ క్వాలిఫైయర్ మ్యాచ్‌లో ఈ విశేషం చోటుచేసుకుంది. మొత్తం మీద తన నాలుగు ఓవర్ల కోటాలో ఐదుగురిని పెవిలియన్ పంపిన మేవా డౌమా మన్కడింగ్‌తో కాకుండా ఒక వికెట్ మాత్రమే తీసింది. అయితే, మన్కడింగ్ ద్వారా ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్‌ను పెవిలియన్ పంపినప్పటికీ అప్పటికే స్కోరు బోర్డు పరుగులు పెట్టడంతో ఉగాండా ముందు భారీ లక్ష్యం నిలిచింది. మన్కడింగ్ అంటే ఏమిటి? క్రికెట్ నియమావళిలోని వివాదాస్పద నిబంధనల్లో ఇదొకటి. రూల్ 41.16 ప్రకారం బౌలర్ బంతి విసరకముందే నాన్ స్ట్రయికర్ క్రీజ్ దాటినప్పుడు అతడిని అవుట్ చేసే అవకాశం ఈ నిబంధన కల్పిస్తుంది. అయితే దీన్ని1947–48 ఆస్ట్రేలియా పర్యటనలో తొలిసారిగా భారత దిగ్గజ బౌలర్ వినూ మన్కడ్ ఉపయోగించారు. దీంతో.. క్రికెట్ నిబంధనలు రూపొందించే ఎంసీసీ (మెరిలిన్ క్రికెట్ క్లబ్) ఆయన పేరుమీదుగా మన్కడింగ్ నిబంధనగా నియమావళిలో చేర్చింది. చదవండి: Virat Kohli: అవన్నీ తప్పుడు ప్రచారాలు.. అతడే కెప్టెన్: బీసీసీఐ క్లారిటీ pic.twitter.com/KjVCYGvQoh — hypocaust (@_hypocaust) September 12, 2021 -
లబూషేన్ క్రీజ్‌లో ఉండు: స్టార్క్ వార్నింగ్
సౌత్ ఆస్ట్రేలియా: ఇటీవల కాలంలో క్రికెట్లో మన్కడింగ్ మాట ఎక్కువగా వినిపిస్తోంది. బౌలర్ బంతిని విసరకముందే బ్యాట్స్‌మన్ క్రీజ్‌ను దాటి వెళితే అతన్ని మన్కడింగ్ ద్వారా ఔట్ చేయవచ్చు. ఇది ఐసీసీ నిబంధనల్లో భాగమే. ఈ సీజన్ ఐపీఎల్లో ఆర్సీబీతో మ్యాచ్‌లో అరోన్ ఫించ్ క్రీజ్‌ను దాటి వెళ్లినా ఢిల్లీ క్యాపిటల్స్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ జస్ట్ వార్నింగ్‌తో సరిపెట్టాడు. గతేడాది రాజస్తాన్ రాయల్స్ ఆటగాడు జోస్ బట్లర్‌ను మన్కడింగ్ ద్వారా ఔట్ చేయడంతో అశ్విన్ వార్తల్లో నిలిచాడు. ఆ సమయంలో కింగ్స్ పంజాబ్ తరఫున ఆడిన అశ్విన్ చర్య క్రీడా స్ఫూర్తికి విరుద్ధమని పలువురు అభిప్రాయపడ్డారు. దాంతోనే ఈ ఏడాది ఫించ్‌ను మన్కడింగ్ ద్వారా ఔట్ చేసే అవకాశం వచ్చినా అశ్విన్ వెనక్కి తగ్గి కేవలం వార్నింగ్‌తో సరిపెట్టాడు. (ప్లేఆఫ్స్ రేసు: ఎవరికి ఎంత అవకాశం?) కాగా, తాజాగా ఆస్ట్రేలియా దేశవాళీ సీజన్లో భాగంగా షెఫీల్డ్ షీల్డ్ టోర్నీలో మన్కడింగ్ చేస్తానంటూ క్వీన్స్లాండ్ ఆటగాడు లబూషేన్‌కు న్యూసౌత్ వేల్స్ పేసర్ అయిన మిచెల్ స్టార్క్ వార్నింగ్ ఇచ్చాడు. క్వీన్స్లాండ్ ఇన్నింగ్స్‌లో భాగంగా 48 ఓవర్ ఐదో బంతికి ముందు స్టార్క్ పరుగెత్తుకుంటూ వచ్చి బంతిని వేయడాన్ని ఆపేశాడు. ఆ క్రమంలోనే నాన్ స్టైకర్ ఎండ్‌లో ఉన్న లబూషేన్‌ను క్రీజ్‌లో ఉండమంటూ హెచ్చరించాడు. ఈ చర్యతో లబూషేన్ కాస్త ఆశ్చర్యానికి గురయ్యాడు. తాను క్రీజ్‌లో ఉన్నప్పటికీ ఇలా చెప్పడం ఏమిటని స్టార్క్‌ను తదేకంగా చూస్తూ ఉండిపోయాడు. తాను క్రీజ్‌ను దాటి బయటకు వెళ్లలేదనే విషయాన్ని తన చేష్టల ద్వారా చెప్పాడు లబూషేన్. స్టార్క్‌ను ఏదో అడగబోతే అతను ఏదో అనుకుంటూ బంతిని వేయడానికి బౌలింగ్ ఎండ్‌కు చేరుకున్నాడు. క్వీన్స్లాండ్ తొలి ఇన్నింగ్స్‌లో లబూషేన్ సెంచరీ చేశాడు. 203 బంతుల్లో 16 ఫోర్లతో 117 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. A warning from Mitch Starc to Marnus Labuschagne 🙊 #SheffieldShield pic.twitter.com/iGGQU7lItP — cricket.com.au (@cricketcomau) October 30, 2020 -
ఎందుకు ఆగిపోయావు అశ్విన్..?
ఢిల్లీ: 'మన్కడింగ్' అని వినగానే మనకు గుర్తొచ్చే పేరు రవిచంద్రన్ అశ్విన్. ఇంతకు ముందు మన్కడింగ్ అంటే ఏంటో ఎవ్వరికీ తెలియదు. క్రికెట్ లవర్స్‌కు దీన్ని పరిచయం చేసిన ఘనత అశ్విన్‌కే దక్కుతుంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో సోమవారం జరిగిన మ్యాచ్‌లో మన్కడింగ్ అంశం మళ్లీ తెరపైకి వచ్చింది. 197 భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు ఆర్సీబీ బరిలోకి దిగింది. ఇన్నింగ్స్‌లోని మూడో ఓవర్ వేసేందుకు వచ్చిన అశ్విన్ తన నాలుగో బంతి వేస్తుండగా ఆరోన్ ఫించ్ క్రీజు దాటి బయటకు వెళ్లాడు. అశ్విన్ బంతి వేయకుండా అలాగే ఆగిపోయి ఫించ్‌వైపు కోపంగా చూశాడు. అక్కడ మన్కడింగ్ చేసే అవకాశం ఉన్నా అశ్విన్ ఆ పని చేయలేదు. దీంతో ఒక్కసారిగా అందరికీ గతేడాది బట్లర్‌ను మన్కడింగ్ చేసింది గుర్తొచ్చింది. ఐతే ఈ సారి మన్కడింగ్ ఎందుకు చేయలేదని క్రికెట్ అభిమానులు ఆశ్చర్యపోయారు. అప్పుడు చేశాడని... ఇప్పుడు చేయలేదని! గత ఐపీఎల్ సీజన్లో పంజాబ్ తరుపున ఆడిన అశ్విన్... రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో జాస్ బట్లర్‌ను మన్కడింగ్ చేశాడు. అప్పట్లో ఈ అంశం వివాదంగా మారింది. ఐతే మన్కడింగ్ అనేది క్రికెట్ రూల్స్‌లో భాగమైనప్పటికీ ఇది క్రికెట్ స్ఫూర్తికి విరుద్ధమని క్రికెట్ ఫాన్స్‌తో పాటు పలువురు ఆటగాలు అశ్విన్ తీరుపై మండిపడ్డారు. రూల్ ఉన్నప్పుడు మన్కడింగ్ చేస్తే తప్పేంటని అశ్విన్ సమర్థించుకున్నాడు. ఏదైమైనా మన్కడింగ్ అంశం మళ్లీ తెరపైకి వచ్చింది. అది కూడా అశ్విన్ వల్లనే సాధ్యం అయ్యింది. గతేడాది బట్లర్‌ను మన్కడింగ్ చేశాడని సోషల్ మీడియాలో ట్రోల్ చేయగా ఈసారి అవకాశం ఉన్నా ఫించ్‌ను ఎందుకు చేయలేదని నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. బట్లర్‌కు మద్దతుగా కొన్ని ఫన్నీ ఫోటోలు విడుదల చేయగా ఇప్పుడు అవి సోషల్ మీడియాలో వైరల్‌గా మారుతున్నాయి. మాన్కడింగ్ చరిత్ర ఏంటంటే... అసలు మన్కడింగ్ అనేది కొత్తగా వచ్చింది కాదు. 1947-48లో భారత్, ఆస్ర్టేలియా మధ్య జరిగిన రెండో టెస్ట్ మ్యాచ్‌లో మొదటిసారి మన్కడింగ్ జరిగింది. భారత స్పిన్నర్ 'విన్నూ మన్కడ్' బౌలింగ్ చేస్తుండగా నాన్స్ర్టైక్లో ఉన్న బిల్ బ్రౌన్ క్రీజు దాటి బయటికి వెళ్లాడు. అప్పుడు విన్నూ మన్కడ్ వికెట్లు పడగొట్టి అతడిని అవుట్ చేశాడు. అలా మాన్కడ్ అనే పదం వెలుగులోని వచ్చింది. అప్పట్లో ఆసిస్ మీడియాలో ఇది చర్చనీయాంశంగా మారింది. ఏదేమైనా మన్కడ్ క్రికెట్ రూల్స్‌లో ఉన్నప్పటికీ ఇది క్రికెట్ స్ఫూర్తికి విరుద్ధమని ఆటగాలు భావిస్తున్నారు. (ఇదీ చదవండి: అశ్విన్ వదిలేశాడు.. కెమెరాలన్నీ పాంటింగ్‌వైపే!) Jos butter be like😂 #Ashwin pic.twitter.com/TgOxTGLazw — Mizan (@Mizan98726466) October 5, 2020 #RCBvDC Ashwin didn't Mankad Finch Meanwhile Buttler: pic.twitter.com/vfRnIQ8Trb — Shivani (@meme_ki_diwani) October 5, 2020 Jos Buttler To Ashwin pic.twitter.com/woRH6Q0TW3 — 🇮🇳 A M A R 🕊️ (@imShinde777) October 5, 2020 -
కొంచెం నేర్చుకో అశ్విన్.. అప్పుడే బదులిస్తా!
దుబాయ్: మరో రెండు రోజుల్లో ఐపీఎల్ సందడి మొదలుకానుంది. యూఏఈ వేదికగా జరుగనున్న ఈ క్యాష్ రిచ్ లీగ్ తాజా సీజన్లోనూ అభిమానులను ఆకట్టుకునేందుకు అన్ని జట్లు సిద్ధమైపోయాయి. ఇక సోషల్ మీడియాలో ఇప్పటికే ఆయా జట్లు, ఆటగాళ్ల అభిమానులు ఐపీఎల్ విశేషాలు, గత సీజన్ తాలూకు జ్ఞాపకాలు గుర్తుచేసుకుంటూ మీమ్స్, వీడియోలతో హల్చల్ చేస్తున్నారు. ఈ క్రమంలో ఓ నెటిజన్.. ప్రస్తుత ఢిల్లీ ఆటగాడు, కింగ్స్ ఎలెవన్ జట్టు మాజీ కెప్టెన్ రవిచంద్రన్ అశ్విన్‌పై వ్యంగ్యాస్త్రాలు సంధించాడు. ఐపీఎల్-12లో ‘మన్కడింగ్’తో అశ్విన్ విమర్శల పాలైన విషయాన్ని గుర్తు చేస్తూ.. ఇంగ్లండ్, ఆస్ట్రేలియా జట్ల మధ్య ఇటీవల జరిగిన వన్డే మ్యాచ్‌కు సంబంధించిన ఓ ఫొటోను షేర్ చేస్తూ.. ‘‘కొంచెం నేర్చుకో అశ్విన్. ఇదిగో ఇలాగే నువ్వు ఆడతావు కదా’’అంటూ సెటైర్లు వేశాడు. ఇందులో ఆసీస్ బౌలర్ మిచెల్ స్టార్క్, నాన్- స్ట్రైకర్ ఎండ్‌లో ఉన్న ఆదిల్ రషీద్‌ను హెచ్చరించాడే తప్ప మన్కడింగ్ చేయలేదు. (చదవండి: నా లైఫ్‌లోనే ఇదొక వరస్ట్: అశ్విన్) ఇక ఇందుకు స్పందించిన అశ్విన్.. తాను బాగానే ఆడతానని నమ్ముతున్నానని, ఇందుకోసం కాస్త వేచి చూడాలని, తనదైన రోజు ఇందుకు బదులిస్తానంటూ కౌంటర్ ఇచ్చాడు. కాగా గతేడాది రాజస్తాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ కెప్టెన్ అశ్విన్ ప్రత్యర్థి జట్టు ఓపెనర్ జోస్ బట్లర్‌ను ‘మన్కడింగ్’ రనౌట్ చేయడం తీవ్ర చర్చకు దారి తీసిన సంగతి తెలిసిందే. క్రికెట్ నియమావళి 41.16 ప్రకారం బౌలర్ బంతి విసరకముందే నాన్ స్ట్రయికర్ క్రీజ్ దాటినప్పుడు అతడిని అవుట్ చేసే అవకాశం ఉన్నప్పటికీ పలువురు అశ్విన్‌పై విమర్శలు గుప్పించారు. క్రీడా స్ఫూర్తికి ఇది విరుద్దమంటూ దుమ్మెత్తిపోశారు. అయితే మరికొంత మంది సీనియర్ ఆటగాళ్లు మాత్రం అశ్విన్‌కు మద్దతుగా నిలిచారు. ఇక అశ్విన్ ప్రస్తుతం ఢిల్లీ జట్టు తరఫున మైదానంలో దిగుతున్న సంగతి తెలిసిందే. కాగా ఢిల్లీ కేపిటల్స్ హెడ్ కోచ్‌గా వ్యవహరిస్తున్న రికీ పాంటింగ్.. మన్కడింగ్ గురించి గత నెలలో కీలక వ్యాఖ్యలు చేశాడు. మన్కడింగ్‌ను తాను ప్రోత్సహించనని, అశ్విన్ ఆనాడు నిబంధనల ప్రకారమే నడుచుకున్నానని చెప్పినా.. క్రీడా స్ఫూర్తికి ఇది విరుద్ధమని అభిప్రాయపడ్డాడు. ఈ విషయం గురించి అశ్విన్‌తో తప్పక చర్చిస్తానని, వికెట్‌కు 2-3 గజాల దూరంలో ఉండటం బేసిక్‌గా చీటింగ్ వంటిదేనని పేర్కొన్నాడు. మన్కడింగ్ ఔట్ అంటే ఏమిటి? క్రికెట్ నియమావళిలోని వివాదాస్పద నిబంధనల్లో ఇదొకటి. రూల్ 41.16 ప్రకారం బౌలర్ బంతి విసరకముందే నాన్ స్ట్రయికర్ క్రీజ్ దాటినప్పుడు అతడిని అవుట్ చేసే అవకాశం ఈ నిబంధన కల్పిస్తుంది. అయితే దీన్ని1947–48 ఆస్ట్రేలియా పర్యటనలో తొలిసారిగా భారత దిగ్గజ బౌలర్ వినూ మన్కడ్ ఉపయోగించారు. దీంతో.. క్రికెట్ నిబంధనలు రూపొందించే ఎంసీసీ (మెరిలిన్ క్రికెట్ క్లబ్) ఆయన పేరుమీదుగా మన్కడింగ్ నిబంధనగా నియమావళిలో చేర్చింది. ఆ పర్యటనలో వినూ మన్కడ్ బౌలింగ్ చేస్తున్న సమయంలో ఆసీస్ బ్యాట్స్‌మన్ బిల్ బ్రౌన్ పదేపదే బంతి వేయకముందే క్రీజు వదిలి పరుగుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో మన్కడ్ పలుమార్లు అతడిని వారించినా పట్టించుకోలేదు. దీంతో బ్రౌన్ క్రీజు దాటిన తర్వాత మన్కడ్ వెంటనే అతడిని రనౌట్ చేయడంతో తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. అయితే ఈ పర్యటనలో మరోసారి కూడా మన్కడ్ .. బ్రౌన్‌ను ఔట్ చేశాడు. అప్పటినుంచి ఈ రనౌట్‌ను మన్కడింగ్ ఔట్‌గా పిలుస్తున్నారు. -
‘ఇది రనౌట్‌కంటే భిన్నమేమీ కాదు’
న్యూఢిల్లీ: హద్దులు దాటే నాన్‌స్ట్రైకర్‌ను ‘మన్కడింగ్’ ద్వారా అవుట్ చేసే అంశాన్ని అనవసరంగా వివాదం చేస్తున్నారని భారత మాజీ పేసర్, ఐసీసీ మ్యాచ్ రిఫరీ జవగల్ శ్రీనాథ్ అభిప్రాయపడ్డారు. తన దృష్టిలో ఇది మామూలు రనౌట్‌కంటే భిన్నమేమీ కాదని, అవుటైన బ్యాట్స్‌మన్ సానుభూతి కోరడంలో అర్థం లేదని ఆయన అన్నారు. అసలు ఈ అంశంలో ‘క్రీడా స్ఫూర్తి’ని ఎందుకు తీసుకొస్తున్నారని శ్రీనాథ్ ప్రశ్నించారు. ‘అదనపు ప్రయోజనాన్ని పొందే ప్రయత్నం చేసే నాన్ స్ట్రైకర్‌ను బౌలర్ అవుట్ చేయడం ముమ్మాటికీ సరైందే. (చదవండి: బీసీసీఐ ఇలా అస్సలు ఊహించి ఉండదు!) బౌలర్ ఎదురుగా ఉన్న స్ట్రైకర్‌కు బౌలింగ్ చేయడంపై దృష్టి పెట్టిన సమయంలో నాన్ స్ట్రైకర్‌కు వేరే పనేముంటుంది. బంతి పూర్తి అయ్యే వరకు ఆగలేడా. అది అతని బాధ్యత. ముందుకెళ్లి అనవసర ప్రయోజనం పొందే నాన్ స్ట్రైకర్‌ను రనౌట్ చేయడాన్ని నేను సమర్థిస్తా. నిబంధనలు ఈ విషయాన్ని స్పష్టంగా పేర్కొంటున్నాయని మళ్లీ మళ్లీ చెప్పాం. అవుటయ్యాక క్రీడా స్ఫూర్తి అన్న మాటే అనవసరం. బ్యాట్స్‌మన్ క్రీజ్‌లో ఉండి తన క్రీడాస్ఫూర్తిని ప్రదర్శిస్తే మంచిది’ అని శ్రీనాథ్ విశ్లేషించారు. (చదవండి: సరదా కోసం కాదు... క్రికెట్ ఆడేందుకు వచ్చాం!) -
'ఫ్రీ బాల్ అవకాశం బౌలర్‌కు కూడా ఇవ్వాలి'
ముంబై : క్రికెట్లో ఫ్రీ బాల్ నిబంధన తేవాల్సిన అవసరముందని టీమిండియా సీనియర్ ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అభిప్రాయపడ్డాడు. బౌలర్ బంతిని వదిలే లోపలే నాన్ స్ట్రయికర్క్రీజును వదిలి ముందుకు వెళితే పరుగు పూర్తి చేసేందుకు అనుమతించకూడదని సూచించాడు.అలా కాకుంటే తర్వాతి బంతిని ఫ్రీబాల్గా ప్రకటించేలా నిబంధన తేవాలని పేర్కొన్నాడు. దీనర్థం ఏంటంటే ఒకవేళ ఫ్రీబాల్‌కు పరుగు చేసినా అది లెక్కలోకి రాదని అశ్విన్ వెల్లడించాడు.(ఆల్‌టైమ్ గ్రేట్‌లలో వారు కూడా..) దీనిపై అశ్విన్ వరుస ట్వీట్లను సంధించాడు. 'ఒకవేళ బంతి వేయకముందే నాన్ స్ట్రయికర్ రెండు అడుగులు ముందుకు వెళ్లి.. దానివల్లే రెండు పరుగులు పూర్తి చేయగలిగితే మళ్లీ అదే బ్యాట్స్‌మన్ స్ట్రయికింగ్‌కు వస్తాడు. ఆ తర్వాతి బంతికి అతడు ఫోర్ లేదా సిక్సర్ కొడితే ఐదు లేదా ఏడు పరుగులు సమర్పించుకున్నట్టే. ఒకవేళ ఒక పరుగే వస్తే.. కొత్త బ్యాట్స్‌మన్ స్ట్రయిక్‌లోకి వచ్చి డాట్ బాల్ ఆడే అవకాశం ఉంటుంది' అని అశ్విన్ ట్వీట్ చేశాడు. ఒకవేళ నాన్ స్ట్రయికర్ ముందుకు వెళితే రనౌట్(మన్కడింగ్) చేసే అవకాశం ఉంటుంది కదా అని యూజర్ అడిగిన ప్రశ్నకి అశ్విన్ స్పందించాడు. ' ముందుకు వెళ్లడాన్ని అనుమతించకపోయే బదులు.. ఆ తర్వాతి బంతిని బౌలర్‌కు ఫ్రీబాల్గా ఇవ్వాలి. ఇదే కాస్త న్యాయంగా ఉంటుంది' అని అశ్విన్ సమాధానమిచ్చాడు. కాగా గతంలో కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ తరఫున ఆడిన అశ్విన్ మన్కడింగ్ విధానంలో రాజస్థాన్ రాయల్స్ ఆటగాడు జాస్ బట్లర్‌ను అవుడ్ చేయడం అప్పట్లో విమర్శలకు దారి తీసింది. కాగా 2023 వన్డే ప్రపంచకప్ కోసం నిర్వహించే సూపల్ లీగ్‌లో ఫ్రంట్ ఫుట్నోబాల్ నిర్ణయాన్ని ఐసీసీ థర్డ్ అంపైర్‌కు అప్పగించిన సంగతి తెలిసిందే. జూలై 30 నుంచి జరిగే ఇంగ్లండ్, ఐర్లాండ్ వన్డే సిరీస్‌తో కొత్త నిబంధన అమల్లోకి రానుంది. మరో వైపు వన్డే సూపర్ లీగ్‌లో స్లో ఓవర్‌రేట్‌కు కూడా శిక్షను కఠినతరం చేశారు. ఇప్పటి వరకు విధిస్తున్న జరిమానా కాకుండా ఒక ఓవర్ ఆలస్యమైతే ఒక పాయింట్ కోత విధించాలని ఐసీసీ నిర్ణయించింది. ఈ నేపథ్యంలో అశ్విన్ ఫ్రీ బాల్ నిబంధనను తెర మీదకు తీసుకువచ్చాడు. -
‘గీత’ దాటితే ప్రమాదం!
చెన్నై: సరిగ్గా ఏడాది క్రితం మార్చి 25, 2019న జైపూర్‌లో రాజస్తాన్ రాయల్స్, కింగ్స్ ఎలెవన్ పంజాబ్ మధ్య ఐపీఎల్ మ్యాచ్ జరిగింది. పంజాబ్ విధించిన 185 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో రాజస్తాన్ దూసుకుపోయింది. 44 బంతుల్లో 77 పరుగులు చేయాల్సిన స్థితిలో చేతిలో 9 వికెట్లున్నాయి. ఈ సమయంలో పంజాబ్ కెప్టెన్ అశ్విన్ రాజస్తాన్ బ్యాట్స్‌మన్ సంజు సామ్సన్‌కు బౌలింగ్ చేస్తున్నాడు. అయితే నాన్ స్ట్రయికర్‌గా ఉన్న జోస్ బట్లర్... అశ్విన్ ‘డెలివరీ స్ట్రయిడ్’ పూర్తి కాకముందే క్రీజ్ దాటి పరుగు కోసం ముందుకొచ్చాడు. ఏమరుపాటుగా ఉన్న అశ్విన్ వెంటనే స్టంప్స్‌ను పడగొట్టి రనౌట్ కోసం అప్పీల్ చేశాడు. బట్లర్ చాలా ముందుకు వెళ్లిపోవడంతో అవుట్ కాక తప్పలేదు. అలా ‘మన్కడింగ్’ ద్వారా అవుట్ చేసి అశ్విన్ క్రీడా స్ఫూర్తికి విరుద్ధంగా వ్యవహరించాడని విమర్శలు వచ్చినా... నిబంధనల ప్రకారం సరైందేనని భారత స్పిన్నర్ వాదించాడు. బట్లర్ వెనుదిరిగాక ఛేదనలో తడబడిన రాజస్తాన్ చివరకు 14 పరుగులతో ఓడిపోయింది. ఇప్పుడు ఏడాది తర్వాత ఈ ఘటనను అశ్విన్ మళ్లీ గుర్తు చేసుకున్నాడు. కోవిడ్–19 నేపథ్యంలో ప్రస్తుతం దేశంలో ప్రకటించిన కర్ఫ్యూ, దాని కారణంగా వస్తున్న సమస్యలను అతను ‘మన్కడింగ్’తో పోల్చాడు. గీత దాటితే రనౌట్ అయినట్లు ఇప్పుడు ‘ఇల్లు దాటితే కష్టమని’ అశ్విన్ చెబుతున్నాడు. బయటకు రాకుండా ఉండటం కొంత కష్టమే అయినా... చివరకు విజయం కోసం ఇదంతా చేయాల్సిందేనని అతను అంటున్నాడు. ‘దేశం మొత్తం లాక్డౌన్ అవుతున్న వేళ దీనిని గుర్తు చేయడం అవసరమని నేను భావిస్తున్నా. బయట ఎక్కడా తిరగకండి. ఇంట్లోనే ఉండండి. భద్రంగా ఉండండి’ అని నాటి రనౌట్ ఫొటోతో అశ్విన్ ట్వీట్ చేయడం విశేషం. మొదటి నుంచి ప్రకృతి ప్రేమికుడు అయిన అశ్విన్ తాజా పరిణామాల పట్ల తన అభిప్రాయాలు వెల్లడించాడు. ‘ఈ విశ్వం ఇప్పుడు మానవజాతిని సవాల్ చేస్తోంది. సమాజం పట్ల మనం ఎంత బాధ్యతగా ఉండగలమా అని ప్రశ్నిస్తోంది. మరో మనిషి కోసం మనం ఎంత త్యాగం చేయగలమో నిజాయితీగా చెప్పమని అడుగుతోంది. ఇవన్నీ సమాధానం చెప్పలేని కఠినమైన ప్రశ్నలు. ఇప్పుడు ఇంట్లోనే ఉంటూ వీటికి జవాబులు ఆలోచించండి’ అంటూ కూడా అతను తన ట్విట్టర్లో అభిప్రాయం వ్యక్తం చేశాడు. క్రీడలకంటే ప్రధానమైనవి ఎన్నో... న్యూజిలాండ్ పర్యటన నుంచి తిరిగి వచ్చిన అనంతరం అశ్విన్ కొన్ని స్థానిక లీగ్‌లలో ఆడాడు. ఇప్పుడు దేశవ్యాప్తంగా కర్ఫ్యూ నెలకొన్న నేపథ్యంలో అతను తన సమయాన్ని ఇంట్లోనే గడుపుతున్నాడు. ఈ సందర్భంగా తన రోజువారీ కార్యక్రమాల గురించి పలు ఆసక్తికర అంశాలు అతను పంచుకున్నాడు. ► ప్రస్తుతం ప్రపంచం ఎదుర్కొంటున్న అతి పెద్ద సమస్యకు త్వరలోనే వైద్యులు పరిష్కారం కనుగొంటారని ఆశిస్తున్నా. ► అయితే ఇదంతా ఇప్పుడు మనకు పెద్ద పాఠం. మనలో చాలా మంది ఆటలకు అనవసర ప్రాధాన్యత ఇస్తున్నారని, జీవితంలో అంతకంటే ముఖ్యమైనవి ఎన్నో ఉన్నాయని తాజా పరిణామాలు గుర్తు చేస్తున్నాయి. ► ఇంత సమయం ఉన్నా నేను క్రికెట్ గురించి అస్సలు ఆలోచించడం లేదు. టీవీలో చూడటం గానీ, యూట్యూబ్‌లో పాత క్లిప్‌లు గానీ అస్సలు చూడటం లేదు. సమీపంలో ఎలాంటి మ్యాచ్‌లు లేవు కాబట్టి నేను ప్రాక్టీస్ కూడా చేయడం లేదు. ► మా అకాడమీ జెన్–నెక్ట్స్ట్ను రెండు వారాల క్రితమే మూసేశాం. దాంతో మా విద్యార్థులకు వాట్సాప్, టెలికాన్ఫరెన్స్ ద్వారా కోచింగ్ ఇస్తున్నా. ► ఉదయం లేచిన దగ్గరి నుంచి నా ఇద్దరు అమ్మాయిలతో (ఐదు, నాలుగేళ్ల వయసు) ఎక్కువ సమయం గడిపేందుకు ప్రయత్నిస్తున్నా. నా ఇంటి చుట్టుపక్కన పక్షుల కిలకిలరావాలు విని ఎన్నేళ్లయింది. ఇప్పుడు ట్రాఫిక్ లేకపోవడం వల్ల కావచ్చు అంతా స్పష్టంగా వినిపిస్తుంది. ఏవో కొత్త పక్షులు చేరినట్లు కూడా అనిపించింది. ► ఇక నేను, భార్య ప్రీతి సినిమాలు, సిరీస్‌లు చూస్తూనే ఉన్నాం. నాకు ‘గేమ్ ఆఫ్ థ్రోన్స్’ ఇష్టమైతే...ఆమెకు ‘సెక్స్ అండ్ ద సిటీ’ అంటే ఆసక్తి. అయితే మాజీ ముఖ్యమంత్రి జయలలిత మీద రూపొందించిన సిరీస్ ‘క్వీన్’ను మాత్రం ఇద్దరం కలిసి చూస్తున్నాం. ► ఇక పుస్తకాలు చదివే పాత అలవాటు కూడా మళ్లీ వచ్చింది. కల్కి రచించిన ఐదు భాగాల ‘పొన్నియిన్ సెల్వన్’ పూర్తి చేసేందుకు నా వద్ద తగినంత సమయం ఉంది. ► మా అమ్మానాన్నలు మాతో పాటే ఉంటారు కానీ వారిద్దరూ కూడా చాలా బిజీ. అయితే ప్రతీ రోజు అమ్మతో ఒక్క గంట పాటైనా ‘క్యారమ్’ ఆడుతూ ఉన్నా. కొంత విశ్రాంతి తర్వాత అమ్మాయిలతో పజిల్స్, లెగోలాంటివి ఆడుకుంటా. ఇంతకుముందులాగా సాయంత్రం కాగానే బయటకు వెళ్లాల్సిన అనవసరం లేదు. సరైన సమయానికే నిద్రపోతుండటం కూడా ఒక మంచి మార్పు. ► కరోనాలాంటి ఉత్పాతాన్ని ఇప్పుడు మనం అధిగమించలిగితే అందరికీ ఇదో పెద్ద పాఠం కావాలి. -
బుమ్రా బౌల్డ్ చేస్తాడు.. మరి అశ్వినేమో..
హైదరాబాద్: కింగ్స్ పంజాబ్ సారథి రవించంద్రన్ అశ్విన్‌కు ‘మన్కడింగ్’ మచ్చ ఇప్పట్లో తొలిగేలా కనిపించడం లేదు. వీలుచిక్కినప్పుడల్లా నెటిజన్లు, క్రికెటర్లు అశ్విన్‌ను ఓ ఆట ఆడుకుంటున్నారు. ఇప్పటికే డేవిడ్ వార్నర్, శిఖర్ ధావన్‌లు మైదానంలోనే అశ్విన్‌కు ‘మన్కడింగ్’ను గుర్తు చేస్తూ ఆటపట్టించారు. తాజాగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు స్పీడ్‌గన్ డెల్ స్టెయిన్ అశ్విన్‌ను ఎగతాళి చేస్తూ ట్వీట్ చేశాడు. ‘బ్యాట్స్‌మెన్ ఎక్కువగా బుమ్రా బౌలింగ్‌లో బౌల్డ్, రబడ బౌలింగ్‌లో క్యాచ్‌ఔట్, తాహీర్ బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూ అవుతారు. కానీ అశ్విన్ బౌలింగ్‌లో మన్కడింగ్‌తో అవుటవుతారు’అంటూ అశ్విన్‌పై వ్యంగ్యాస్త్రాలు సంధిస్తూ ట్వీట్ చేశాడు. ప్రస్తుతం స్టెయిన్‌కు సంబంధించిన ట్వీట్ తెగ వైరల్ అవుతోంది. స్టెయిన్ కరెక్ట్‌గా చెప్పారంటూ నెటిజన్లు రీట్వీట్ చేస్తూన్నారు. ఇక ఆలస్యంగా ఐపీఎల్‌లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ స్పీడ్‌గన్.. ఆడిన రెండు మ్యాచ్‌ల్లో అదరగొట్టాడు. స్టెయిన్ రాకతో బలహీనంగా ఉన్న ఆర్సీబీ బౌలింగ్ విభాగానికి బలం చేకూరింది. అసలేం జరిగిందంటే..? ఐపీఎల్ సీజన్ 12లో భాగంగా రాజస్తాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో జోస్ బట్లర్‌ను మన్కడింగ్ విధానంతో ఔట్ చేయడంతో అశ్విన్ వివాదాన్ని కొని తెచ్చుకున్నాడు. అశ్విన్ బంతి వేయబోయే సమయానికే బట్లర్ క్రీజ్ వదిలి కాస్త ముందుకు వచ్చాడు. దాంతో వెంటనే చేతిని వెనక్కి తీసుకున్న అశ్విన్ బెయిల్స్‌ను పడగొట్టి అప్పీల్ చేశాడు. థర్డ్ అంపైర్ కూడా దానిని ఔట్‌గానే ప్రకటించడంతో బట్లర్ వెనుదిరగాల్సి వచ్చింది. ఈ క్రమంలో ఇద్దరి మధ్య తీవ్ర వాదోపవాదం కూడా చోటు చేసుకుంది. అశ్విన్ తీరుపై నెటిజన్లు, మాజీ ఆటగాళ్లు దుమ్మెత్తిపోశారు. -
వైరల్: ‘మన్కడింగ్’కు గల్లీ క్రికెటర్ల పరిష్కారం
-
వైరల్: ‘మన్కడింగ్’కు గల్లీ క్రికెటర్ల పరిష్కారం!
హైదరాబాద్: మన్కడింగ్.. ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) సీజన్ 12లో తెరపైకి వచ్చిన పేరు. సీజన్ ఆరంభంలో రాజస్థాన్ రాయల్స్ ఓపెనర్ జోస్ బట్లర్‌ను కింగ్స్ పంజాబ్ సారథి రవిచంద్రన్ అశ్విన్ మన్కడింగ్ రనౌట్ చేయడంతో దీనిపై తీవ్రమైన చర్చ జరిగింది. బట్లర్‌ను మన్కడింగ్ రనౌట్ చేయడం ద్వారా అశ్విన్ తీవ్ర విమర్శలను ఎదుర్కొన్నాడు. అయితే ఈ విషయంలో పలువురు అశ్విన్‌కు మద్దతు తెలపగా.. మరికొందరు దుమ్మెత్తిపోస్తున్నారు. క్రికెట్ నియమావళి 41.16 ప్రకారం బౌలర్ బంతి విసరకముందే నాన్ స్ట్రయికర్ క్రీజ్ దాటినప్పుడు అతడిని అవుట్ చేసే అవకాశం ఈ నిబంధన కల్పిస్తుంది. అయితే ‘మన్కడింగ్’ భారి నుంచి బ్యాట్స్‌మెన్ ఎలా తప్పించుకోవచ్చో గల్లీ క్రికెటర్లు ఫన్నీగా వీడియో తీసి పోస్ట్ చేశారు. ఆ వీడియోలో నాన్ స్ట్రయికర్ బ్యాట్‌కు బదులు కొబ్బరి మట్టతో క్రీజులోకి వచ్చాడు. బ్యాట్స్‌మెన్ బంతిని కొట్టిన కాసేపటికి నాన్‌స్ట్రయికర్ పరుగు కోసం ప్రయత్నించడం.. క్రీజు మధ్యలో నిలుచొని కొబ్బరి మట్టతో సులువుగా పరుగులు సాధించాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో తెగ హల్చల్ చేస్తోంది. ‘ఈ విధమైన క్రికెట్‌కు ఐసీసీ ఒప్పుకుంటే మన్కడింగ్ వివాదమే ఉండదు’ అంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. చదవండి: మన్కడింగ్ ఔట్ అంటే ఏంటో తెలుసా? అశ్విన్ ఏందీ తొండాట..! -
అమ్మా.. ధోనికే మన్కడింగా?
ముంబై : మన్కడింగ్.. తాజా ఐపీఎల్ సీజన్లో రచ్చలేపిన అంశం. రాజస్తాన్ రాయల్స్ ఆటగాడు జోస్ బట్లర్‌ను కింగ్స్ ఎలెవన్ పంజాబ్ కెప్టెన్ రవిచంద్రన్ అశ్విన్ మన్కడింగ్ విధానంలో ఔట్ చేయడంతో ఈ నిబంధనపై తీవ్ర చర్చనీయాంశమైంది. అశ్విన్ క్రీడాస్పూర్తికి విరుద్దంగా వ్యవహరించాడని మాజీ క్రికెటర్లు, అభిమానులు, క్రీడా విశ్లేషకులు దుమ్మెత్తిపోసారు. అయితే ఈ తరహా ఔట్ క్రికెట్ నిబంధనల్లో ఉన్నప్పటికి.. క్రీడా స్పూర్తికి విరుద్దంగా ఉందని తీసేయాలనే డిమాండ్ వ్యక్తం అవుతోంది. గతంలో చాలా సార్లు ఈ తరహాలో తీసినప్పటికి.. కొందరు క్రీడా స్పూర్తితో బ్యాట్స్‌మన్‌ను వెనక్కి పిలిచిన సందర్భాలు ఉన్నాయి. అయితే తాజాగా మరోసారి మన్కడింగ్ పదం చర్చనీయాంశమైంది. గురువారం చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ ఆటగాడు కృనాల్ పాండ్యా ఈ తరహా ఔట్‌కు ప్రయత్నించాడు. కానీ చెన్నై ఆటగాడు మహేంద్రసింగ్ ధోని ఆ అవకాశం ఇవ్వలేదు. కేదార్ జాదవ్‌కు బంతి వేయాల్సిన కృనాల్ ఒక్కసారిగా ఆగి నాన్‌స్ట్రైకర్ ధోనిని హెచ్చరించాడు. కానీ ధోని తన బ్యాట్‌ను క్రీజులోనే ఉంచి ఏ మాత్రం అవకాశం ఇవ్వలేదు. ఈ సందర్భంగా కామెంటేటర్స్ ఆసక్తికరంగా వ్యాఖ్యానించారు. ధోని తన 15 ఏళ్ల కెరీర్లో మైదానంలో ఏ మాత్రం అలసత్వంగా ఉండలేదని, అది వికెట్ల వెనుకాలనైనా.. క్రీజులోనైనా అని వ్యాఖ్యానించారు. ఇక దీనికి సంబంధించిన వీడియో నెట్టింట హల్చల్ చేస్తుండగా.. అమ్మా..ధోనికే మన్కడింగా అంటూ అభిమానులు కామెంట్ చేస్తున్నారు. చదవండి: మన్కడింగ్ ఔట్ అంటే ఏంటో తెలుసా? అశ్విన్ ఏందీ తొండాట..! -
ట్రాఫిక్ పోలీస్ ‘మన్కడింగ్’
బట్లర్‌ను ‘మన్కడింగ్’ ద్వారా అశ్విన్ ఔట్ చేయడం ఎంత వివాదం రేపిందో తెలిసిందే. అయితే కోల్‌కతా పోలీసులు దీనిలో మరో కోణాన్ని చూశారు. వెంటనే దానిని పోస్టర్‌గా మలచి ప్రజల్లో ‘ట్రాఫిక్ అవగాహన’ కోసం వాడుకునే ప్రయత్నం చేశారు. ‘ఆకుపచ్చ లైట్ రాక ముందే ముందుకు వెళ్లవద్దు, గీత దాటితే తప్పించుకోలేరు... అంటూ బెంగాలీలో వ్యాఖ్య రాసి ట్రాఫిక్ ఫోటో కూడా కలిపి పెట్టారు. దీనిపై స్పందన ఎలా ఉంటుందనేది ఆసక్తికరం. ఎందుకంటే 2017 చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో బుమ్రా నోబాల్ కారణంగా బతికిపోయిన ఫఖర్ జమాన్ సెంచరీతో పాక్‌ను గెలిపించడంతో ఇదే తరహాలో జైపూర్ పోలీసులు పోస్టర్లు వేశారు. దేశం తరఫున ఆడే ఆటగాడికి మీరిచ్చే గౌరవం ఇదేనా అంటూ అప్పట్లో స్వయంగా బుమ్రా దీనిపై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేయడంతో పోలీసులు వాటిని తొలగించాల్సి వచ్చింది. -
‘అతడెవర్నీ మోసం చేయలేదు’
హైదరాబాద్: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)-2019లో ‘మన్కడింగ్’ తీవ్ర వివాదం రేపిన విషయం తెలిసిందే. రాజస్తాన్ రాయల్స్ బ్యాట్స్‌మన్ జోస్ బట్లర్‌ను రవిచంద్రన్ అశ్విన్ మన్కడింగ్ విధానం ద్వారా ఔట్ చేశాడు. దీంతో అశ్విన్ క్రీడా స్పూర్తి మరిచాడంటూ ఐపీఎల్ అభిమానులు, మాజీ ఆటగాళ్లు తీవ్రంగా విమర్శిస్తున్నారు. అంతే కాకుండా అతడి వ్యక్తిత్వాన్ని కూడా కించపరుస్తున్నారు. అయితే ఈ వివాదంపై ఇప్పటికే అశ్విన్‌కు మురళీ కార్తీక్, బీసీసీఐ మద్దతు తెలపగా.. తాజాగా అండర్-19 కోచ్ రాహుల్ ద్రవిడ్ కూడా అశ్విన్‌కు బాసటగా నిలిచాడు. అశ్విన్ ఎవర్నీ మోసం చేయలేదని.. తన పరిమితులకు లోబడే మన్కడింగ్ చేశాడని, అతడిపై విమర్శలు చేయడం సరికాదని ద్రవిడ్ పేర్కొన్నాడు. అయితే మన్కడింగ్ చేసే ముందు బ్యాట్స్‌మన్‌ను ఒక్కసారైనా హెచ్చరించి ఉండాల్సిందని ఆయన చెప్పుకొచ్చాడు. ఎవరు అంగీకరించినా, అంగీకరించకున్నా అశ్విన్ తన హద్దులకు లోబడే ప్రవర్తించాడని పేర్కొన్నాడు . ఈ చర్యతో అతడి వ్యక్తిత్వానికి అగౌరవపరచడం తగదన్నాడు. ఇది కేవలం తన వ్యక్తిగత అభిప్రాయమని, అదే విధంగా ఇతరుల మనోభావాలను గౌరవిస్తానని ద్రవిడ్ పేర్కొన్నాడు. ఈ మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ ఆటగాడు జోస్ బట్లర్ 67 పరుగులతో ఆ జట్టును గెలుపు దిశగా తీసుకెళ్తున్న వేళ.. అశ్విన్ మన్కడింగ్‌తో మ్యాచ్‌ను మలుపు తిప్పాడు. బట్లర్ నిష్ర్కమణ తర్వాత మిగిలిన బ్యాట్స్‌మన్ పెవిలియన్‌కు క్యూ కట్టడంతో పంజాబ్ నిర్దేశించిన లక్ష్యాన్ని చేరుకోవడంలో రాజస్థాన్ రాయల్స్ జట్టు విఫలమైంది. ఇక ద్రవిడ్ గతంలో రాజస్థాన్ రాయల్స్ జట్టు కోచ్‌గా వ్యవహరించిన విషయం తెలిసిందే. -
‘మన్కడింగ్’ రేపిన దుమారం
జైపూర్: ఐపీఎల్ మ్యాచ్‌లో రాజస్తాన్ బ్యాట్స్‌మన్ బట్లర్‌ను ‘మన్కడింగ్’ ద్వారా ఔట్ చేసి పంజాబ్ కెప్టెన్ రవిచంద్రన్ అశ్విన్ కొత్త వివాదాన్ని తెర మీదకు తెచ్చాడు. అతను నిబంధనల ప్రకారమే వ్యవహరించాడంటూ కొందరు మద్దతు పలుకుతుండగా... భారత టాప్ స్పిన్నర్ చేసింది తప్పేనంటూ మరికొందరు వ్యాఖ్యానించారు. అయితే తాజా ఘటనపై అశ్విన్ మాత్రం మొదటి నుంచీ ఒకే మాటకు కట్టుబడి ఉన్నాడు. తాను చేసిన దాంట్లో తప్పేమీ లేదని అతను మ్యాచ్ తర్వాత కూడా కుండబద్దలు కొట్టినట్లు మాట్లాడాడు. ‘నేను అలా ఔట్ చేయాలని వ్యూహం ఏమీ రచించుకోలేదు. అది అప్పటికప్పుడు జరిగిపోయిందంతే. నిబంధనలకు అనుగుణంగానే నేను వ్యవహరించాను. క్రీడా స్ఫూర్తి అనే మాటను ఎందుకు ముందుకు తెస్తున్నారో నాకు అర్థం కావడం లేదు. స్ఫూర్తికి విరుద్ధమని భావిస్తే నిబంధనలే మార్చేయండి. ఎప్పుడో 1987 ప్రపంచకప్‌లో జరిగిన ఘటనతో దీనిని పోల్చవద్దు. నాటి మ్యాచ్‌లో నేను గానీ బట్లర్ గానీ ఆడలేదు. బంతి వేసే సమయంలో కావాలని ఆలస్యం చేశాననే మాటను కూడా నేను అంగీకరించను. అతను అప్పటికే ముందుకు వెళ్లిపోయాడు’ అని అశ్విన్ వివరణ ఇచ్చాడు. 2012లో బ్రిస్బేన్‌లో జరిగిన వన్డేలో కూడా అశ్విన్ ఇదే తరహాలో తిరిమన్నెను ఔట్ చేయగా... భారత తాత్కాలిక కెప్టెన్ సెహ్వాగ్ తమ అప్పీల్‌ను వెనక్కి తీసుకోవడంతో తిరిమన్నె బ్యాటింగ్ కొనసాగించాడు. 2014లో ఎడ్జ్‌బాస్టన్‌లో జరిగిన వన్డేలో బట్లర్‌ను ఇదే రీతిలో సేననాయకే మన్కడింగ్ చేశాడు. మరోవైపు గతంలో జరిగిన ఐపీఎల్ కెప్టెన్ల సమావేశంలో మన్కడింగ్ చేయరాదంటూ నిర్ణయం తీసుకున్నామంటూ మాజీ చైర్మన్ రాజీవ్ శుక్లా గుర్తు చేయగా... అది నిబంధనలు మారక ముందు జరిగిన సమావేశమని బోర్డు అధికారి ఒకరు స్పష్టం చేశారు. మన్కడింగ్ అంటే..: క్రికెట్ నిబంధనలు రూపొందించే ఎంసీసీ ప్రకారం... బౌలర్ బంతిని వేయడానికి సిద్ధమై, అతని చేతినుంచి ఇంకా బంతి వెళ్లక ముందే నాన్‌స్ట్రైకర్ క్రీజ్ దాటి బయటకు వస్తే బెయిల్స్‌ను పడగొట్టి బౌలర్ సదరు బ్యాట్స్‌మన్ ఔట్ కోసం అప్పీల్ చేయవచ్చు. ఇది సాంకేతికంగా రనౌట్ జాబితాలో వస్తుంది. 2017 అక్టోబర్ 1నుంచి అమల్లోకి వచ్చిన నిబంధనల ప్రకారం బౌలర్ బంతిని విసిరే లోగా ఏ సమయంలోనైనా నాన్‌స్ట్రైకర్ క్రీజ్ బయట ఉంటే ఔట్‌గానే పరిగణిస్తారు. నిబంధల ప్రకారం అశ్విన్ చేసింది సరైందే. క్రీడా స్ఫూర్తి ప్రకారం బ్యాట్స్‌మన్‌ను ఔటే చేసే ముందు ఒక సారి హెచ్చరిస్తే బాగుంటుందని అంటారు కానీ నిబంధనల్లో ఎక్కడా ముందుగా హెచ్చరించాలని లేదు. 1947లో సిడ్నీ టెస్టులో ఆసీస్ బ్యాట్స్‌మన్ బ్రౌన్‌ను భారత ఆల్‌రౌండర్ వినూ మన్కడ్ ఇలా ఔట్ చేయడంతో ‘మన్కడింగ్’ అని పేరు వచ్చింది. అశ్విన్ చేసిన పని అతను ఎలాంటివాడో చెబుతుంది. పంజాబ్ జట్టు సభ్యుల కళ్లలోకి నేను చూసినప్పుడు అపరాధ భావం కనిపించింది. అలా చేయడం సరైందో కాదో అభిమానులే నిర్ణయిస్తారు.’ – రాజస్తాన్ కోచ్ ప్యాడీ ఆప్టన్ ఒక వ్యక్తిగా, కెప్టెన్‌గా అశ్విన్ చేసిన పని నిరాశ కలిగించింది. అశ్విన్ కావాలనే బంతి వేయకుండా ఆగిపోయాడు. దానిని డెడ్‌బాల్‌గా ప్రకటించాల్సింది. ఇది క్రీడాస్ఫూర్తికి విరుద్ధం. – వార్న్, మాజీ క్రికెటర్ నిబంధనలు ఉన్నాయి. మైదానంలో కెమెరాలూ ఉన్నాయి. నాకు కుప్పలు తెప్పలుగా మెసేజ్‌లు పంపడం ఆపండి. ఏదైనా ఉంటే అశ్విన్ టైమ్‌లైన్‌లో చేసుకోండి. దీనికంటే నా సౌందర్యపోషణ గురించి, లిప్‌స్టిక్ షేడ్ గురించి అడుగుతున్నవారే నయం.’ – అశ్విన్ భార్య ప్రీతి అసహనం క్రీడాస్ఫూర్తి గురించి అశ్విన్‌కు గుర్తు చేయాల్సిన అవసరం లేదు. అంతా రూల్స్ ప్రకారమే జరిగింది. ఏదైనా తప్పు ఉంటే అంపైర్లు, రిఫరీ చూసుకుంటారు. అశ్విన్‌కు నియమాలు ఏమిటో వాటిని ఎలా వాడుకోవాలో బాగా తెలుసు.’ – బీసీసీఐ -
వైరల్: అశ్విన్ ‘మన్కడింగ్’ మరో వీడియో
సాక్షి, హైదరాబాద్: ఇండియన్ ప్రీమియరల్ లీగ్(ఐపీఎల్)-2019లో కింగ్స్ పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ ఆటగాడు జోస్ బట్లర్ ఔట్ వివాదానికి దారి తీసింది. జోస్ బట్లర్‌ని 'మన్కడింగ్' ద్వారా రనౌట్ చేయడంపై కింగ్స్ పంజాబ్ సారథి రవిచంద్రన్ అశ్విన్‌ను అభిమానులు, మాజీ ఆటగాళ్లు ఉతికారేస్తున్నారు. జెంటిల్మన్ గేమ్‌లో అశ్విన్ క్రీడా స్పూర్తికి విరద్దంగా ప్రవర్తించాడని యావత్ క్రికెట్ ప్రపంచం విమర్శిస్తోంది. (‘మన్కడింగ్ వద్దనుకున్నాం కదా..’) అయితే తాజాగా గతంలో టీమిండియా - శ్రీలంక మ్యాచ్‌లో ఈ విధంగానే అశ్విన్ మన్కడింగ్ ద్వారా శ్రీలంక బ్యాట్స్‌మన్‌ను ఔట్ చేస్తే సచిన్, సెహ్వాగ్ లు చొరవతీసుకొని క్రీడాస్ఫూర్తితో అప్పీల్ ను వెనక్కి తీసుకున్న వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. క్రికెట్లో అత్యంత హుందాగా వ్యవహరించే దిగ్గజ ఆటగాళ్లు సచిన్, సెహ్వాగ్ లాంటి ఉన్నతమైన క్రీడాకారుల నుంచి కనీస స్ఫూర్తిని కూడా అశ్విన్ పొందలేదంటూ ఐపీఎల్ అభిమానులు దుమ్మెత్తిపోస్తున్నారు. (‘అశ్విన్‌ను చూసి గర్వపడుతున్నా’) ఇక అశ్విన్ మాత్రం తను చేసిన పనిని సమర్ధించుకున్నాడు. మ్యాచ్ అనంతరం మాట్లాడుతూ..‘మన్కడింగ్ ఘటనపై అసలు చర్చే అనవసరం. అదేమీ కావాలని చేసింది కాదు. అలా జరిగిపోయిందంతే. నా బౌలింగ్ యాక్షన్ పూర్తి కాకముందే అతను క్రీజ్ వదిలాడు. ఈ విషయంలో నేను స్పష్టంగా ఉన్నా. ఇలాంటి చిన్న చిన్న విషయాలే మ్యాచ్‌ను మలుపు తిప్పుతాయి కాబట్టి బ్యాట్స్‌మన్ జాగరూకతతో ఉండటం అవసరం.’ అని అశ్విన్ పేర్కొన్నాడు. చదవండి: మన్కడింగ్ ఔట్ అంటే ఏంటో తెలుసా? -
‘మన్కడింగ్ వద్దనుకున్నాం కదా..’
సాక్షి, హైదరాబాద్ : ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)-12లో తొలి వివాదం రాజుకుంది. సోమవారం రాజస్తాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కింగ్స్ పంజాబ్ సారథి ఈ వివాదానికి తెరలేపిన విషయం తెలిసిందే. జోరుమీదున్న జాస్ బట్లర్‌ను మన్కడింగ్ విధానంలో అశ్విన్ ఔట్ చేశాడు. అయితే క్రికెట్లో ఇది చట్టబద్దమైనా.. క్రీడా స్పూర్తికి విరుద్దమంటూ అభిమానులు, మాజీ ఆటగాళ్లు విమర్శిస్తున్నారు. అయితే తాజాగా ఈ వివాదంపై ఐపీఎల్ చైర్మన్ రాజీవ్ శుక్లా ట్విటర్లో స్పందించారు. ‘కోల్‌కతాలో జరిగిన ఓ ఐపీఎల్ సమావేశంలో విరాట్ కోహ్లి, ఎంఎస్ ధోనిలతో కలిసి మన్కడింగ్ విధానాన్ని పాటించవద్దని నిర్ణయించాం. నాన్ స్ట్రైకర్ క్రీజు దాటి వెళితే బౌలర్ ఔట్ చేయవద్దని అనుకున్నాం’అంటూ ట్వీట్ చేశారు. ఇక అశ్విన్ మాత్రం తను చేసిన పనిని సమర్ధించుకున్నాడు. మ్యాచ్ అనంతరం మాట్లాడుతూ..‘మన్కడింగ్ ఘటనపై అసలు చర్చే అనవసరం. అదేమీ కావాలని చేసింది కాదు. అలా జరిగిపోయిందంతే. నా బౌలింగ్ యాక్షన్ పూర్తి కాకముందే అతను క్రీజ్ వదిలాడు. ఈ విషయంలో నేను స్పష్టంగా ఉన్నా. ఇలాంటి చిన్న చిన్న విషయాలే మ్యాచ్‌ను మలుపు తిప్పుతాయి కాబట్టి బ్యాట్స్‌మన్ జాగరూకతతో ఉండటం అవసరం.’ అని అశ్విన్ పేర్కొన్నాడు. -
‘మన్కడింగ్’ పేరును తొలగించండి!
సునీల్ గావస్కర్ సూచన ముంబై: భారత క్రికెట్ దిగ్గజం వినూ మన్కడ్ గౌరవాన్ని తగ్గించే విధంగా ఉన్న ‘మన్కడింగ్’ పద ప్రయోగాన్ని క్రికెట్ పరిభాష నుంచి తొలగించాలని మాజీ కెప్టెన్ సునీల్ గావస్కర్ అభిప్రాయపడ్డారు. బౌలర్ చేతి నుంచి బంతి దాటక ముందే నాన్‌స్ట్రైకర్ క్రీజ్ వదిలినప్పుడు అతడిని అవుట్ చేయడాన్ని మన్కడింగ్‌గా వ్యవహరిస్తారు. 1947–48 ఆస్ట్రేలియా సిరీస్‌లో బిల్ బ్రౌన్‌ను మన్కడ్ ఈ తరహాలో అవుట్ చేసినప్పటి నుంచి అతని పేరునే దీనికి వాడుతున్నారు. ‘ఈ పేరును వాడటం మన్కడ్‌లాంటి దిగ్గజ ఆటగాడి స్థాయిని తగ్గిస్తున్నట్లుగా అనిపిస్తోంది. నిజంగా పేరుతోనే దీనిని పిలవాలంటే అప్పటి నాన్‌స్ట్రైకర్ పేరునే దీనికి వాడాలి. ఎందుకంటే మన్కడ్ రెండుసార్లు హెచ్చరించిన తర్వాత కూడా అతను క్రీజ్ దాటి వెళ్లాడు. తప్పు బ్యాట్స్‌మన్‌దే. కాబట్టి దీనిని బ్రౌనింగ్ అని వ్యవహరిస్తే మేలు’ అని గవాస్కర్ సూచించారు. ఇటీవలే క్రికెట్ నిబంధనల్లో ఎంసీసీ పలు మార్పులు చేసింది. ఇందులో మన్కడింగ్‌ను పూర్తిగా బ్యాట్స్‌మన్ తప్పుగా నిర్ధారించింది. రనౌట్‌కు నాన్స్ట్రైకర్దే తప్ప బౌలర్‌ది బాధ్యత కాదని స్పష్టం చేసింది. -
‘మన్కడింగ్’ మారింది!
లండన్: మన్కడింగ్... క్రికెట్లో వివాదాస్పద నిబంధనల్లో ఒకటి. క్రికెట్ నియమావళి 42.15 ప్రకారం బౌలర్ బంతి విసరకముందే నాన్ స్ట్రయికర్ క్రీజ్ దాటినప్పుడు అతడిని అవుట్ చేసే అవకాశం ఈ నిబంధన కల్పిస్తుంది. దీన్ని 1947–48లో తొలిసారిగా భారత బౌలర్ వినూ మన్కడ్ చేయడంతో ఆయన పేరుమీదుగా మన్కడింగ్ నిబంధనగా మెరిల్‌బోన్ క్రికెట్ క్లబ్ (ఎంసీసీ) నియమావళిలో చేర్చారు. అయితే ఇది క్రీడా స్ఫూర్తికి విరుద్ధమని చాలా సందర్భాల్లో వివాదం జరిగింది. అయితే ఈ నిబంధనను ఎంసీసీ మార్చేసింది. ఇప్పుడు దీన్ని 41.16 నిబంధన ప్రకారం ‘బ్యాట్స్‌మన్ తప్పిదం’గా మార్చారు. పూర్తిగా బౌలర్‌కు అనుకూలమైన నిబంధనగా మారిందిపుడు. గతంలో బౌలర్ యాక్షన్‌కు ముందు మాత్రమే ఔట్ చేసే అవకాశముండేది. ఇప్పుడు యాక్షన్ (బంతి విడుదలకు ముందు చేయి పూర్తిగా తిరిగినా) తర్వాత కూడా ఔట్ చేసే వెసులుబాటు కల్పించారు. ఏప్రిల్ 12న మన్కడ్ జయంతి. పైగా ఈ ఏడాది శత జయంతి రోజే ఆయన పేరుతో ఉన్న నిబంధన మారడం గమనార్హం. -
‘మన్కడింగ్’లో మార్పు లేదు
స్పష్టం చేసిన ఎంసీసీ లండన్: అంతర్జాతీయ క్రికెట్లో ప్రస్తుతం అమల్లో ఉన్న ‘మన్కడింగ్’ నిబంధనను మార్చాల్సిన అవసరం లేదని ఎంసీసీ వరల్డ్ క్రికెట్ కమిటీ తేల్చి చెప్పింది. మన్కడింగ్ క్రీడా స్ఫూర్తికి విరుద్ధం కాదని అభిప్రాయ పడింది. బౌలర్ బంతి విసరక ముందే (డెలివరీ స్ట్రైడ్ పూర్తి కాకుండా) నాన్‌స్ట్రైకర్ ఆటగాడు క్రీజ్‌ను విడిచి ముందుకు వెళితే అతడిని బౌలర్ అవుట్ చేయవచ్చని మన్కడింగ్ నిబంధన చెబుతోంది. అయితే తరచూ ఇది వివాదాస్పదం అవుతోంది. ఇటీవల ఇంగ్లండ్ ఆటగాడు బట్లర్‌ను లంక బౌలర్ సేనానాయకే ఇలా అవుట్ చేయడం క్రీడా స్ఫూర్తికి విరుద్ధమంటూ దుమారం రేపింది. అయితే వరల్డ్ క్రికెట్ కమిటీ సభ్యుడైన ఆండ్రూ స్ట్రాస్ ఇందులో తప్పేమీ లేదన్నారు. ‘ఇది క్రీడా స్ఫూర్తికి సంబంధించిన విషయం కాదు. ఇది నిబంధనలను సరిగ్గా పాటించడానికి సంబంధించినది. అలా అవుట్ కాకూడదంటే మీరు సరిగ్గా క్రీజ్‌లో ఉండండి చాలు. దీని గురించి బౌలర్ గానీ, ఫీల్డింగ్ జట్టు కెప్టెన్ గానీ హెచ్చరించాల్సిన అవసరం కూడా లేదు. మన్కడింగ్ లేకపోతే నాన్‌స్ట్రైకర్ అదనపు ప్రయోజనం పొందే ప్రయత్నం చేస్తాడు’ అని స్ట్రాస్ స్పష్టం చేశారు.