ముంబై : క్రికెట్‌లో ఫ్రీ బాల్ నిబంధన తేవాల్సిన అవసరముందని టీమిండియా సీనియర్ ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అభిప్రాయపడ్డాడు. బౌలర్ బంతిని వదిలే లోపలే నాన్ స్ట్రయికర్క్రీజును వదిలి ముందుకు వెళితే పరుగు పూర్తి చేసేందుకు అనుమతించకూడదని సూచించాడు.అలా కాకుంటే తర్వాతి బంతిని ఫ్రీబాల్గా ప్రకటించేలా నిబంధన తేవాలని పేర్కొన్నాడు. దీనర్థం ఏంటంటే ఒకవేళ ఫ్రీబాల్‌కు పరుగు చేసినా అది లెక్కలోకి రాదని అశ్విన్ వెల్లడించాడు.(ఆల్‌టైమ్ గ్రేట్‌లలో వారు కూడా..)
దీనిపై అశ్విన్ వరుస ట్వీట్లను సంధించాడు. 'ఒకవేళ బంతి వేయకముందే నాన్ స్ట్రయికర్ రెండు అడుగులు ముందుకు వెళ్లి.. దానివల్లే రెండు పరుగులు పూర్తి చేయగలిగితే మళ్లీ అదే బ్యాట్స్‌మన్ స్ట్రయికింగ్‌కు వస్తాడు. ఆ తర్వాతి బంతికి అతడు ఫోర్ లేదా సిక్సర్ కొడితే ఐదు లేదా ఏడు పరుగులు సమర్పించుకున్నట్టే. ఒకవేళ ఒక పరుగే వస్తే.. కొత్త బ్యాట్స్‌మన్ స్ట్రయిక్‌లోకి వచ్చి డాట్ బాల్ ఆడే అవకాశం ఉంటుంది' అని అశ్విన్ ట్వీట్ చేశాడు. ఒకవేళ నాన్ స్ట్రయికర్ ముందుకు వెళితే రనౌట్(మన్కడింగ్) చేసే అవకాశం ఉంటుంది కదా అని యూజర్ అడిగిన ప్రశ్నకి అశ్విన్ స్పందించాడు. ' ముందుకు వెళ్లడాన్ని అనుమతించకపోయే బదులు.. ఆ తర్వాతి బంతిని బౌలర్‌కు ఫ్రీబాల్గా ఇవ్వాలి. ఇదే కాస్త న్యాయంగా ఉంటుంది' అని అశ్విన్ సమాధానమిచ్చాడు.
కాగా గతంలో కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ తరఫున ఆడిన అశ్విన్ మన్కడింగ్ విధానంలో రాజస్థాన్ రాయల్స్ ఆటగాడు జాస్ బట్లర్‌ను అవుడ్ చేయడం అప్పట్లో విమర్శలకు దారి తీసింది. కాగా 2023 వన్డే ప్రపంచకప్ కోసం నిర్వహించే సూపల్ లీగ్‌లో ఫ్రంట్ ఫుట్నోబాల్ నిర్ణయాన్ని ఐసీసీ థర్డ్ అంపైర్‌కు అప్పగించిన సంగతి తెలిసిందే. జూలై 30 నుంచి జరిగే ఇంగ్లండ్, ఐర్లాండ్ వన్డే సిరీస్‌తో కొత్త నిబంధన అమల్లోకి రానుంది. మరో వైపు వన్డే సూపర్ లీగ్‌లో స్లో ఓవర్‌రేట్‌కు కూడా శిక్షను కఠినతరం చేశారు. ఇప్పటి వరకు విధిస్తున్న జరిమానా కాకుండా ఒక ఓవర్ ఆలస్యమైతే ఒక పాయింట్ కోత విధించాలని ఐసీసీ నిర్ణయించింది. ఈ నేపథ్యంలో అశ్విన్ ఫ్రీ బాల్ నిబంధనను తెర మీదకు తీసుకువచ్చాడు.
Comments
Please login to add a commentAdd a comment