ఢాకా వేదికగా బంగ్లాదేశ్-న్యూజిలాండ్ మధ్య జరిగిన రోండో వన్డేలో ఓ ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. రనౌట్ అయ్యి పెవిలియన్‌కు వెళ్తున్న కివీస్ బ్యాటర్‌ను వెనక్కి పిలిచి.. బంగ్లాదేశ్ క్రికెట్ జట్టు క్రీడా స్పూర్తిని చాటుకుంది.
ఏం జరిగిందంటే?
ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన న్యూజిలాండ్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. 167 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి కివీస్ కష్టాల్లో పడింది. ఇటువంటి సమయంలో కివీస్ స్పిన్ ఆల్‌రౌండర్ ఇష్ సోధి జట్టును అదుకునే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో కివీస్ ఇన్నింగ్స్ 46 ఓవర్ వేసేందుకు బంగ్లా పేసర్ హసన్ మహమూద్ సిద్దమయ్యాడు.
అయితే తొలి బతి వేసేందుకు సిద్దమైన మహమూద్.. నాన్ స్ట్రైక్ ఎండ్‍లో ఉన్న న్యూజిలాండ్ బ్యాటర్ ఇష్ సోదీని రౌనౌట్(మన్కడింగ్) చేశాడు. సోధి క్రీజు దాటడం గమనించిన మహమూద్ బంతిని డెలివరీ చేయకుండా స్టంప్స్‌ను పడగొట్టాడు.
వెంటనే రనౌట్‌కు అప్పీల్ చేయగా.. ఫీల్డ్ అంపైర్‌లు థర్డ్ అంపైర్‌కు రిఫర్ చేశాడు. థర్డ్ అంపైర్ నితిన్ మీనన్ కొత్త నిబంధనల ప్రకారం ఔట్‌గా ప్రకటించాడు. దీంతో నిరాశతో పెవిలియన్ వైపుగా సోధి నడిచాడు.
బంగ్లాదేశ్ క్రీడా స్పూర్తి..
సరిగ్గా ఇదే సమయంలో బంగ్లాదేశ్ తమ క్రీడా స్పూర్తిని చాటుకుంది. బంగ్లాదేశ్ కెప్టెన్ లిటన్ దాస్, సహచర ఆటగాళ్లు అంపైర్‌లతో చర్చలు జరిపి సోదీని వెనక్కి పిలవాలని నిర్ణయించుకున్నారు. వెంటనే హసన్ మహమూద్ పరిగెత్తుకుంటూ వెళ్లి సోధిని వెనుక్కి పిలిచాడు.
మళ్లీ తిరిగి వచ్చిన సోదీ నవ్వుతూ హసన్ మహమూద్‍ను కౌగిలించుకున్నాడు. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఇది చూసిన అభిమానులు బంగ్లాదేశ్ మంచి మనసుకు పిధా అయిపోయారు. కాగా ఈ మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌పై 86 పరుగుల తేడాతో కివీస్ విజయం సాధించింది.
చదవండి: Asian Games 2023: సెమీస్‌లో బంగ్లాదేశ్ చిత్తు.. ఫైనల్‌కు చేరిన భారత్
#BabarAzam𓃵 Asif
— Muhammad Farhan Ali (@imrealfarhanali) September 23, 2023
Hassan Mahmud mankad Ish Sodhi then made him come back.
Umpire gave it out
(Rabitholebd Sports) pic.twitter.com/tyDbSr5WPJ
Comments
Please login to add a commentAdd a comment