ప్రస్తుతం ప్రపంచ క్రికెట్‌లో తరుచూ ఏదో ఒక మ్యాచ్‌లో మన్కడింగ్( నాన్-స్ట్రైకర్స్ రనౌట్)ను మనం చూస్తునే ఉన్నాం. కొన్ని వివాదాస్పదంగా మారిన సందర్భాలు ఉన్నాయి. తాజాగా ఇటువంటి సంఘటనే ఒకటి యూరోపియన్ క్రికెట్ లీగ్‌లో చోటు చేసుకుంది. బౌలర్ బంతి వేయకముందే నాన్ స్ట్రైకర్ దాదాపు మిడిల్ పిచ్ వరకు వెళ్లిపోయాడు.
రౌనౌట్ చేసే అవకాశం ఉన్నప్పటికీ.. బౌలర్ మాత్రం కేవలం వార్నింగ్‌తోనే సరిపెట్టాడు. అయితే పిచ్ మధ్య వరకు వెళ్లిన బ్యాటర్ మళ్లీ వెనుక్కి వచ్చే ప్రయత్నం చేయకపోవడం గమానార్హం. ఈ సంఘటన సైప్రస్ మౌఫ్లన్స్- పంజాబ్ లయన్స్ మ్యాచ్ సందర్భంగా జరిగింది.
అయితే ఈ వీడియో మాత్రం సోషల్ మీడియాలో నవ్వులు పూయిస్తోంది. నెటిజన్లు ఈ వీడియోపై ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు. "కొంచెం బంతిని చూసి వెళ్ల వచ్చుకదా" అంటూ ఓ యూజర్ కామెంట్ చేశాడు. ఇక తాజాగా బిగ్‌బాష్ లీగ్‌లో కూడా ఆడమ్ జంపా చేసిన మన్కడింగ్ తీవ్ర చర్చనీయాంశం అయింది.
Incredible backing up🤯 #EuropeanCricket #EuropeanCricketLeague #ThrowbackECL22 pic.twitter.com/lZZroI2X3V
— European Cricket (@EuropeanCricket) January 6, 2023
చదవండి: Rishabh Pant: రిషభ్ పంత్ మోకాలి సర్జరీ సక్సెస్.. కానీ!
Comments
Please login to add a commentAdd a comment