వైరల్‌: ఆసుపత్రిలో కలకలం.. కాటేసిన పామునే మెడలో వేసుకుని.. | Bihar Man Bitten By Snake Walks Into Hospital With Reptile In Hand, Watch Shocking Video Goes Viral | Sakshi
Sakshi News home page

వైరల్‌: ఆసుపత్రిలో కలకలం.. కాటేసిన పామునే మెడలో వేసుకుని..

Published Wed, Oct 16 2024 9:23 PM | Last Updated on Thu, Oct 17 2024 1:33 PM

Bihar Man Bitten By Snake Walks Into Hospital With Reptile In Hand

భాగల్‌పూర్‌: తనను కాటేసిన పాము నోటిని గట్టిగా పట్టుకుని ఆసుపత్రికి వచ్చిన ఓ వ్యక్తి కలకలం సృష్టించాడు. బీహార్‌లోని భాగల్‌పూర్‌లో ఈ ఘటన జరిగింది. ప్రపంచంలోని అత్యంత ప్రమాదకరమైన ఐదు పాములలో ఒకటైన రస్సెల్స్‌ వైపర్ కాటుకు గురైన ప్రకాశ్ మండల్.. పాముని మెడలో వేసుకుని ఆస్పత్రికి వైద్యం కోసం రావడంతో అక్కడ వారంతా షాక్‌ అయ్యారు. భయంతో పరుగులు తీశారు.

ఈ సమయంలో పామును చేతిలో పట్టుకుని ఆసుపత్రి అంతా తిరుగుతూ కొంతసేపు నేలపై పడుకున్నాడు. అతని ఎడమ చేతికి పాము కాటు వేయగా, అక్కడ ఉన్న డాక్టర్లు కూడా అతని దగ్గరికి వచ్చే ధైర్యం చేయలేకపోయారు. పామును పట్టకుని ఉంటే వైద్యం కష్టమని వైద్యులు తెలిపారు. దీంతో అతి కష్టం మీద పామును ఒక సంచిలో వేసి కట్టేసిన తర్వాత ప్రకాశ్ మండల్‌కు చికిత్స ప్రారంభించారు. ఆసుపత్రిలో జరిగిన ఈ మొత్తం సంఘటనకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. ప్రస్తుతం అతని ఆరోగ్య పరిస్థితి మెరుగ్గానే ఉందని, ప్రాణాపాయం తప్పినట్లు వైద్యులు తెలిపారు.

 ఇదీ చదవండి: 82 ఏళ్ల జీవితకాలంలో ఒక్క మహిళని కూడా చూడలేదట..!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement