క్రికెట్.. జెంటిల్ మ్యాన్ గేమ్ గా పేరొందిన విషయం అందరికి తెలిసిందే. కానీ క్రికెట్ టోర్నమెంట్‌లో ఆ పేరుకే మాయని మచ్చ తీసుకువచ్చారు. ఓ మ్యాచ్‌లో ఆటగాళ్లు పొట్టు పొట్టు కొట్టుకున్నారు. అంపైర్‌లు ఆపినా కూడా బ్యాట్‌లతో మరి కొట్టుకున్నారు. ప్రొఫిషనల్‌గా ఉండాల్సిన క్రికెటర్లు వీధి రౌడీల్లా మారారు. అస్సలు ఈ సంఘటన ఎక్కడ జరిగింది? ఇంతకీ ఆ టోర్నీ ఏదో తెలుసుకోవాలంటే ఈ కథనం చదవాల్సిందే.
ఏం జరిగిందంటే?
ఎంసీసీ స్పోర్ట్స్ క్రికెట్ క్లబ్.. ఎంసీసీ వీక్‌డేష్ బాష్ XIX పేరిట ఓ టోర్నీ నిర్వహించింది. ఈ టోర్నీకి యూఏఈలోని ఆజ్మల్ ఆతిథ్యమిచ్చింది. ఈ టోర్నీలో భాగంగా మంగళవారం జరిగిన ఫైనల్లో ఏరోవిసా క్రికెట్, రబ్దాన్ క్రికెట్ క్లబ్‌లు తలపడ్డాయి. అయితే ఈ మ్యాచ్ రణరంగాన్ని తలపించింది.
రబ్దాన్ క్రికెట్ క్లబ్ ఇన్నింగ్స్ 13వ ఓవర్ వేసిన నాసిర్ అలీ బౌలింగ్‌లో చివరి బంతికి కాషిఫ్ మహ్మద్ ఎల్బీగా ఔటయ్యాడు. అయితే కాషిఫ్‌ను ఔట్ చేసిన తర్వాత బౌలర్ సెలబ్రేషన్స్ శ్రుతిమించాయి. కాషిఫ్ వద్దకు వెళ్లిన అలీ అతడిని రెచ్చగొట్టేలా సంబరాలు చేసుకున్నాడు.
అతడి వైపు చేతి వేలు చూపిస్తూ గెట్ అవుట్ అంటూ గట్టిగా అరిచాడు. కాషిఫ్ కూడా అతడి వ్యాఖ్యలకు స్పందిస్తూ గొడవ పెట్టుకున్నాడు. ఈ క్రమంలో ఇరు జట్ల నుంచి ఆటగాళ్ల సైతం తమ ప్లేయర్లకు మద్దతుగా నిలిచారు. దీంతో గొడవ మరింత తీవ్రమైంది. ఒకరొకరు పిడిగుద్దులు గుద్దుకున్నారు. బ్యాట్‌లతో కూడా కొట్టుకున్నారు. ఆఖరికి అంపైర్లు జోక్యం చేసుకుని ఈ గొడవను సద్దుమణిగేలా చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
KALESH on Cricket Pitch 🥵 pic.twitter.com/mhvNYFIp4I
— Sameer Allana (@HitmanCricket) September 25, 2024
Comments
Please login to add a commentAdd a comment