అరంగేట్ర మ్యాచ్‌లోనే నలుగురిని మన్కడింగ్ చేసిన బౌలర్‌ | Maeva Douma runs out four non-striker in her debut T20I match | Sakshi
Sakshi News home page

Mankading Out: ఒకే మ్యాచ్‌లో.. ఒకే బౌలర్‌ చేతిలో ఏకంగా ఐదుగురు మన్కడింగ్‌

Published Mon, Sep 13 2021 5:48 PM | Last Updated on Mon, Sep 13 2021 7:29 PM

Maeva Douma runs out four non-striker in her debut T20I match - Sakshi

కంపాలా: అంతర్జాతీయ అరంగేట్ర మ్యాచ్‌లో ఆటగాళ్లు సెంచరీలు, హ్యాట్రిక్‌లు సాధించడం వంటి రికార్డులను క్రికెట్‌లో సాధారణంగా మనం చూస్తూనే ఉంటాం. కామెరూన్‌కు చెందిన మేవా డౌమా తన అంతర్జాతీయ అరంగేట్ర మ్యాచ్‌లో ఓ రికార్డు సాధించింది. ఏకంగా ఐదుగురుని ఔట్‌ చేసింది. అయినప్పటికీ తమ బ్యాట్స్‌మెన్‌ ప్రత్యర్థి విసిరిన 191 పరుగుల టార్గెట్‌ను ఛేదించలేక చేతులెత్తేశారు. కేవలం 36 పరుగులకే ఆలౌట్‌ అయి ఘోర ఓటమిని మూటగట్టుకున్నారు.

ఇక ఏకపక్షంగా సాగిన ఈ మ్యాచ్‌లో మేవా డౌమా సాధించిన రికార్డు ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే ఆమె తీసిన ఐదు వికెట్లలో నాలుగు వివాదాస్పద మన్కడింగ్‌ ద్వారానే రావడం గమనార్హం. కామెరూన్‌, ఉగాండా జట్ల మధ్య ఆదివారం జరిగిన మహిళల టీ20 వరల్డ్‌ కప్‌ క్వాలిఫైయర్‌ మ్యాచ్‌లో ఈ విశేషం చోటుచేసుకుంది. మొత్తం మీద తన నాలుగు ఓవర్ల కోటాలో ఐదుగురిని పెవిలియన్‌ పంపిన మేవా డౌమా మన్కడింగ్‌తో కాకుండా ఒక వికెట్‌ మాత్రమే తీసింది. అయితే, మన్కడింగ్‌ ద్వారా ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్‌ను పెవిలియన్‌ పంపినప్పటికీ అప్పటికే స్కోరు బోర్డు పరుగులు పెట్టడంతో ఉగాండా ముందు భారీ లక్ష్యం నిలిచింది. 

మన్కడింగ్ అంటే ఏమిటి?
క్రికెట్‌ నియమావళిలోని వివాదాస్పద నిబంధనల్లో ఇదొకటి. రూల్‌ 41.16 ప్రకారం బౌలర్‌ బంతి విసరకముందే నాన్‌ స్ట్రయికర్‌ క్రీజ్‌ దాటినప్పుడు అతడిని అవుట్‌ చేసే అవకాశం ఈ నిబంధన కల్పిస్తుంది. అయితే దీన్ని1947–48 ఆస్ట్రేలియా పర్యటనలో తొలిసారిగా భారత దిగ్గజ బౌలర్‌ వినూ మన్కడ్‌ ఉపయోగించారు. దీంతో.. క్రికెట్ నిబంధనలు రూపొందించే ఎంసీసీ (మెరిలిన్ క్రికెట్ క్లబ్) ఆయన పేరుమీదుగా మన్కడింగ్‌ నిబంధనగా  నియమావళిలో చేర్చింది.

చదవండిVirat Kohli: అవన్నీ తప్పుడు ప్రచారాలు.. అతడే కెప్టెన్: బీసీసీఐ క్లారిటీ

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement