
అర్జున్ టెండుల్కర్ (PC: MI)
Arjun Tendulkar- Mankading: టీమిండియా దిగ్గజం సచిన్ టెండుల్కర్ తనయుడు, గోవా ఆల్‌రౌండర్ అర్జున్ టెండుల్కర్ ‘మన్కడింగ్’ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. మన్కడింగ్ తప్పు కాదని, అయితే తను మాత్రం ఈ విధంగా రనౌట్‌లో భాగమై సమయం వృథా చేసుకోనన్నాడు. రంజీ టోర్నీలో గోవాకు ప్రాతినిథ్యం వహిస్తున్న అర్జున్.. సర్వీసెస్‌తో మ్యాచ్‌లో మొదటి రోజు ఆటలో రెండు వికెట్లు తీశాడు.
ఈ క్రమంలో మంగళవారం క్రిక్‌నెక్ట్స్ తో మాట్లాడిన అర్జున్ టెండుల్కర్ మన్కడింగ్ విషయంలో తన అభిప్రాయం పంచుకున్నాడు. ‘‘మన్కడింగ్‌ను నేను పూర్తిగా సమర్థిస్తా. నిబంధనల ప్రకారం అది సరైందే. ఇలా రనౌట్ చేయడం క్రీడాస్ఫూర్తికి విర్ధుమంటే నేను ఒప్పుకోను.
టైమ్, ఎనర్జీ వేస్ట్ చేసుకోను
అయితే, నేను మాత్రం నాన్ స్ట్రైకర్‌ను మన్కడింగ్ చేసి సమయం వృథా చేసుకోను. బెయిల్స్‌ను పడగొట్టడానికి నేను నా వేగాన్ని తగ్గించుకోలేను. మన్కడింగ్ చేయాలంటే చాలా వరకు ఎనర్జీ, ఎఫర్ట్ పెట్టాల్సి ఉంటుంది.
నేను అలా నా శక్తి, టైమ్ వేస్ట్ చేయను. అయితే, ఎవరైనా మన్కడింగ్ చేస్తే దానిని మాత్రం సమర్థిస్తా’’ అని చెప్పుకొచ్చాడు. కాగా, బౌలర్ బంతి విసరకముందే నాన్- స్ట్రైకర్ క్రీజును వీడితే రనౌట్ చేయడం నిబంధనల ప్రకారం సరైందేనన్న సంగతి తెలిసిందే.
సచిన్ సైతం
ఇక మన్కడింగ్ రవిచంద్రన్ అశ్విన్ వంటి బౌలర్ల విషయంలో విమర్శలు వచ్చిన తరుణంలో సచిన్ వారికి అండగా నిలబడ్డాడు. కాగా 23 ఏళ్ల అర్జున్ బౌలింగ్ ఆల్‌రౌండర్. ఎడమచేతి వాటం గల ఈ బ్యాటర్.. లెఫ్టార్మ్ ఫాస్ట్ మీడియం పేసర్. తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకునే క్రమంలో.. మేటి క్రికెటర్‌గా ఎదగాలనే ఆశయం అడుగులు వేస్తున్నాడు.
ఇదిలా ఉంటే.. ఇటీవల శ్రీలంకతో తొలి వన్డే సందర్భంగా మహ్మద్ షమీ దసున్ షనకు మన్కడింగ్ చేయగా.. కెప్టెన్ రోహిత్ శర్మ ఆ రనౌట్ అప్పీలు వెనక్కి తీసుకున్నాడు. ఈ నేపథ్యంలో అర్జున్ టెండుల్కర్ ఈ మేరకు వ్యాఖ్యలు చేయడం గమనార్హం.
చదవండి: ఆటో డ్రైవర్ కొడుకు నుంచి టీమిండియా కీలక పేసర్‌గా! ఆ ఒక్క లోటు తప్ప! కెప్టెన్ మాటలు వింటే..
Virat Kohli: ఓర్వలేనితనం అంటే ఇదే..
Comments
Please login to add a commentAdd a comment