మన్కడింగ్(నాన్‌స్ట్రైకింగ్ ఎండ్ రనౌట్) అనగానే మొదటగా గుర్తుకువచ్చేది రవిచంద్రన్ అశ్విన్. ఐపీఎల్‌లో జాస్ బట్లర్‌ను మన్కడింగ్ చేయడం ద్వారా అశ్విన్ పెద్ద వివాదానికే తెర లేపాడు. ఆ తర్వాత మన్కడింగ్‌ను చట్టబద్ధం చేస్తూ రూల్ తీసుకురావడంతో అశ్విన్ చర్యను సమర్థించారు. తాజాగా టి20 ప్రపంచకప్‌లో భాగంగా ఆదివారం సౌతాఫ్రికాతో మ్యాచ్‌లో టీమిండియా స్పిన్నర్ అశ్విన్‌కు మరోసారి మన్కడింగ్ చేసే అవకాశం వచ్చింది. అది కూడా ప్రొటిస్ విజయంలో కీలకపాత్ర పోషించిన డేవిడ్ మిల్లర్‌ది.
అయితే ఈసారి రనౌట్ చేయకుండా కేవలం హెచ్చరికతోనే వదిలిపెట్టాడు. ఇన్నింగ్స్ 18వ ఓవర్‌లో ఇది చోటుచేసుకుంది. ఆ ఓవర్‌లో అశ్విన్ చివరి బంతిని వేయడానికి ముందే నాన్‌స్ట్రైక్ ఎండ్‌లో ఉన్న మిల్లర్ క్రీజు బయట ఉన్నాడు. ఇది గమినించిన అశ్విన్ బంతి వేయడం ఆపేసి మిల్లర్‌కు..''యూ ఆర్ ఔట్ ఆఫ్ క్రీజ్'' అంటూ వార్నింగ్ ఇచ్చాడు. అయితే రూల్స్ ప్రకారం మిల్లర్‌ను రనౌట్ చేసే అవకాశం వచ్చినా అశ్విన్ వదిలేశాడు. ఇది క్రీడాస్పూర్తిగా పరిగణించినప్పటికి అశ్విన్ చర్యపై మాత్రం టీమిండియా క్రికెట్ ఫ్యాన్స్ సంతోషంగా లేరు.
ఎందుకంటే అప్పటికే మిల్లర్ తన జట్టును విజయంవైపు నడిపిస్తున్నాడు. కిల్లర్ మిల్లర్‌గా గుర్తింపు పొందిన అతను ఉంటే మ్యాచ్ కచ్చితంగా గెలిపిస్తాడు. ఈ నేపథ్యంలోనే మిల్లర్‌ను రనౌట్ చేయాల్సింది అని అభిమానులు పేర్కొన్నారు. ఇది కూడా వాస్తవమే. ఎందుకంటే ఆ తర్వాత మిల్లర్ మూడు ఫోర్లు కొట్టి సౌతాఫ్రికాను విజయతీరాలకు చేర్చాడు. ఒకవేళ అశ్విన్ మిల్లర్‌ను మన్కడింగ్ చేసి ఉంటే ఫలితం కచ్చితంగా వేరుగా ఉండేది. అందుకే ఫ్యాన్స్..'' ఛ.. అశ్విన్ మిల్లర్‌ను వదిలేసి పెద్ద తప్పు చేశావ్'' అంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున కామెంట్స్ చేశారు.
చదవండి: రోహిత్ మరీ ఇంత బద్దకమా..
Comments
Please login to add a commentAdd a comment