టి20 ప్రపంచకప్‌లో సూపర్-12లో టీమిండియాపై విజయంతో సౌతాఫ్రికా గ్రూఫ్-2లో పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకుంది. సౌతాఫ్రికా విజయంలో కీలకపాత్ర కిల్లర్ మిల్లర్‌దే. కాగా టి20 ప్రపంచకప్‌కు ముందు టీమిండియా గడ్డపై ఆడిన టి20 సిరీస్‌లో మిల్లర్ విశ్వరూపం చూపించాడు. తాను ఫామ్‌లో ఉంటే ఎంత డేంజర్ అనేది అర్థమయ్యేలా చేశాడు. తాజాగా టి20 ప్రపంచకప్‌లో మిల్లర్‌తో పాటు మార్క్రమ్ కూడా కీలక ఇన్నింగ్స్ ఆడినప్పటికి చివరి వరకు నాటౌట్‌గా నిలిచి అర్థసెంచరీతో జట్టును గెలిపించింది మాత్రం మిల్లరే. అందుకే అతన్ని అందరూ కిల్లర్ మిల్లర్ అని అభివర్ణిస్తారు.
►తాజాగా టీమిండియాపై విజయంతో మిల్లర్ టి20 క్రికెట్‌లో ఒక రికార్డు అందుకున్నాడు. 2022లో ఇప్పటివరకు సౌతాఫ్రికా చేజింగ్‌కు దిగిన సందర్భాల్లో మిల్లర్ 16 ఇన్నింగ్స్‌ల్లో 14సార్లు నాటౌట్‌గా నిలిచి జట్టును గెలిపించడం విశేషం. అందుకే మిల్లర్‌ను చేజింగ్ మాస్టర్‌గా పేర్కొన్నారు క్రికెట్ అభిమానులు.
►ఇక 2011 వన్డే వరల్డ్‌కప్ తర్వాత ఐసీసీ మేజర్ టోర్నీలో సౌతాఫ్రికా టీమిండియాను ఓడించడం మళ్లీ ఇదే. 2011 వన్డే వరల్డ్‌కప్‌లో నాగ్‌పూర్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో టీమిండియాను సౌతాఫ్రికా ఓడించింది. తాజాగా ఐదు వికెట్ల తేడాతో భారత్‌ను చిత్తు చేసింది.
చదవండి: టీమిండియా ఓటమి.. 'Bye-Bye Pakistan'
Comments
Please login to add a commentAdd a comment