T20 world Cup: Shadab Khan took no wickets, Except Devon Conway run-out
Sakshi News home page

Shadab Khan: షాదాబ్‌ ఖాన్‌ సూపర్‌ త్రో.. కాన్వే మొహం మాడిపోయింది

Published Wed, Nov 9 2022 3:10 PM | Last Updated on Wed, Nov 9 2022 4:06 PM

No Wickets Last 5 MAtches Shadab Khan Direct Run-out Devon Conway Levels - Sakshi

టి20 ప్రపంచకప్‌లో భాగంగా పాకిస్తాన్‌, న్యూజిలాండ్‌ మధ్య సెమీఫైనల్‌ పోరు ఆసక్తికరంగా సాగుతుంది. ఈ మ్యాచ్‌లో పాకిస్తాన్‌ ఆల్‌రౌండర్‌ షాదాబ్‌ ఖాన్‌ సూపర్‌ రనౌట్‌తో మెరిశాడు.  హారిస్‌ రౌఫ్‌ వేసిన ఇన్నింగ్స్‌ ఆరో ఓవర్‌ చివరి బంతిని కాన్వే మిడాఫ్‌ దిశగా ఆడాడు.  డెవన్‌ కాన్వే క్విక్‌ సింగిల్‌ కోసం ప్రయత్నించి నాన్‌స్ట్రైక్‌ ఎండ్‌లో ఉన్న కేన్‌ విలియమ్సన్‌కు కాల్‌ ఇచ్చాడు. విలియమ్సన్‌ పరిగెత్తగా.. కాన్వే మాత్రం సకాలంలో క్రీజులోకి చేరుకోలేకపోయాడు.

అప్పటికే మిడాఫ్‌లో ఉన్న షాదాబ్‌ ఖాన్‌ విసిరిన డైరెక్ట్‌ త్రోకు కాన్వే రనౌట్‌గా పెవిలియన్‌ చేరాడు. షాదాబ్‌ ఖాన్‌ సూపర్‌ త్రోకు కాన్వే మొహం మాడిపోయింది. అలా పవర్‌ ప్లే ముగిసేసరికి న్యూజిలాండ్‌ 36 పరుగుల వద్ద రెండో వికెట్‌ కోల్పోయింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement