
న్యూఢిల్లీ: హద్దులు దాటే నాన్‌స్ట్రైకర్‌ను ‘మన్కడింగ్’ ద్వారా అవుట్ చేసే అంశాన్ని అనవసరంగా వివాదం చేస్తున్నారని భారత మాజీ పేసర్, ఐసీసీ మ్యాచ్ రిఫరీ జవగల్ శ్రీనాథ్ అభిప్రాయపడ్డారు. తన దృష్టిలో ఇది మామూలు రనౌట్‌కంటే భిన్నమేమీ కాదని, అవుటైన బ్యాట్స్‌మన్ సానుభూతి కోరడంలో అర్థం లేదని ఆయన అన్నారు. అసలు ఈ అంశంలో ‘క్రీడా స్ఫూర్తి’ని ఎందుకు తీసుకొస్తున్నారని శ్రీనాథ్ ప్రశ్నించారు. ‘అదనపు ప్రయోజనాన్ని పొందే ప్రయత్నం చేసే నాన్ స్ట్రైకర్‌ను బౌలర్ అవుట్ చేయడం ముమ్మాటికీ సరైందే.
(చదవండి: బీసీసీఐ ఇలా అస్సలు ఊహించి ఉండదు!)
బౌలర్ ఎదురుగా ఉన్న స్ట్రైకర్‌కు బౌలింగ్ చేయడంపై దృష్టి పెట్టిన సమయంలో నాన్ స్ట్రైకర్‌కు వేరే పనేముంటుంది. బంతి పూర్తి అయ్యే వరకు ఆగలేడా. అది అతని బాధ్యత. ముందుకెళ్లి అనవసర ప్రయోజనం పొందే నాన్ స్ట్రైకర్‌ను రనౌట్ చేయడాన్ని నేను సమర్థిస్తా. నిబంధనలు ఈ విషయాన్ని స్పష్టంగా పేర్కొంటున్నాయని మళ్లీ మళ్లీ చెప్పాం. అవుటయ్యాక క్రీడా స్ఫూర్తి అన్న మాటే అనవసరం. బ్యాట్స్‌మన్ క్రీజ్‌లో ఉండి తన క్రీడాస్ఫూర్తిని ప్రదర్శిస్తే మంచిది’ అని శ్రీనాథ్ విశ్లేషించారు.
(చదవండి: సరదా కోసం కాదు... క్రికెట్ ఆడేందుకు వచ్చాం!)
Comments
Please login to add a commentAdd a comment