టీమిండియా-దక్షిణాఫ్రికా రెండో వన్డే సందర్భంగా ఓ ఫన్నీ సంఘటన చోటు చేసుకుంది. టాస్ సమయంలో మ్యాచ్ రిఫరీ జవగల్ శ్రీనాథ్‌తో పాటు మ్యాచ్ ప్రెజెంటర్ సంజయ్ మంజ్రేకర్ ఇరు జట్ల కెప్టెన్‌లు మైదానం మధ్యలోకి వచ్చారు. ఈ క్రమంలో స్పిన్ చేయడానికి కాయిన్ ఎవరికి వచ్చిందిని మంజ్రేకర్ ఇరు జట్ల కెప్టెన్‌ను అడిగాడు.
ఈ క్రమంలో ధావన్, కేశవ్ మహారాజ్ ఇద్దరూ ఒకరినొకరు అయోమయంగా చూసుకున్నారు. ఎందుకుంటే కాయిన్ వారిద్దరి ఎవరు దగ్గర లేదు. మ్యాచ్ రిఫరీ జవగల్ శ్రీనాథ్ కాయిన్ కెప్టెన్లకు ఇవ్వకుండా తన దగ్గరే పెట్టుకున్నాడు.
ఈ క్రమంలో ధావన్ నవ్వుతూ శ్రీనాథ్‌కు కాయిన్ ఇవ్వమని అడిగాడు. ఇందుకు సంబంధించిన వీడియోను బీసీసీఐ ట్విటర్ షేర్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
🚨 Toss Update from Ranchi 🚨
— BCCI (@BCCI) October 9, 2022
South Africa have elected to bat against #TeamIndia in the second #INDvSA ODI.
Follow the match ▶️ https://t.co/6pFItKiAHZ @mastercardindia pic.twitter.com/NKjxZRPH4e
చదవండి: Tri Series NZ VS BAN: రాణించిన కాన్వే.. బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన న్యూజిలాండ్
Comments
Please login to add a commentAdd a comment