Javagal Srinath
-
చాంపియన్స్ ట్రోఫీ: తప్పుకొన్న నితిన్, శ్రీనాథ్.. అంపైర్లు, మ్యాచ్ రిఫరీలు వీరే!
చాంపియన్స్ ట్రోఫీ-2025 టోర్నమెంట్‌కు సంబంధించి అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ) అంపైర్లు, మ్యాచ్ రిఫరీల వివరాలను ప్రకటించింది. మొత్తంగా పన్నెండు మంది అంపైర్లు, ముగ్గురు మ్యాచ్ రిఫరీలు ఈ ప్రతిష్టాత్మక టోర్నీలో భాగం కానున్నట్లు వెల్లడించింది. అయితే, ఇందులో భారత్ నుంచి ఒక్కరూ లేకపోవడం గమనార్హం.కాగా 2017లో చివరిసారిగా చాంపియన్స్ ట్రోఫీ జరుగగా.. నాడు ఫైనల్లో టీమిండియాపై గెలుపొందిన పాకిస్తాన్ విజేతగా అవతరించింది. అయితే, ఆ తర్వాత వివిధ కారణాల వల్ల ఐసీసీ మళ్లీ ఈ వన్డే టోర్నీని ఇప్పటిదాకా నిర్వహించలేదు. తాజాగా మళ్లీ ఇప్పుడు మరోసారి ఈ మెగా ఈవెంట్‌ను నిర్వహించేందుకు ముహూర్తం ఖరారు చేసింది.డిఫెండింగ్ చాంపియన్ హోదాలో పాకిస్తాన్ ఆతిథ్య హక్కులు దక్కించుకోగా.. భద్రతా కారణాల దృష్ట్యా టీమిండియా అక్కడకు వెళ్లడం లేదు. ఐసీసీ అనుమతితో హైబ్రిడ్ విధానంలో తటస్థ వేదికైన దుబాయ్‌లో తమ మ్యాచ్‌లన్నీ ఆడనుంది. ఈ క్రమంలో మ్యాచ్ అఫీషియల్స్‌లో భాగమైన అంపైర్ నితిన్ మీనన్, మ్యాచ్ రిఫరీ జవగళ్ శ్రీనాథ్ కూడా కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.ఈ ఇద్దరు పాకిస్తాన్‌కు వెళ్లేందుకు ఆసక్తి చూపలేదని సమాచారం. ఈ విషయం గురించి బీసీసీఐ వర్గాలు వార్తా సంస్థ పీటీఐతో మాట్లాడుతూ.. ‘‘నితిన్ మీనన్‌ను చాంపియన్స్ ట్రోఫీ రోస్టర్‌లో పెట్టాలని ఐసీసీ భావించింది. కానీ వ్యక్తిగత కారణాల దృష్ట్యా ఆయన పాకిస్తాన్ పర్యటనకు నిరాకరించారు’’ అని పేర్కొన్నాయి.ఇక జవగళ్ శ్రీనాథ్ కూడా సెలవులు తీసుకుంటున్న క్రమంలో పాక్ వెళ్లడం కుదరదని చెప్పినట్లు సమాచారం. కాగా ఐసీసీ ఎలైట్ ప్యానెల్ ఆఫ్ రిఫరీస్, అదే విధంగా ఐసీసీ అంపైర్ల ఎలైట్ ప్యానెల్లో భారత్ నుంచి చోటు దక్కించుకున్నది వీళ్లిద్దరే.అయితే, ప్రతిష్టాత్మక చాంపియన్స్ ట్రోఫీ నుంచి మాత్రం ఈ ఇద్దరూ దూరంగా ఉండటం గమనార్హం. కాగా జవగళ్ శ్రీనాథ్ ప్రస్తుతం భారత్- ఇంగ్లండ్ వన్డే సిరీస్‌తో బిజీగా ఉన్నాడు. ఫిబ్రవరి 6, 9, 12 తేదీల్లో ఇరుజట్ల మధ్య జరిగే మూడు మ్యాచ్‌లకు శ్రీనాథ్ మ్యాచ్ రిఫరీగా వ్యవహరించనున్నాడు. ఇదిలా ఉంటే.. ఫిబ్రవరి 19 నుంచి పాకిస్తాన్ - దుబాయ్ వేదికలుగా చాంపియన్స్ ట్రోఫీ మొదలుకానుంది. ఆస్ట్రేలియా, భారత్, సౌతాఫ్రికా, న్యూజిలాండ్, అఫ్గనిస్తాన్, బంగ్లాదేశ్, ఇంగ్లండ్, పాకిస్తాన్ ఈ మెగా టోర్నీలో టైటిల్ కోసం తలపడతాయి. ఇక క్రికెట్ ప్రేమికులకు అసలైన మజా అందించే భారత్- పాకిస్తాన్ మ్యాచ్ దుబాయ్‌లో ఫిబ్రవరి 23న జరుగుతుంది.ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025 అంపైర్లు:కుమార్ ధర్మసేన, క్రిస్ గఫానీ, మైఖేల్ గోఫ్, అడ్రియన్ హోల్డ్‌స్టాక్, రిచర్డ్ ఇల్లింగ్‌వర్త్, రిచర్డ్ కెటిల్‌బరో, అహ్సన్ రజా, పాల్ రీఫిల్, షర్ఫుద్దౌలా ఇబ్నే షాహిద్, రోడ్నీ టక్కర్, అలెక్స్ వార్ఫ్, జోయెల్ విల్సన్.ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025 మ్యాచ్ రిఫరీలు:డేవిడ్ బూన్, రంజన్ మదుగల్లె, ఆండ్రూ పైక్రాఫ్ట్.చదవండి: Ind vs Eng: తొలి వన్డేకు ఇంగ్లండ్ తుదిజట్టు ప్రకటన.. వెటరన్ ప్లేయర్ రీఎంట్రీ -
IPL 2024 RCB Vs MI: ముంబై, ఆర్సీబీ మ్యాచ్‌పై అనుమానాలు..?
వాంఖడే వేదికగా ముంబై, ఆర్సీబీ జట్ల మధ్య నిన్న జరిగిన మ్యాచ్‌పై పలువురు క్రికెట్ అభిమానులు అనుమానం వ్యక్తిం చేస్తున్నారు. టాస్ సమయంలో ఏదో జరిగిందని చర్చించుకుంటున్నారు. మ్యాచ్ రిఫరీ జవగల్ శ్రీనాథ్ టాస్ ఫలితాన్ని తారుమారు చేశాడని ఆరోపిస్తున్నారు. ఐపీఎల్ అంటేనే ఫిక్సింగ్ అని నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారు. నిన్నటి మ్యాచ్‌లో ముంబై గెలవాలని ముందుగానే ఫిక్స్ అయ్యిందని అంటున్నారు. శ్రీనాథ్ టాస్ ఫలితాన్ని మార్చాడనటానికి ఇదే సాక్ష్యం అంటూ ఓ వీడియోని పోస్ట్ (సోషల్‌మీడియాలో) చేశారు. ఈ వీడియో నెట్టింట వైరలవుతుంది. కాగా, నిన్నటి మ్యాచ్‌లో ఆర్సీబీపై ముంబై 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ అన్ని విభాగాల్లో అద్భుతంగా రాణించి ఆర్సీబీని మట్టికరిపించింది. Rigged the toss too? @mipaltan pic.twitter.com/lmobHelD0S — 🜲 (@balltamperrer) April 12, 2024 తొలుత బౌలింగ్‌లో బుమ్రా (4-0-21-5) చెలరేగిపోగా.. ఆ తర్వాత బ్యాటింగ్‌లో ఇషాన్ కిషన్ (39 బంతుల్లో 69; 7 ఫోర్లు, 5 సిక్సర్లు), రోహిత్ శర్మ (24 బంతుల్లో 38; 3 ఫోర్లు, 3 సిక్సర్లు), సూర్యకుమార్ యాదవ్ (19 బంతుల్లో 52; 5 ఫోర్లు, 4 సిక్సర్లు), హార్దిక్ పాండ్యా (6 బంతుల్లో 21 నాటౌట్; 3 సిక్సర్లు) శివాలెత్తిపోయారు. ఫలితంగా ముంబై ఇండియన్స్ సీజన్లో రెండో గెలుపును నమోదు చేసింది. ఈ విజయాలకు ముందు ముంబై హ్యాట్రిక్ పరాజయాలను ఎదుర్కొన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ముంబై 5 మ్యాచ్‌ల్లో 2 విజయాలతో పాయింట్ల పట్టికలో ఏడో స్థానంలో ఉంది. మరోవైపు ఆర్సీబీ 6 మ్యాచ్్ల్లో ఒకే ఒక్క విజయం సాధించి పాయింట్ల పట్టికలో చివరి నుంచి రెండో స్థానంలో ఉంది. ఆర్సీబీ తదుపరి ఆడబోయే 8 మ్యాచ్‌ల్లో ఏడింట గెలిస్తేనే ప్లే ఆఫ్స్ అవకాశాలు సజీవంగా ఉంటాయి. లేకపోతే ఈ సీజన్లోనూ ఆర్సీబీ రిక్త హస్తాలతోనే వెనుదిరగాల్సి వస్తుంది. -
రవీంద్ర జడేజా అరుదైన ఘనత.. శ్రీనాథ్ రికార్డు బద్దలు
టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా అరుదైన ఘనత సాధించాడు. అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక వికెట్లు పడగొట్టిన ఆరో భారత బౌలర్‌గా జడేజా నిలిచాడు. హైదరాబాద్ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో బెయిర్ స్టోను ఔట్ చేసిన జడ్డూ.. ఈ రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. జడేజా ఇప్పటివరకు మూడు ఫార్మాట్లలో 332 మ్యాచ్‌లు ఆడి 552 వికెట్లు పడగొట్టాడు. ఈ క్రమంలో భారత మాజీ పేసర్ జవగల్ శ్రీనాథ్‌ను జడేజా అధిగమించాడు. శ్రీనాథ్ తన అంతర్జాతీయ కెరీర్లో 551 వికెట్లు సాధించాడు. ఇక అరుదైన ఘనత సాధించిన జాబితాలో భారత స్పిన్ దిగ్గజం అనిల్ కుంబ్లే 953 వికెట్లతో తొలి స్ధానంలో ఉన్నాడు. ఆ తర్వాతి స్ధానంలో టీమిండియా వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ 723 వికెట్లతో కొనసాగుతున్నాడు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. మూడో రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లండ్ తమ రెండో ఇన్నింగ్స్‌లో ఆరు వికెట్ల నష్టానికి 316 పరుగులు చేసింది. వన్‌డౌన్ బ్యాటర్ ఒలీ పోప్ అద్భుత సెంచరీతో చెలరేగాడు. పోప్ (148), రెహాన్ అహ్మద్ (16) పరుగులతో క్రీజులో ఉన్నారు. ఇంగ్లండ్ ప్రస్తుతం సెకెండ్ ఇన్నింగ్స్‌లో 126 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతోంది. అంతకుముందు భారత్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 436 పరుగులకు ఆలౌటైంది. -
వరల్డ్‌కప్‌కు అంపైర్ల జాబితాను ప్రకటించిన ఐసీసీ.. భారత్ నుంచి ఒక్కడే
అక్టోబర్ 5 నుంచి ప్రారంభంకానున్న వన్డే వరల్డ్‌కప్ కోసం 16 మంది అంపైర్ల జాబితాను ఐసీసీ ఇవాళ (సెప్టెంబర్ 25) ప్రకటించింది. మెగా టోర్నీ కోసం నలుగురు రిఫరీల లిస్ట్‌ను కూడా ఐసీసీ ఇవాళే రిలీజ్ చేసింది. అంపైర్ల జాబితాలో భారత్ నుంచి నితిన్ మీనన్ ఒక్కడికే ప్రాతినిథ్యం లభించగా.. రిఫరీల్లో సైతం భారత్ నుంచి జవగల్ శ్రీనాథ్ ఒక్కడికే అవకాశం దక్కింది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా డిఫెండింగ్ ఛాంపియన్స్ ఇంగ్లండ్-గత ఎడిషన్ రన్నరప్ న్యూజిలాండ్ మధ్య అక్టోబర్ 5న జరిగే టోర్నీ ఓపెనింగ్ మ్యాచ్‌కు భారత అంపైర్ నితిన్ మీనన్, శ్రీలంక మాజీ క్రికెటర్ కుమార ధర్మసేన ఫీల్డ్ అంపైర్లుగా వ్యవహరిస్తారని ఐసీసీ పేర్కొంది. అక్టోబర్ 14న జరిగే భారత్-పాకిస్తాన్ మ్యాచ్‌కు అంపైర్లు, రిఫరీల వివరాలను సైతం ఐసీసీ ఇవాళే వెల్లడించింది. ఈ మ్యాచ్‌కు రిచర్డ్ ఇల్లింగ్‌వర్త్, మరియాస్ ఎరాస్మస్ ఫీల్డ్ అంపైర్లుగా వ్యవహరించనుండగా.. రిచర్డ్ కెటిల్‌బోరో థర్డ్ అంపైర్‌గా, ఆండీ పైక్రాఫ్ట్ మ్యాచ్ రిఫరీగా ఉంటారు. అంపైర్ల వివరాలు.. క్రిస్ బ్రౌన్ (న్యూజిలాండ్) కుమార ధర్మసేన (శ్రీలంక) మరియాస్ ఎరాస్మస్ (సౌతాఫ్రికా) క్రిస్టోఫర్ గఫ్ఫానీ (న్యూజిలాండ్) మైఖేల్ గాఫ్ (ఇంగ్లండ్) అడ్రియన్ హోల్డ్‌స్టాక్ (సౌతాఫ్రికా) రిచర్డ్ ఇల్లింగ్‌వర్త్ (ఇంగ్లండ్) రిచర్డ్ కెటిల్‌బోరో (ఇంగ్లండ్) నితిన్ మీనన్ (ఇండియా) ఎహసాన్ రజా (పాకిస్తాన్) పాల్ రీఫిల్ (ఆస్ట్రేలియా) షర్ఫుద్దౌలా ఇబ్నే షహీద్ (బంగ్లాదేశ్) రాడ్నీ టక్కర్ (ఆస్ట్రేలియా) అలెక్స్ వార్ఫ్ (ఇంగ్లండ్) జోయెల్ విల్సన్ (వెస్టిండీస్) పాల్ విల్సన్ (ఆస్ట్రేలియా) రిఫరీల జాబితా.. జెఫ్ క్రో (న్యూజిలాండ్) ఆండీ పైక్రాఫ్ట్ (జింబాబ్వే) రిచీ రిచర్డ్సన్ (వెస్టిండీస్) జవగల్ శ్రీనాథ్ (ఇండియా) -
టాస్ కాయిన్ ఇవ్వడం మర్చిపోయిన శ్రీనాథ్.. వీడియో వైరల్
టీమిండియా-దక్షిణాఫ్రికా రెండో వన్డే సందర్భంగా ఓ ఫన్నీ సంఘటన చోటు చేసుకుంది. టాస్ సమయంలో మ్యాచ్ రిఫరీ జవగల్ శ్రీనాథ్‌తో పాటు మ్యాచ్ ప్రెజెంటర్ సంజయ్ మంజ్రేకర్ ఇరు జట్ల కెప్టెన్లు మైదానం మధ్యలోకి వచ్చారు. ఈ క్రమంలో స్పిన్ చేయడానికి కాయిన్ ఎవరికి వచ్చిందిని మంజ్రేకర్ ఇరు జట్ల కెప్టెన్‌ను అడిగాడు. ఈ క్రమంలో ధావన్, కేశవ్ మహారాజ్ ఇద్దరూ ఒకరినొకరు అయోమయంగా చూసుకున్నారు. ఎందుకుంటే కాయిన్ వారిద్దరి ఎవరు దగ్గర లేదు. మ్యాచ్ రిఫరీ జవగల్ శ్రీనాథ్ కాయిన్ కెప్టెన్లకు ఇవ్వకుండా తన దగ్గరే పెట్టుకున్నాడు. ఈ క్రమంలో ధావన్ నవ్వుతూ శ్రీనాథ్‌కు కాయిన్ ఇవ్వమని అడిగాడు. ఇందుకు సంబంధించిన వీడియోను బీసీసీఐ ట్విటర్ షేర్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 🚨 Toss Update from Ranchi 🚨 South Africa have elected to bat against #TeamIndia in the second #INDvSA ODI. Follow the match ▶️ https://t.co/6pFItKiAHZ @mastercardindia pic.twitter.com/NKjxZRPH4e — BCCI (@BCCI) October 9, 2022 చదవండి: Tri Series NZ VS BAN: రాణించిన కాన్వే.. బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన న్యూజిలాండ్ -
జవగళ్ శ్రీనాథ్, హర్భజన్ సింగ్‌లకు అరుదైన గౌరవం
లండన్: భారత మాజీ క్రికెటర్లు జవగళ్ శ్రీనాథ్, హర్భజన్ సింగ్‌లకు ప్రసిద్ధ మెరిల్‌బోన్ క్రికెట్ క్లబ్ (ఎంసీసీ)లో జీవితకాల సభ్యత్వం లభించింది. టెస్టు క్రికెట్ ఆడే 12 దేశాల నుంచి ఎనిమిది దేశాల క్రికెటర్లకు ఈ ఏడాది జీవితకాల సభ్యత్వం ఇచ్చినట్లు ఎంసీసీ ఒక ప్రకటనలో తెలిపింది. మేటి పేసర్‌గా భారత జట్టుకు సేవలందించిన శ్రీనాథ్ ప్రస్తుతం ఐసీసీ ఎలైట్ మ్యాచ్ రిఫరీ ప్యానెల్లో ఉన్నారు. శ్రీనాథ్ తన అంతర్జాతీయ కెరీర్లో వన్డేల్లో 315 వికెట్లు, టెస్టుల్లో 236 వికెట్లు పడగొట్టాడు. హర్భజన్ మూడు ఫార్మాట్లలో కలిపి 711 వికెట్లు తీశాడు. చదవండి: T20 WC 2021: ఆఖరి ఓవర్లో నలుగురు ఔట్.. బౌలర్‌కు దక్కని హ్యాట్రిక్ -
‘ఇది రనౌట్‌కంటే భిన్నమేమీ కాదు’
న్యూఢిల్లీ: హద్దులు దాటే నాన్‌స్ట్రైకర్‌ను ‘మన్కడింగ్’ ద్వారా అవుట్ చేసే అంశాన్ని అనవసరంగా వివాదం చేస్తున్నారని భారత మాజీ పేసర్, ఐసీసీ మ్యాచ్ రిఫరీ జవగల్ శ్రీనాథ్ అభిప్రాయపడ్డారు. తన దృష్టిలో ఇది మామూలు రనౌట్‌కంటే భిన్నమేమీ కాదని, అవుటైన బ్యాట్స్‌మన్ సానుభూతి కోరడంలో అర్థం లేదని ఆయన అన్నారు. అసలు ఈ అంశంలో ‘క్రీడా స్ఫూర్తి’ని ఎందుకు తీసుకొస్తున్నారని శ్రీనాథ్ ప్రశ్నించారు. ‘అదనపు ప్రయోజనాన్ని పొందే ప్రయత్నం చేసే నాన్ స్ట్రైకర్‌ను బౌలర్ అవుట్ చేయడం ముమ్మాటికీ సరైందే. (చదవండి: బీసీసీఐ ఇలా అస్సలు ఊహించి ఉండదు!) బౌలర్ ఎదురుగా ఉన్న స్ట్రైకర్‌కు బౌలింగ్ చేయడంపై దృష్టి పెట్టిన సమయంలో నాన్ స్ట్రైకర్‌కు వేరే పనేముంటుంది. బంతి పూర్తి అయ్యే వరకు ఆగలేడా. అది అతని బాధ్యత. ముందుకెళ్లి అనవసర ప్రయోజనం పొందే నాన్ స్ట్రైకర్‌ను రనౌట్ చేయడాన్ని నేను సమర్థిస్తా. నిబంధనలు ఈ విషయాన్ని స్పష్టంగా పేర్కొంటున్నాయని మళ్లీ మళ్లీ చెప్పాం. అవుటయ్యాక క్రీడా స్ఫూర్తి అన్న మాటే అనవసరం. బ్యాట్స్‌మన్ క్రీజ్‌లో ఉండి తన క్రీడాస్ఫూర్తిని ప్రదర్శిస్తే మంచిది’ అని శ్రీనాథ్ విశ్లేషించారు. (చదవండి: సరదా కోసం కాదు... క్రికెట్ ఆడేందుకు వచ్చాం!) -
చెమట సరిపోతుందిగా...
చెన్నై: బంతి మెరుపు పెంచేందుకు బౌలర్లు లాలాజలం (ఉమ్ము)కు బదులు చెమటను ఉపయోగించవచ్చని భారత మాజీ పేసర్, మ్యాచ్ రిఫరీ జవగళ్ శ్రీనాథ్ సూచించాడు. కరోనా నేపథ్యంలో కుంబ్లే నేతృత్వంలోని ఐసీసీ కమిటీ బంతి షైనింగ్‌కు లాలాజలం వాడటాన్ని నిషేధించింది. దీంతో కృత్రిమ పదార్థం వాడే వెసులుబాటు ఇవ్వాలని ప్రపంచ వ్యాప్తంగా చర్చ నడుస్తోంది. దీనిపై శ్రీనాథ్ మాట్లాడుతూ ‘ఉమ్ముకు ప్రత్యామ్నాయంగా చెమటను వినియోగించవచ్చు. నిజానికి ఆటలో లాలాజలానికంటే చెమటనే ఎక్కువగా ఉపయోగిస్తాం. కాబట్టి ఉమ్ము వద్దన్నంత మాత్రాన అదో సమస్య కాదు. తరచూ చేతితో ఉమ్మును అందుకొని బంతికి రాయడమనేది అలవాటైంది. ఇప్పుడు దీన్ని మార్చుకుంటే సరిపోతుంది. కొత్త మార్గదర్శకాలను పాటించాలి. లాలాజలానికి బదులుగా చెమట రాయడాన్నే అలవాటు చేసుకుంటే భవిష్యత్తులో దీని పాత్రే కీలకమవుతుంది’ అని అన్నాడు. -
‘అతని బౌలింగ్ అంటే ఎంతో ఇష్టం’
కేప్‌టౌన్: భారత క్రికెట్ జట్టు మాజీ పేసర్ జవగల్ శ్రీనాథ్‌కు తగినంత గుర్తింపు లభించలేదని దక్షిణాఫ్రికా మాజీ బౌలర్ షాన్ పొల్లాక్ పేర్కొన్నాడు. 1990-2000ల మధ్యలో భారత్‌కు శ్రీనాథ్ ప్రధాన బౌలింగ్ ఆయుధని పొల్లాక్ తెలిపాడు. కానీ అతని ప్రతిభకు తగ్గ గుర్తింపు రాలేదని పొల్లాక్ అన్నాడు. 1991 నుంచి 2003 వరకూ భారత జట్టు తరఫున శ్రీనాథ్ 67 టెస్టులు, 229 వన్డేలు ఆడారు. టెస్టుల్లో 236, వన్డేల్లో 315 వికెట్లు తీశారు. ('ఆ మ్యాచ్‌లో మియాందాద్ వాడిన బ్యాట్ నాదే') వెస్టిండీస్ మాజీ ఫాస్ట్ బౌరల్ మైఖేల్ హోల్డింగ్, ఇంగ్లండ్ బౌలర్ సువర్ట్ బ్రాడ్‌తో కలిసి ఓ చర్చలో పాల్గొన్న పొల్లాక్ .. ‘శ్రీనాథ్‌కు తగినంత గుర్తింపు లభించలేదు. మా కాలంలో చాలా మంచి బౌలర్లు ఉన్నారు. పాకిస్థాన్‌లో వసీం అక్రమ్, వకార్ యూనిస్.. వెస్టిండీస్‌లో కల్ట్రీ ఆంబ్రోస్, వాల్ష్, ఆస్ట్రేలియాలో గ్లెన్ మెక్‌గ్రాత్, బ్రెట్ లీ.. ఇలా చెప్పుకుంటూ పోతే.. ఎంతో మంది గొప్ప బౌలర్లు ఉన్నారు’’ అని అన్నారు.తన రిటైర్మెంట్ తర్వాత సౌతాఫ్రికా బౌలర్లలో డెయిల్ స్టెయిన్ బౌలింగ్ తనకు ఎంతో నచ్చిందని పొల్లాక్ పేర్కొన్నారు. ఎటువంటి వికెట్‌పై అయినా స్టెయిన్కి బౌలింగ్ చేసే సత్తా ఉందని చెప్పిన పొల్లాక్.. అతను ఎంతో ప్రత్యేకమైన వ్యక్తి అని.. అతని రికార్డులే అందుకు సాక్ష్యమని పేర్కొన్నారు. (ఐపీఎల్ జరిగేలా లేదు ) -
శ్రీనాథ్‌కు రూ. 52 లక్షలు
ముంబై: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ద్వారా పలువురు యువ ఆటగాళ్లు వెలుగులోకి రావడంతో పాటు ఆర్థికపరంగా కూడా వారికి మంచి స్థాయి లభించింది. ఇదే తరహాలో లీగ్‌తో భాగస్వామ్యం ఉన్న అనేక మందికి ఐపీఎల్ ద్వారా పెద్ద మొత్తాలు దక్కాయి. ఇందులో అంపైర్లు, మ్యాచ్ రిఫరీలు కూడా ఉన్నారు. 2019 ఐపీఎల్లో ఎనిమిది మంది భారత అంపైర్లకు చేసిన చెల్లింపుల వివరాలను బీసీసీఐ వెల్లడించింది. ఈ జాబితాలో మ్యాచ్ రిఫరీ జవగల్ శ్రీనాథ్ కూడా ఉన్నారు. శ్రీనాథ్‌కు ఈ సీజన్ కోసం 52 లక్షల 45 వేల 128 రూపాయలు లభించాయి. శ్రీనాథ్‌తో సరిగ్గా సమానంగా అంపైర్ నితిన్ మీనన్‌కు కూడా 52 లక్షల 45 వేల 128 రూపాయలు లభించడం విశేషం. ఎస్. రవి రూ. 42.46 లక్షలు, మను నాయర్ రూ. 41.96 లక్షలు, షంషుద్దీన్ రూ. 41.00 లక్షలు... అనిల్ దండేకర్, యశ్వంత్ బెర్డే, నారాయణన్ కుట్టి తలా రూ.32.96 లక్షలు, నందన్ రూ. 37.04 లక్షలు అందుకున్నారు. -
ఐపీఎల్-10 ఫైనల్ రిఫరీ ఎవరో తెలుసా?
న్యూఢిల్లీ: ఐపీఎల్-10 సీజన్లో మే 21న హైదరాబాద్ లో జరిగే ఫైనల్ మ్యాచ్ కు రిఫరీగా భారత మాజీ దిగ్గజ బౌలర్ జవగల్ శ్రీనాథ్ ను నియమిస్తున్నట్లు బీసీసీఐ ప్రకటించింది. శ్రీనాథ్ క్వాలిఫైర్-1, ఫైనల్ మ్యాచ్ కు రిఫరీగా బాధ్యతలు నిర్వహించనున్నాడు. ఇక మే 16న జరగబోయే క్వాలిఫైర్-1 మ్యాచ్ కు ఎస్ రవి, శాంషుద్దీన్ లు, ఫైనల్ మ్యాచ్ కు రవి, నిగెల్ లియోంగ్ లను ఫీల్డ్ అంపైర్ లుగా నియమిస్తున్నట్లు బీసీసీఐ తెలిపింది. ఫ్లే ఆఫ్ మ్యాచ్ లకు రిఫరీలుగా శ్రీనాథ్, మనూ నాయర్, చిన్మయా శర్మ లు బాధ్యతలు నిర్వహించనున్నారు. జవగల్ శ్రీనాథ్ భారత్ తరపున 229 వన్డేలు ఆడాడు. భారత తరపున వన్డేల్లో 300 వికెట్లు పడగొట్టిన తొలి బౌలర్ శ్రీనాథ్. 2003 వరల్డ్ కప్ లో ఫైనల్ చేరిన భారత్ జట్టులో శ్రీనాథ్ కీలక సభ్యుడు. -
'దాదా.. శత్రువులే ఎక్కువమంది ఉంటారు'
హైదరాబాద్: భారత క్రికెట్లో మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీకి మంచి భవిష్యత్ ఉందని మాజీ పేసర్ జవగళ్ శ్రీనాథ్ అన్నాడు. అయితే క్రికెట్ పాలనాధికారిగా స్నేహితుల కంటే శత్రువులే ఎక్కువమంది ఎదురవుతారని శ్రీనాథ్ హెచ్చరించాడు. క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ బెంగాల్ (క్యాబ్) అధ్యక్షుడిగా గంగూలీని నియమించే అవకాశముందని వార్తలు వచ్చిన నేపథ్యంలో శ్రీనాథ్ పైవిధంగా స్పందించాడు. బీసీసీఐ అధ్యక్షుడు, క్యాచ్ చీఫ్ జగ్మోహన్ దాల్మియా మరణంతో ఈ రెండు పదవులు ఖాళీ అయ్యాయి. ప్రస్తుతం క్యాబ్ సంయుక్త కార్యదర్శిగా ఉన్న గంగూలీని చీఫ్‌గా నియమిస్తే బాగుంటుందని క్రికెట్ వర్గాలు భావిస్తున్నాయి. -
వరల్డ్‌కప్‌లో భారత్‌కున్న అవకాశాలపై శ్రీనాథ్