
లండన్: భారత మాజీ క్రికెటర్లు జవగళ్ శ్రీనాథ్, హర్భజన్ సింగ్‌లకు ప్రసిద్ధ మెరిల్‌బోన్ క్రికెట్ క్లబ్ (ఎంసీసీ)లో జీవితకాల సభ్యత్వం లభించింది. టెస్టు క్రికెట్ ఆడే 12 దేశాల నుంచి ఎనిమిది దేశాల క్రికెటర్లకు ఈ ఏడాది జీవితకాల సభ్యత్వం ఇచ్చినట్లు ఎంసీసీ ఒక ప్రకటనలో తెలిపింది.
మేటి పేసర్‌గా భారత జట్టుకు సేవలందించిన శ్రీనాథ్ ప్రస్తుతం ఐసీసీ ఎలైట్ మ్యాచ్ రిఫరీ ప్యానెల్‌లో ఉన్నారు. శ్రీనాథ్ తన అంతర్జాతీయ కెరీర్‌లో వన్డేల్లో 315 వికెట్లు, టెస్టుల్లో 236 వికెట్లు పడగొట్టాడు. హర్భజన్ మూడు ఫార్మాట్లలో కలిపి 711 వికెట్లు తీశాడు.
చదవండి: T20 WC 2021: ఆఖరి ఓవర్లో నలుగురు ఔట్.. బౌలర్‌కు దక్కని హ్యాట్రిక్
Comments
Please login to add a commentAdd a comment