
ముంబై: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ద్వారా పలువురు యువ ఆటగాళ్లు వెలుగులోకి రావడంతో పాటు ఆర్థికపరంగా కూడా వారికి మంచి స్థాయి లభించింది. ఇదే తరహాలో లీగ్‌తో భాగస్వామ్యం ఉన్న అనేక మందికి ఐపీఎల్ ద్వారా పెద్ద మొత్తాలు దక్కాయి. ఇందులో అంపైర్లు, మ్యాచ్ రిఫరీలు కూడా ఉన్నారు. 2019 ఐపీఎల్‌లో ఎనిమిది మంది భారత అంపైర్లకు చేసిన చెల్లింపుల వివరాలను బీసీసీఐ వెల్లడించింది.
ఈ జాబితాలో మ్యాచ్ రిఫరీ జవగల్ శ్రీనాథ్ కూడా ఉన్నారు. శ్రీనాథ్‌కు ఈ సీజన్ కోసం 52 లక్షల 45 వేల 128 రూపాయలు లభించాయి. శ్రీనాథ్‌తో సరిగ్గా సమానంగా అంపైర్ నితిన్ మీనన్‌కు కూడా 52 లక్షల 45 వేల 128 రూపాయలు లభించడం విశేషం. ఎస్. రవి రూ. 42.46 లక్షలు, మను నాయర్ రూ. 41.96 లక్షలు, షంషుద్దీన్ రూ. 41.00 లక్షలు... అనిల్ దండేకర్, యశ్వంత్ బెర్డే, నారాయణన్ కుట్టి తలా రూ.32.96 లక్షలు, నందన్ రూ. 37.04 లక్షలు అందుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment