వాంఖడే వేదికగా ముంబై, ఆర్సీబీ జట్ల మధ్య నిన్న జరిగిన మ్యాచ్‌పై పలువురు క్రికెట్ అభిమానులు అనుమానం వ్యక్తిం చేస్తున్నారు. టాస్ సమయంలో ఏదో జరిగిందని చర్చించుకుంటున్నారు. మ్యాచ్ రిఫరీ జవగల్ శ్రీనాథ్ టాస్ ఫలితాన్ని తారుమారు చేశాడని ఆరోపిస్తున్నారు.
ఐపీఎల్ అంటేనే ఫిక్సింగ్ అని నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారు. నిన్నటి మ్యాచ్‌లో ముంబై గెలవాలని ముందుగానే ఫిక్స్ అయ్యిందని అంటున్నారు. శ్రీనాథ్ టాస్ ఫలితాన్ని మార్చాడనటానికి ఇదే సాక్ష్యం అంటూ ఓ వీడియోని పోస్ట్ (సోషల్‌మీడియాలో) చేశారు. ఈ వీడియో నెట్టింట వైరలవుతుంది.
కాగా, నిన్నటి మ్యాచ్‌లో ఆర్సీబీపై ముంబై 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ అన్ని విభాగాల్లో అద్భుతంగా రాణించి ఆర్సీబీని మట్టికరిపించింది.
Rigged the toss too? @mipaltan pic.twitter.com/lmobHelD0S
— 🜲 (@balltamperrer) April 12, 2024
తొలుత బౌలింగ్‌లో బుమ్రా (4-0-21-5) చెలరేగిపోగా.. ఆ తర్వాత బ్యాటింగ్‌లో ఇషాన్ కిషన్ (39 బంతుల్లో 69; 7 ఫోర్లు, 5 సిక్సర్లు), రోహిత్ శర్మ (24 బంతుల్లో 38; 3 ఫోర్లు, 3 సిక్సర్లు), సూర్యకుమార్ యాదవ్ (19 బంతుల్లో 52; 5 ఫోర్లు, 4 సిక్సర్లు), హార్దిక్ పాండ్యా (6 బంతుల్లో 21 నాటౌట్; 3 సిక్సర్లు) శివాలెత్తిపోయారు. ఫలితంగా ముంబై ఇండియన్స్ సీజన్‌లో రెండో గెలుపును నమోదు చేసింది. ఈ విజయాలకు ముందు ముంబై హ్యాట్రిక్ పరాజయాలను ఎదుర్కొన్న విషయం తెలిసిందే.
ప్రస్తుతం ముంబై 5 మ్యాచ్‌ల్లో 2 విజయాలతో పాయింట్ల పట్టికలో ఏడో స్థానంలో ఉంది. మరోవైపు ఆర్సీబీ 6 మ్యాచ్‌్‌ల్లో ఒకే ఒక్క విజయం సాధించి పాయింట్ల పట్టికలో చివరి నుంచి రెండో స్థానంలో ఉంది. ఆర్సీబీ తదుపరి ఆడబోయే 8 మ్యాచ్‌ల్లో ఏడింట గెలిస్తేనే ప్లే ఆఫ్స్ అవకాశాలు సజీవంగా ఉంటాయి. లేకపోతే ఈ సీజన్‌లోనూ ఆర్సీబీ రిక్త హస్తాలతోనే వెనుదిరగాల్సి వస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment