ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో ఆర్సీబీ వైఫల్యాల పరంపర కొనసాగుతుంది. ఈ సీజన్‌లోనూ ఆ జట్టు చెత్త ప్రదర్శనతో ఫ్యాన్స్‌కు విసుగుతెప్పిస్తుంది. ముంబై ఇండియన్స్‌తో నిన్న (ఏప్రిల్ 11) జరిగిన మ్యాచ్‌లో ఆర్సీబీ 196 పరుగుల భారీ స్కోర్‌ను కూడా కాపాడుకోలేకపోయింది.
ఐపీఎల్‌లో 190 ప్లస్ స్కోర్‌ను కాపాడుకోలేకపోవడం ఆర్సీబీకి ఇది 11వ సారి. ఐపీఎల్ చరిత్రలో ఆర్సీబీతో పాటు పంజాబ్ కింగ్స్ (11) మాత్రమే ఇన్నిసార్లు 190 ప్లస్ స్కోర్‌ను కాపాడుకోలేకపోయింది. ఐపీఎల్‌లో ఇలాంటి చెత్త రికార్డులు ఆర్సీబీ ఖాతాలో చాలా ఉన్నాయి.
కాగా, నిన్నటి మ్యాచ్‌లో ఆర్సీబీ బ్యాటర్లు పర్వాలేదనిపించినా బౌలర్లు మాత్రం పూర్తి తేలిపోయారు. ఈ మ్యాచ్‌లో ఆర్సీబీ బౌలింగ్ గల్లీ క్రికెటర్లకంటే ఘోరంగా ఉండింది. ప్రతి ఒక్క బౌలర్ 10కిపై ఎకానమీ రేట్‌తో పరుగులు సమర్పించుకున్నారు. ఆకాశ్‌దీప్ అయితే ఏకంగా 15.70 సగటున పరుగులు ఇచ్చాడు.
టీమిండియా తరఫున మెరుపులు మెరిపించే సిరాజ్ అతి సాధారణ బౌలర్‌లా తయ్యారయ్యాడు. అన్‌క్యాప్డ్ బౌలర్లను తప్పుబట్టేందుకు లేదు. చించేస్తాడనుకున్న రీస్ టాప్లే 3 ఓవరల్లో 34 పరుగులు, మ్యాక్సీ ఒక్క ఓవర్‌లో 17 పరుగులు సమర్పించుకున్నారు. పేరొందిన బౌలర్‌ను ఒక్కరిని కూడా ఎంపిక చేసుకోకపోవడం ఆర్సీబీ యాజమాన్యం చేసిన తప్పని ఫ్యాన్స్ వాపోతున్నారు.
ఇదిలా ఉంటే, నిన్నటి మ్యాచ్‌లో ఆర్సీబీపై ముంబై ఇండియన్స్ 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ.. డుప్లెసిస్ (40 బంతుల్లో 61; 4 ఫోర్లు, 3 సిక్సర్లు), రజత్ పాటిదార్ (26 బంతుల్లో 50; 3 ఫోర్లు, 4 సిక్సర్లు), దినేశ్ కార్తీక్ (53 నాటౌట్) రాణించడంతో నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 196 పరుగులు చేసింది. బుమ్రా ఐదు వికెట్ల ప్రదర్శనతో (4-0-21-5) చెలరేగాడు.
అనంతరం 197 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ముంబై.. ఇషాన్ కిషన్ (39 బంతుల్లో 69; 7 ఫోర్లు, 5 సిక్సర్లు), రోహిత్ శర్మ (24 బంతుల్లో 38; 3 ఫోర్లు, 3 సిక్సర్లు), సూర్యకుమార్ యాదవ్ (19 బంతుల్లో 52; 5 ఫోర్లు, 4 సిక్సర్లు), హార్దిక్ పాండ్యా (6 బంతుల్లో 21 నాటౌట్; 3 సిక్సర్లు) మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడటంతో 15.3 ఓవర్లలోనే 3 వికెట్లు కోల్పోయి విజయతీరాలకు చేరింది. ఆర్సీబీ బౌలర్లు మరోసారి చెత్త ప్రదర్శన చేసి గెలిచే మ్యాచ్‌ను ఓడేలా చేశారు.
Comments
Please login to add a commentAdd a comment