ఐపీఎల్ 2024లో భాగంగా ఆర్సీబీతో నిన్న (ఏప్రిల్ 11) జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ ఓపెనర్ ఇషాన్ కిషన్ అరుదైన మైలురాయిని తాకాడు. ఈ మ్యాచ్‌లో 5 సిక్సర్లు బాదిన ఇషాన్ ఐపీఎల్‌లో సిక్సర్ల సెంచరీని పూర్తి చేశాడు. తద్వారా ముంబై ఇండియన్స్ తరఫున ఈ ఘనత సాధించిన నాలుగో క్రికెటర్‌గా రికార్డుల్లోకెక్కాడు. ఇషాన్‌కు ముందు రోహిత్ శర్మ, కీరన్ పోలార్డ్, హార్దిక్ పాండ్యా ముంబై ఇండియన్స్ తరఫున 100 సిక్సర్ల మార్కును తాకారు. ఇషాన్ ఖాతాలో ప్రస్తుతం 102 సిక్సర్లు (80 మ్యాచ్‌లు) ఉన్నాయి.
కాగా, ఆర్సీబీతో మ్యాచ్‌లో ఇషాన్‌తో పాటు రోహిత్ శర్మ (24 బంతుల్లో 38; 3 ఫోర్లు, 3 సిక్సర్లు), సూర్యకుమార్ యాదవ్ (19 బంతుల్లో 52; 5 ఫోర్లు, 4 సిక్సర్లు), హార్దిక్ పాండ్యా (6 బంతుల్లో 21 నాటౌట్; 3 సిక్సర్లు) మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడటంతో ముంబై ఇండియన్స్ 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.
తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ.. డుప్లెసిస్ (40 బంతుల్లో 61; 4 ఫోర్లు, 3 సిక్సర్లు), రజత్ పాటిదార్ (26 బంతుల్లో 50; 3 ఫోర్లు, 4 సిక్సర్లు), దినేశ్ కార్తీక్ (53 నాటౌట్) రాణించడంతో నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 196 పరుగులు చేసింది. బుమ్రా ఐదు వికెట్ల ప్రదర్శనతో (4-0-21-5) చెలరేగాడు. అనంతరం 197 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్.. 15.3 ఓవర్లలోనే 3 వికెట్లు కోల్పోయి విజయతీరాలకు చేరింది.
Comments
Please login to add a commentAdd a comment